Friday, June 18, 2010

ఆ  పస్తంబ కల్ప వృక్షము

విద్యా వాచస్పతి ,వేద శ్రీ ,విద్వత్ శిరోమణి
బ్రహ్మ శ్రీ తెలకపల్లె విశ్వనాధ శర్మ
-----------------------------------------------------------------------------------------

శకారాతి శాలి వాహనుని శకము ప్రారంభ మగుటకు పూ ర్వమే విక్రమార్కుడు తన సంవత్సరమును ప్రవర్తింప చేసెను .ఆయన తమ్ముడు భర్తృహరి నీతి, శృంగార ,వైరాగ్య శతకములు అని ప్రపంచ ప్రఖ్యాతములైన ౩ శతక సాహిత్యములను అద్భుతముగా సృష్టించెను . ఆయనకు పూర్వము ౧౫౦౦ సంవత్సరముల నాడు కాత్యాయన మహర్షి శివ మహిమ్న స్తోత్రమును రచించెను .ఇది కవుల పరంపర .ఈ నీ తి, శతక స్తోత్రములు పురాణము లలో అనాదిగా ఉన్నట్టు కనపడు చున్నవి . తెలుగు భాష లో ప్రఖ్యాత మైన సుమతి శతకము అను నీ తి శతకము శాశ్వత మైన గరుడ పురాణము లోని బృహస్పతి ప్రవచించిన సంస్కృత నీ తి శతకమునకు తూ చ తప్పని అనువాదమే . ఇట్లు ఈ నీ తి ,స్తోత్ర శతక సంప్రదాయ ము మన దేశములో అనాదిగా కొనసాగుచు వచ్చు చున్నది .

మహారాజ శ్రీ సుబ్బారావు మహా కవి కలము నుండి జాలు వారినవే ఈ రెండు విధముల కవనములు . ఇంతటి పాశ్చాత్య ప్రభావోపేతమైన ఘోర కలిలో కూడ ఈ పరంపర అవిచ్చిన్నముగా సాగిపోవు చుండుట ఆనంద దాయక మైన విషయము . భవిష్యత్తు లో కూడ దీనిని బట్టి ఈ విధమైన కవితా ప్రవాహములు ఆగవని అని పించు చున్నవి .

ఈ కవి ప్రధానముగా హనుమద్భ క్తు డైనను ఆ హనుమంతుడు రామ భక్తుడు కనుక సర్వ జన వంద నీ యుడు అను భావమును బలముగా ధ్వనింప జేయుచు రామ భక్త అను మకుటమును తన పద్యములకు ఒసంగెను .శీ ఘ్రముగా ప్రసన్ను డయ్యె ఆంజనేయ స్వామికి ఎన్నో నామములున్నను హనుమంతుడు అను పదము ముఖ్య మైనది . హనుమంతుడు అనగా హనువు = దవడ కలవాడు =హనుమంతుడు . మన అందరికి దవడ ఉన్నది కదా .మనము హనుమంతులమేనా ? కాము . సంస్కృత శబ్దముల సంప్రదాయములో ఒక అద్భుత విలాసము లుండును . స్త్రీని అంగన అందురు .అంగన అనగా అంగములు కలది అని అర్ధము . మఱి పురుషుడు కూడ అంగములు ఉండును కనుక అంగనులు అందురా ? కారు .ప్రశస్తములైన అంగములు కలవి అని అర్ధము . అట్లే హనువు (దవడ ) కలవాడు . అనగా వజ్రాయుధ ఘాతముచే దవడ వాచిన వాడు అని అర్ధము కాదు . ప్రశస్తమైన హనువు కలవాడు అని భావము . ఆయన హనువుకు ప్రాశస్త్యము ఎట్లు వచ్చెను అనగా వైకుంతు పొగడని వక్త్రంబు వక్త్రమే ,డమ డమ ధ్వని తోడి డక్క కాక అన్నట్లు ఆ మహాను భావుడు తన హనువును అవిచ్చిన్న రామ నామ జపమునకై వినియోగించు చున్నాడు . అందువలన రామ భక్తుని హనువు ప్రశస్తమైనది . కనుక ఆయన ప్రశస్త హనుమంతుడు అని భావము .

మనము మన హనువును పర దూష ణము ,గురు దూ ష ణముకో, అసత్యములు చెప్పుటకో, చాడీలు చెప్పుటకో ఉపయోగించు చున్నాము . అందువలన మన హనువు అప్రశ స్తమైనది . కనుక మనము హనుమంతులము కాము ఈ విషయము లన్నియు వారు తమ కవిత్వములో ధ్వనింప జేసిరి .కనుక ధ్వనించే అర్ధమునకు బలము ఎక్కువ . కనుక వీ రు కవితా సిద్దులని అనుకో వలసి వచ్చును .

తర్వాత నీ తి శతకమును సుమతి శతకము యొక్క ఒరవడి పై కందములలో నరుడా ! అను మకుటముతో రచించిరి .ఇది కూడ గొప్ప సుగుణమే.నీవు నరుడవు .ఈ నీ తులకు తప్పినచో నరకుడ వగుదువు .నరకుడవు అయన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టు కొన్నట్లు ఈ నీ తులు ఏమియు ఉపయోగించవని భావము .

ఈ కవి లేఖిని నుండి ఇతోదికముగా పుంఖాను పుంఖములుగా నీ తి ,భక్తి పద్యములు వెలువడ గలవని ఆశించు చున్నాను .

(సం )
తె.వి.శర్మ
(తెలకపల్లె విశ్వనాధ శర్మ )
ఫోన్ .౦౪౦౨౪౦౩౩౩౨౬

కలియుగాబ్దములు ౫౧౧౧
వికృతి జ్యేష్ట శుద్ధ తదియ
౧౫-౬-౨౦౧౦

అభినందన వాక్యము

ఓం నమో భగవతే శ్రీ విద్యా ర ణ్యా య !
సాహితీ సమాలోచనం ద్వారా సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది .అది సమాజంలో చైతన్య వికాసానికి దోహదం చేస్తుంది .మన తెలుగు భాషకు సాహిత్యం ,ఆ సాహిత్యం లొ లాలిత్యము ,లాలిత్యముతో బాటు ప్రగాఢ భక్తి ,సంస్కారము ఉన్నాయి .నిజమే . ఏ భాషలో లేవు గనుక .ఏ సంస్కృతిలో గాన రావు గనుక .కాని ఎందుకో గాని తెలుగు వాడికి తన జాతి ,సంస్కృతీ , భాష అంటే అమితానందము .కార ణం ఆ సంస్కృతిలో ,భాషలో ,సాహిత్యంలో భక్తి ,జ్ఞానం ,వైరాగ్యం ఉట్టి పడతా యి.

హనుమ పేరు తలుస్తూనే తెలుగు వాడి హృదయం భక్తితో ఉప్పొంగి పోతుంది .దేశం లో హనుమద్ భక్తులు ,నిరతిశయా నందంతో ఊ గి పోతారు .ఆ భక్త శిఖా మ ణు ల కోవకు చెందినవారు మాన్య శ్రీ సుబ్బారావు గారు .

నిజానికి తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని చొప్పించిన గొప్ప కవితా శిఖా మ ణులు.ఒక్క పొల్లు మాటను కూడ వాడ కుండ మర్రి విత్తన మంత చిన్ని పద్యములలో మహా వృక్ష మంత భావాన్ని అందించారు .అదే సాహితీ వేత్తల మధుర గీతము .ఆ గీతమును పాడుకొంటూ ఆ హనుమను తన మనస్సునందే యుండమని శతక పద్యములతో బంధించి వేశారు శ్రీ సుబ్బారావు గారు . భక్తుడు కోరేదే అది .భగవంతుని భక్తితో బంధింస్తే భవ బంధాలు వాటంతట అవే ఊ డిపోతాయి.
చిత్త శుద్ధిగ చేసెద సేవ నీ కు
ముక్తి కోసము నెప్పుడు మ్రొక్క నిన్ను
పారమార్ధికమునకు నే బాటు పడను
నా మనంబున నుండుమా రామ భక్త !
వాసనానాం పరిత్యజ మొక్షార్ధిత్వ మపి త్యజ అను నది ఉపనిషద్వా ణి.
అంత పెద్ద అర్ధం కాని ఉపనిషద్వా ణి ని చిన్న పద్యం లో చిన్ని చిన్ని పదములలో ఇ రికించారు శ్రీ సుబ్బారావు కవీన్ద్రులు .ఇట్లాంటివి ఎన్నో ,ఎన్నెన్నో .
ఇక సాహిత్య సేవా దృక్పధంలో -సమాస వికాస మునకు మార్గగామి శ్రీ సుబ్బారావు .మచ్చు తునక లాంటి -మంచి కంద పద్య సౌరభాలను సమాజము మీదికి వెదజల్లినారు.

మానుము ననుమానమ్మును
మానుము మఱి దుష్ట జనుల మైత్రిని పుడమిన్
మానుము చెడు నలవాట్లను
మానుము నిక చెడ్డ పనుల మహిలో నరుడా !
ఇట్లా చెప్పినవే -ఓ వంద కందాలు .విందా ర గిన్చండని వందనముతో డ పలికిన రమ్య మైన సాహి తీ సుధా పరంపర .
తన అమెరికా పర్యటనలో ఆ దేశ ఆనందాన్ని చవి చూచి పలవ రింపుతో పలుకరించిన పద్య సుమాలు ఆహ్లాదము కలిగిస్తాయి .
మా తృ మూర్తిని మన్నించమని ,దైవ సాన్నిధ్యమే తనకు రక్ష యని , ప్రేమ మూర్తి శ్రీ శ్రీ శ్రీ బాబా గారిని తనను కనిక రించమని వేడుకొనే పద్యాలు .కాదు అవి అమృత బిందువులు .

