Sunday, March 31, 2019

ఠఢంశుఔ

నగధరుడూదగ శంఖము
నగములుదలలూచిమెచ్చెనాదక్రియలన్
నగములు బ్రాణుల దోడుగ
నగజయుదాసంతసించె నారసఝరికిన్

ఠఢీణుముళ

రాకపోయిన నచటకు రమ్యముగను
గన్ను లకుకట్టి నటులుగ కందిశంక
రయ్య గురువులు తెలియప రచుట వలన
వంద నంబులు స్వామియో బండికాడి!

Saturday, March 30, 2019

సిఠిలీ

నీమముదప్పకుండగను నీతినివర్తిలుచుందురందఱు
న్రామునిరాజ్యమందెపుడు,రాక్షసధర్మమె చెల్లుబాటగు
న్రాముని శత్రువాఖలుడు,రావణురాజ్యమునందు పూర్తిగా
సేమముజేయభూప్రజకుశ్రీపతిచంపెను దుష్టరావణున్

రాామఫాాాాా

నాల్గుపాదాల నడిచెనున్యాయముగను
రామరాజ్యాన ధర్మము,రాక్షసమ్మె
కంసుపాలన నరయగ ,గాలయముని
తలపుగలిగెనునిజముగ దమనవిధము

Friday, March 29, 2019

కగఙీనుక్ష

కూకటి వ్రేళ్ళతోదునిమి కోరికలన్నిటినొక్కమారుగా
నేకముజేసినుల్లమును నీశునినామమెసంస్మరించుచో
జీకటికంటెమేలయిన చెన్నలరారెడుకాంతియున్నదే
చీకటిలోన మేలయిన చిచ్చఱకంటిని జూడగానగున్

sglm

చీకటిని మించువెలుగున్నదా కనులకు
నున్నదనుటయే పొసగును నెన్నగాను
గనులు మూసుకు ధ్యానమ్ము నొనరజేయ
లీల గన్పించు బరమాత్మ వెలుగుతోడ

తడీణీః

అణకువ లేకయుండుచును నారడిజేయుచునొక్కరొక్కరున్సదా
పణములు వెట్టుచుండియును భార్యలయాభరణంబులన్నియున్వచో
రణముసెలంగెరా తెలుగురాష్ట్రములందుననేమిచెప్పుదున్సదా
వినయవిధేయతల్గలిగిబ్రేమనునింపుచునుండమేలగున్

కగఞణశళ

కనినకలలన్ని నిజమైన గలలుగాను
రణముసెలరేగెతెలుగురాష్ట్రములలోన
నొకరి గెలుపునాకొఱకునింకొకరు,పోరు
సల్పుచుండిరిఘాటైన బల్కులుడివి

Thursday, March 28, 2019

రామాయణము

 శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ శేషతల్ప సుఖ నిద్రిత రామ్ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్ చండకిరణకుల మండన రామ్ శ్రీ మద్దశరథ నందన రామ్ కౌసల్యా సుఖవర్ధన రామ్ విశ్వామిత్ర ప్రియ ధన రామ్ ఘోర తాటకా ఘాతక రామ్ మారీచాది నిపాతక రామ్ కౌశిక మఖ సంరక్షక రామ్ శ్రీమదహల్యోద్ధారక రామ్ గౌతమముని సంపూజిత రామ్ సుర మునివర గణ సంస్తుత రామ్ నావిక ధావిత మృదు పద రామ్ మిథిలా పురజన మోహక రామ్ విదేహ మానస రంజక రామ్ త్ర్యమ్బక కార్ముక భంజక రామ్ సీతార్పిత వర మాలిక రామ్ కృత వైవాహిక కౌతుక రామ్ భార్గవ దర్ప వినాశక రామ్ శ్రీమదయోధ్యా పాలక రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ అయోధ్య కాండము: అగణిత గుణగణ భాషిత రామ్ అవనీ తనయా కామిత రామ్ రాకా చంద్ర సమానన రామ్ పితృ వాక్యాశ్రిత కానన రామ్ ప్రియ గుహ వినివేదిత పద రామ్ తత్ క్షాలిత నిజ మృదుపద రామ్ భరద్వాజ ముఖానందక రామ్ చిత్ర కూటాద్రి నికేతన రామ్ దశరథ సంతత చింతిత రామ్ కైకేయీ తనయార్థిత రామ్ విరచిత నిజ పితృ కర్మక రామ్ భరతార్పిత నిజ పాదుక రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ అరణ్య కాండము దండకావనజన పావన రామ్ దుష్ట విరాధ వినాశన రామ్ శరభంగ సుతీక్షార్చిత రామ్ అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్ గృధ్రాధిప సంసేవిత రామ్ పంచవటీ తట సుస్థిత రామ్ శూర్పణఖార్తి విధాయక రామ్ ఖర దూషణ ముఖ సూదక రామ్ సీతా ప్రియ హరిణానుగ రామ్ మారీచార్తి కృదాశుగ రామ్ వినష్ట సీతాన్వేషక రామ్ గృధ్రాధిప గతి దాయక రామ్ శబరీ దత్త ఫలాశన రామ్ కబంధ బాహుచ్ఛేదన రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ కిష్కింధా కాండము హనుమత్సేవిత నిజపద రామ్ నత సుగ్రీవాభీష్టద రామ్ గర్విత వాలి సంహారక రామ్ వానరదూత ప్రేషక రామ్ హితకర లక్ష్మణ సంయుత రామ్ సుందరా కాండము కపివర సంతత సంస్మృత రామ్ తద్గతి విధ్వ ధ్వంసక రామ్ సీతా ప్రాణాధారక రామ్ దుష్ట దశానన దూషిత రామ్ శిష్ట హనూమద్భూషిత రామ్ సీతా వేదిత కాకావన రామ్ కృత చూడామణి దర్శన రామ్ కపివర వచనాశ్వాసిత రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ యుద్ధ కాండము: రావణ నిధన ప్రస్థిత రామ్ వానరసైన్య సమావృత రామ్ శోషిత సరిదీశార్థిత రామ్ విభీషణాభయ దాయక రామ్ పర్వతసేతు నిబంధక రామ్ కుంభకర్ణ శిరచ్ఛేదక రామ్ రాక్షససంఘ విమర్దక రామ్ అహి మహి రావణ చారణ రామ్ సంహృత దశముఖ రావణ రామ్ విధి భవ ముఖ సుర సంస్తుత రామ్ ఖస్థిత దశరథ వీక్షిత రామ్ సీతాదర్శన మోదిత రామ్ అభిషిక్త విభీషణ నత రామ్ పుష్పక యానారోహణ రామ్ భరద్వాజాభినిషేవణ రామ్ భరత ప్రాణ ప్రియకర రామ్ సాకేత పురీ భూషణ రామ్ సకల స్వీయ సమానత రామ్ రత్నలసత్పీఠాస్థిత రామ్ పట్టాభిషేకాలంకృత రామ్ పార్థివకుల సమ్మానిత రామ్ విభీషణార్పిత రంగక రామ్ కీశకులానుగ్రహకర రామ్ సకలజీవ సంరక్షక రామ్ సమస్త లోకాధారక రామ్ ఉత్తరా కాండము: ఆగత మునిగణ సంస్తుత రామ్ విశ్రుత దశకంఠోద్భవ రామ్ సీతాలింగన నిర్వృత రామ్ నీతి సురక్షిత జనపద రామ్ విపిన త్యాజిత జనకజ రామ్ కారిత లవణాసురవద రామ్ స్వర్గత శంభుక సంస్తుత రామ్ స్వతనయ కుశలవ నందిత రామ్ అశ్వమేధ క్రతు దీక్షిత రామ్ కాలావేదిత సురపద రామ్ అయోధ్యక జన ముక్తిద రామ్ విధిముఖ విభుధానందక రామ్ తేజోమయ నిజరూపక రామ్ సంసృతి బంధ విమోచక రామ్ ధర్మస్థాపన తత్పర రామ్ భక్తిపరాయణ ముక్తిద రామ్ సర్వచరాచర పాలక రామ్ సర్వభయామయ వారక రామ్ వైకుంఠాలయ సంస్థిత రామ్ నిత్యానంద పదస్థిత రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్

