Friday, November 30, 2018

పతిపాదార్చన

iమతభేదంబులజూడకుండగనుసమ్మానంబుతోనానుమా
పతిపాదార్చనకార్తికమ్మునగడున్భద్రమ్ముచేకూర్చులే
పతియాశంకరుడన్నివేళలనుసూప్రాణంబురక్షించుగా
నతులన్జేతునుమార్ధదేహునకునానారీతులొప్పారగన్

కరణము

అరయుముగద్యపద్యములనద్భుతరీతినివ్రాయవీలు వ్యా
కరణమునమ్మువారలకు,గలుగుశుభంబులునిశ్చయంబుగన్
 గరముననాసదాశివునిగారవమొప్పగబూజజేయుచు
న్నురమునుసాక్షిగామనమునొక్కటిజేయుచుమౌనముండుచో
----
పోచిరాజు సుబ్బారావు
ప్రభాత్ నగర్ ,హైదరాబాదు

Thursday, November 29, 2018

కశ్మీరము

కశ్మలమున్బెంచునుగద
కాశ్మీరపుటలజడి,జనకళ్యాణమిడున్
గాశ్మీరసోయగంబులు
పశ్మీనానందుతెలియుప్రస్ఫుటముంగన్

Tuesday, November 27, 2018

చన్నులులేని

మన్నుననెచ్చటన్నరయమచ్చుకనైననుగానరావుగా
చన్నులులేనియావులు,బ్రసన్నతబాలనొసంగెబానెడున్  నన్నువజెంగలిన్దినుచునాయతరీతినిదూడచేపగా
గ్రన్ననజేపుచున్మిగులకమ్మనిబాలనునిచ్చునున్సుమీ

చనులులేని

ఎంతవెదికినగనబడవెచటకూడ
చనులులేనియావులు,పాలజాలనొసగె
తెలకపిండినిబెట్టుటవలననిన్న
పౌష్టికాహారమీయగబాలుపెరుగు

నల్లగనున్న

అల్లనరాజశేఖరుడెయావలవేసెనునేరియేరుచున్
నల్లగనున్నమల్లెలను,నాతిముదంబునదాల్చెగొప్పునన్
నుల్లముసంతసిల్లగనునొప్పుగదేవగమల్లిపూవులన్
మల్లెలుదానొనర్చుగద మత్తునుజిత్తవికారమున్సదా

నల్లగాాాాానున్న

!కొల్లగొట్టినధనముతోగూతుకొఱకు
మల్లెపూవులుగొనగనుమండిలోన
రంగురంగుల తోడనురంగవల్లి
నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె"

Sunday, November 25, 2018

వలలుని



కలవరపాటుజెందుచునుగాపురుషుండునుబోలెబల్కితే?
వలలునీజంపెగీచకుడవక్రపరాక్రముడైరణంబునన్
వలలుడెజంపెగీచకునవక్రపరాక్రముడైరణంబునన్
వలలునిశక్తినెప్పుడునవారితబల్మిని బెర్గుచుండుగా

వలలునిగీచకుడుసంపెవరవిక్రముడై


ఉలటావ్రాసిరియిచ్చట
వలలునిగీచకుడుసంపెవరవిక్రముడై
కలవరపడకుడుసెప్పుదు
వలలుడెగీచకునిజంపెపండితవర్యా!

Saturday, November 24, 2018

కనిపించిరికోతులవలెగవివరులెల్లన్

అనుమానంబేలకొ?యిట
కనిపించిరికోతులవలెగవివరులెల్లన్
గనులకుబైరులుగ్రమ్మగ
గనిపించునువేరుగానుగవివర!వినుమా!

కనబడిరప్డు

కనులవిబైర్లుగప్పగనుగాంచగవేదికనొక్కసారిగా
వినయముతోడవంగగనువేదికమీదనునుండువారలున్
గనబడిరప్డువానరులుగాగవివర్యులుతత్సభాస్ధలిన్
ననయముజేతువందనములాకవిశ్రేష్ఠులకెల్లవేళల

Friday, November 23, 2018

ఆకాశవాణి

అతులితభక్తినినతివలు
సతతంబునుబరమశివునిశ్రధ్ధనుగొలువన్
 సతులకునరయగనాశ్రీ
పతిపూజయెకార్తికమునభద్రతనొసగున్
---
పోచిరాజు సుబ్బారావు
ప్రభాత్ నగర్ ,హైదరాబాదు

విద్యలులేనట్టినరుడెవిఙ్ఞుడనదగున్

ఉద్యమములునడిపించును
విద్యలులేనట్టినరుడె,విఙ్ఞుడనదగున్
విద్యలునేర్వనివాడై
పద్యములనువ్రాయువిధమువచ్చుటవలనన్

Thursday, November 22, 2018

చల్లనినీటిచే

ఉల్లముసంతసిల్లుటకునూర్పులువోవనుగారణంబునన్
నల్లదెబద్రినాధమునహర్షముతోడనుదానమాడగా
జల్లనినీటిచేనొడలుసర్వముగాలెనదేమిచిత్రమో
కల్లలుగాదునాపలుకుకార్మికలోకమునట్లెచెప్పెగా

చల్లనినీరముననొడలుసర్వముగాాాాాాలెన్

లల్లీ!యేమనిజెప్పుదు
బల్లిదమౌమహిహకలుగుబదరీనాధన్
నల్లదెతానముజేయగ
జల్లనినీరముననొడలుసర్వముగాలెన్