శ్రీ సుబ్బారావు గారిని వారి సాహితి సేవను మరువలేరు అనడానికి ఈ చిన్న పద్యాలే నిదర్శనములు .
శుభాభి నందనలతో ------వ . వేం. సత్యనారాయణ
౫-౫-౨౦౧౦. ph.no.o4024037759
saraswata visarada ,vedanta siromani,daivajna ratna
Rtd.dy.scy to govt&ex member
aagama examinationsadvisory board
ap,state govt,Endoments Department
AlsoGuest facuity dr MCr HRd institute of A.P.
H.no.4-53,New Nagole colony,saroor nagar,hyd-500035.

Friday, May 7, 2010

హరి విల్లు-----షష్టి పూర్తీ

పూ జ్యులు పేరరాజు -సత్య సుందరులు
ఆ పురాణ దంపతుల జ్యేష్ట పుత్రుడ !
నాన్న ఓ నాన్న
సామాన్య కుటుంబాన జన్మించి
తెనుగు పండిట్టువై
వేల సంఖ్యల శి ష్యుల మన్ననల నందినావు
మేమునూ నీ శిష్య పరమా ణు లమే
అయినందులకు గర్వించు చున్నాము
అమ్మా ! నాన్న !
ఆది దంపతులు మాకు మీరు
మీ కనుసన్నల మెలగు చుంటిమి
మీ ఆజ్నలే మాకు శి రోదార్యములు
షష్టి .....షష్టి పూర్తి
నిండెనా అరువది వత్సరములు
కలగా ఉన్నది నాన్న !
నీ వయసును చూ స్తే
పవలు రేలు శ్ర మించినా
అలుపు సొలుపులు నిన్ను అంటవు
ఏ మి కోరవు ఏ మి వేడవు
నీవు మా పుణ్యాల పంటవు
మా కోసమె నీ జీవితమంతా
ధార వోసితివి, ఇది నిజము సుమ్ము
నీకుగా నీకు ఏమియు లేదు
నిరాడంబర జీవితము తక్క
బ్రతుకు నందలి మిట్ట పల్లము
లన్నియు నీకు సమానములే
దుఖమునకు క్రుంగి పోవుట
సుఖమునకు పొంగి పోవుటలు
నీకు సుదూరములు........
ఎంత ఎత్తుకు ఎదిగినా
ఎత్తు లేవీ లేనివాడవు
దైవ చింతన దైవ దర్శనములు
నీకు నిత్య కృత్యములు
ఈ షష్టి పూర్తి పర్వ దినాన
మా నమస్కృతు లందు కోవలె
శత వసంతము లీవు మనవలె
మీకివే మా శత కోటి వందనములు ...
ప్రేమతో ....
కిరణ్
పాపాయి
మాధవి

Sunday, March 28, 2010

శ తక సమర్పణ

సీతా రాముల కరుణన
శ తకమ్మును వ్రాసి యుంటి శ తకము పేరున్
సతతము నరుడా యన న
ప్పొత్తము నర్పింతునమ్మ ! పుణ్యము కలుగన్

వ్రాసితి శంకరు గరుణన
వ్రాసితి మఱి రామ భక్త శతకము నేనున్
దోసిలి నొగ్గియు సతతము
నాశ తొ నర్పించు కొందు నాన్నకు ప్రీతిన్ .

Sunday, March 21, 2010

రధ సప్తమి స్నాన శ్లో కము

యద్యజ్జన్మ కృ తం పాపం
మయా సప్తసు జన్మసు
తస్య రో గంచ శో కంచ
సమస్తం హంతు సప్త మీ .

Wednesday, March 17, 2010

౧౦ .వాయువులు

౧.ప్రాణము ౨.అపానము ౩.వ్యానము (వ్యామోహము )౪.ఉదానము (ప్రత్యుత్పత్తి )౫.సమానము ౬.నాగము (త్రేన్చుట)౭.కూర్మము (కాంతి )౮.క్రుకరము(ఆకలి మంట )౯.ధనంజయము (విశ్రాంతి )౧౦.దేవదత్తము (ఆవలింత ).

౭ వరల్డ్స్ ఆఫ్ ది వరల్డు

౧.చిచేనిజ -----మెక్సికో ౨.క్రీస్తు రెడిమేర్ -----------బ్రాసిల్ ౩.తాజ్ మహల్ --ఇండియా
౪.గ్రేటు వాల్ ఆఫ్ చీ నా ౫.కోలోజియం --ఇటలి. ౬.పేత్ర--జార్డాన్ .౭ .మాచు పిచ్చు --పెరూ.===========వీ టి గురించి వివరముగా తెలిసి కొనవలసి యున్నది.

Wednesday, March 10, 2010

బే స్మెంటు

బేస్మెంటు మంచిదయ్యెను
బే స్మెంటున నుండి మేము చూతుము టీ విన్
బే స్మెంటు లేని ఎడలన
భే షుగ్గా మాదు ఉనికి ప్ర శ్నార్ధకమౌ .

ఆరు నెలలుగ నుంటిని నమెరికా లొ
ఐన పది +రెండు రోజులు పైన నుంటి
మిగులు రోజులు బేస్మెంటు గాగ నయ్యి
వెడలె రోజులు మాకట్లు వింతగాను .

బే స్మెంటుకు వందనములు
బే స్మెంటే మాకు నిల్లు భే ష రతు గ గన్
బే స్మెంటు కొచ్చి పిల్లలు
భే షు గగా నాడిరపుడు భీతిని లేకన్ .

హీటరు చేసిన మేలును
నెట్టుల మరువంగ గలను నెప్పుడు నైనన్
అట్టిటు తిరుగుచు నుండియు
దట్టమమగు నుష్ణ మిచ్చి గట్టెక్కిం చెన్


Wednesday, March 3, 2010

లక్ష్మీ స్థానములు

౧.తామర పూవు
౨.మారేడు దళము
౩.ఏ నుగు కుంభ స్థలము
౪.ఆవు వెనక తట్టు
౫.ఆడవారి నుదురు

సత్య గు ణ ము

సత్యము ప్రా ణ ము ,ధర్మము
సత్యమయే జీ వగర్ర శాశ్వత గు ణ మున్
సత్యము మానము ,నిత్యము
సత్యమ్ముకు సాటిదొకటి జగతిని గలదే ?

సాధన

మీ సాధన నే జూ చితి
నాసాంతము చదువ తెలిసె యాముష్మికముల్
ఓ సా మీ ! కోటేశ్వర !
ఆసాంతము వ్రాసి తీ వ ! యాధ్యాత్మికముల్ .

Tuesday, March 2, 2010

అమ్మ

అమ్మను మించిన దైవము
ఇమ్మహిలో గానరాదు నెందున వెతకన్
అమ్మయె తొలి గురువాయెను
అమ్మకు జేజేలు గొట్ట హాయిని నిచ్చున్ .అమ్మకు నాన్నకు నమములు
అమ్మా యన కరు ణ జూ పె నాదేవతయున్
కమ్మని మాటల భక్తిని
ఇ మ్ముగ బోధించె మాకు నిలలో మనగన్ .

నమములు అమ్మకు నాన్నకు
నమములు ఆ సాయి ప్రభుకి నమములు ఉమకున్
నమములు గిరిజా పతికిని
నమములయా వెంకటేశ! నమములు నీ కున్ .

అమ్మా ఎక్కడ నుంటివి
ఇమ్మా ఇక నీ దు నాజ్న నిను జే రుటకున్
సొమ్ములు నాస్తులు నన్నియు
వమ్మే నమ నింక నాకు వదులు దు నన్నిన్ .

సంతోష మాత మాయమ
సంతసము గ జే యుమమ్మ వత్సర మంతా
ఉత్సుకత నీ కు జే యుదు
నుత్సాహము తోడ పూ జ లొ య్యన మాతా!

శారద మాతకు నమములు
శారద మా గృపను జూడు శరణము నీవే
అరవింద ముఖము గలిగిన
శారదమా! నీకు నెపుడు సాగిల బడుదున్

విఘ్నముల నిత్తు నందురు
విఘ్నాధిప నిన్ను జనులు విఘ్నము లీయా
విఘ్నముల నాకు నీయకు
విఘ్నాధిప నిన్ను గొలుతు వేలుగ భక్తిన్ .

మహి సము లిద్దరు పుట్టిరి
మహిలో సంతోష మాత మహిమమ వలనన్
మహిసము లిద్దరి వయసులు
మహిమౌగా పాది నెలల మధ్యన నుండెన్ .

దండమయా శివ శంకర
దండమయా సాంబ నీ కు దండము శంభో
దండమయా నీలాంబర
దండమయా గరళ కంట దండము భవుడా!

అమ్మ ! శారద !యమ్మల కమ్మ వమ్మ !
నిన్ను సేవించు మనుజుడు నేగు దివికి
కాన నేనును సేవింతు కరుణ జూడు
సకల గుణముల కిరవైన శారదాంబ !

శారద మాతకు నమములు
శారద! మఱి దయను జూడు శరణము నీవే
తరియించుమమ్మ దీనుని
కోరను నిక నేది నిన్ను కువలయ నేత్రా !

తుండముచే నడ్డంకుల
నండకు రానీక గొట్టి యసముంబ్రాపున్
నిండ కృతి నోము కొరకై
కొండల రాచూలి కొడుకు గొలిచెద భక్తిన్


శ్రీ సాయీ యో సాయీ

నీ సాయము గోరుచుంటి నిలకడ కొరకై

ఈ సారికి దయ జూడుము

ఏ సాయము గోర నిన్ను నికపై సాయీ !

Monday, March 1, 2010

విజయ

విజయోత్సాహము కలిగెను
విజయను నే బెండ్లియాడ వేవురి ఎదుటన్
విజయయె భార్యగ తగునని
ప్ర్రాజాపతి వ్రాసె నె పు డొ ఫలకము నందున్ .

