Monday, April 30, 2012

పద్య రచన -౧౩ .మేనక -విశ్వా మిత్ర

మేనక ! యేగుమునిక నీ
కూ నయు నీ తోడు గాగ , గోరిక తీ రెన్
రానిక నీ దరి కెపుడును
జానెడు గా నున్న పిల్ల శాకుంతల యౌన్ .

సినిమాలను జూచు వాడు శ్రీ మంతు డగున్

దినదినము నీ రసించును
సినిమాలను జూచు వాడు , శ్రీ మంతు డగున్
సినిమాల జోలి పోవక
వినయముగా వేంకటేశు వేడిన యెడ లన్

పుట్టు మచ్చలు గల వాడు పోకి రౌను

మంత్రి యగు నయ్య ! కుడి వైపు మంద మైన
పుట్టు మచ్చలు గల వాడు , పోకి రౌను
పగలు రేయియు నానక బారు కెళ్ళి
దేశ ద్రిమ్మరి యటులన దిరుగు వాడు

Sunday, April 29, 2012

పద్య రచన -౧౨- విశ్వనాధ వారు

వేయి పడగల రచయిత విశ్వ నాధ !
కల్ప వృక్షము నీ సొత్తు కవి వరుండ !
విశ్వ విఖ్యాతి గాంచిన వేద పురుష !
అందు కొను మయ్య ! కైదండ లందు కొనుము .

ఏడు కొండల వాడు కాపాడ లేడు

ఏడు కొండల వాడు కాపాడ లేడ
టన్న మాటలు సత్యము లవియ కావు
వేడు కోలున దప్పక వేంక టేశు
కావ బూ నును నిజ మిది కల్ల గాదు

అయ్య వార య్యె నవనిని యాచ కుండు

యాయ వారంపు నన్నంబు నాహ రించి
యొజ్జ దరి కేగి నేర్చు చు నోన మాలు
బడుగు బాపడు చందాల వలన చదివి
అయ్య వార య్యె నవనిని యాచ కుండు

మ శ కంబులు దొమ్ము లాడ మంచము విరిగెన్

అశనము కుళ్ళిన నుండును
మ శ కంబులు , దొమ్ము లాడ మంచము విరిగెన్
నిశలం ద్రాగిన మత్తులొ
విశదంబు గ జెప్పు నిజము వెంగల యప్పా !

పద్య రచన -11

తక్షకు మీ దన కోపము
కక్ష గ మారంగ జేసె క్రతువును రాజున్
తక్షణమ పాము లన్నియు
నాక్షణ మే భస్మ మయ్యె నగ్నికి వరుసన్

Saturday, April 28, 2012

పాండు తనయుల మించిన పాపు లెవరు ?

పాండు తనయుల మించిన పాపు లెవరు ?
ననుట ధర్మమ? పండితు లార! మీ కు ?
పరమ ప్రామాణ గ్రంధంబు భార తంబు
తెలియు మీ కది నైనను దెలుపు చుంటి

పద్య రచన -10

రావణు డవనీ జాతను రధము పైన
నపహ రించుకు బోవంగ నపుడు పక్షి
అయ్య! వలదని పలుమార్లు నడ్డు బడగ
పక్షి రెక్కలు నరికెను పాపి యగుచు .

Friday, April 27, 2012

పద్య రచన -9

సత్యవతి నిమ్ము నాతండ్రి శంతనునకు
శాంత నుండను గోరుదు సజ్జ నుండ !
అడ్డు రాబోను నతనికి నంచు పలికి
ధర్మ నిరతుని నమ్ముము దాస రాజ !