Wednesday, November 21, 2018

వీసముగూడ

వీసముగూడజేయకుడుపేర్మినీసాయమునెప్పుడున్భువిన్
మోసముజేయువాలలకె,మ్రొక్కదగున్సుజనుల్హితార్ధులై
యేసమయంబునన్బరులయీప్సితమెవ్వడుతీర్చునోదగన్
నాసమతాభవున్భువినినాదరమొప్పగదప్పకుండగన్

మోసమొనరించువాాారికేమొ

దూరముగనుండమంచిదిదురితదూర!
మోసమొనరించువారికే,మ్రొక్కదగును
మంచిగోరెడువారినిమనసువెట్టి
మోసగించినజగతికేముప్పుగలుగు

Tuesday, November 20, 2018

దత్తపది--మూడు-ఆరు-ఏడు-పది

ప్రాణమూడునుసైంధవా!బాణమునకు
నేడుగడయదిలేకనీయింతికుములు
వేతుబాణముకాచుకోపదిలముగను
రుధిరధారలదనరారువిధిగనొడలు

palakollu bava

లేవు లేవాయె  యికమాకు లేవు నీవు
కాన రానట్టి దూరమ్ము  గడచి నావు 
మాయ మర్మము  లెఱు గని  మనిషి వీవ 
సాటి  యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?

ఆశ లేదయ్య  నీకుగా నాశ లేదు
ఉన్న దానితో సంతృప్తి నొంది తీవు
నీవు చేసిన సేవలు నిరత ము హృ ది
 భద్ర పఱతుము నిక్కము భవ్య చరిత!

ఏమి  నేరము జేసితి  మింత లోన
విడిచి పోతిరి మమ్ముల విడిచి యిచట
నీదు రాకకు మేమిట యెదురు చూతు
మయ్య !రాగదే వేవేగ యార్య బావ !

వత్తుననుకొంటిమిముజూడపరమపురుష!
యింతలోపలనాకయ్యెవింతగాను
కడుపుమంటలుజెలరేగెగాఢముగను
నాసుపత్రికిబోతినత్యవసరముగ

 కలగానయ్యెనునీదుబంధములుమాకార్యా,యవేమంటివా
 యలుపుల్లేకయెమాగృహంబులకుబాహాటంబుగావచ్చిరే
విలసిల్లన్సుగుణంబులన్నియును,దాపేరాశకున్బోవకే
ఫలముంబెట్టినగ్రొత్తగుడ్డలనుసాఫల్యంబునొందన్గొనెన్


అమ్మ నాన్నయు నక్కయ్య లంతె కాక 
బావ లిరువురు మమువీ డి దివము జేరె
వారి మార్గమ్ము నీవును బడసి తీవ
దిక్కు మాకిక యెవరయ్య యిక్కడింక


సకల శుభములు  గలిగించు శంకరుండు
మరల జన్మమ్ము లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ  ననుమ తించి
యొసగు  గావుత ! యాత్మకు  నొనరు శాంతి 

తోబుట్టువుల

🙏* తోబుట్టువుల విలువ చెప్పిన రాముడు

ఈనాడు మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు చిన్న చిన్న కారణాలతో, అహంకారంతో, మనస్పర్ధలతో విడిపోతున్నారు. ఇటువంటి సమయంలో రామాయణం మొత్తం మానవాళికి ఒక ఆశాజ్యోతి. రాముడు తోబుట్టువుల గొప్పతనం గురించి రామాయణంలో చెప్పిన మాట అందరూ గుర్తించుకోదగినది.

ఇంద్రజిత్తు (మేఘనాధుడు) తో యుద్ధం చేసిన ‪#‎లక్ష్మణుడు‬ అతడు చేసిన అస్త్రప్రయోగంతో మూర్ఛపోతాడు. రక్తపుమడుగులో ఉన్న తమ్ముడిని చూసిన రాముడికి ఎక్కడలేని దుఃఖం వచ్చి సుశేషునితో ఈ విధంగా అంటాడు.
నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుని ఈ స్థితిలో చూసి నా శక్తి క్షీణించిపోతోంది. ఒకవేళ లక్ష్మణుడు మరణిస్తే, నా జీవితానికి, సంతోషానికి అర్దమేముంది? నా వీరత్వం సిగ్గుపడుతోంది. చేతి నుంచి ధనుస్సు పడిపోయినట్టుంది. బాణాలు జారిపోతున్నాయి. కన్నీరుతో కళ్ళు నిండి దృష్టి కూడా కనిపించడంలేదు. నేను మరణించాలనుకుంటున్నాను అని రాముడు ఎంతో ఏడుస్తాడు.

ఓ శూరుడా! లక్ష్మణా! విజయం కూడా నన్ను తృప్తి పరచలేదు. దృష్టి కోల్పోయిన వ్యక్తికి జాబిల్లి (చంద్రుడు) ఏ విధంగా సంతోషాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు నేను పోరాడి సాధించేది ఏంటి? లక్ష్మణుడు మరణించి ఉంటే, నేను యుద్ధం చేసి లాభం ఏంటి? నువ్వు నన్ను ఏ విధంగా వనవాసానికి ముందు అనుసరించావో, అలాగే ఇప్పుడు నేను నిన్ను మృత్యువులో అనుసరిస్తాను. యముని వద్దకు నీ వెంట వస్తాను.

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః |
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతః సహోదరః ||

భార్యలు ఏ దేశంలోనైన దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ ఏ దేశానికి వెళ్ళిన తోబుట్టువులు మాత్రం దొరకరు. వారిని కోల్పోకూడదు అంటాడు ‪‎#శ్రీరాముడు‬.

