౧. నాగ రాజాభిదేయుడ! నాగ రాజ !
బంధు మిత్రుల పాలిట బాంధవుండ !
ఆలు బిడ్డలసహకార మందు నరుడ !
అందు కొనుమయ్య ! యాశీ స్సు లందు కొనుము .
౨. పుట్టి నలుబది వత్సర మట్టు లైన
కుర్ర కారును బోలుచు కొమరు మిగిలి
చీ కు చింతలు నొందక చిరు నగవుల
బలుక రింతురు ప్రజలను ప్రమద మలర .
౩. పుట్టు మనుజుడు సౌఖ్యము బొంద గోరు
దేశ దేశాలు భ్రుతికి నై తిరిగి తీవు
కష్ట నష్టాలు భరియించ గలవు నీవు
సాటి యె వరయ్య! నీ కిల సాటి యె వరు ?
౪. ఆది దంపతు లైనట్టి యాదిదేవు
డాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
నెల్ల వేళల మిమ్ముల జల్ల గాను .
౫. సాయీ నే సేవించుడు
సాయీ యే మనకు రక్ష సకలంబునకున్
సాయీ భక్తుల గొలిచిన
సాయీ యే కనిక రించి సంపద నిచ్చున్ .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment