Wednesday, April 10, 2013

శ్రీ రామ నవమి (19-4-2013)

ఈ రోజు  నవమి  కావున
శ్రీ రాముల బెండ్లి జరిగె  సీతమ తోడన్
ఆ రాముడు  సంతసమున
భూ రిని నిక  నిచ్చు గాక ! భూ తిని  మనకున్ .

సీ తా రాములకు ను నిట
చేతో మోదంబు గలుగ  జేసిరి  పెండ్లిన్
ఏతావున ననగయనగ
ఈ తావునె , శాస్త్రి యింట   యిప్పుడె  జరిగెన్ .

రామ నామపు  భజనలు  రహిని జెలగ
వేద పండితుల్  సాక్షిగ  విపుల ముగను
మంత్ర రాజాలు   సభ లోన  మారు మ్రోగ
పెండ్లి జేసిరి  ఘనముగ విబుధ  వరులు .

మృదుల  మధుర  వాద్య మింపు గొలుప మది
పులక రించె , గగురు  బొడిచె  మేను
తేలిపోయె  మనసు  తెమ్మెర వోలెను
వాద్య  మహిమ బొగడ  వరుణి  దరమె ?

బంధు  జనములు  ముత్యాలు  బట్టి  యీ య
సీ త  మ ఱి యును  రాముడు  సిగ్గు  వడుచు
పోసి కొని రయ్య ! శిరము పై  ముచ్చట గను .
వేద మంత్రాల  మధ్యన  వేద  విదులు .

ఈ కళ్యాణము  జేసిన
మీ కును మఱి ముక్తి  గలుగ  ,మీ తో బాటున్
ఈ కళ్యాణము  జూసిన 
మాకును నిక  ముక్తి  నీ య మాత న డు గు దున్ .

రామునినే  ధ్యానించిన
రామునికే  పూజ సేయ  రామునె  దలచన్
రాముని  యారా ధించిన
రాముడె మ ఱి  యిచ్చు  మనకు  రాదగు  ముక్తిన్ .

రామా ! నీ కళ్యాణము
దామోదర  శాస్త్రి యింట  దడవు దడవునన్
ప్రేమాదరములు గలుగగ
మేమే కద ! చేయు చుంట  మీ కృ ప వలనన్

(మేమే అ నగా  ఉత్సవ  కమిటీ )

సీ తా రాముల  జూపులు
శీ త ల ముగ నుండి  మనకు  సేదను  దీర్చన్
ఏతావున  బ్రసరించిన
ఆ తావులు శుభము లగును నందము మీ ఱన్ .

అయ్యె  రాముని  కళ్యాణ మద్భుతముగ
పాన కంబును  వడపప్పు  పాయసంబు
బూరె  పులిహోర  బజ్జీలు  భూరి గాను
చేసి వెట్టిరి  నైవేద్య మీ శునకును

చూసితి  కల్యాణం బును
చేసితినే గడుపు  నిండ  సీ తమ  గరుణన్
వాసి గల భోజ నంబును
ఆసాయము  నచట నుండ  హాయిగ  నుండెన్ .
(రచన:  పోచిరాజు  సుబ్బారావు )



No comments:

Post a Comment