Sunday, February 28, 2010

మానవ సేవ

మఱువకు మానవ సేవను
మరువకు నీ బంధు జనుల మరువకు శి వునిన్
మరువకు నీ కర్తవ్యము
మరువకు నీ మాతృసేవ మహిలో నరుడా !


బాబా !

బాబాని కోరినంత నె
బాబాయే వేగ వచ్చి బాధలు తీ ర్చున్
బాబా కది సంతోషము
బాబా మా ప్రా ణ మౌట భాగ్యము మాదే .

వడ్ల గింజ

నిండార పంట చేలను
పండారిన వడ్ల గింజ పండుగ చేయన్
కండ్లార చూ సి గింజను
పండారిన ద య్యె మనసు పరిపరి విధమున్ .

చిట పటలాడు

చిటపట లాడుట మానుము
చిటపటలే క్రుంగ దీయు మేటిని నైనన్
చిటపటల వల్ల మనుజులు
జటిలముగా మారుచుంద్రు జగముల నెల్లన్ .

Saturday, February 27, 2010

నరుడా !

మననము సేయుము రాముని
మనన మె శ్రీ రామ రక్ష మానవులకిలన్
మననము తోడన మసలిన
మనుగడకే శాంతి నిచ్చు మహిలో నరుడా !

సద్గో ష్టి సిరులు నొసగును
సద్గోష్టి యె కీ ర్తి బెంచు సంఘము లోనన్
సద్గోష్టి నిచ్చు తృప్తిని
సద్గోష్టి యె చేర్చు దివికి సతతము నరుడా !

మానుము ననుమానమ్మును
మానుము మఱి దుష్ట జనుల మైత్రిని పుడమిన్
మానుము చెడు నలవాట్లను
మానుముమిక చెడ్డ పనుల మహిలో నరుడా !

వదులుము సంసారంబును
వదులుము మఱి దుర్గు ణంబు లైదును వరుసన్
వదులుము సాహంకారము
వదులుము నీ యవ గు ణం బు వదులుము నరుడా !

చెప్పుడు మాటలు వినకుము
చెప్పిన యవి కల్ల? నిజమ? చేయుము రూడిన్
చెప్పినవి నిజము లైన చొ
తప్పక పాటించు మదిని చప్పున నరుడా !


పుట్టిన మనుజుడు తప్పక
గిట్టు సుమా శంక లేదు గిట్టుట తధ్యం
గిట్టని వాడెవ డుండ డు
గట్టిగ సేవించ శి వుని పట్టుకొ నరుడా !

నమ్ముము నారాయ ణు నిని
నమ్మకమే జయము గూ ర్చు నమ్మిన పజకున్
నమ్మకము బలము మనిషికి
నమ్ము మయా నిన్ను నీవు నమ్ముము నరుడా !

నమ్మకుము దుష్ట జనులను
నమ్మకుమా కల్లలాడు నమ్మక ద్రోహిన్
నమ్మకుము దాస జనమును
నమ్మకు నీ కళ్ళ నెపుడు నమ్మకు నరుడా !

ఆశించకు పర ధనమును
ఆశించకు మయ్య నెపుడ యన్యుల ఆస్తిన్
ఆశించిన చెడి పోదువు
ఆశకు మఱి శత్రు విలను ఆసయె నరుడా !ఆశించు నీ దు భ వితను
ఆశించుట తప్పు యనను ఆశా జీ వీ !
ఆశలు కలుగుట సహజము
ఆశలు శృతి మించ రాదు ఆశా నరుడా !

ప్రేమించుము జీ వ కోటిని
ప్రేమించుమ సాటి జనుల ప్రేమ తొ నెపుడున్
ప్రేమయె దేవుని రూ పము
ప్రేమను సేవించు మయ్య ప్రేమ తొ నరుడా !

అర్ధము లన్నిటి కంటెను
పరమార్ధ మె గొప్ప దండ్రు పండితులు దగన్
పరమాత్మయే పరమార్ధము
పరమాత్ముని దెలిసి కొనుము పట్టుకు నరుడా !

మంచిని జేయుము నిరతము
మంచియె కాపాడి నిన్ను మనిషిని జేయున్
మంచియె మమతల నిలయము
మంచిని బోధించు మన్న మహిలో నరుడా !

పచ్చి చర్మపు దిత్తిది పనికి రాదు
కాటికేగాని కొఱ గాదు గవ్వకైన
బొందిలో నుండి ప్రాణము ల్బోవు వరకు
మా మనంబుల నుండుమా రామ భక్త !

ఆలోచింపుము నొకపరి
ఆలోచన నాపలేదు యాటంకంబున్
ఆలోచన నొక వరమట
ఆలోచన చేయు మయ్య ఎప్పుడు నరుడా !

పుట్టుట గిట్టుట కొరకని
పుట్టటమే మాన గల మ ? పుట్టును జగమున్
పుట్టుకయే పరమావధి
పొట్టి గ గా కుండునట్లు పుట్టుము నరుడా !

కట్టకుము పేక మేడలు
కట్టిన యవి కూ లిపోవు కట్టేడుటేనే
కట్టాలని యని పించిన
గట్టిగ కాం క్రీ టుతోడ కట్టుము నరుడా

పిచ్చగల వాని యింటను
హెచ్చుగ పోట్లాడు కొందు రెల్లరు సములై
పిచ్చియ ముదిరిన దైన చొ
చెచ్చెర హాస్పిటలు నందు చేర్చుము నరుడా !

పటపట లాడించకు మఱి
పటపట లాడించ పళ్ళు పట్టులు తప్పున్
పటపట లాడిన శబ్దము
కటువౌ గా నుండు మదికి కంటి వె నరుడా !

చెలిమి సేయుచు సేవలు సేతు నీ కు
వే యి కష్టాలు వచ్చిన వెరవ నయ్య
దొరికితివి నాకు గొప్ప వైద్యుడవు గాన
నా మనంబున నుండుమా రామ భక్త !

శ్రీ రాముని సేవించుము
శ్రీ రాముడు నీ కు నొసగు సిరి సంపదలున్
శ్రీ రామ నామ జపమును
ఆ రాత్రము సేయు వాడు ఆర్యుడు నరుడా !

కూటి కోసము పలుచోట్లు కోరుకోనుచు
దేశ దేశము లెల్లను దిరుగు చుంటి
నిలను సంసార వారధి నీ దకొరకు
నా మనంబున నుండుమా రామ భక్త !


నీ వే సద్గుణ సీలివి
నీవే మఱి సైనికుండు నీ వే గురుడౌ
నీ వే నౌ వైద్యుండవు
నీ వే గా పాలకుండు నిజముగ నరుడా !

ఉమ యనుచు పిలిచి నంతనె
ఉమయే ప్రత్యక్ష మగును సోముని వెంటన్
ఉమ యన నెవరను కొంటివి
ఉమయే మన దైవమైన అమ్మయె నరుడా !

పాడుము జాతియ గీతము
పాడుము నీ స్కూ లునందు పాయని భక్తిన్
పాడుమని యెవరు వేడిన
పాడనునని చెప్పకుండ పాడుము నరుడా !

గమనములు నెన్నియు న్నను
గమనాలే యన్ని జేరు గమ్యము దరికిన్
గమ్యంబు జీ వితంబ యె
గమ్యాన్నిక జే రుమయ్య గట్టిగ నరుడా !

గురువులు నేవురు పూజ్యులు
గురువులలో నుత్తముండు పారమ గురువున్
గురువులు వెలుగును నిత్తురు
గురువులనే వేడుకొనుము కూర్మి తొ నరుడా !

అరవకుగట్టిగ నెప్పుడు
అరచినచో గొంతు వోవు అరపుల వలనన్
అరచుట కుక్కల నైజము
అరపులు వినబడిన నీ కు వెరవకు నరుడా !

సత్యము పలుకుము నెపుడును
సత్యమె గాపాడు నిన్ను సతతము మహిలో
సత్యము మించిన గుణమును
సత్యముగా లేదు ననుట సత్యము నరుడా !

నిద్దుర లెమ్మని యరచిన
నిద్దురయే లేవ నీ వ నిద్దుర యేలా
నిద్దుర ఎక్కువ వోయిన
పొద్దంతయు తోచ కుండ వోవును నరుడా!


చేయకు దొంగ తనంబును
చేయకు మఱి దుష్ట జనుల నెయ్యము నెపుడున్
చేయకు వేగపు పయనము
చేయకుమా చిన్న పిల్ల చేష్టలు నరుడా !

జాలియ మానవ నైజము
జాలియయే లేనినాడు జగమే శూన్యం
జాలిన మనుగడ యున్నది
జాలికి జేజేలు గొట్టు చయ్యన నరుడా !

మ నసుకు నచ్చిన కార్యము
మౌనముగా జేసిరేని మౌనులు మెత్తుర్
మౌనమె మనసుకు బలమని
నెనయంగా దెలిసి కొనుము నేర్పున నరుడా !

నిర్వేద ముండ కూడదు
నిర్వేద మె గ్రుంగ దీ యు నిరతము మనిషిన్
నిర్వేద మండ్రు దిగులును
నిర్వేదము బారద్రోలు నిరతము నరుడా !

తనువును నంటిన కుళ్ళును
వెనువెంట నె బారద్రోల వేయుము నీవున్
మనమున నాటినదైన చొ
మనుగడకే ముప్పు వచ్చు మహిలో నరుడా !

జాతకములు బూ టకములు
జాతకముల నమ్మకునికి జాతికి మేలౌ
జాతకములకును బదులుగ
నీ తిని నే నమ్ముకొనుము నిరతము నరుడా !