నేను ఇక్కడే, ఈ యుద్ధభూమిలోనే మరణిస్తాను, తిరిగి అయోధ్యకు వెళ్ళను, నాకు నీ కంటే ఎవరు ఎక్కువ కాదు అంటూ లక్ష్మణుని చూస్తూ రాముడు రోదిస్తాడు.

ఇది వాల్మీకి ‪#రామాయణం‬ యుద్ధకాండ 101 సర్గలో ఉంది.

తోడబుట్టిన వారి విలువ ఎంత చక్కగా చెప్పాడు శ్రీ రాముడు. అహంకారాలాకు పోయి వారిని దూరం చేసుకుంటారా? కొత్తగా పెళ్ళై వచ్చిన జీవిత భాగస్వామి కోసం వారిని విడిచిపెడతారా? శ్రీ రాముడు మనకు ఆదర్శం కావాలి. బంధువులు, బంధుత్వాలు ఎన్నైనా కలుపుకోవచ్చు. కానీ తోబుట్టువులను తీసుకురాలేరు. వారితో కూడా కాలం గడపాలి, ప్రేమను పంచుకోవాలి. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులులాగా అప్యాయతతో జీవించాలి.

Monday, November 19, 2018

రమ్మనిబిల్చెతండ్రితొలిరాత్రికిగూతునుబ్రేమమీఱగన్

అమ్మరొచేయుచుంటినిటయాదిపరాంబికకుత్సవంబునున్
రమ్మనిబిల్చెతండ్రి తొలిరాత్రికిగూతునుబ్రేమమీఱగన్
నిమ్ముగ తొమ్మిదిన్దినములిచ్చటయుండగవీలుకానిచో
రమ్మికయొక్కరాత్రికినిరాహులుతోడనసంతసింతునున్

రమ్మనితండ్రిపిలిచెదొలిరాత్రికిగూతున్

అమ్మా!యిత్తునురూకలు
రమ్మనితండ్రిపిలిచె,దొలిరాత్రికిగూతు
న్నిమ్ముగదేవాలయమున
కమ్మనుబూజించుకొఱకుహరితోబంపెన్

arunachalam

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.

అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,

సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.

కంచిలో పృథివీ లింగం,

జంబుకేశ్వరంలో జలలింగం,

అరుణాచలంలో అగ్నిలింగం,

చిదంబరంలో ఆకాశలింగం,

శ్రీకాళహస్తిలో వాయులింగం,

కోణార్కలో సూర్యలింగం,

సీతగుండంలో చంద్రలింగం,

ఖాట్మండులో యాజమాన లింగం –

ఈ ఎనిమిది అష్టమూర్తులు.

ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.

కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.

అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.

అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.

అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.

అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.

ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.

అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.

అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.

కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.

అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.

అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.

అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.

అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.

అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.

దర్శనాత్ అభ్రశదసి
జననాత్ కమలాలే
స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది.

మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.

కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.

ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.

అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.

దాని పేరే అరుణాచలం.

అచలము అంటే కొండ.

దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.

ఆకొండ అంతా శివుడే.

అక్కడ కొండే శివుడు.

కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.

అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.

అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.

గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.

ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది.

అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.

అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.

దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.

ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.

ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.

అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.

అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.

ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.

అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.

కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.

అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.

అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.

అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.

అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.

ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు.

ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి.

అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.

అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.

‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.

నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.

ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.

అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.

అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.

తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది.

రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు.

ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది.

అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.

తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది.

ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు.

అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు.

దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది.

అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది.

అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.

ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.

పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది.

ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు.

లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు.

శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.

అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.

ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.

సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.

స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే.

అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.

అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ.

అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ.....

ఓం నమఃశివాయ .

Sunday, November 18, 2018

బగమునుమ్రింగుచున్న

నకనకలాడుచుండుచునునాలుకజూపుచుబ్రాకిపుర్వుశా
బకమునుమ్రింగుచున్నదొకబల్లిగనుంగొనుమయ్యమిత్రమా!
తికమకయైనజీవితమతీంద్రియశక్తులగారణంబునన్
నొకరినినొక్కరీజగతినొవ్వుచునుండుటజర్గుచుండెగా

బకమును గబళించుబల్లిగనుము

గోడమీదబ్రాకుచీడపురుగును,శా
బకమునుగబళించుబల్లిగనుము
చూచుచుండమ్రింగచోద్యమయాయెను
బ్రాణిబ్రాణికిలనుభక్ష్యదినుసు

Saturday, November 17, 2018

అహమే

అహమేప్రాణినిగ్రుంకజేయుచునుదానాజీవికెల్లప్పుడు
న్సహనమ్మేతొలగింపజేయునుగదా,శాంతిన్సుఖమ్మున్భువిన్
సహనమ్ముండినబొందవచ్చునిలనాశాజ్యోతివెల్గుల్లలో,
నిహమున్శంభునిబూజజేయగనుశివైక్యంబులొందన్నగున్

సహనమె


ఇహమునశాంతినినిచ్చును
సహనమె,తొలగింపజేయుశాంతినిసుఖము
న్నహమనుభావముగల్గిన,
నహమునువిడనాడవలయునభవునిగృపకై

ఆకాాాాాాశవాాాాణి

మద్యముగ్రోలుచున్నెపుడుమాంసమునంజుచుదిర్గుచుండునే
విద్యలులేనిమానవుడె,విఙ్ఞుడుగాజనమాన్యతన్గనెన్ 
విద్యయెతల్లియున్గురువువిద్యయెదం డ్రినిగాదలంచియున్ 
విద్యకుసాటియౌనదిలవీక్షణజేయగ గానరాదుగా 
 --------

