Sunday, March 3, 2019

శివస్తుతి

శివస్తుతి

భక్తవశంకర!పార్వతినాథుడ!పంచముఖేశుడ!భక్తునిరా
ముక్తినినిచ్చెడు పూజితదైవమ,పోడిమిజూడుముపుష్కరుడా!
రక్తపుజీరలురాగిలునట్టులె రమ్యపుమోమునగావుమురా
భక్తులరక్షణభారముగాదుగపావనజన్ముడ!భైరవుడా!


ఆరడివెట్టకనాదుకొ మమ్ములహైమవతీశుడ! యాదిసురా!
మారునిసంహర మాదృశభక్తుల మత్తులదుఃఖముమాన్పుమయా
హారతులిచ్చెదనందుకొనంగను నాయతరీతిని  నంబపతీ!
మారముజేయక మమ్ములవేడగ మంచిగరాగదె మంజుప్రభో!!

కాశికి వచ్చితి  కంటికినిండుగ  గాంచితిశంకర! కావుమయా
కాశినివాసము గాగలవారలు కాంతురుస్వర్గము కాయముతో
కాశియెప్రాణము కాశియెమానము కాశియెసర్వము కాశిప్రభో!
కాశినివీడగ గావలియైననుగాంక్షనుజెప్పడు కాశివిభూ!


భక్తులపాలిట భాగ్యవిధాతవు పావనమూర్తివి పాహిశివా!
రక్తినిబాడుదు రమ్మనిగోరుచు  రచ్చనుజేయక రమ్ముశివా!
ముక్తినినీయగమోదముతోడనుముంగిలికిప్పుడెమౌనిగరా
భక్తినినింపుగ ప్రార్ధనజేయుదు భార్గవినాథుడపాహిహరా!


కొప్పునగంగను గోరిధరించిన గూరిమిశంకర, కుక్షికికై
యప్పులజేసితి నందరియొద్దను
 నంబరకేశుడ!
 యల్పుడనై
దప్పదునీకిక  తల్లిగబ్రోవగ దండ్రిగసాయము
దాలిమితో
నిప్పుడుజేయగ నీశ్వర!కోరుదు నిందుకళాధర!
యీశుప్రభో,

కాంతలుబుత్రులు గారుగనిత్యము కాలుడ!నన్నిక కావుమురా
సాంతమునమ్ముదు సారసలోచన ఛాత్రుడనౌదును సాంబశివా!
పంతముజేయక పాలనజేయుము పావనతేజుడ! భైరవుడా!
వంతనివారక పాపవిమోచన, భార్గవరాముడ! పాహిశివా


చిన్మయరూపుడ! చిత్తజసంహర! సేవ్యసురాగ్రణి! చేరగరా
తన్మయమందితి  దావకరూపము  దర్శనమౌటను ధన్యుడనే
సన్మతిగొల్చెద సాదరమొప్పగ  జల్లగమమ్ముల సాకుమురా
మన్మథుడంబము మాన్చినశంకర, మమ్ములమాత్రము మంచుమయా


సాంబసదాశివ సాంబసదాశివ  సాంబసదాశివ సాంబశివా,
అంబకుజెప్పుమ యాశ్రయమిమ్మని  ఆశ్రయ రక్షక యార్తినిసూ
పంబనువెలసిన పావనమూర్తికి వప్రుడ!యోభవ, పాహిశివా!
సాంబునిబేరది సార్ధకమాయెను సారసలోచన సాంబశివా


,కొబ్బరి కాయలు గొట్టుదుశంకర! కోరినకోర్కెలు గూర్చుమయా
యబ్బురమొందగ హారతులిచ్చెద నద్రిజవల్లభ! యాతృతతో
జబ్బలుద్రిప్పుచు జక్కగధూపము జయ్యననిత్తును జంద్రశిఖా! పబ్బపురోజున బాయసమాదిగ భక్ష్యములెన్నియొ వండుదురా

No comments:

Post a Comment