పలుకులు చిలకల వంటివి
పలుకుము మఱి మంచిగాను పరుషము లేమిన్
పలుకులు మంచిగ నుండిన
పలుకే బంగార మగును ప్రుదివిని నరుడా !మమతల యాశా దీ పముమమతలకే మమతలగుట మహిలో చిత్రం
మమతల ములుగుచు దేలుచు
మమతలనే నాశ్రయించి మనువుము నరుడా !

అమ్మా యని నివు పిలిచిన
అమ్మయె వే వే గ వచ్చి యక్కున జేర్చున్
అమ్మను మించిన దైవము
ఇమ్ముగ నెట గానరాదు నమ్ముము నరుడా !

ఎలిజిను పురమున వెలసిన
వేలుపు యగు సాయి నాధు వేడుక మీరన్
కొలువగ నేగితి మచ టకు
నిలువెల్లను బులక రించె నిజముగ నరుడా !

అక్కడ చేసిన పూ జలు
ఎక్కడ మరికానరావు నెందును వెతకన్
అక్కడి పూ జా పద్ధతి
మక్కువ కలిగించె నాకు నిక్కము నరుడా !

ఆరాధన గావించిరి
ఆరాధన వారి పధము నారయ తెలిసెన్
ఆరాధన పరమావధి
ఆరాధన చేయుమయ్య ఆర్తి తొ నరుడా !

చక్కని సంసారమ్మును
ముక్కలుగా జే సికోకు మోడులు వారన్
ముక్కలు చెక్కలు నైన చొ
నొక్కటిగా జేయరాదు నిక్కము నరుడా !

పచ్చని సంసారముల లొ
చిచ్చును మఱి బెట్టుకోకు మెచ్చును ప్రజలున్
చక్కగ గల సంసారము
హెచ్చగు సంతసము నొందు నిచ్చలు నరుడా !


అమ్మా యని విని నంతనె
అమ్మయె శీఘ్రముగా వచ్చి నార్తిని తీర్చున్
అమ్మకు సాటిది లేదిల
అమ్మను సంతోష బెట్టు మిమ్ముగ నరుడా !

మనుగడ కోసమె తినవలె
మనుగడ మఱి యుండ రాదు తినడము కోసం
మనుగడ వరమని తెలియుము
మనుగడయే జేయు మాన్యు మహిలో నరుడా !

గో వింద నామ జపమును
గావించిన నరుడు దివిని గైకొను ముక్తిన్
గో విందుని దర్శించిన
గో విందే తీ ర్చు జనుల కోరిక నరుడా !

మాటకు ముఖ్యము సత్యము
మాటయె బోషించు శ క్తి మాటయె లోకం
మాటయె జనులకు రక్షణ
మాటకు మరియొకటి లేదు దీటు గ నరుడా !

అక్షరమే క్షీ ణిం చదు
అక్షరమే జీ వకోటి కాధారంబౌ
అక్షరమే నాయుధమ
య్యక్షరమే నీ కు రక్ష యయ్యెను నరుడా !

జీ విత మొక చదరంగము
జీ వితమే నయ్యె బంటు జీ వన పరిధిన్
జీ వన మది పరమార్ధము
జీ వనమే భార మయ్యె జీ వికి నరుడా !

విశ్వమున నేడు వింతలు
న శ్వరముగ నుండెనండ్రు నార్యులు రూ డిన్
ఆ వింతల వివరాలను
వివరముగా దెలిసి కొనుము విందును నరుడా !

విశ్వాసముతో నుండుము
విశ్వాసము నీకు శక్తి వేలుగ నిచ్చున్
విశ్వాస యుతుడ వైన చొ
విశ్వమునే ద్రిప్పగలవు వింతగ నరుడా !

సత్యము నెరుగుము శివమని
సత్యమమే సుందరమ్ము సాయికి సమముల్
సత్యము సుందర శి వముల
నిత్యము పూ జించు కొనుము నిష్ఠ తొ నరుడా !

సాయికి భక్తుడ వైన చొ
సాయికి ప్రతి రూపులైన సత్యము శి వమున్
పాయకను సుందరమ్మును
చేయుము పూ జాదికంబు సేతలు నరుడా !

చిటపట లాడుచు చినుకులు
పటపటమని క్రింద బడగ పల్లమె యయ్యెన్
పట పటల శక్తి యయ్యది
తటముల దరి కేగ రాదు బిట్టుగ నరుడా !

మన కుల గోత్రము లాకృతి
మన సంపద కలిమి బలిమి మన కేలనయా
మన వెంట రావు నిజమది
మన సత్యమె తోడు వచ్చు మనతో నరుడా !

కలడందురన్ని చోట్లను
కల డా యీ స్తంభ మందు కంటి వె నెపుడున్
కలడనుట దెలియు నాకును
కలడు కలండనెడు వి ష్ణు గాంచి తె నరుడా !

పశువులు మాత ల వంటివి
పశువులు నిల గడ్డిమేసి పాలను నిచ్చున్
పశువులు పెంచును జాతిని
పశువుల మఱి జోలిపోక మసలుము నరుడా !

వియ్యాల వారి విందును
నెయ్యముగా స్వీ కరించ నేర్తువు గానీ
కయ్య ము వచ్చిన ఎడలన
వియ్యముతో నుండ బోక వెడలుము నరుడా !

పాలకులు దిట్టలైన చొ
పాలితులే సౌఖ్య మొం ద్రు పాలన లోనన్
పాలయ మాం దామోదర
పాలయ మామ్మనుచు నీవు పలుకుము నరుడా !

నటనయ నొక కళ యాయెను
నటననయే కీ ర్తినిచ్చు నటికుల కెంతో
నటనము సేయుట కష్టము
నటనలలో బేరు నొందు నటుడుగ నరుడా !

ధైర్యము కలిగిన మనుజుడు
నిర్భయము గ నుండి జేయు నెంతటి పనినిన్
అర్భకు డు నైన వాడును
నిర్భయము గ నున్నఎడల ధీ రుడె నరుడా !

భయమను నది యొక రక్కసి
భయము ను నిల మాన్ప కునికి మరణ మె తధ్యం
భయమును మించిన దయ్యము
నె య్యె డ లను గాన రాదు నె రు గుము నరుడా !

ఊ పిరి మనిషికి యాయువు
ఊ పిరి మఱి యాడ కునికి ఔటై నట్లే
ఉచ్చ్వా నిశ్వాసంబులు
ఊ పిరిగా నెరుగు మయ్య ! సూటిగ నరుడా !

జీ వితమే కూ డికయును
జీ వితమే తీసివేత జీ వన సత్యం
జీ విత మన సుఖ దుఃఖము
జీ విత మొక మాయ యంచు చెప్పుము నరుడా !

భగవన్నా మము పలికిన
భగవంతు డె తాను వచ్చి భక్తుని బ్రోవున్
భగవన్నామము గొప్పది
భగవంతుని వేడుకొనుము భక్తి తొ నరుడా !

౫౯.చేయుము అభి షే కమ్మును
చేయుము విడనాడ కుండ చేయుము పూ జల్
చేయుము శి వునకు పైయవి
చేయగనే ముక్తి కలుగు జీ వికి నరుడా !

.చూసితి రామాలయమును
చూసితి మఱి సాయి నాధు జూసితి శి వునిన్
జూసితిని నమ్మవారిని
జూసితి నే నెల్జి నందు జూసితి నరుడా !

.చేయకుము జీ వ హింసను
చేయకుమా దొంగ తనము చేయకు తప్పున్
చేయకు పరసతి సంగము
చేయుము శ్రీరామ సేవ నిత్యము నరుడా !

.శ్రీ రామ నవమి రోజున
శ్రీరాముడు బెండ్లి యాడె సీతమ తల్లిన్
సారా జగమున కయ్యది
పారంప ర్యంబ గలుగు పండుగ నరుడా !

భద్రాద్రి గిరి నివాసుడ
శ్రీరాముడ నీకు నమము సీతారామ
శ్రీరామ యనుచు వ్రాసిన
శ్రీరాము డె నాకు నిచ్చు శ్రీలును నరుడా !

.పుట్టిన మనుజుడు తలచును
పుట్టుకయే జీ వితంబు పుట్టుక భాగ్యం
గిట్టు దు మని భయ పడుదురు
పుట్టిన వాడెప్పు డైన గిట్టును నరుడా !

.పను లెన్ని కలిగి యున్నను
దిన దినమున విద్య పెంపు ధీ యుక్తు డ వై
విన గోరుము సత్కధ లను
కవి విబుధులు సంత సించు గతినిని నరుడా !

ధరణీ నాయకు భార్యయు
గురు భార్యయు న న్న భార్య కుల కాంతను గ
న్న తల్లి దను గన్నది యున్
ధర నేవురు త ల్లు లనుచు తలుచుము నరుడా !

సిరి జేర్చు బంధువులను నా
సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
సిరియే గుణ వంతుండ ని
ధరలో బొగ డించు ననుచు తలపుము నరుడా !

హద్దులు మీరకు నెన్నడు
హద్దులు మఱి మీర కున్న హాయి గ నుం దూ
హద్దులు మీరిన ఎడలన
పెద్దలు నిను దండ జేయ పిలుతురు నరుడా !

పాపపు పని మది తలపకు
చేపట్టిన వారి యెడల చేయకు కీడున్
లోపల తలపకు క్రూరుల
పాపుల మది నమ్మ బోక మసలుము నరుడా !

ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబు దెలుప నేగకు మీ నీ
క న్న తల్లి దండ్రుల యశం
బెన్న బడెడు మాడ్కి దిరుగు మెలమిని నరుడా !

పాపుల జోలికి పోకుము
పాపులు నిల జేతురయ్య పాపా లెన్నో
పాపము నేమను కొంటివి
పాపమె మఱి శిష్ట జనుల శా పము నరుడా !