Friday, November 16, 2018

రణములెపండితోత్తములరమ్యపుగ్రీడలుసాహితీసభన్

గణములగూర్పుతోడనయగారములొప్పసమస్యలన్సుపూ
రణములెపండితోత్తములరమ్యపుగ్రీడలుసాహితీసభ
న్గణములుబ్రాసలౌనులయకారునిబీజపుమంత్రరాజమే
ప్రణతులుసేయనొప్పగునుఫాలుని,శంకరు,ఫాలనేత్రునిన్

రణములెకదపండితులకురమ్యక్రీడల్

అణువణువునుత్సహించగ
గణములదాబేర్చుకతనగణనీయముగాన్
 గణుతింపసమస్యాపూ
రణములెకదపండితులకురమ్యక్రీడల్u
-

Thursday, November 15, 2018

గలగల

పలువురిహింసజేసిననుదప్పకనీకునుగల్గుబుణ్యముల్
గలగలబాఱునట్టిసురగంగనుమున్గిన,గల్గుబాపముల్
యిలనువసించుబ్రాణులనునేమరుపాటుదనంబునన్గనన్
నలరెడునుమాశంకరులనర్చనజేసినబోవుపాపముల్

గంగలోమున్గబాాాాపముల్గలుగుపెక్కు

పుణ్యములుగల్గుదప్పకపుణ్యపురుష!
గంగలోమున్గ,బాపములుగలుగుపెక్కు
పరులహింసించునాతడుభర్గుడైన
నిష్టపడకుడుకవులార!హింసజేయ

Wednesday, November 14, 2018

అర్కజుపాశము



అర్కజుబాశముkచుట్టెను
మార్కండేయుని,కొడుకుగమారుతిపుట్టెన్
మర్కటమౌయాకేసరి
కర్కునికిన్సాటియైననంశముతోడన్
ప్రత్యుత్తరంతొలగించు

puraanamula loni వ్యక్తులు

పురాణముల లోని వ్యక్తులు

అగస్త్యుడు

అగస్త్యుడు మహర్షి. లోపాముద్ర ఆయన ఇల్లాలు.వారి కుమారుడు దృఢస్యుడు.  ఇల్వలుడు వాతాపి అను దుర్బుద్ధి గల ఇద్దరు రాక్షసులు అరణ్యములో నివసిస్తూ దారిలో పోవువారిని మాయమాటలతో వారిని హింసించుటకై ఆతిధ్యమిత్తుము రమ్మని పిలిచెడివారు. ఇల్వలుడు తనసోదరుడు వాతాపిని మేక గా మార్చి దాని మాంసము అతిథికి వడ్డించి భోజనము అయిన వెంటనే 'వాతాపి బయటకు రా' అని పిలిచెడివాడు. వాతాపి పొట్టచీల్చుకొని బయటకు వచ్చెడివాడు.  ఒకసారి అగస్త్య మహర్షి అటుగా వెళ్ళడము తటస్తించింది. ఎప్పటిలాగే వారు మహర్షిని భోజనమునకు పిలిచారు. ఆతిధ్యమైన తరువాత వాతాపిని బయటకు రమ్మని పిలిచాడు ఇల్వలుడు. వాతాపి మహర్షి పొట్ట చీల్చుకొని బయటకు రాగానే మహర్షి చనిపోతాడని తలచాడు. కానీ అంతలోనే అగస్త్యుడు 'వాతాపి జీర్ణం' అని అన్నాడు. వాతాపి జీర్ణమైపోయాడు. ఇల్వలుడు కోపంతో అగస్త్యుని మీద దాడి చేయబోగా అగస్త్యుడు తన హుంకారముతో ఇల్వలునికూడా దహించి వేసాడు. 
అగస్త్య మహర్షి వింధ్యపర్వతము యొక్క గర్వభంగమొనరించాడు. సముద్రమున దాగిన కాలకేయులను రాక్షసులను బయటకు రప్పించుటకై సముద్రమునే ఔపోసన పట్టాడు.
దండకారణ్యములోని అగస్త్యుని ఆశ్రమము దర్శించిన రామునికి ఆయన దివ్యమైన ధనుర్బాణములు అక్షయ తూణీరములు ఖడ్గము ప్రసాదించి వారిని సమీపములో గోదావరి తీరమున గల పంచవటిలో నివసించమని ఆదేశించెను.
 పైన పేర్కొన్న అంశములు అగస్త్యుని యొక్క తపఃశక్తిని, గొప్పతనమును చాటుతున్నవి.అగస్త్యుడు మహర్షి. లోపాముద్ర ఆయన ఇల్లాలు. వారి కుమారుడు దృఢస్యుడు.

అగ్ని

బ్రహ్మ మానస పుత్రుడు అగ్ని. భార్య స్వాహాదేవి.  వశిష్ఠుని శాపం చేత గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని అను త్రేతాగ్నులు పృధు చక్రవర్తి కొడుకైన విజితాశ్వునకు  భార్య  శిఖండిని యందు పావకుడు, పవమానుడు, శుచి అను పేర్లతో పుట్టి తమ ప్రభావంతో మళ్ళీ అగ్నులుగా రూపొంది యధా స్థానాలకు వెళ్లిపోయారు.
 అరణి యందు మధింపగా పుట్టినవాడు పవమానుడు. మెరుపులతో నుండువాడు పావకుడు. సూర్యుని తేజస్సు నందుండువాడు శుచి.
పావకుని కొడుకు సహరక్షుడు రాక్షసుల యజ్ఞములో ఉంటాడు.  పవమానుని పుత్రుడు కవ్యవాహుడు పితృదేవతలయందు ప్రీతిగలిగి యుండును. శుచి కుమారుడు హవ్యవాహుడు యజ్ఞములయందలి హవిస్సును దేవతలకు చేర్చు చున్నాడు. 