Wednesday, March 27, 2019

కగీఙుము

సతితోనేగినరాముడయ్యెడలదాస్నానంబునాగంగలో
గుతుకంబొప్పగగాశికేగిజరిపెన్ ,గోదావరీస్నానమున్
సతితోగూడుచుజేయుచోగలుగునేసాయుజ్యంబెక్కాలమున్
బతితుల్బొందుదురైహికంబులగుబబ్బంబుల్సదామున్గుచోన్

రబినఞఠ

పాపముల దొలగించునుబ్రతియొకరికి
గౌతమీస్నాన,మొనరించెగాశికేగి
పరమ పావన గంగలో పత్నితోడ
నీటమునుగుచు రామయ్య నీరమిచ్చె

గుడ్ న్యూస్

🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪

GOOD NEWS FOR SENIOR CITIZENS

Free Darshan of  Lord Venkateshwara
for Senior Citizens @Tirupathi.

There are two slots fixed. One at 10am and another at 3pm.

You have to produce  age proof with photo ID and report at S 1 counter
under the bridge crossing the road from Gallery to Temple right side wall. No need to climb any steps.

Good seating arrangement is available. When you are seated inside - Hot Sambar rice and curd rice and Hot milk is provided.  Everything is free of cost.

You will get two laddus for which you have to pay Rs.20/-. For more laddus you can pay Rs. 25/- for each laddu.

From the car parking area at the exit gate of the Temple, a battery car is available to drop you at the counter of entry and vice -versa.

At the time of Darshan all other queues are stopped only Sr.Citizen Darshan is allowed without any push or pressure.

You can just come out of Darshan within 30 minutes after darshan of the Lord.

Contact Helpdesk Tirumala 08772277777

Info courtesy :  TTD.
_________________________

Forwarded as received but it's very  important circular, so please send to Sr Citizens as well as in all Groups.

                              🙏🙏

సతియేమూలము

సతియేమూలము సృష్టికిన్నరయ యస్మద్వంశ మింపొందగన్
సతియేయాద్యముదేశగౌరవము నాశాద్యంతమేపారగన్
సతియేయన్నియుయైధరన్దనరిసంసారంబుదాజూచుతన్
సతియేభర్తకునొజ్జయౌ బరమసంస్కారంబునేర్పింపగన్

Tuesday, March 26, 2019

సతియే

సతియన శక్త్యవతారము
సతియే నడిపించుజగతిసక్రమరీతిన్
సతియే సృష్టికి మూలము
సతియేకద పూరుషునకుసద్గురువుగనన్

కగశు

విమలా! నేర్వుము సూర్యుడేగదిల నెవ్విధంబుగా జూచినన్
కమలాప్తుండు,శశాంకుడౌననుటనిక్కంబేకదామిత్రమా!
యమలంబొందెడుకాంతిపుంజములనాహార్యంబుగావించుచున్
బ్రమదంబొందగజేయుచున్ బ్రజకునాప్యాయంబుజేకూర్చుగా!

Monday, March 25, 2019

కమలాప్తుండు చంద్రుడనుటకల్లయెటులగున్

జూవిమలా,వినుమీ రవియే
కమలాప్తుడు,చంద్రుడనుట కల్లయెటులగున్
కుముదంబులకిలహితుడే
కమలము కుముదంబులరయ గావుగనొకటే

Sunday, March 24, 2019

ఛజఞీంౌఔ

జఘ్నిని దాధరించియును శాత్రవవీరుల మూర్కొనంగగా
విఘ్నము సంభవించునని భీతినిజెందె గణేశుడత్తఱిన్
విఘ్నము కల్గునేయనుచు వేదనతోడను నుండుచోనికన్
నిఘ్నమ యౌదుమీభువిని నీరజలోచన! వింటివేసుమా

విఘ్నంబగునని గణపతి భీతింజెందెన్

జఘ్నిని జేబూనుచునే
విఘ్నంబగునని గణపతిభీతిన్ జెందెన్
నిఘ్నమయగుదుము జనులకు
విఘ్నంబుల రాకగురిచి భీతిని జెందన్

శంకరు పయనము

కంది శంకరుగురువుల కాంక్షదీర
సకల శుభములు గలిగించు శంకరుండు
నన్ని విధముల వారిని నాదుకొనగ
బయన మయ్యది సుఖముగ వరలుగాక!

Saturday, March 23, 2019

పబణీఃక్ష

su

శతక మావిష్కరణమది స్వామి యచట
దిగ్విజయముగాజరుగుత!దైవకృపను
నాశు భసమయ మందున నందుకొనుము
వందనంబులు నాయవి వందలాది


పుస్త కావిష్కరణసభబోదగదట
యెండలెక్కువ యచ్చట నుండలేవు
ననుచు వాసుకి చెప్పగావినుట వలన
మాను కొంటిని పయనము మదిని నెంచి

fsk

అవగాహంబునుగాంచితేసుమతి! యాయచ్చోట వేంచేసెయీ
శివుడంబాసహితుండు,కోరివెలసెన్సింహాచలస్వామిగన్
నవనిన్గల్గినమానవాళినిక దాగాపాడనప్పన్నయే
భవబంధంబుల ద్రెంపుమాయనుచునీభవ్యున్ సదాగొల్తురే

Friday, March 22, 2019

హరుడుగౌరితోవెలసె సింహాాాాాచలమున

భక్తకోటిని గాపాడ భరణియందు
హరుడు గౌరితోవెలసె,సింహాచలమున
నారసింహుడప్ప న్నగా నరుల నెపుడు
నోముజేయగ దయతోడ నుద్భవించె

వరలక్ష్మిగారు

వరలక్ష్మి గారి యింటను
జరిగెడు నాయుత్సవమ్ము సఫలీకృతమున్
హరిహరులిరువురు జేయుత!
సురలందఱు జయముబలుక సుమములతోడన్

చజఞంక్ష

మధుపానాంకిత మత్తచిత్తులుగదామౌనుల్ సదాచారులున్
మధుపానాంకిత మత్తచిత్తులన సమ్మానంబెమౌనీశ్వరున్
మధుపానంబది జేయునెప్పుడునునున్మంత్తుంగ దానెల్లరిన్
సుధలన్మౌనులుగ్రోలుటేయనగ నాసోమంబంచుటేసుమా

Thursday, March 21, 2019

యలిశీౌౌ

బుధులుడివిన ధ్యానమయను
మధుపానాసక్తులుగద మౌనివరేణ్యుల్
విధీమెప్పుబొందగోరిన
విధిగామౌనమ్ముమేలు విస్తృతభంగిన్

ఓ మానవుడా!

ఎపుడు పోవునో  యీ ప్రాణ  మెవరి కెఱు క ?
ప్రాణ ముండంగ జేయుచు బరుల కీవి
బ్రదుకు నన్నాళ్ళు  దృ ప్తిగ  బ్రదుకు డ య్య !
దాని వలనన గలుగును దైవ  యయువు

 మమకారమ్మును  వదులుము
మమకారము కలిగి యుండ మఱి మఱి జన్మ
ల్లమరుచు నే యుండును
మమకారము మించు జబ్బు మహినిన్గల దే ?

నొప్పించకు మదినెవరిది
నొప్పించిన దిరిగి నీవు నొవ్వగ వలయున్
నొప్పించుట కును  బదులుగ
నెప్పుడు సంతసము జేయు నెవరికి నైనన్

మౌనము భూషణ మెయ్యెడ
మౌనము మఱి యాయుధమ్ము మైత్రికి నెపుడున్
మౌనము కాదస మర్ధత
మౌనులకు న్మహిమ గలిగె మౌనమె చేతన్

కండ్లుండెను గాననుచును
గండ్లను నిక బెద్ద జేసి కనకుమ యన్ని
న్గం  డ్లకు గనబడు న  న్నియు
కం డ్లె దుటనె మాయమగును గనుమీ నిజమున్

భారతమ్మ

భారతమ్మకు నేనిదె పలుకుచుంటి
సాదరంబును దోడుత స్వాగతంబు
శక్తియుక్తుల నొసగును శంకరుండు
పద్యములనల వోకగ వ్రాయుకొఱకు

Wednesday, March 20, 2019

sgkll

వత్సరమంతయున్ భవపుబంధముతోడను మ్రగ్గుచోవసం
తోత్సవముల్ ముదంబునిడు నొక్కొగృహస్ధునకున్ దలంపగన్
నుత్సవముల్ గడున్ముదమునొందగ జేయును నెల్లవారిలో,
మత్సరమెందున్గనకమానితరీతినినుండమేలగున్

wtilm

భారపుబ్రదుకును నీదను
వేరగు మార్గమ్ములెన్నొ వెదకుచునుండన్
దోరమయగుబూనిక సం
సారులకెందులకొయీవసంతోత్సవముల్

Tuesday, March 19, 2019

దత్తపది-హా-య్ప

హాయి గొల్పెడు భవనాన హలొయ నుచును
నుండ గోరిక యున్నచో నుండుమయ్య
చెడ్డ దారికి గుడ్బైలు సెప్పి యికను
గాని యెడలను దుర్గతి గలుగు నీకు
ననుచు ధార్తరాష్ట్రునితోడ ననియె వృష్ణి

sgkmm

లోకుల మాటలన్వినిన రూఢిగ గల్గెడుచెప్పలేనిచీ
కాకులుమానవాళికతికష్టములన్గలిగించుానెప్పుడు
న్లోకులుకాకులేయగుచులుఛ్ఛపుమాటలగీడుజేయుచున్
లోకువజేతురెప్పుడునురూమరులెన్నియొపల్కుచుండుచున్

djll

ఏకాకి తనమునరయగ
వ్యాకులతను బెంచుచుండి పగగలిగించన్
నాకలతలిడెడుబలుచీ
కాకులుమానవులకెపుడు కష్టములనిడున్ 

Sunday, March 17, 2019

తధీనన

ధరణి గూలెను ద్రోణుడు ధర్మరాజు
బొంకగా,హరిశ్చంద్రునిబోలునెవడు
పోల్చలేమండి యెవరిని పుడమినందు
సత్య పాలన విషయాన సాటియతని

Saturday, March 16, 2019

యలశశుఔణనన

గిజగిజ లాడుచుండుచును గీడను భావననొందెనే సుమా
సుజనపరాభవంబున ,యశోవిభవంబులు దక్కునెప్పుడున్
స్వజనమనంగవారలు సభాస్ధలి మెప్పును నొందుచోదగన్
సుజనమనంబులెప్పుడును శుధ్ధిగనుండును గీడుజేయవే

సుజన

సుజన పరాభవ మనునది
ప్రజలేరికి నుండబోదు పావన చరితా!
యజరామరమగు నాత్మకు
సుజనపరాభవ మొసంగుసుఖ సంపత్తుల్ ?

ఛఝణుశఋా

వినుమా శంకర! యిధ్ధరన్దలప యెవ్వాడైనమెప్పున్వడున్
ధనమున్గోరి పరిశ్రమించు నరుడే,ధన్యుండు మోక్షార్ధియౌ
వినయంబొప్పగ రామనామమును దావేసారి బల్కందగున్
ననుమానంబునులేదుగా నికను నార్యా మీరలే జెప్పుడీ

ధనము గోరువాడె ధన్య జీవి

ధనము  గోరువాడె ధన్య జీవి యనుట
యక్షరాల  నిజమె  యార్య ! యదియ
ధనము లేని యెడల  తద్దయు జూతురు
చులకను గను  భువిని  సుమ్ము నమ్ము

Friday, March 15, 2019

ఆకాశవాణి

గ్రహణమువేళ యుండరుగ గాంతులతోడను,నంధకారమే
యిహమున దొర్లుచుండుచునునేదియుగన్పడకుండ యుండగా
గ్రహణమువేళ నత్యధిక కాంతి వెలింగిరి సూర్యచంద్రముల్
యహహ యనంగ నట్లుగ ను నార్యుల కయ్యది పాడియే ప్రభూ!

పద్మశ్రులు

పద్మ శ్రీలైదు బిరుదుగా భవ్యులైన
కంది శంకరు లిచ్చిన గారణమున
నందుకొనుముర యాశీస్సు లందుకొనుము
నాదు సోదర కామేశ! నగగు దనర

Thursday, March 14, 2019

నేను ఎవరు ---


నేను ఎవరు ?కలిగెను   నాకునుఅనుమానము
గరువము ,గబ్బుతనములులేకుండుటయే  నేను
నేనుఅనునదేఒకగండము,ఆగండమువిడివడితే
 జగమున  ఏమీలేదు
రమణులు నుడివిరి నీవుఎవరవో  తెలియుము వచ్చును ముత్తియ
గొంతులోపానము లేనిచో నేనేలేను
కామము,కోపములారునుపోయిననేనును పోయి  ఆ తమయె  మిగులును
నేనునేననుట    ఎవరునేను,వచితి  నెచటి  నుండి ?  ఆతమనా , మరిపీనుగునా!
పుట్టుపుట్టుక ఎక్కడోఎవరికెరుక?  ఏమని నుడువుదు? నేనెవరినని
నేను నేనను నహము తా నిన్ను పట్టె నేమి ?యెవరవు ? వచ్చితి వెచటి నుండి ?
పుట్టు మనుజుడు తప్పక గిట్టు కతన
భ్రాంతి విడనాడు మిక వెఱ్ఱి బాగు లోడ

ఓశివా

ఓశివా !
-----
తనరగ నారదాదులును ధాతయు విష్ణువు దేవతావరుల్
మనమునునీపయిన్నునిచిమానితరీతినిగొల్వుచుండగా,
వినుమురదేవరాజునునభీష్టముతోడనుబూజజేయగా
గనికరముంచినాపయినిగాంతువెయల్పునిజల్లగాశివా!

శంకరు,నాజిగెల్చి జనసంఘము బ్రోచెను రామభద్రుడే

అంకమునందుజేరెగదయంబిక సేవల మెప్పుజేసియా
శంకరు,నాజిగెల్చి జనసంఘము బ్రోచెను రామభద్రుడే
లంకపురాధిపు న్శిగుల రాజసమొప్పగ మూర్కొనంగసూ
శంకలుదీరగా బ్రజలు సంతసమొందుచు నుండిరయ్యెడన్

శంకరుగెల్చిరఘువరుడుజనులనుబ్రోచెన్

అంకముజేరెను నంబిక
శంకరుగెల్చి,రఘువరుడు జనులను బ్రోచెన్
బింకము గలిగిన పశువా
లంకేశుని సంహరించి రాజసమొప్పన్

Wednesday, March 13, 2019

సత్కవికాని నాగఫణిశర్మ వధానముజేయుటెందుకో

సత్కవికాని నాగఫణిశర్మ వధానముజేయుటెందుకో
సత్కవికాదునా యనుచు సత్యప్రమాణము జేయనేర్తురే
సత్కవియౌను దెల్పుటకు సాక్ష్యములాతని పూరణంబులే
సత్కవి కానిచో నెవరు సత్కృతులీయరు గాదెయీ భువిన్

నాగఫణి శర్మ సుకవి యనందగండు

బోడి మల్లన్న యనురీతి బొసగె సామి!
శర్మ యవధాన సారము సాంతము విని
నాగఫణి శర్మ సుకవి యనందగండు
నాయ నంగను బాడియే? మీకది నైతికమ్మె?

Tuesday, March 12, 2019

హరునిన్ మృత్యువు మ్రింగగా భువనమత్యానందమున్బొందెరా

కరమున్భారత సైన్యమన్దనర పుల్కామా వధాశూరుసం
హరునిన్ మృత్యువు మ్రింగగా భువనమత్యానందమున్బొందెరా
యరయన్ నంతియయౌనుగా భువిని సయ్యాటాల నాడించుచు
న్గరమున్వేసట బెట్టగాదగును నెక్కాలంబురాకుండుగా

హరుమృత్యువు మ్రింగ లోక మానందించెన్

హరుడే లయకారుడుగద
హరుమృత్యువు మ్రింగ లోక మానందించెన్
హరుమృత్యువు మ్రింగుటయా
జరుగని పనియార్య!యదియ జగమందెచటన్

Monday, March 11, 2019

గ్రూరుని మార్గమే మనకుగూర్చును ముక్తినటన్నసత్యమౌ

రౌరవ నామకంబనెడు రొచ్చున వేయును నెల్లవేళలన్
గ్రూరుని మార్గమే మనకుగూర్చును ముక్తినటన్న సత్యమౌ
కారణజన్ముడా రమణుగాంక్షలు మీరగ వేడుచో నికన్
నారమణుండె యిచ్చుననునాశలుదప్పకయుండుగావుతన్

గ్రూరుని మార్గమ్మె,మనకు గూర్చును ముక్తిన్

రౌరవమునకున్జేర్చును
గ్రూరుని మార్గమ్మె,మనకు గూర్చును ముక్తిన్
గారణ జన్ముని సాయిని
గారుణ్యము కలుగువరకు గయిదండలిడన్

న్గన్నసుతుండెనామగడుగాడెయటంచనమెచ్చిరెల్లరు

అన్నువగాగదాననియెయాదివరాహులరామలక్ష్శికి
న్గన్నసుతుండెనామగడుగాడెయటంచనమెచ్చిరెల్లరు
న్గన్నువపండుగాయెగదకాంచగమిమ్ములనెల్లవేళల
న్జెన్నువమీరయుండుడికజీవితమంతయురాగసంపదన్

Sunday, March 10, 2019

కన్నకుమారుండెనామగండనిబల్కెన్

సన్నని నడుమున్గలిగిన
నన్నెలతియె మొన్నదానునందరియెదుటన్
నన్నా! వింటిరె భారతి
కన్నకుమారుండెనామగండనిబల్కెన్

GROWING OLD WITH GRACE with 11 FORMULAS:

GROWING OLD WITH GRACE with 11 FORMULAS:

1. Live in your own place to enjoy independence and privacy.
2. Hold on to your bank deposits and assets with yourself.
3. Don't depend only on your children's promise to care for you when you grow old as their prioroties change with time.
4. Expand your circle of friends to include those who will outlive you.
5. Do not compare and expect nothing from others.
6. Do not meddle in the life of your children. Let them live THEIR life not yours.
7. Do not use old age as your shield and justification to demand care, respect and attention.
8. Listen to what others say but think and act independently.
9. Pray, but do not beg, even from God. If at all ask for his forgiveness.
10. Last 2 IMPORTANT ONES ....
10. TAKE GOOD CARE OF OWN   HEALTH. Apart from Medical Attention, eat Best Food in the Best Way (you can afford) & Try to Do your own Work ...
 And finally,
 11. DO NOT RETIRE FROM LIFE.

Saturday, March 9, 2019

మరణములేనివారుగద,మానవులెల్లరుదివ్యమూర్తులున్

అరయగ దేవతాగణములయ్యరెయెన్నటికెప్పుడున్సుమా
మరణములేనివారుగద,మానవులెల్లరుదివ్యమూర్తులున్
మురిపెముతోడశంకరునిబూజలుభక్తినిజేయువారలున్
విరివిగ దైవనామమునువేమరుసారులుబల్కువారలున్

మరణమేలేని వారలు,మనుజులెల్ల

ఎంచి జూడగ దేవత లెప్పటికిని
మరణమేలేని వారలు,మనుజులెల్ల
చావు పుట్టుక గలవారు జగమునందు
పాప కర్మల బట్టియు ద్భవముగలుగు

Friday, March 8, 2019

గ్యుద్ధముశాంతినొసగుజనులున్నతినిగనన్

ఉద్ధతినిగాకయెప్పుడు
బద్ధతిగావాదులాడ పండితులెపుడున్
సిద్ధాంతము కొఱకావా
గ్యుద్ధముశాంతినొసగుజనులున్నతినిగనన్

100 నిత్య సత్యాలు - ధర్మఆచారములు

P.S.N Murthy:
*స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు*

100 నిత్య సత్యాలు - ధర్మఆచారములు

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.

2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.

3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.

4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి

5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.

6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు.

7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.

8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.

9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.

10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.

11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.

13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.

16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు .

17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.

18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.

19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.

20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.

21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.

22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.

24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.

25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు

26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.

27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు.

28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.

29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.

30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.

31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.

32. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము.

33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.

34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.

35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.

36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.

37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.

38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.

39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు.

40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.

41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.

42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు.

43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.

45. ఏడవటం వలన దారిద్ర

నిత్యసత్యములు

P.S.N Murthy:
్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి.

46. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు.

47. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి.

48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.

49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు.

50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.

51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం
.
52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.

54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం.

55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు
.
56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు.

57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.

58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.

59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.

61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు
.
62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు.

63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.

64. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.

65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.

66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను.

67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.

71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి.

72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాక్ భంగం చాలా దోషం.

73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.

74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.

75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.

76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.

77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.

78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.

79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.

80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.

81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి.

82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.

83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.

84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.

85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు.

86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.

87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట

కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.

88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.

89. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే.

90. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.

91. గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.

92. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.

93. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు.

94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి.

95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.

96. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు.

97. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు.

98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు.

99. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు

100. దేవాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు

చదవండి. పిల్లలతో చదివించండి ఇంతకు మంచిన గొప్ప సంపద పిల్లలికి ఇవ్వలేమేమో

పరులు సమస్త రాజ్యమునుపాలనజేయగ నొప్పునెప్పుడున్

అరయుచు సేమమున్ బ్రజల హర్షము జూచుచునట్టియాదయా
పరులు సమస్త రాజ్యమునుపాలనజేయగ నొప్పునెప్పుడున్
గరువది యెంతవచ్చినను గాసిలుబెట్టక పన్నులన్నియున్
నరకొరగాగదీయుచును నందరిమోములుసక్కజేవలెన్

Thursday, March 7, 2019

పరులు సేయనొప్పు పాలనమ్ము

ప్రజల సేమ మరసి బహువిధములయుక్తి
పరులు సేయనొప్పు పాలనమ్ము
చీకు చింత లేని జీవన మార్గము
నెన్ను కొందు రపుడు మన్ను జనులు

ఉమాదేవిగారు



:ఆ.వె:రయమున హయమెక్కె రాణి రుద్రమ దేవి
           రాజ్యమేలె గాదె రమణ తోడ
         ముదితల కిలలోన ముదమార నేర్పంగ
        నన్ని నేర్తు రవని యందు నిజము

2.ఆ.వె:అవసరమ్ము నేర్పు నతివలకెల్లను
           కష్టసాధ్యమైన కార్యములను
          నేర్పుతోడ చేయు నేర్పరి తనమబ్బు
          అభినుతించ వలయు నార్యులార.

3.ఆ.వె:.ఝాన్సి రాణి లక్ష్మి జయమందె హయమెక్కి
          పోరు సల్పితాను పూజ్యత గనె
           వంట పనియెగాదు వడిగ నే పనినైన
         చేయగలరతివలు చిటికె లోన.

4ఆ.వె:అడువారటంచు నలుసుగా చూడకు
      నవని నేలగలరు నలఘు మతులు
      వంట వండగలరు వాహనాలవలీల
       నడపగలరు గాంచు డవని యందు.

5.ఆ.వె:ఆడువారనంగ నబలలే గారిల
          నాదిశక్తులంచు నరయుడయ్య
         ఎట్టి పనుల నైన నిట్టె చేయగలరు
          వాహనమ్ము నడుపు పడతిఁగనుము.

6.కం:జల్లెడ దిప్పిన చేతులు
        మెల్లగ స్టీరింగు బట్టి మెలకువ తోడన్
        తల్లడి చెందక బండిని
         నుల్లము నందున బెదరక నువిదయె నడుపున్.

7ఆ.వె:అవనినేలగలదు హయము నెక్కగలదు
           విద్య లెల్ల నేర్చి వెలుగ గలదు
           వాహనంబు నడిపి వాసికెక్కగలదు
           అబల కాదు చూడు సబల యీమె.

8ఆ.వె:బస్తి నేలగలదు బండి నడుప గలదు
         నవసరమ్మె నేర్పు నతివకన్ని
          చక్రములశకటము చక్కగా త్రిప్పుచు
           తాను సాగు చుండు ధరణి యందు.

9ఆ.వె:కష్టసాధ్యమైన కార్యంబు లెల్లను
          సులువు గానె చేసి చూపగలదు
           ఆడదబల గాదు సబలన్నతీరుగ
            సాగు చుండు గనుము జగతి యందు.

0.ఆ.వె:పొట్టకూటి కొరకు పుడమిపై పడుచున్న
         పడతి పాట్లు చూడ బాధ కలుగు
        తప్పు లెన్ని యున్న తప్పదు సాపాటు
        ననుచు తొక్కె రిక్ష యవని యందు.

11ఆ.వె:ఆడదంటె కాదు అంగడిలో బొమ్మ
          ఆడదంటె అమ్మె యవని యందు
          అమ్మ నాదరించ నఖిలసిరులబ్బు
            ననెడి మాట నెపుడు నమ్మ వయ్య.

12ఆ.వె:మగువ మన్ననంద మహియంత వెలుగును
      లలనలున్న చోట లక్ష్మి తాను
      వాసముండు నండ్రు వసుధలో జనములు
       గౌరవించుడయ్య ఘనముగాను.

13ఆ.వె:మగువలె మహిలోన మణిదీపములని
         తెలియుమయ్య నీవు తెలివి తోడ
           అన్నమిడెడి వేళ నన్నపూర్ణ యౌను
            నాగ్రహమ్ము కలుగ నపర కాళి

శంకరశతకము

శతకమయ్యదియాత్రేయ సామిచేత
వెల్లడినిజేయముదమాయె నుల్లమునకు
నాశు భపుఘడియలసమ యాన నాదు
వందనమ్ములు మీకివె  యందుకొనుడు


శంకరాభరణము

శంకరాభరణముమానిశంకరార్య!
వేరెగ్రూపున జేరియు దూరమౌట
భావ్యమనిపించుచున్నదే? పరమపురుష,
తట్టుకొనలేక వ్రాసితినిట్టులార్య,

Wednesday, March 6, 2019

గారాగారమున మధురగానము వింటిన్

శ్రీరాముని గుడికనుచును
ధారాళపు ఖర్చుజేయదావినిప్రభువుల్
గారాగారముజూపగ
గారాగారమున మధురగానము వింటిన్

ప్రేమయెకీడొనర్చుగద,ద్వేషమెమేలొనగూర్చునిచ్చలున్

కామముమీరియుండునెడ కామికుమధ్యననుండునట్టియా
ప్రేమయెకీడొనర్చుగద,ద్వేషమెమేలొనగూర్చునిచ్చలున్
బ్రేమలుదూరమైనపుడువేరుగగాపురముండుటౌకతన్
గాముకులొక్కరైమరలకాపురమొండుగజేయుచుందురే