సంతోషమె సిరి నాయువు
సంతోషమె సగము బలము సఖులను గూర్చున్
సంతోష మిచ్చు శుభములు
సంతసముగ నుండు నీవు సతతము నరుడా !

బాబానే సేవించుము
బాబాయే మనకు రక్ష బహు విధములు గాన్
బాబాకు సాటి దైవము
ఈ భువిలో లేదు నిజము నెరుగుము నరుడా !

శంకరు నిల సేవించిన
శంకరుడే రక్ష జేయు సతతము మనలన్
శంకరు మించిన దైవము
నెక్కడ మఱి గానరాడు నెరుగుము నరుడా !

మాటలు కోటలు దాటిన
మాటలకే ముప్పు గలుగు మరువకు దానిన్
మాటల పొందిక మనుజుని
మేటినిగా జేయు భువిని మేలుకొ నరుడా !

పోకిరి మాటలు సెప్పుచు
పోకిరిగా నుండ బోకు పుడమిని నీవున్
పోకిరి తనము తొ నుండిన
చాకిరి యే మిగులు నీకు సతతము నరుడా !

చేయకుము కాని కార్యము
పోయకుమా క్రింద బడగ భోజన సరుకుల్
చేయకుము రిపు గృహంబున
పాయక మఱి ధర్మ నిష్ఠ బ్రతుకుము నరుడా !

ఉచ్చ్వా నిశ్వా సంబులు
కవ్వడి వలె రెండు వైపు లూపిరి పీ ల్చన్
శి వమది నొప్పెను లేనిచొ
శ వ మదియే యయ్యె నంత హంతకు నరుడా !

వగవకు గడచి న దానికి
పొగడకు దుర్మతుల నెపుడు పొసగని పనికై
వ్యగ్రత నుంచియు పనియెడ
నిగ్రహము గ జేయుమయ్య నే పని నరుడా !

ప్రాణము మానము రెండిట
ప్రాణమునే గొప్ప దండ్రు మానము కంటెన్
ప్రాణ మె లేని చొ మానపు
నునికియి యే యుండ దసలు నూహకు నరుడా !

శ తకము లన్నిట గొప్పది
శ తకమునే జెప్ప నోర్వ శ తకము పేరున్
శ తకము దేనికి దానికి
గత చరితము చాల కలదు చదువుము నరుడా !

ధన వంతుడు బల వంతుడు
ధన వంతు డె సుంద రుండు ధన వంతుండే
ధన వంతు డగును ధీ రుడు
ధనమును మఱి పంచి బెట్ట ధర్మము నరుడా !

గురువన గురుతర బాధ్య త
గురు భారము నీ కొసగ గ గురువవు నీవే
గురువులకు గురువగుదు వట
గురు మూర్తి గ గాచు మమ్ము గురువై నరుడా !

మాటల నాయువు పోవును
మాట యె ప్రాణంబు నిలను మనిషికి దలపన్
మాటయ మోదము నిచ్చును
మాటకు సరి యేది లేదు మహిలో నరుడా !

కలవో లేవో యంచును
కలతం జెందు దు రిల నిను కానగ లేకన్
కలడనుట నిజమ యైన చొ
కలతలు లేకుండ నిన్ను కాం తును నరుడా !

పని చేయు నెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దన భుక్తి యెడల దల్లియు
ననదగు కుల కాంత యుండ నగురా నరుడా !

ఏ మీ యీ విద్దూరము
మామూలు గ బొమ్మ గుండి మన్మధ లీ లం
కామమునే జయి యించెను

కామం నిను జే రకుండు కటువు గ నరుడా !

వేషా లెన్నియో వేసితి
వీసాలను మార్చినట్లు విను వీ ధికి కై
మోసాల బారి నుండియు
నాసాంతము భద్ర గుండు నా శ తొ నరుడా !

కమలములు నీ రు విడిచిన
కమలాప్తుని కిర ణు సోకి కాలిన భంగిన్
తమ తమ నిలయము దప్పిన
తమ వారే శ తృ లౌట తధ్యము నరుడా !

కవి గాని వాని రచనలు
కవులల యెడ చులక లౌను కావ్యము లైనన్
కవనము లల్లుట సుకరము
కావ్యము లను చదువు వాని కౌనది నరుడా !

చుట్టములు వచ్చు చుందురు
గట్టిగ ద్రవ్యంబు గలుగ జట్టులు గాగన్
చుట్టములు కాని వారును
చుట్టము లే మనకు యనుచు చొ త్తు రు నరుడా !

గురువన గురుతర బాధ్యత
గురు భావము నీవు నొంద గురువవు నీవే
గురువులకు గురువు యయ్యును
గురు మూర్తి గ పేరు నొందు గుణముల నరుడా !

గురువన నెవరను కొంటివి
గురువు లె నిల బొమ్మ విష్ణు గూ డిన శి వులున్
గురువుయె నిల పరమాత్మయు
పరమాత్మను వేడు కొనుమ పావన నరుడా !

కోరికలే గుర్రాలై
కోరికలే మితి మీ రియున్న కూడదు నొప్పున్
కోరికల పుట్ట నాపియు నీరములే లేక యుండు నిజముగ నరుడా !

వినుమది నెవ్వరు సెప్పిన
విని దానిని నమలు పెట్ట వేగము పడకూ
విని దాని మంచి చెడ్డలు
నెనయంగా చర్చ జేసి నే ర్వుము నరుడా !

పెద్దల యెడ గర్వించకు
పెద్దలు సెపు మాటలన్ని శ్ర ద్ధగ వినుమా
పెద్ద లిల పూ జ నీ యులు
పెద్దలనే నా శ్ర యించు బుద్దిగ నరుడా !

ఆకాసంబున పయనము
నా కేలా వచ్చె ననుచు నీ కది డౌటా
ఆకస మన నాకము గద
నాకంబున గలడు తండ్రి నమ్ముము నరుడా !

మానవులు మూడు రకములు
మానవుల లొ నుత్తముండు మరియును నీ చుల్
మానవుల లొ మధ్యములును
నెనయంగా దెలిసి కొనుము నే ర్పున నరుడా !

మానవ జాతికి మనుగడ
నెనయంగా సాయి భజన సేయుట వలెనే
నను దినము సాయి నామము
విన సొంపుగ దలచు కొనుము వేమరు నరుడా !

సంతోషంబు గ నుండుము
సంతసమున మెలగువాడు శాంతము మరియున్
సంతసము నిచ్చు పరులకు
సంతోష మె సగము బలము సత్యము నరుడా !

ఆరాధన గావించుము
ఆరాధన జే యు నెడల నంబ యె గాచున్
ఆరాధన పరి విధములు
ఆరాధన జే సికొనుము ఆ శ తొ నరుడా !

ఆనం దంబు గ నుండుము
ఆనందము సగము బలము నాయువు పెంచున్
ఆనంద వంతు డవనిని
తన యంతట తాను బ్రతుకు తధ్యము నరుడా !

అనుమానము పెను భూతము
అనుమానము నీ రసించు నన వరతంబున్
అనుమాన ముందు మనుజుడు
దినదినమును రచ్చ కెక్కు దివిలో నరుడా !

సాయీ నే పూజించిన
సాయీ నే మనకు నిచ్చు సాకల్యంబున్
సాయీ యే పరమాత్ముడు
సాయీ యే సకల లోక శర ణుడు నరుడా !

దండగ గలిగెడి పనులను
పండుగగా జేసికొనకు పని గట్టుకునై
అండగ సాయిని వేడిన
ఉండును నీ చెంత నిపుడ యో యీ నరుడా !


Friday, February 26, 2010

గో వర్ధన గిరి

గోవర్ధన గిరి ఎత్తియు
గోవుల కాపాడినావు గోకుల కృష్ణా !
గోవనితలు గోపాలురు
గోవిందుని జేర వచ్చె గోగిరి దరికిన్ .

సాదర వందనాలు

వంశ మెన్న గ చాగంటి వంశ తిలక !
కోట +ఈ శ్వర కలిపిన కుదిరె పే రు
రావు అనునది నీ పేర చివర గలదు
అందుకోవయ్య ! సాదర వందనాలు .

సుందర కాండ

కాండల నన్నిట మెరుగగు
కాండము మఱి సుందరండ్రు కావ్యజ్ఞులిలన్
పండుగ రోజున చదివిన
మెండుగ యా హనుమ యిచ్చు మిత్తిని లేమిన్ .

ఏరకుమి.......

ఏరకుమి బియ్య మటులను
ఏరకుమీ కంది పప్పు ఏరకు మినుముల్
ఏరకుమి పంచదారను
ఏరకుమీ క్రింద పడిన వేరకు సుమ్మీ .

Monday, February 22, 2010

పరమాత్మ

పరమాత్మని శి వునందురు
పరమాత్మయె కార ణంబు వాయువు వీ చన్
పరమాత్మయె ది శ లన్నియు
పరమాత్మయె జీ వ కో టి పరి కిం పం గాన్.

అద్భుతానందము

ఎల్ల పనులు మాని ఏ కాగ్రచిత్తుడై
ఎవడు చేయు పూజ నిహము నందు
అట్టి నరున కిచ్చు అద్భుతా నందము
భవుని చేష్ట యదియ భవ్యము గ ను .


మామిడికుదురు

మామిడికుదురు పురంబున
మామిడి మఱి పనస పండ్లు మైమర పిం పన్
తెమ్మంటిని యా పండ్లను
నమ్మకు నై వే ద్యమిచ్చి నాకలి దీ ర్పన్.

Sunday, February 21, 2010

పరువము తో .....

ఒరులకు చేయుము సాయము
కరవైనను బంధు జనుల కడ కేగకుమా
పరులకు మర్మము సెప్పక
పరువము తో బ్రతుకు మెపుడు పాప విరోధీ !