అజామీళుడు

కన్యాకుబ్జము అనే దేశములో ఒకప్పుడు అజామీళుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు.   ఒకానొక సందర్భములో అతడు ఒక అధమ జాతి స్త్రీ తో కూడి నిగ్రహమును కోల్పోయెను. ఆ స్త్రీయందు కలిగిన సంతానంలో ఆఖరివాని పేరు నారాయణ.  అతనిమీద పెంచుకున్న మమకారం కారణంగా అజామీళుడు ‘నారాయణా నారాయణా’ అని పలుకుతూ ప్రాణములు విడిచెను. మరణకాలమున నారాయణ నామం పలుకుటచే, పాశములతో వచ్చిన యమకింకరులను నారాయణుని సేవకులు అడ్డుకొన్నారు. పవిత్రమైన నారాయణుని నామము ఉచ్చరించినంత మాత్రమున అజామీళుడు శిక్ష నుండి రక్షితుడయ్యెనని తెలిపారు.  యమధర్మరాజు కూడా నారాయణుని స్మరించిన భక్తుల జోలికి వెళ్లవద్దని యమభటులను సమాధానపరిచెను.     అజామీళుడు యమభటులకు, నారాయణ సేవకులకు మధ్యన జరిగిన సంవాదము వినగలుగుతాడు.  తిరిగి జీవించిన అజామీళుడు తాను గడిపిన జీవితమునకు విచారించి అప్పటినుంచి భక్తితో నారాయణుని సేవించి   ఆయనలో ఐక్య మయ్యాడు.

అత్రి


అత్రి మహాముని.  అనసూయ ఆయన ఇల్లాలు. అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో గొప్పవాడు తన ఇంట పుట్టాలని తపస్సు చేసింది. తత్ఫలితముగా ఆమెకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు   జన్మించారు.
 సీత రామ లక్ష్మణులు చిత్రకూటము విడిచి వెళ్లునప్పుడు అత్రి మహాముని ఆశ్రమమును సందర్శించిరి.  అనసూయ సీతకు దివ్యాభరణములు, ఎన్నటికీ నలగని వస్త్రములు, మరియు అంగరాగములు   తన తపశ్శక్తితో సృష్టించి  యిచ్చెను.

అద్రిక

అద్రిక ఒక అప్సరస. ఒకనాడు ఆమె మత్స్య రూపము ధరించి యమునా నదిలో విహరిస్తోంది. ఆ సమయములో ఒక బ్రాహ్మణుడు యమునలో దిగి సంధ్యా వందనము ఆచరించుచుండగా చేపరూపములోనున్న అద్రిక అతని అంద చందములకు ముచ్చటపడి పాదములను పట్టుకొని లాగింది. అందుకు కోపించి ఆ బ్రాహ్మణుడు ఆమెను మత్స్యముగానే ఉండిపొమ్మని శాపమిచ్చాడు. అద్రిక అతని పాదములపై బడి క్షమించమని వేడుకోగా ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు పుట్టినప్పుడు శాపవిమోచనం మౌతుందని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇది ఇలా ఉండగా చేది రాజైన ఉపరిచర వసువు పితృదేవతల కార్యము నిర్వర్తించుట కొరకు తండ్రి చెప్పినమీద మృగార్ధమై వేటకు వచ్చి,  భార్య గిరిక గుర్తుకు వచ్చి తన తేజమును ఆకుదొన్నెలో నుంచి, డేగ ముక్కుకు కట్టెను. వేరొక డేగ తరుమగా దొన్నె క్రిందపడి దానిలోని పదార్థమును చేపరూపములోనున్న అద్రిక ఆహారమనుకొని మ్రింగివేసినది. ఫలితముగా గర్భము దాల్చి చేపరూపములోనున్న అద్రికను పట్టిన  జాలరులు దానిని దాశరాజుకు, దాశరాజు ఉపరిచర వసువునకు కానుకగా ఇచ్చారు. ఆ చేపను చీల్చగా మగపిల్లవాడు ఒక ఆడపిల్ల బయటపడ్డారు. అద్రిక శాపవిమోచనమై అదృశ్యమైంది. ఉపరిచర వసువు మగ పిల్లవాడిని ఉంచుకొని ఆడపిల్లను దాశరాజుకు ఇచ్చి వైచెను. దాశరాజు వద్ద పెరిగిన ఆమెనే మత్స్యగంధి. పరాశరునికి మత్స్యగంధి యందు పుట్టినవాడే వ్యాసుడు.

అనంతుడు

నాగ ప్రముఖులలో ఒకడు. విష్ణుమూర్తి కి  పాన్పుగా అలరినవాడు.

soudasudu

సౌదసుడు(కల్మాషపాదుడు)