Tuesday, March 5, 2019

బ్రేమించినగీడుగల్గు ద్వేషింపుమికన్

కామముక్రోధముమదముల
బ్రేమించినగీడుగల్గు ద్వేషింపుమికన్
సేమముగలుగును జగతికె
యేమాత్రమువలదుశంక యీవిషయమునన్

Monday, March 4, 2019

వాహనమన్యములేలగోరగన్

లెస్సగ నుండెనిప్పుడిటఋలీలనుగొల్పుచు వింతగానెయిర్
బస్సె,దుబాయిజేర్చదగు వాహనమన్యములేలగోరగన్
గుస్సనువీడుచున్ నికను గౌరవమొప్పగనెక్కుమాయదిన్
మిస్సునుగావునీపనికి మేదినీయానముమించి యుండుటన్

బస్సేసాధనముగద దుబాయినిజేరన్

లెస్సగ వినుడుమ ఱియెయిరు
బస్సేసాధనముగద దుబాయినిజేరన్
గుస్సాలు మానియికయా
బస్సేయెక్కవ లయునెదు బాయికి బాలా!

గురుమూర్తిజీ


శి వ క ‌ ళ్యా ణ ము



పార్వతీ పరమేశ్వరులను నూత్న వధూ వరుల జేయుట


గౌరిని జంద్రకాంతఫలకమ్మున కూర్చొనబెట్టి , గంధపున్
సారము - నంగలేప‌నము - సంపెగనూనె నలంది , పూసి క
స్తూరిని , హేమకుంభములతో జలమార్చుచు , ధూపధూమ వి
స్ఫారితదీర్ఘకేశములఁ జక్కగ వేనలి వేసి రంగనల్

అభ్యంగనస్నాన మాచరింపగనె స
ర్వాంగసంస్కారకార్యముల జేసి
అంగరాగమ్ముల నంజనాలేపముల్
సొంపారగా సంతరింప జేసి
తళుకులగుల్కు పీతవసనమ్ముల మేన
నింపొదవగ ధరియింప జేసి
మాణిక్యఖచిత హేమక భూషణముల ను
న్నత రీతిగా నలంకృతము జేసి

సర్వభువన జన నయనోత్సవకరముగ
గౌరినిం దీర్చిదిద్దిరి కాంతలెల్ల |
జనని మే‌నకాదేవి రచన మొనర్చె
మలయజ కలిత కళ్యాణతిలకరేఖ |

జనకుడగు హిమక్ష్మాధర చక్రవర్తి
లలన కిడె లలాటమున లలామకమ్ము

భసితము మారె కస్తూరి భరితాంగ రాగసంపదగ
పసిమియేనికతోలు మారె పసిడియంచుల పచ్చడముగ
బుసకొట్టు భుజగము మారె భూషించు తార హారముగ
నొసటి నేత్రము మారె నాహ ! నూత్నదీప్త లలామకముగ

జూట మది శిరోవస్త్రమై శోభ నొసగ
బాలశశియె చూడామణిత్వమును పొంద
పెండ్లికొడుకయ్యె శంభుడు వేడ్కమీర
పెండ్లిపల్లకిగా మారె వృషభు డంత

వివహవేదికా వర్ణనము


అమరగణమ్ము లెల్లయు " శివా " యనుచున్ జయపెట్టుచుండగా ,
యమునయు గంగయున్ గలసి యల్లన చామర వీచుచుండగా ,
రమయు నరుంధతీసతియు బ్రాహ్మియు హారతు లిచ్చుచుండ , స
ప్తమునులు దివ్యవేదవిదితమ్ముగ కార్యము లాచరించగా ,
ప్రమదముతోడ నిల్వ నిరుపార్శ్వములందున బ్రహ్మవిష్ణువుల్ ,
రమణుడు - శంకరుం డిక విరాజిలె చక్కని పెండ్లిబిడ్డడై


ప్రకట మంగళకర మధురవాద్యనిస్వనములతో
సకల బంధుహితులు రాగ , శంభు నెదురుకొనియె మే
నక | మరియు తుషార శైలనాధు డతని యమలపా
ద కమలముల నెలమి గడిగి దానమొసగె కన్యకన్


ప్రమథులు మంగళవాద్యముల్ మొరయింప ,
దిక్పతుల్ పుష్పవేదిక నమర్చ ,
నలుగిడె నా యరుంధతి వధూవరులకు |
కమలాతపత్రమ్ము కమల పట్టె |
ఆ కేశవాంభోరుహాసను లిరువైపు
నిలిచిరి శంభుని నికట మందు |
గీర్పతి మంత్రము లేర్పడ బఠియింప
గీర్వాణి కళ్యాణ గీతి బాడె |

గిరిజయు శివుడున్ దమయొక్క శిరముల పయి
ముత్తెముల తలంబ్రాలను పోసుకొనిరి
సేస లుంచెను దేవతాసిధ్ధగణము

శ్రీకరము మనోహరము నై త్రిజగములకు
పరగె వారి శుభంకర పరిణయమ్ము
వినిన చదివిన మోక్షమ్ము మనకు గలుగు




బాలచంద్రమౌళి . దీనభక్తపాల . శంకరా .
శూలపాణి . నాగభూష . శుభ్రదేహ . ఈశ్వరా .
నీలకంఠ . నిర్వికార . నిర్మలా . మనోహరా .
జాల మేల మమ్ము బ్రోవ జాలితో . మహేశ్వరా

Sunday, March 3, 2019

శ్రీరఘురామ సద్భజన సేయదగున్ శివరాత్రికిన్దమిన్


వారునువీరునాక పరివారము సైతము భక్తితోడుతన్
శ్రీరఘురామ సద్భజన సేయదగున్ శివరాత్రికిన్దమిన్
శ్రీరమనాథుడున్మఱియు శ్రీసతి భర్తయు నేకరూపులే
యేరికిజేసినన్భజన నిద్దరిమూర్తులసేవయేయగున్

రామ భజన సేయుము ,శివవరాత్రికి భక్తిన్

ముక్తి కలుగును దప్పక మూర్తి! నీకు
రామ భజన సేయుము ,శివవరాత్రికి భక్తిన్
బూజలునభిషే కమ్ములు భూరిజేయ
సిరియు సంపద లిచ్చును శివుడుమనకు

శివస్తుతి

శివస్తుతి

భక్తవశంకర!పార్వతినాథుడ!పంచముఖేశుడ!భక్తునిరా
ముక్తినినిచ్చెడు పూజితదైవమ,పోడిమిజూడుముపుష్కరుడా!
రక్తపుజీరలురాగిలునట్టులె రమ్యపుమోమునగావుమురా
భక్తులరక్షణభారముగాదుగపావనజన్ముడ!భైరవుడా!


