Friday, April 12, 2013

తేజ నృత్యము (11-4-2013)

వేలకొలదిగ సభికులు  వేచి చూడ
మైకు  సెట్టులు  పని చేయ  నిక తము న న
ఎట్టకేలకు  మొదలిడి రె ట్లొ  యపుడు
డేన్సు  సారులు  బ్రార్ధించె  గణపతి నిల .

చిన్న పిల్లలు  నృత్యము సన్నయ మున
చేయు చుండుట  చూడగ  చేత  మలరె
కట్టు ,బొట్టులు  మఱి యును కదలికలును
చూడ ముచ్చట గొలిపెను జూపరులకు .

రామా లయమున  జరిగెను
ప్రేమగ మఱి  తేజ  డేన్సు  ప్రియ తము లెదుట న్
గోముగ  జేసెను  నృత్యము
భామలు  మఱి  మెచ్చు కొనుచు  భళిరా  యనగన్ .

మెలికలు  దిరుగుచు  నృత్యము
లలితముగా జేసె  నపుడు  లహరుల  వోలెన్
ఇలలో  నెవ్వరు  జేయని
తలపులుగా  ద్యోత మయ్యె దలిరుల  కపుడున్ .

ము ద్దు  ముద్దుగ బ్రాకుచు బోర్ల బడుచు
ఆడు కొను   నట్టి  బాలిక  యింత లోన
స్టేజి మీ దన  నృత్యము  చేయ గలుగు
స్థాయి దెచ్చు కొన గలుగు  స్థాయి  కెదిగె .

అమ్మా! తేజమ్మా ! మఱి
కొమ్మా ! దీ వన  శతములు కోటిగ  నిపుడున్
అమ్మాధవు నింగొలు చుచు
ఇమ్మనుమా ,చదువు  బాగ  నిమ్ముగ నీ కున్ .

చదువులు  జదువుము  బాగుగ
చదివినచో  నీ కు  వచ్చు చక్కటి  జాబున్
చదివించు నమ్మ నాన్నలు
ముదమును నే బొందు రపుడు  ముద్దుల  తేజా !

(రచన : పోచిరాజు  సుబ్బారావు )




 

No comments:

Post a Comment