భగీరథుని సంతతిలోనివాడైన ఋతుపర్ణుడు నలచక్రవర్తితో స్నేహమొనరించి అతడికి అక్ష విద్యను నేర్పి నలుని నుండి అశ్వ విద్యను గ్రహించాడు. ఆ ఋతుపర్ణుని మనుమడు సౌదాసుడు, అతడి భార్య మదయన్తి. సౌదాసునికి దైవభక్తి మెండు, ధర్మపరుడు. సౌదాసుడు ఒకసారి వేటకు వెళ్లి మార్గములో తారసపడిన ఒక రాక్షసునితో పోరి వానిని చంపివైచెను. ఆ రక్కసునకు ఒక తమ్ముడు కలడు. వాడు రాజు పై పగబట్టి వంటవాని వేషములో రాజు ఇంట్లో చేరాడు. ఒక రోజు రాజు, కులగురువు వసిష్ఠుని ఆతిధ్యమునకు పిలిచెను. అదే అదనుగా వంటవాడుగా నున్న  రాక్షసుని తమ్ముడు నరమాంసమును వసిష్ఠునకిచ్చు ఆతిధ్యములో కలిపివేసెను. ఈ విషయము రాజునకు తెలియదు. వసిష్ఠుడు భోజనమునకు కూర్చొని తనకు వడ్డించిన పదార్ధములో నరమాంసము కలిసియుండుట గ్రహించి సౌదాసుని నరమాంస భక్షకుడైన  రాక్షసుడవు కమ్మని శపించెను. తరువాత  రాజు నిరపరాధి అని, అతని ప్రమేయము లేదని తెలిసికొని, తన శాపమును పన్నెండు ఏళ్లకు కుదించెను. వసిష్ఠుడు తనకు ఆకారణముగా శాపమిచ్చినందుకు ఆగ్రహించి వసిష్ఠుని శపించుటకు రాజు తన చేతియందు నీళ్లు పోసుకొని మంత్రించసాగెను. ఆ సమయములో రాజు భార్య మదయన్తి వచ్చి సౌదాసునితో  ‘కులగురువైన వసిష్ఠుని శపించుట తగదని, దానివలన రాజుకు అతని వారసులకు క్షేమముగాదని’  పలికి రాజును అందుండి విరమింపజేసెను. సౌదాసుడు భార్యమాటలు విని తాను కోపము తెచ్చుకొనకుండవలసినదని తలబోసి చేతిలోని జలమును తన కాళ్ళ పై వదలివేసెను. అలా మంత్రించిన జలము పడిన కారణముగా అతని కాళ్ళ రంగు నల్లగా మారి  అప్పటినుంచి రాజు కల్మాషపాదుడయ్యెను.

అలా శాపవశమున నరమాంసభక్షకుడి గా రాక్షసరూపములోనున్న రాజు, అరణ్యములో బ్రాహ్మణ దంపతులను చూచి బ్రాహ్మణుని మ్రింగ బోయెను. బ్రాహ్మణుని భార్య రాక్షస రూపములోనున్న రాజుతో 'మానవజన్మ దుర్లభమైనది, మనిషిగా పుట్టినందుకు దానం ధర్మం పరోపకార గుణము ఉండాలి. సూర్యవంశములో జన్మించిన నీవు బ్రాహ్మణుని చంపి ఆ పాతకాన్ని కొని తెచ్చుకుంటావా? మీ తాత తండ్రులను గురుతుకు తెచ్చుకొని ధర్మమును పాటించి నా భర్తను వదలి పెట్టు'  అని ఆక్రోశించింది.  అలా అతని భార్య ప్రాధేయపడినా కూడా వినకుండా సౌదాసుడు బ్రాహ్మణుని భక్షించివేసెను. అపుడా బ్రాహ్మణ యువతి సౌదాసునితో  ‘ఈ పాప కృత్యమునకు ఒడిగట్టిన నీవు భార్యతో సంగమించినచొ  మరణింతువుగాక’ అని శాపమిచ్చి ఆమె భర్త చితిలోపడి ప్రాణము వదలెను. పన్నెండు సంవత్సరముల కాలము ముగియగానే సౌదాసునకు నిజరూపమువచ్చి రాజ్యమునకు తిరిగివచ్చెను. బ్రాహ్మణ యువతి శాపకారణముగా, భార్యతో రమించిన సౌదాసుడు మరణించగలడు అందుచేత భార్యతో సంభోగించలేడు. సంతానము లేని కారణముగా మదయన్తి అప్పటి సాంప్రదాయము ననుసరించి భర్త అనుమతితో కుల గురువైన వసిష్ఠునితో కూడి  కొడుకును కన్నది.     అతడి పేరు అస్మకుడు. అలా ఆ మదయన్తి వసిష్ఠుని వలన పొందిన గర్భమును ఏడు సంవత్సరములు ధరించింది. అప్పటికీ ప్రసవం కాకపోవటంతో వసిష్ఠుడు వాడిగా ఉన్న రాయితో ఆమె గర్భమును చీల్చగా అస్మకుడు పుట్టాడు. ఆ అస్మకుని కొడుకు మూలకుడు జన్మించిన సమయంలోనే  పరశురాముడు, తండ్రి జమదగ్ని మరణమునకు ప్రతీకారంగా రాజ సమూహములను తన గండ్ర గొడ్డలితో మట్టుపెడుతున్నాడు. అప్పుడు స్త్రీలందరు ఆ బాలుని చుట్టూ చేరి కాపాడటం వల్ల మూలకుడు నారీకవచుడుగా గా పేరొందాడు. పరశు రామునిచే నిర్మూలింపబడిన  సూర్య వంశమునకు మూలమై నిలిచాడు కావున ఆ బాలుడు మూలకుడయ్యాడు.
 
ఖట్వాఙ్గడు సౌదాసుని తరువాతి తరములోనివాడు. ఖట్వాన్గుని కుమారుడు దీర్ఘబాహుడు, దీర్ఘబాహుని కుమారుడు రఘుమహారాజు. రఘుమహారాజు సంతతివాడు అజుడు, అజుని పుత్రుడు దశరధ మహారాజు.

బ్రహ్మముహూర్తం

*🔥అద్భుతమైనది- బ్రహ్మముహూర్తం🔥*

👉🏼పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు.
ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు.