Friday, February 19, 2010

సూరేకారము

తెచ్చితి సూరేకారము
తెచ్చితి మఱి గంధకంబు తెచ్చితి బీడున్
తెచ్చితిని యాముదంబును
తెచ్చిన మఱి నింక యేమి తేవలె జెపుమా !

Thursday, February 18, 2010

భగవాన్

మళ్లీ మళ్లీ మనిషిగా పుట్టి ఏ దో చేయాలని లేదు
మళ్లీ మళ్లీ మర ణించి స్వర్గ సుఖాలు పొందాల నీ లేదు
నిన్ను సరాసరి చేరుకునే మార్గం చూ పించు
ఆ మార్గంలో ఒంటరిగానైనా నన్ను పయనించ నీ
నాకు నీ వరాలు భోగాలు సంపద లూ వద్దు
ఎన్ని అనుభవించినా అన్నింటి నీ వదులు కోవలసినదే
అందు కే భగవాన్ ! నిన్ను నేనే మీ కావాలని కోరను
నేను ఎవరో గుర్తించే జ్ఞానాన్ని మాత్రము నాకు ప్రసాదించు .

బాబయ్య

తెలుగు సాహిత్య రంగాన్ని తీర్చి దిద్ది
నీ ది యగుశై లి నొకదాని నిగ్రహించి
తెలుగు భాషకు వన్నెను దెచ్చినావు
శే ష బాబయ్య! నే నిదె సే రికొలు తు.

Wednesday, February 17, 2010

పాపాత్ముడు

తన గుణము తనకు నుండగ
నెనయంగా నొరుని గుణము నెంచును మదిలో
తన గుణము తెలియ కన్యుని
పనిగొని దూ షించు వాడు పాపాత్ముండున్.

లే ప్తాప్

బ్లూ మింగు డేలు నందున
మే మీ లే ప్టాపు నందు రామాయణమున్
ఏ మరు పాటుం జెందక
రాముని కథ చే యుచుంటి పారాయణగాన్.

Tuesday, February 16, 2010

మకుట ధారణ శ్లో కములు

బ్రహ్మ ణా నిర్మితం పూ ర్వం
కి రీ టం రత్న శో భీతం
అభిషిక్త పురా ఏవ
మనుస్థం దీప్త తేజసం
తస్యాం వమాయే రాజానః
క్రమద్యే నైభిషి చైతః
సభాయాం హేమ క్లుప్తాయాం
శో భితాయాం మహా ఘనైహి
రత్నైర్నావదిస్సైవ
చిత్రితాయాం సు శో భానైహి
నానా రత్న మయే పీ టే
కల్పయిత్వా యధావిదిహి
కి రీ టే న తతః పశ్యాట్
వ శి స్టీన మహాత్మనా
ఋ త్విక్ర్భుషనస్చైవ
సమయోధ్యాతా రాఘవః
Monday, February 15, 2010

వం శో ద్దారక !

అంజని వం శో ద్ధారక !
అంజలి జోడిం తు నీ కు ఆర్యారాధ్యా !
అంజనము వేసి కనుమా
అంజలిలో నేమి గలదొ అంజని పుత్రా !


Sunday, February 14, 2010

ప్రేమ పిశాచి

ప్రేమికుల దినము కావున
ప్రేమికు  లీ  రోజు మిగుల  ప్రేమాయ ణు లై
ప్రేమ ను  మునుగుచు దే లుచు
ప్రేమను  బరమార్ధ మనుచు బెంచుదు రికపైన్ 

బ్లూమింగు డేలు

బ్లూ మింగు డేలు పురమున
అమితముగా మంచు కురిసి అందము కలుగన్
హిమసంద్రము తలపించిన
ఇమ్మంచుని పొగడనిలను నేరికి తరమే ?

గుడ్బై చెప్పుట యుక్తము
గుడ్బై బ్లూ మింగు డేలు గుడ్బై నీ కున్
గుడ్బైలు కాదు యండులు
గుడ్బై యే మరల నగును గుడ్మోర్నిం గన్ .Friday, February 12, 2010

రామ భక్త !

రామ నామము జపియించు రామ బంట !
ప్రాణ రక్షక లక్ష్మణ ప్రాణ దాత !
వాయు వేగము కలిగిన వాయు పుత్ర !
నా మనంబున నుండుమా రామ భక్త ! ..

ఆత్మ హత్యకు తలపడినట్టి నరుని
జాగుసేయక దరిజేరి జాలితోడ
బుజ్జగింతును దయగల నొజ్జవోలె
నా మనంబున నుండుమా రామ భక్త ! ..

చావు కోరిన మనుజుడు చావలేడు
నింద లెనిదె మననుండి బొందు పోదు
కార్య కారణ ఘటనల కర్త వీ వ
నా మనంబున నుండుమా రామ భక్త !


ధర్మసంస్థాపనార్ధమై ధర ణి పుట్టె
రామ నామాభిదేయుడై రమ్య మల రె
భజన గావింతు నని శ మ్ము భక్తి సేతు
నామనంబున నుండుమా రామ భక్త ! .


ఆది మధ్యాంత రంబుల కంద కుండ
ఆక సంబంత రూ పంబు నావహించి
లంక కాల్చగ వచ్చిన రామ దూ త
నా మనంబున నుండుమా రామ భక్త ! .

రామ నామము ప్రజకుశ్రీ రామ రక్ష
కూడ బలుకుచు వ్రాయుడు కోటి మార్లు
వ్రాయ దలచితి నిక పైన వ్రాయు నపుడు
నామనంబున నుండుమా రామభక్త !
కదన రంగాన లక్ష్మ ణు క్రింద బడగ
రావ ణా నుజ ప్రేర ణ దివికి నేగి
ఔషధంబును దెచ్చిన భిషకు నీ వ
నామనంబున నుండుమా రామభక్త !

అలుపుసలుపులు నె రుగని అమర వీ ర !
వట్టి ప్రేర ణ కతనన పరుగులెత్తి
రావ ణా దుల జావుకు రా ణ వీ వ
నామనంబున నుండుమా రామభక్త !

ద్రవ్య మిమ్మనినీవెంట దగులలేదు
భూములిమ్మని నీ పేరు పొగడ లేదు
నేను గోరిన దొక్క టెనీ లవర్ణ
నామనంబున నుండుమా రామ భక్త !

ప్రీతి సేయక వేవంక బెట్టనేమి
కల్ప వృక్షంబు వలె నీవు కల్గ నింక
ప్రజల లక్ష్యంబు నాకేల పాండురంగ !
నామనంబున నుండుమా రామ భక్త !

నిమిష మైనను నీ యందు నిలువలేను
కష్టములకోర్వ నాచేత గాదు నిన్ను
స్మర ణ జేసెద నా యధాశక్తి కొలది
నామనంబున నుండుమా రామ భక్త !

వెళ్లిపోయిన సిరులేవి వెంటరావు
కూ డబెట్టిన సొమ్మేది కుడువరాదు
విత్తమార్జన కతనన విర్రవీగు
నామనంబున నుండుమా రామ భక్త !బ్రతుకు నన్నాళ్ళు చేయుదు భజన నీకు
రామ !యిప్పుడె చేసేద నామ భజన
మర ణ మాసన్న మైన చొ మరతు నేమొ?
నామనంబున నుండుమా రామ భక్త !

నామనంబున నుండుమా రామ భక్త !
అనుచు పలుమార్లు వేడిన నాదుకోవ ?
అయిన రాముని వేడెద నప్పుడైన
నామనంబున నుండుమా రామభక్త !

ముక్తి కోసము నేనిన్ను మ్రొక్కుచుంటి
పుడమి పుట్టిన జనుల మెప్పులకు గాదు
పారమార్దికమునకునే బాటు పడితి
నామనంబున నుండుమా రామభక్త !

ద్రోహ చింతన చేసెడి దుర్జనులకు
మధుర మైనట్టి నీ నామ మంత్ర మరయ
మర్కటంబుల మేనుకు మలయమట్లు
నామనంబున నుండుమా రామభక్త !


కమల నాభుని మహిమలు కానలేని
తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు
నరక లోకంబు చవిచూచు నట్టి పాపి
నామనంబున నుండుమా రామభక్త !

బాల్య మందున మఱి కాక ప్రాయ మం దొ
ఎప్పు డెక్కడ యేవేళ నేక్ష ణం బొ
మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన
నామనంబున నుండుమా రామభక్త !తల్లిదండ్రులు భార్యయు తనయులాది
చుట్టముల మీ ది భ్రమ దీ సి చూర జెక్కి
సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు
నామనంబున నుండుమా రామభక్త !

ఏ ది ఎటులగు నెవరికి యెరుక తరము ?
జరుగ మానదు జగతిని జరుగు నదియ
చింత గూ డదు దానికై సుంతయైన
మామనంబున నుండుమా రామ భక్త !

వ్రాయు వ్రాతలు నుదుటన వ్రాయుమయ్య
చేయు చేతలు పుడమిని చేయు మయ్య !
కో యు కో తలు వరిచేల కో య వచ్చి
మా మనంబున నుండుమా రామ భక్త !

శ్రీ లు బొంగిన శ్రీ దేవి సిరులు నొసగు
పాలు పొంగిన గో మాతపాల నిచ్చు
నీ రు పొంగిన నదులన్ని నీ ర మీ య
మా మనంబున నుండుమా రామ భక్త !

రాళ్ల గాజులు చేయించె రామదాసు
అమ్మ సీతమ్మ ! మరచి తె యమ్మ నీవు
చెప్పు మీ వార్త ప్రభునకు మెప్పు కలుగ
మా మనంబున నుండుమా రామ భక్త !

ఆయురారోగ్య సంపద లన్నియిచ్చి
అవనిలో మానవుల కన్ని యాసలిచ్చి
వ్యర్ధులను జేసి తెలిపెడి వాడ వీ వె
మా మనంబున నుండుమా రామ భక్త !


