ఆ.వె:భరత దేశమందు బానిసలుగ ప్రజ
బ్రతుకు చుండ గాంచి బాధతోడ
పోరు వల్ల మనము పొందగలము స్వేచ్ఛ
ననుచు బోసు చాటె నవని యందు
ఆ.వె:వైరి జనుల కెల్ల వణుకు పుట్టెను నాడు
బోసు బాబు యున్న బుగులు హెచ్చె
శాంతి మాట కన్న సాయుధ సమరమే
సక్రమంబ టంచు సాగె ముందు
ఆ.వె:భరత మాత వెతను బాపదలచువారు
పోరు చేయు నెంచ పుడమియందు
ననుచు జనుల పిలిచె నాయజాదుఫవుజు
సైన్యమందు చేర జవము గాను
ఆ.వె: తెల్లవారినింక దేశమునుండియే
తరుమ వలెనటంచు తలచి కూర్చె
సైన్యము నొకచోట సాయుధ పోరాట
మాచ రించ నెంచి నవనియందు
ఆ.వె:దేశమాత యొక్క దీనత్వమును బాప
సైన్యమిలను కూర్చి చక్కగా ను
సమర మాచ రించ సాగుచు నేతాజి
గగనవీధి యందె కన్ను మూసె.
డా బల్లూరి ఉమాదేవి
No comments:
Post a Comment