🌻ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు.

🌻ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి.

🌻సూర్యోదయ మునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు.
అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం.

*🌹ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది🌹*

*🌻సూర్యోదయం అవడానికి, 96-48 నిమిషాల మధ్యకాలం ఇది🌻*.

🌻నిజానికి తెల్లవారు ఝామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని 'ఆసురీ ముహూర్తం' అని... ఆసురీ ముహూర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని 'బ్రహ్మముహూర్తం' అని అంటారు.

*🌺ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమున లేచి.. భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలి🌺*

🌻బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు.

*🎋ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది🌾*

పురాణగాథ:-

🌻బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి.

🌻కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసు కోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు.
ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు.

🌻అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది.

*🌸ఈ బ్రహ్మ ముహూర్త కాలమున చదివే చదువు చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి🌸*

🌻ఈ ముహూర్తాన్ని ఉపయోగించాలంటే  ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం.

🌻ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది.
మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, అయిష్టాలు లేని సమయం.

*🎋ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది🌾*

🌻ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది.

🌻అయితే మనం ఆ సమయంలో *నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటాము.* ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా *కనీసం మేలుకొని ఉండ మంటారు మన పెద్దవాళ్లు.*

🌻చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి ఈ బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

*🍁బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు🍁*

🌻పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది.

యోగా మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం మరియు
5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వంటి వాటి వలన మనసు త్వరగా భగవధ్యానంలో  ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

🌻బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది.
 అందుకే ఋషులు, యోగులు,
ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.

🌻సర్వేజనాః
శుఖినోభవంతు💐

these are b impotant

*Plz remember what these*
*few organs are afraid of ?*

*Kidney:*
Afraid to stay up all night.
*Stomach:*
Afraid of the cold food.
*Lungs:*
Afraid of smoke.
*Liver:*
Afraid of fatty stuff.
*Heart:*
Afraid of salty food.
*Pancreas:*
Afraid of big eating.
*Intestines:* .. Afraid of
eating seafood indiscriminately.
*Eyes:* .. Afraid of
mobiles & computers screens.
*Gallbladder:*
Afraid of not eating breakfast.

So pls take real good care of yourself !
Because spare parts may not fit.
They are very expensive....
& not necessarily available in stock !
🙏

Tuesday, November 13, 2018

చదువులు

పదునుగజేయునెప్పుడునుభారముగాదలంచకున్నచో
చదువులుబాలబాలికలఙ్ఞానము,నాశమొనర్చువద్దురా
యదనపుభోగలాలసతలన్నియు,జీవితమేకృశించురా
చదివినమంచివారుగనుఙ్ఞానముబెంచుమనీషులౌదురే

వలదుచదువు

అడ్డగాడిదవలె నడయాడుచుండుచో
వలదుచదువుబాలబాలికలకు
చదువువలననగునుసత్పురుషునిగను
చదువులేనియతడుచవటయెగద

Monday, November 12, 2018

కొందఱుకొంటెవారపుడుకొంటెతనంబునకొట్టిరేగదాiiiiy

కొందఱుకొంటెవారపుడుకొంటెతనంబునకొట్టిరేగదా
పందినిజూచి,శంకరుడుపార్వతిగాదలపోసెముగ్ధుడై
యందముతోడభాసిలినయాయమలక్ష్శినిజూచియత్తఱిన్
నందముజూడగానెవరికైననుగల్గునుజిత్తవిభ్రమున్

డెందముపార్వతిమయమైi

డెందముపార్వతిమయమై
యందఱిజీవంబులందుయముననుజూడన్
బొందుగనాక్రమమందున
పందినిగనిశంకరుండుపార్వతినెంచెన్

Sunday, November 11, 2018

రాఘవన్యాయమేయిదియరాయలుసెప్పుటయివ్విధంబుగన్



రాఘవన్యాయమేయిదియరాయలుసెప్పుటయివ్విధంబుగన్
మాఘముసంక్రమించినదిమార్గశిరంబునగార్తికంబనన్
మాఘముకార్తికంబునకుమార్గశిరంబునకున్నదేయెటన్
నీఘనప్రాసయేయగునునించుకబంధములెంచిచూడగ

dhkll

మాఘుడువ్రాసినకావ్యము
మాఘము,సంక్రమణమయ్యెమార్గశిరమున
న్మాఘము,కావ్యముదలపన
మోఘముగావ్రాయబడుటముదముగనుండెన్

Saturday, November 10, 2018

కప్పను

చప్పుడుచేయకుండగనుజారునిచెంతకునేగుచుండువెం
కప్పనుగాంచిపామువడకందొడగెన్గడుభీతచిత్తయై
యప్పుడునామెయున్మిగులనారడినొందుచుగేకవేయగా
యప్పురపెద్దలందఱునునైక్యతతోడనబాముజంపిరే

కప్పను గని పాము, కలఁతఁ జెందె

పాకుకొనుచువచ్చిభక్షించెవేగమె
కప్పను గని పాము, కలఁతఁ జెందెt
పామునోటనుండిప్రాణభయముతోడ
ప్రాణమనినబ్రీతిప్రాణులకిల

Friday, November 9, 2018

ఈర్ష్యభావమదియయిసుమంతజూపకu

ఈర్ష్యభావమదియయిసుమంతజూపక
యత్తమామలయెడరక్తిగలని
లయమెశాంతిగూర్చునయముగానుభువిని
శివుడుకాచునెపుడుసిరులనిచ్చి