Thursday, April 26, 2012

పాద రసమన్న తీ యని పానకంబు

బంధ రహితుని భక్తుల బాంధ వుణ్ణి
ఉబ్బు లింగని గరళము నోర్చు వాని
బంధ ములు దొల గగజేయు భవుని మృదుల
పాద రస మన్న తీ యని పాన కంబు

పద్య రచన -8

నీ లిగగనంబు రసమయ నీ రదంబు
సాధు నీ రంబు గల యట్టి సరసు యదియ
పట్టు వృక్షంబు లెన్ని యొ చుట్టు నుండె
చూ డ ముచ్చట గొలుపును చూ పరులకు

Wednesday, April 25, 2012

విప రీ తపు పులుసు కూ ర విస్తరి మ్రింగెన్

అపు రూ పమౌర యీ యది
విప రీ తపు పులుసు కూర విస్తరి మ్రింగెన్
నపర ముని యా బ్రహ్మేం ద్రుడు
తపనత తో జెప్పె నిటుల తప్పవు వింతల్

Monday, April 23, 2012

చేప చన్నుల లో పాలు చెం బె డుండె

కుడితి త్రాగించి , లాలించి కూర్మి తోడ
పచ్చ గడ్డిని మరియును వట్టి గడ్డి
మాటి మాటికి తినిపించి మేటి పొదుగు
చేప చన్నులలో పాలు చెం బె డుండె

పది కధలు చెప్ప గల వాడె పండి తుండు

కధకు డగు నయ్య ! కమ్మగ, క్రమము తోడ
పది కధలు చెప్ప గల వాడె , పండి తుండు
భాష మీ దన పరి పూ ర్ణ పట్టు గలిగి
వేద వేదాంత సారపు వేత్త యగు చొ

Sunday, April 22, 2012

శంకరు నకు గలవు వంక లెన్నొ

గొంతు నందు గలదు గుళికల గరలంబు
శిరము నందు గంగ తిరము గాను
నొడలు నిండ భూ తి మెడను పాప చయంబు
శంకరునకు గలవు వంక లెన్నొ .

ఎద్దు నెరుగు నె నటుకులు నీ యు రుచిని

మనుజ సంబంధ మైనట్టి భాష ణంబు
ఎద్దు నెరుగు నె , నటుకులు నీ యు రుచిని
తినిన వారలు మాత్రము తెలిసి కొండ్రు
నిక్క మీ యిది పుడమిని నెరుగు డ య్య !

Saturday, April 21, 2012

ముద్ద రాలు ముద్దు మొద్దు జేయు

మూతి మూతి కలిసి ముదము గలుగ జేయు
ముద్దరాలు ముద్దు , మొద్దు జేయు
కడుపు నిండ తిండి గలవాని నెపుడును
మొద్దు కాక యుండ మూతి కట్టు

పుట్టు మచ్చలు గల వాడు మూ ర్ఖు డరయ

భోగి యగు నయ్య ! కుడి వైపు భుజము నందు
పుట్టు మచ్చలు గల వాడు , మూ ర్ఖు డరయ
మంచి వినకుండ చెడ్డను నెంచు వాడు
మొరకు దనమున నుండిన బోవు సిరులు

Friday, April 20, 2012

సుగ్రీ వుని యెడమ కాలు శునకము గరచెన్

ఆగ్రా జూచుట కేగితి
నాగ్రాలో జరిగె ఘటన నయ్యో పాపం
నీ గ్రో జాతికి జెందిన
సుగ్రీ వుని యెడమ కాలు శునకము గరచెన్ .

చెప్పునకు లభించె చెరకు తీ పి

చెరకు రసము కాక జేయు చుండం గను
బాన లోన చెప్పు పడుట వలన
చెప్పునకు లభించె చెరకు తీ పి యకట
తినగకుక్క , తెలిసె తీ పి యనుచు .

Thursday, April 19, 2012

శని వలన నె నడుచు చుండు జగ మంత యునున్

మనుజులు బాధలు నొందుట
శని వలన నె , నడుచు చుండు జగ మంత యునున్
శని చూపు మంచి దైన చొ
ననిశము భోగము ల తోడ హాయిని నిస్తూ .