కోటి వైద్యులు గుంపు గ గూ డియున్న
మరణ కాలము నెవ్వరు మాన్ప లేరు
నిలుచునా దేహ మిందొక్క నిమిషమైన
మా మనంబున నుండుమా రామ భక్త !

సంత సంబున నుంచుమా స్వర్గ మందు
ఎచట నన్నుంచినంగాని ఎపుడునిన్ను
మరచి పోకుండ నామ స్మరణ నొసగు
మా మనంబున నుండుమా రామ భక్త !

బాల్య మప్పటి నుండియు భక్తి తోడ
నిన్నె సేవించు చుంటిని నిజము నమ్ము
హీనుడగు జుమ్మి నీవు నన్నేలు కొనగ
మామనంబున నుండుమా రామ భక్త

సుగుణ మొక్కటియును లేదు జూడబోవ
ఒరుల మంచిని కీర్తిని యోర్వలేను
నేరములు కాచి రక్షించ నీవ దిక్కు
మామనంబున నుండుమా రామ భక్త !

పన్నగాదిప మురహర పద్మనాభ !
భాను తేజుడ గోవింద భాసమాన
భజన సేయుచు నుందు నా భావ మందు
మా మనంబున నుండుమా రామ భక్త !

ఏ డు కొండల మీ దున్న వెం కటే శ !
రామ ! భవహర !మురహర ! రామ చంద్ర !
ఈ శ జగదీ శ ! సర్వేశ !ఈ డ కొచ్చి
మా మనంబున నుండుమా రామ భక్త !

తెలియ జాలక కొన్నియు తెలిసి కొన్ని
పాతకంబులు జేసితి పద్మనాభ !
కలుషములు ద్రుంచి నన్నేలు కష్ట మనక
నా మనంబున నుండుమా రామ భక్త !


పుట్టి నప్పటి నుండియు పుణ్య మెరుగ
భిక్ష మొక్కని కైనను బెట్ట లేదు
నలిన దళ నేత్ర నిన్ను నే నమ్మినాన
నామనంబున నుండుమా రామ భక్త !

కమల లోచన ! నరసింహ ! కాంతి తేజ !
జీ వ కోట్లను బోషింప నీ వె కాని
వే రె యొ క దాత లేడ య్యె వెతకి జూ డ
నామనంబున నుండుమా రామ భక్త !

పచ్చి చర్మపు దిత్తిది పనికి రాదు
కాటికే గాని కొఱ గాదు గవ్వ కైన
బొందిలోనుండి ప్రాణము ల్బోవువరకు
నా మనంబుల నుండుమా రామ భక్త !చెలిమి సేయుచు సేవలు సేతు నీ కు
వే యి కష్టాలు వచ్చిన వెరవ నయ్య
దొరికితివి నాకు గొప్ప వైద్యుడవు గాన
నా మనంబున నుండుమా రామ భక్త !
కూటి కోసము పలు చోట్లు కోరు కొనుచు
దేశ దేశము లెల్లను దిరుగు చుంటి
నిలను సంసార వారధి నీ దకొరకు
నా మనంబున నుండుమా రామ భక్త !

గర్వమున గష్టపడి నిన్ను గానకున్న
సేవకుని జేసికొనవయ్య శేష శయన
మోక్ష సామ్రాజ్య మొందగా మోదమిడగ
నా మనంబున నుండుమా రామ భక్త !


సంత సమ్మున నిన్ను నే స్మరణ సేతు
నిన్నె నమ్మిన భక్తుండ నిశ్చయముగ
కోరి చిల్లర వేల్పుల గొల్వ బోను
నా మనంబున నుండుమా రామ భక్త !

పంచ కావ్యము లా యవి పటన రాదు
శాస్త్ర గ్రంధము లేవియు చదువ లేదు
తప్పు గలిగిన సద్భక్తి తక్కువౌన ?
నా మనంబున నుండుమా రామ భక్త !

భళిర నే నీ మహా మంత్ర బలము చేత
దురిత జాలము నెల్లను దోల గలను
దివ్య వైకుంఠ పదవి సాధించ గలను
నా మనంబున నుండుమా రామ భక్త !

ఆది నారాయణానుజ ! ఆంజనేయ !
పరమ సాత్వికుడైన నీ భక్త వరుల
దాసులకు దాసుడను జుమీ ధాత్రి లోన
నా మనంబున నుండుమా రామ భక్త !

ద్రవ్యమిమ్మని నీ వెంట దగుల రాను
భూ ములిమ్మని నిన్ను నే బొగడ లేను
కనక మిమ్మని నే నిన్ను కష్ట పెట్ట
నా మనంబున నుండుమా రామ భక్త !

మంద బుద్ధియు తుడనను నింద రాగ
కల్ప వృక్షంబు వలె నీవు కలిగె నాకు
ప్రజల లక్ష్యంబు నాకేల వాయు పుత్ర !
నా మనంబున నుండుమా రామ భక్త !

చిత్త శుధ్ధి గ జేసెద సేవ నీ కు
ముక్తి కోసము నెప్పుడు మ్రొక్క నిన్ను
పారమార్ధికమునకు నే బాటు పడుదు
నా మనంబున నుండుమా రామ భక్త !

పుణ్య వంతులు సేతురు పూజ నీ కు
భక్త వర్యులు ననిశము పొగడు నిన్ను
కాల మంతయు వమ్ముగ గడుప లేను
నా మనంబున నుండుమా రామ భక్త !

సీత జూచిన యప్పుడు సేద దేరి
గంతులు వయిచు నాడెంత గల వొ గాని
పరువు గలవాడవయ్య ప్రాబల్కు లందు
నా మనంబున నుండుమా రామ భక్త !

ఒక్క గ్రుద్దట రక్కసి నొడిపి నావు
నీ పరాక్రమ మిట్టిది నిఖిల జగము
లాజ్న మీ రక నిచ్చుట యద్భుతంబు
నా మనంబున నుండుమా రామ భక్త !

నీ దు బలమెంతొ తెలియదు నీకు నౌర
తెలియ నవ్యక్తుడవు గావు తెలిసి కొన్న
నిట్టి వాడని తెలియ లేదేవ్వరికిని
నా మనంబున నుండుమా రామ భక్త !

జీవి జీవిని భక్షింప జేసి తీవు
తెలిసె నీ రక్ష కత్వంబు దేవ దేవ
వేరె గతి లేక నిన్ను సేవింప వలసె
నా మనంబున నుండుమా రామ భక్త !

అంజని సుతుండ మారుతి ఆంజనేయ
పెట్టు పేరు లనేకముల్ పుట్టు పేరు
గురుతెరింగిన నీ మూల మెరుగ వచ్చు
నా మనంబున నుండుమా రామ భక్త !

గుణము లన్నిటి యందు సద్గుణుడ వీవు
తెలిసి మ్రొక్కెద నితరమే దిక్కు లేక
నెంచరాని గుణా ధ్యుడ వీ వె హనుమ
నా మనంబున నుండుమా రామ భక్త !

దాన ధర్మము లొన గూ ర్చ ధనము లే దు

తీర్ధ యాత్రలు సేయగ ధీ రుగాను
స్మరణ చేసెద నా యధా శక్తి కొలది
నా మనంబున నుండుమా రామ భక్త !

బ్రతుకు కోసము చేయను బాడి గమ్ము
పరుల కాంతల కోసము పరుగు లిడను
జగడ మాడెడు పని కంటె జావు మేలు
నా మనంబున నుండుమా రామ భక్త !

తనువు బోయిన తరుణాన దయను కలిగి
నరక మీ యక గాపాడు నన్ను నీవు
పరమ సంతోష మొప్పగ భజన సేయ
నా మనంబున నుండుమా రామ భక్త !

యముని దూతలు బ్రాణంబు లపహరింప
బలగ మందరు దుఖం బు బడయగాను
చుట్టమల మీ ది భ్రాంతిని చూ రగొట్ట
నా మనంబున నుండుమా రామ భక్త !

ఒకరి సొమ్ముకు దోసిలి నొగ్గ నే ర
ధనము లీయగ వచ్చిన దండు కోను
తప్పులన్నియు క్షమియింప తండ్రి వీ వ
నా మనంబున నుండుమా రామ భక్త !

దాట లేనయ సంద్రము దాటలేను
చేయ లేనయ నెయ్యము సేయలేను
చూ డ లేనయ సీతను చూడ లేను
నా మనంబున నుండుమా రామ భక్త !

కాల్చ నీ వలె లంకను గాల్చలేను
ఎగుర నీ వలె మింటికి నెగురలేను
పాడ నీ వలె భజనలు పాడలేను
నా మనంబున నుండుమా రామభక్త !

కాళ్ళు కడుగంగ నిక్కడ నీళ్లు లేవు
పూ జ సేయంగ నా కడ పూ లు లేవు
భజన మాత్రమె సేతును భక్తి తోడ
నా మనంబున నుండుమా రామ భక్త !

భజన గావింతు ననిశమ్ము భక్తితోడ
విన్నపింతును విన్నపాల్వి నయముగను
ఆలపింతును మొరలను ఆలకించి
నా మనంబున నుండుమా రామభక్త !

పాము కం టపు విషమును బట్ట వచ్చు
మనుజ రోగాలు సీఘ్రము మాన్ప వచ్చు
పుడమిలో దుష్టులకు జ్ఞాన బోధ తెలుప
నా మనంబున నుండుమా రామభక్త !

పరుల ద్రవ్యము మీ దన భ్రాంతి నొంద
విష్ణు దాసుల జూచిన వెక్కిరించ
పరుల కాంతల నెన్నడు పరిహ సింప
నా మనంబున నుండుమా రామ భక్త !

సేతు బంధన కీర్తిని పొందు కతన
నబ్బె నీకు పరోప కారైక ఫలము
లంతి యె కాక నీ చేత నైన దేమి
నా మనంబున నుండుమా రామ భక్త !