Thursday, November 8, 2018

రామలక్ష్శణులుదననురాణిగాను

రామలక్ష్శణులుదననురాణిగాను
నొప్పుకొనకగ వారిపైజెప్పిరావ
ణునివి నాశన మునకుకా రణమయగుచు
దోడబుట్టువేయన్నకుగీడొనర్చె

భరతుడుభ్రాతృవత్సలత

అరయుమురాజ్యపాలననుహర్షముతోడనుదానుజేసెగా
భరతుడుభ్రాతృవత్సలత,బాదుకలిచ్చెనురామమూర్తికిన్
బరమపదంబులిచ్చునవి,ప్రాణముగంటెనుహెచ్చుచూచునా
భరతునిభ్రాతృవత్సలతవాసికికెక్కెనులోకమంతకున్

Wednesday, November 7, 2018

భరతుడు

అరయుము రాముని తమ్ముడె
భరతుడు,రామునకొసంగెబాదుకలెలమిన్
భరతుడు భక్తిని గొలుచుచు
బురమున్వేంచేయుదనదుపూర్వోద్భవుకున్

తిమిరమునిండునెల్లెడల

అమలుడు సూర్యుడెప్పుడిలనస్తముజెందునొనప్పుడేగదా
తిమిరమునిండునెల్లెడల,దీపములెన్నియొవెల్గుచుండినన్
జమురునుబోయుచుండుముర,సారెకుసారెకుదప్పకుండగన్
బ్రమిదలలోన,నిచ్చునవిభాగ్యములెన్నియొవెల్గుచుండుచున్

Tuesday, November 6, 2018

తిమిరమ్మెల్లెడలనిండు

అమలుడు సూర్యుడు గ్రుంకగ
తిమిరమ్మెల్లెడలనిండు,దివ్వెలువెలుగన్
జమురును నిండుగవేయుము
ప్రమిదలలోరమ్య!నీవు భద్రముసుమ్మా

ఇరవుగ

ఇరవుగసత్యభామనుమహీధరరాజులుమెచ్చునట్లుగా
నరకనియంతయయ్యెగద,నాగగళుండగజాతమెచ్చగ
న్గరళముద్రాగెనయ్యెడలగాదిలికోడలిమానసంబుదా
యరమరకేదియున్గనకహాయిగనుండెనునాక్షణంబునన్

Monday, November 5, 2018

నరకహంతకుండు,గరళగళుడు

నందనందనుండునాగశయనుడుసు
నరకహంతకుండు,గరళగళుడు
నాగభూషణుండునాబరగుచునిల
భక్తకోటినెపుడురక్తిజూడు

మాతలుమువ్వురైననొకమాతనెకొల్చుటనీకుభావ్యమే


కాతరమేమియున్బడకకామితసంపదలిచ్చునట్టియా
మాతలుమువ్వురైననొకమాతనెకొల్చుటనీకుభావ్యమే
మాతలుమువ్వురన్గొలువమంచిగసంపదలిత్తురెప్పుడున్
మాతకుసాటివారెవరుమచ్చుకునైననుగానరారుగా

Sunday, November 4, 2018

మాతలుమువురైననొక్కమాతగొలుతువా

కాతరములేద మాధవి?
మాతలుమువురైననొక్కమాతగొలుతువా
పాతకముగలుగకుండగ
మాతలుమువ్వురనుగొలువుమంచియెకలుగున్

హలమునరాఘవుండుదనుజాధిపుజంపెనుసంగరంబునన్



అలదశకంఠుడయ్యెడలయందఱబాధవెట్టదానదో
హలమునరాఘవుండుదనుజాధిపుజంపెనుసంగరంబునన్
నమలుడుదీర్ఘబాహుడునునార్తులరక్షకుండుగనౌగదా
సులభతరుండుభక్తులకుశుధ్ధమనస్కుడుజూడరాముడే

ఈవారము

ఈవారములోనేదీ
పావళిపండుగజరుపనగుబున్నమికిన్
బావనగంగాతీరపు
టావళినేమెట్టభూమినంబకునిడుమా

హలమునరాఘవుడురాక్షసాధముజంపెన్

ఇలలంకానగరపుపతి
బలగరువముతోబ్రజలనుబాధించంగన్
దలపడిదనదగుకోలా
హలమునరాఘవుడురాక్షసాధముజంపెన్

Friday, November 2, 2018

పావళిపండుగజరుపనగుబున్నమికిన్

ఈవారములోనేదీ
పావళిపండుగజరుపనగుబున్నమికిన్
బావనగంగాతీరపు
టావళినేమెట్టభూమినంబకునిడుమా

Thursday, November 1, 2018

వంచనజేయరెప్పుడునుబాపముజోలికిబోవరెయ్యెడన్

వంచనజేయరెప్పుడునుబాపముజోలికిబోవరెయ్యెడన్
మంచినిబెంచువారలిల,మందమతుల్గదయెంచిచూడగన్
మంచినిగూర్చిచెప్పుసరిమాటలువీనులకెక్కనీయకన్
గొంచెముగూడనాతృతనుగుర్తుకుదెచ్చుకొనంగబూనరే

మంచిపెంచువారు

బుధ్ధిమంతులుగనుబూజింపబడుదురు
మంచిపెంచువారు,మందమతులు
మఱచిపోదురెపుడుమఱిమఱిచెప్పిన
కొంచెమైనరాదుగుర్తుతనకు

మాతృభూమికి వచ్చినమాత

మాతృభూమికి వచ్చినమాత!నీకు
సాదరమ్ముగబలుకుదుస్వాగతమ్ము
మాతృభూమినిమించినమహియగలదె!
దివినిగంటెనుగొప్పది,తెలియునుగద,