చెప్పు దినెడు కుక్క చెరకు తీ పి నెరుగ

కొన్న చెప్పు జూడ కుట్లన్ని దెగి యుండె
పేద వాని చెప్పు , పిచ్చి దౌను
చెప్పు దినెడు కుక్క , చెరకు తీ పి నెరుగ
మాంస భక్ష ణం బు మరుగు కతన

సకల జీ వుల రక్షింప జముడు నేర్చు

హరి హర సుతుండు పుడమిని నవత రించె
సకల జీ వుల రక్షింప , జముడు నేర్చు
జీ వ కోటుల ప్రాణంబు పోవు ఘడియ
పాప పుణ్యంబు ఫలముల బట్టి నెరుగు .

మను చరిత్ర కర్త మంచన గద !

అల్లసాని పెద్ద నార్యుండు గద నిల
మనుచరిత్ర కర్త , మంచన గద !
బసవు చరిత వ్రాసి బహుళ ప్ర శ స్థలు
నొందె ధరను మంచి యొజ్జ గాను

Wednesday, April 18, 2012

శంకరుడు సకల శుభ నాశం కరుండు

శంకరుడు సకల శుభ నా శం కరుండు
ననుట న్యాయమ? జగతిని నార్యులకును
శం కరో తీ తి శంకర : శాస్త్ర ముండె
సకల శుభముల నిచ్చును శంక రుండు .

Tuesday, April 17, 2012

దత్త పది ; అప్పు -చెప్పు -కొప్పు -మెప్పు

ఎండ కాలము బోరులు నెండి పోయె
అప్పు లీ యుచు బ్రజలను నాదు కొనుట
మెప్పునకు కాక రాజున కొప్పు సుమ్ము
చెప్పు చుంటిని నందరి సేవ కులకు

కారి పోయెను గుండెలు జారి పోయె

రాముడా హవ మందున రాక్షసులకు
వేల రూపుల గనిపించ విడి విడింగ
మెల్ల మెల్లగా సంతోష మెల్ల నీ రు
కారి పోయెను గుండెలు జారి పోయె

పద్య రచన -4

ఆంజ నేయుని మూపును నాక్రమించి
ఎక్కు పెట్టుచు రాముడు నొక్క శరము
రౌద్ర రూపము దాల్చిన రుద్రు వోలె
శత్రు సంహార పనికినై జనెను ననికి

Monday, April 16, 2012

కోపమే భూషణము నీ తి కోవిదునకు

సకల సంపత్తి హరియించు సాధనంబు
కోపమే , భూషణము నీతి కోవిదునకు
శాంత సహనంబు లియ్యివి సముచితము గ
నొప్పి , కలిగియు యలరారి యోలలాడ .

Sunday, April 15, 2012

బోడి గుండంట జడలేమొ బోలె డంత

వేంక టేశుని దర్శింప నేగు గురుతు
బోడి గుండంట , జడ లేమొ బోలె డంత
వరము లిచ్చెడు సాయికి వన్నె యైన
సత్య సాయి యె నికపైన శరణు మనకు

హనుమంతుని వేడు కొనిన నాయువు తీయున్

విను ముర ! సర్వము నిచ్చును
హనుమంతుని వేడు కొనిన , నాయువు తీ యున్
ననవరత రామ దూషణ
విని నంతనె నోట కరచి వేటులు వేచీ .

Saturday, April 14, 2012

క్రాంతి యనగ కవుల కల్పన కద!

కంది వంశ తిలకు క్రాంతి య నగ కవు
ల కలపన కద నిక లాస్యము గను
క్రాంతి బంధ మయ్యె కల్పన తోడను
పాలు నీ రు వోలె బ్రతుకు గాక !










Friday, April 13, 2012

కరము కరము మోద కరము గాదె!

వేడు కొనిన నీ శు వినయంబు తోడన
శక్తి బుద్ది బలము రక్తి మఱియు
అభయ హస్త మీ యు నశ్వరు శుభ కర
కరము , కరము మోద కరము గాదె !

