Sunday, August 18, 2013

రూపాల సంగమేశ్వర స్వామి --కర్నూలు

ధరణి వె లయుజ  గన్నాధు దలము మీద
సంగ మేశ్వరు  స్వామిని శక్తి కొలది
పూజ జేయగ  నేగగ  మోజు పడుచు
స్వామి  దర్శన మాయెను  సంతసముగ


మంత్ర యుతముగ  నర్చన తంతు పూర్తి
గాగ పూజారి యిచ్చెను నగవు తోడ
తీర్ధ ప్రాసాదములు మాకు  తియ్య వైన
అందు కొంటిమి మఱి యును  నార గించి


పిదప  యాంజ నేయు  స్తాట్యు  పేర్మి తోడ
మార్గ మంతయు గతుకుల మయము నైన
చూడ నేగితి  మచట కు  చొరవ తోడ
చూడ నద్భుతముగ నుండె  చూచు కొలది


ఉర్వి జనములు సుఖముగ  నుండు కొఱకు
దైవ ప్రార్ధన జేసితి నీ వ ,స్వామి !
ఎల్ల వేళల గాపాడు  చల్ల గాను
నీవె దిక్కిక గోరుదు  నిన్నె శరణు


వాన రాకడ గమనించి  పై నభమున
పయన మైతిమి యింటికి రయము గాను
ఒక్క య ఱగంట పయనమై సుఖము గాను
చేరు కొంటిమి యింటికి సేమము గను





No comments:

Post a Comment