ఆరడివెట్టకనాదుకొ మమ్ములహైమవతీశుడ! యాదిసురా!
మారునిసంహర మాదృశభక్తుల మత్తులదుఃఖముమాన్పుమయా
హారతులిచ్చెదనందుకొనంగను నాయతరీతిని  నంబపతీ!
మారముజేయక మమ్ములవేడగ మంచిగరాగదె మంజుప్రభో!!

కాశికి వచ్చితి  కంటికినిండుగ  గాంచితిశంకర! కావుమయా
కాశినివాసము గాగలవారలు కాంతురుస్వర్గము కాయముతో
కాశియెప్రాణము కాశియెమానము కాశియెసర్వము కాశిప్రభో!
కాశినివీడగ గావలియైననుగాంక్షనుజెప్పడు కాశివిభూ!


భక్తులపాలిట భాగ్యవిధాతవు పావనమూర్తివి పాహిశివా!
రక్తినిబాడుదు రమ్మనిగోరుచు  రచ్చనుజేయక రమ్ముశివా!
ముక్తినినీయగమోదముతోడనుముంగిలికిప్పుడెమౌనిగరా
భక్తినినింపుగ ప్రార్ధనజేయుదు భార్గవినాథుడపాహిహరా!


కొప్పునగంగను గోరిధరించిన గూరిమిశంకర, కుక్షికికై
యప్పులజేసితి నందరియొద్దను
 నంబరకేశుడ!
 యల్పుడనై
దప్పదునీకిక  తల్లిగబ్రోవగ దండ్రిగసాయము
దాలిమితో
నిప్పుడుజేయగ నీశ్వర!కోరుదు నిందుకళాధర!
యీశుప్రభో,

కాంతలుబుత్రులు గారుగనిత్యము కాలుడ!నన్నిక కావుమురా
సాంతమునమ్ముదు సారసలోచన ఛాత్రుడనౌదును సాంబశివా!
పంతముజేయక పాలనజేయుము పావనతేజుడ! భైరవుడా!
వంతనివారక పాపవిమోచన, భార్గవరాముడ! పాహిశివా


చిన్మయరూపుడ! చిత్తజసంహర! సేవ్యసురాగ్రణి! చేరగరా
తన్మయమందితి  దావకరూపము  దర్శనమౌటను ధన్యుడనే
సన్మతిగొల్చెద సాదరమొప్పగ  జల్లగమమ్ముల సాకుమురా
మన్మథుడంబము మాన్చినశంకర, మమ్ములమాత్రము మంచుమయా


సాంబసదాశివ సాంబసదాశివ  సాంబసదాశివ సాంబశివా,
అంబకుజెప్పుమ యాశ్రయమిమ్మని  ఆశ్రయ రక్షక యార్తినిసూ
పంబనువెలసిన పావనమూర్తికి వప్రుడ!యోభవ, పాహిశివా!
సాంబునిబేరది సార్ధకమాయెను సారసలోచన సాంబశివా


,కొబ్బరి కాయలు గొట్టుదుశంకర! కోరినకోర్కెలు గూర్చుమయా
యబ్బురమొందగ హారతులిచ్చెద నద్రిజవల్లభ! యాతృతతో
జబ్బలుద్రిప్పుచు జక్కగధూపము జయ్యననిత్తును జంద్రశిఖా! పబ్బపురోజున బాయసమాదిగ భక్ష్యములెన్నియొ వండుదురా

కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీజి మున్పెప్పుడో

కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీజి మున్పెప్పుడో
యలనాటెప్పటి మాటయో యదియ యార్యా!యిప్పుడేవారునా
బలుకుల్నమ్మరు శాంతులెప్పుడు ప్రలంభాలాడగా రావుగా
వలపుల్జూపుచుబ్రేమతోడుతను దాభాషించుచోవచ్చునే

Saturday, March 2, 2019

కలహముసుఖమిచ్చుననెనుగాంధీమునుపే

ఇలమీగురువును నడుగుము
చెలువంగా గాంధిగురిచిచెప్పుడుననగన్
సులువుగనుబదులుసెప్పెను
కలహముసుఖమిచ్చుననెనుగాంధీమునుపే

Friday, March 1, 2019

ఆకాశవాణి

బుద్ధిగనుండకెప్పుడును బోరులుగొట్టగబల్కనిట్లుగా
యుద్ధముయుద్ధమంచునునికహోరులువెట్టుచుబెచ్చుమీరుచో
నుద్ధతితోడనే పరులయుద్ధతిమాన్చగనెల్లవారికిన్
యుద్ధమెశాంతిదాయకమహో జనపాళికిసౌఖ్యమిచ్చెడిన్
-----
పోచిరాజు సుబ్బారావు
హైదరాబాదు

బెదరి కార్యముల్ విడుచుటె విఙ్ఞతయగు

బెదరి కార్యముల్ విడుచుటె విఙ్ఞతయగు
బెదరుటన్నది తెలియుమా పిరికితనము
విఙ్ఞు డగుమానవుడుధర బెదరకుండ
దూసుకొనుచుబో వలెనెంత దూరమైన

తెలుగువెలుగు

అప్పుబాధనుబడలేక యర్జునుండు
తనదుగోడునుజెప్పుచు దనయునకును
నిట్లుపలికెను వినుముర యికను మనకు
దలనుతాకట్టుపెట్టుటెధర్మమగును