రండా గమనంబు సేయ రమ్యంబ యగున్

గుండా బత్తుల రాముడు
ఉండ్రాజ వరంబు కేగి నూ రికి రాగన్
ఆం డా ళ్ళేదురుగ నేగుచు
రండా గమనంబు సేయ రమ్యంబ యగున్

సన్యాసికి పిల్ల నివ్వ సంబర పడియెన్

అన్యాయ మైన పని యది
సన్యాసికి పిల్ల నివ్వ , సంబర పడియెన్
కన్యా రాశిని కలిగిన
కెన్యా దేశంపు రాజు కే లీ యగ రాన్ .

Thursday, April 12, 2012

గణ పతిని గన నింద లొదవును గాదె?

సర్వ శుభములు గలుగును శర్వ పుత్రు
గణపతిని గన, నింద లొ దవును గాదె?
చవితి చంద్రుని చూచిన చవితి నాడు
పూజ చేసిన తల బ్రాలు బ్రోచు మనల

Tuesday, April 10, 2012

ఏడు కొండలు నెక్కిన మాడు పగులు

ఆక్ష ణం బున మంగమ్మ మోక్ష మిచ్చు
నేడు కొండలు నెక్కిన , మాడు పగులు
పిచ్చి వేషాలు వేసిన లచ్చి యెదుట
జాగరూ కత వలనన జయము కలుగు

కనరాని విశేషములను కవి కాంచు గదా!

మనుజుల ,పండిత వర్యుల
దనుజుల , మఱి మునుల కెల్ల , దల్లుల కైనన్
వినుమది , తలపుల యందున
కన రాని విశేషము లను కవి కాంచు గదా !

Monday, April 9, 2012

పాపములకు మూలము లగు బశుపతి పూజల్

కోపము ,గర్వము లీ ర్ష్యలు
పాపములకు మూలము లగు ,బశుపతి పూజల్
బాపముల బార ద్రోలును
బాపములను జేయకునికి ప్రధమము మనకున్ .

Sunday, April 8, 2012

బెద రె దుశ్శా శనుం గని భీ ముడపుడు

దుస్స సేనుడు సిగ బట్ట ద్రుపద పుత్రి
బెద రె , దుశ్శా శనుం గని భీ ము డపుడు
రౌద్ర మూర్తి యై చంపగ నుద్య మించె
ఆలి రక్షణ ముఖ్యము హరున కైన

Friday, April 6, 2012

కౌగి లింతలే కవులకు ఘనత నొసగు

ప్రేమ గొప్పది పావన మైన దిలను
ప్రేమ చిహ్నంబు జంటల ప్రేమి కులకు
కౌగి లింతలే , కవులకు ఘనత నొసగు
కావ్య రచనంబు రసమయ కలిత మైన .

నిప్పున నొక చేరె డంత నెత్తురు గారెన్

అప్పల రవి యాడుచు బడె
నిప్పున , నొక చేరె డంత నెత్తురు గారెన్
నిప్పున గల గరిక మొనలు
చప్పున దన వ్రేలు గీచి జరజర మనుచున్

గాడిద యే డ్చెను గదన్న ,ఘన సంపన్నా !

గాడిని దప్పిన కొడుకును
గాడిద కొడుకం చు తండ్రి కటినము జూపన్
వీడా? నాకొడుకం చును
గాడిద యే డ్చెను గదన్న ! ఘన సంపన్నా !

కనము వినము పలుక మనెడు జ్ఞానులకు నతుల్

అనయము మంచిని జేతును
వినయముగా నుండు నెపుడు పెద్దల యె డ లన్
ననుచిత భావపు భాషను
కనము వినము పలుక మనెడు జ్ఞానులకు నతుల్

Thursday, April 5, 2012

పట్నములే పల్లె లయ్యె వలసల కతనన్

పట్నము వాసపు బ్రతుకులు
కట్నము వలె భార మయ్యి కష్టము మొదలౌ
పట్నముల నుండ నేరక
పట్నములే పల్లె లయ్యె వలసల కతనన్

బడ బానల పంక్తి పైన పచ్చిక మొలచెన్

దడదడ లాడుచు వర్షము
బడ ,బానల పంక్తి పైన పచ్చిక మొలచెన్
వడ గాడ్పు లధిక మగుటను
వడలుచు మఱి వాడి పోయె పచ్చిక పరకల్ .

