టక్కరి నక్కయు నొకపరి
మిక్కుటముగ నాక లుండి మేదిని యందున్
ఇక్కడ కక్కడ దిరుగుచు
కొక్కొరోకో యనుచు దిరుగు కోడిని జూచెన్ .
చూచి దరి జేరి ప్రియమగు చూడ్కు లలర
కుశల బ్రశ్నల నడిగియు కూర్మి తోడ
ఒలక బోయగ బ్రేమలు నుట్టి బడగ
ఉబ్బి పోయెను నా కోడి యు త్సుకతన .
మాయ మాటల నమ్మించి మడియ జేసి
మాం స మంతయు దినెను నా మాయ నక్క
మోస పోవద్దు నిక నైన మోస గాండ్ర
మాయ మాటల కెపుడును మనుజు లార!
మిక్కుటముగ నాక లుండి మేదిని యందున్
ఇక్కడ కక్కడ దిరుగుచు
కొక్కొరోకో యనుచు దిరుగు కోడిని జూచెన్ .
చూచి దరి జేరి ప్రియమగు చూడ్కు లలర
కుశల బ్రశ్నల నడిగియు కూర్మి తోడ
ఒలక బోయగ బ్రేమలు నుట్టి బడగ
ఉబ్బి పోయెను నా కోడి యు త్సుకతన .
మాయ మాటల నమ్మించి మడియ జేసి
మాం స మంతయు దినెను నా మాయ నక్క
మోస పోవద్దు నిక నైన మోస గాండ్ర
మాయ మాటల కెపుడును మనుజు లార!
No comments:
Post a Comment