పాపాలకు పుట్టినిల్లు పశు పతి నిలయం

పీపా బోలిన పొట్టలు
పాపాలకు బుట్టి నిల్లు , పశు పతి నిలయం
పాపాల బార ద్రోలును
పాపాలను సేయ కునికి ప్రధమము మనకున్

రావణుడే రాము డయ్యె రణమున జూడన్

ఆహవ రంగము నందున
రావణ దనుజులు మరియును రావణ సైన్యం
చేవలు సూపుచు పోరగ
రావణుడే రాము డయ్యె రణమున జూడన్ .

Wednesday, April 4, 2012

దైవ శక్తిని హరియించు దనుజ బలము

కొలవ లేమయ యింతని కొలవ లేము
దైవ శక్తిని , హరియించు దనుజ బలము
హనుమ నామము దలచిన యా క్షణంబ
రామ భక్తుల కుండును నామ మహిమ

Tuesday, April 3, 2012

విధవ యనుచు బిల్చె విభుడు సతిని

విధవ పదమున కర్దము వేయి యేళ్ళు
ధనము కలిగియు వర్ధిల్లు ధర్మ పత్ని !
ననుచు నామెపై నను రక్తు డై సొబగున
విధవ యనుచు బిల్చె విభుడు సతిని .

Monday, April 2, 2012

నాగ పంచమి వచ్చును నవమి నాడు

శుద్ధ పంచమి దినమున శుభము లీ య
నాగ పంచమి వచ్చును ,నవమి నాడు
రామ చంద్రుడు పెండ్లాడె భూమి సుతను
తెలుసు కొనవచ్చు నిట్ల నె తిధుల బట్టి

జన్మ దిన శుభాకాంక్షలు (డి.నాగ రాజ ,అల్లుడు గారు ,౨౮-౩-౨౦౧౨ )

౧. నాగ రాజాభిదేయుడ! నాగ రాజ !
బంధు మిత్రుల పాలిట బాంధవుండ !
ఆలు బిడ్డలసహకార మందు నరుడ !
అందు కొనుమయ్య ! యాశీ స్సు లందు కొనుము .
౨. పుట్టి నలుబది వత్సర మట్టు లైన
కుర్ర కారును బోలుచు కొమరు మిగిలి
చీ కు చింతలు నొందక చిరు నగవుల
బలుక రింతురు ప్రజలను ప్రమద మలర .

౩. పుట్టు మనుజుడు సౌఖ్యము బొంద గోరు
దేశ దేశాలు భ్రుతికి నై తిరిగి తీవు
కష్ట నష్టాలు భరియించ గలవు నీవు
సాటి యె వరయ్య! నీ కిల సాటి యె వరు ?

౪. ఆది దంపతు లైనట్టి యాదిదేవు
డాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
నెల్ల వేళల మిమ్ముల జల్ల గాను .

౫. సాయీ నే సేవించుడు
సాయీ యే మనకు రక్ష సకలంబునకున్
సాయీ భక్తుల గొలిచిన
సాయీ యే కనిక రించి సంపద నిచ్చున్ .

Sunday, April 1, 2012

పురుష గర్భమే సృష్టికి పుట్టి నిల్లు

విశ్వ మంతయు దానయై వెలుగు లీ య
సకల లోకాలు నింపుకు శరణు నిచ్చు
నాదిదంపతు లైనట్టి యాది దేవు
పురుష గర్భమే సృష్టికి పుట్టి నిల్లు .

రామ నామ మనిన రక్తి రాక్షసులకు

భక్తి శ్ర ద్ద ల సేవించు భక్తుల కిల
రామ నామ మనిన రక్తి , రాక్షసులకు
గుండె దడ దడ లాడును గుండె పోటు
కతన , నెవరి కైన కలుగు కాలు భయము