సీత వెదుకంగ లంకకు చేరు నిన్ను
నీ దు వేగము తెలియక నీ దు బలము
అల్పునిగ నేన్చినా రె లోకైక నాధ
నా మనంబున నుండుమా రామ భక్త !

లంక కేగిన నిను చూసి రక్కసుండు
వారి దాసులు నిన్నెంత దూరు చున్న
బంత మున్న దె నీ కిసు మంత యైన
నా మనంబున నుండుమా రామ భక్త !

మానవత్వంపు విలువలు మంట కలిపి
ఒడిసికొనుచును దలపడ యొ కరి నొ కరు
సిద్ధ పడుచుండ నే మని సెపుదు సామి
నా మనంబున నుండుమా రామ భక్త !

రామ నామము పలుకుదు రమ్య మలర
రామ భజనలు సేతును రాగ మొప్ప
నీకు కైదండ లిడుదును నీవ దిక్కు
నా మనంబున నుండుమా రామ భక్త !

రాళ్ళు కరగంగ పాడిన రావ నీవు
ఏమి చేసిన వత్తు వొ నెరుక పరచు
చేతు నదిఎల్ల నిప్పుడ చెప్పి నట్లు
నా మనంబున నుండుమా రామ భక్త !

పూ జసేతును నిప్పుడ పూజ నీ య
భజన సేతును దినమెల్ల భక్త వర్య
చేరి కొలుతును ననిశమ్ము చిత్స్వ రూ ప
నా మనంబున నుండుమా రామ భక్త !

గిట్టు మనుజుడు తప్పక పుట్టు మరల
నతని పాపంబు విడివడు నంత వరకు
మరల జన్మంబు లేకుండ మమ్ము జూడ
నా మనంబున నుండుమా రామ భక్త !


సత్య వంతుల బోధలు జనులు వినగ
శ క్తి లేదాయె నిక నీ వె సాకు మయ్య
పక్షి రారాజ మా వంటి పామరులను
నా మనంబున నుండుమా రామ భక్
పక్షి నాయక నీ కు నే భజన సేతు
పద్మ లోచన నీ మీద భక్తి లేని
మానవుడు రెండు పాదాల మహిషి యగును
నా మనంబున నుండుమా రామ భక్త

దైత్య సంహర నాయెడ దయను జూపు
దీన పోషక నాకిక దిక్కు నీ వ
 నిన్ను నమ్మిన ట్లుగనమ్మనే నె వరిని
నా మనంబున నుండుమా  రామ భక్త !
భక్త రక్షక నీ కె న్నొ ప్ర ణు తు లీ య
నా మనంబున నుండుమా రామ భక్త !

నడక మంచిది యైన చొ నరులు మెచ్చు
చదువు లెస్స గ నుండిన సభ్యు డ గును
ఆయు రారోగ్య సంపద హాయి నీ య
నా మనంబున నుండుమా రామ భక్త !

జందె మింపుగ వేసుకు సంధ్య వార్చ
బ్రహ్మ మందక కాలే డు బ్రాహ్మణుండు
ఆ శ పోవక యగునేమి యతి వరుండు
నా మనంబున నుండుమా రామ భక్త !

సంతసంబున నిత్తువా స్వర్గ సుఖము
నేను జేసిన పుణ్యాలు నన్ని జూసి
పాతకంబులు జేసిన పాపి నౌ ర
నా మనంబున నుండుమా రామ భక్త !

అడవి పక్షుల కెవ్వడా హార మిచ్చె
ఫణుల కెవ్వడు బోసెను బాలు ధరణి
పసుల కెవ్వ డొ సంగెను పచ్చ గడ్డి
నా మనంబున నుండుమా రామ భక్త !

కోతి మూకల సాయంబు కూడ గట్టి
సాగరంబున గట్టితి సేతు ఔర
యుక్తి సేయుదు వోహో నీ శ క్తి దెలిసె
నా మనంబున నుండుమా రామ భక్త !

పుడమి నందున చంచల బుద్ది వయ్యు
నెటుల నీదగు కొంచెపు నడత లెంచ
కభి నుతింతును లోకైక కపివ యనుచు
నా మనంబున నుండుమా రామ భక్త !

కొండ లన్నిటి సరి దాటి కొంచు బోయి
చిత్ర కూటాద్రి శిఖరమ్ము చేర నిలిచి
రామ సేవకు బూనిన రమ్య చరిత
నా మనంబున నుండుమా రామ భక్త !

కాండ లెల్లను సుందర కాండ మిగుల
ముఖ్య మందురు కవి వరుల్ మోద మలర
కాన ప టనంబు జేసెద కపి వరుండ
నా మనంబున నుండుమా రామ భక్త !

పాపా లె న్నిని జేసిన
పాపుల దరి జేర్చకుండ పాలయ హనుమా
పాపాల జోలు పో నిక
పాపంబుల మీద నొట్టు పవన కుమారా !నిన్ను భక్తులు పూ జించి నీ మ మలర
ప్రేమ పక్వాన్నము లననే పెట్టు చుండ్రు
కాన నాచేతి దొకటైన కాదు వ్యయము
నా మనంబున నుండుమా రామ భక్త !


చిన్ని కోతిగ సీతను జేరగోరి
శింశుప వృక్ష చివరన సేద దేరి
సీత దుఃఖంబు చెవులార చేది కొనిన
నా మనంబున నుండుమా రామ భక్త

కదల నీ యకుండ గట్టిగా లింగంబు
కట్టి వేయనేమి ఘనత గలుగు
భావ మందు శి వుని భావించి గొల్తును
నా మనంబున నుండుమా రామ భక్త !

గాలి వానన జెలరేగు కాళ రాత్రి
దివ్వె జూపక నిను నేను దెగడి నేని
నెగులు రగిలించి గుండెలో నెగడు వెట్ట
నా మనంబున నుండుమా రామ భక్త !

లలిత నామంబు లన్నియు లహరి గాగ
మానసంబున పరుగిడు మహతి లీ ల
రమ్య మలరంగ సేతు పారాయ ణంబు
నా మనంబున నుండుమా రామ భక్త !

ఉచ్చ నీ చంబు లెరుగక ఇచ్చ జేయు
రావణు మర్దించ పూ నిక రగులు కొనగ
లంక కేతెంచి కాల్చితి లంక పురము
నా మనంబున నుండుమా రామ భక్త !

మమత నీ లీల లటు సూచి భయము నొంది
విమత భూ వరు లందఱు విముఖు లయిరి
తగుదు వగుదు వీ ఘనతకు దంభ రూప
నా మనంబున నుండుమా రామ భక్త !

సిద్ధ సంకల్ప అవి కల్ప సీత బంట
నిష్కలంక నిరాతంక నిరుపమాంక
దీ న శ రణ్య నైపుణ్య దీ న బంధు
నా మనంబున నుండుమా రామ భక్త !

బలిమి రావణు సీత నుంబప హరింప
నీ కు నిజ కార్యము భరం బె నిర్వహింప
నిఖిల దైవత కార్యముల్ నిర్వ హించ
నా మనంబున నుండుమా రామ భక్త !

రాముడ వతార పురుషుగ రాక వలన
లంక సాధించితిరి గాని లావు చేత
నిర్జరా రుల గెలువంగ నెవరి తరము
నా మనంబున నుండుమా రామ భక్త !

నీ బలము నీకు తెలియదు
నీ బలమును జెప్ప వలయు నితరులు నీ కున్
నీ బల మనితర సాధ్యము
నీ బలమును మించి లేడు నెవడు ను హనుమా
నా మనంబున నుండుమా రామ భక్త !

వాయు పుత్రుని బలమును వాడు నెరుగ
ఇతర పురుషులు జెప్పిన నింత లగును
చెప్ప సరివోవ సుగ్రీవు నొప్పు ననఘ
నా మనంబున నుండుమా రామ భక్త !


నిన్ను చూ తును దురాన నిచ్చ లలర
నిన్ను సేవింప దలపడ నెప్పు డైన
ఎదుట నుండంగ భయ ప డి యేగువాడ
నా మనంబున నుండుమా రామ భక్త !

జగము లన్నియు నీ కు వశ్యము లటంటి
వీవు నిజ దాస వ శ్యు డ వెంత ఘనత
దాస దాసాను దాసుండ లాస్య మొప్ప
నా మనంబున నుండుమా రామ భక్త !

ఎవ్వ రింటికి బోయిన నేమి ఫలము
ఉన్నచో నుండి సిరుల పెంపొందు కొందు
నిన్ను కోరుదు శరణము నీ వ దిక్కు
నా మనంబున నుండుమా రామ భక్త !

భువన మోహన మూర్తివి భూరి గాను
ఎంచ దేవర దైవమా యీ వె కాన
చూ ప ర కు నీ దు మహిమను జూప గలవు
నా మనంబున నుండుమా రామ భక్త !

మారుతా త్మజ కపి వర మర్క టే శ
పరమ సాత్వికు లైన భక్త వరుల
దాసులకు దాసుడను జుమీ ధాత్రిలోన
నా మనంబున నుండుమా రామ భక్త !

శ్రీ రామ దూతం శిర సా నమామి
భళిర నే నీ మహా మంత్ర బలము చేత
దివ్య వైకుంఠ పదవి సాధించ గలను
నా మనంబున నుండుమా రామ భక్త !

తిరిగి నన్నాళ్ళు తిరిగితి తిరము లేక
కాన రాదాయె నిన్ను నా కన్ను దోయి
భజన జేయుదు నీ మీద భక్తి కలుగ
నా మనంబున నుండుమా నామ భక్త !

ఆయు రారోగ్య సంపద లన్నియిచ్చి
ఈ యవలసిన భక్తిని నీ య వైతి
చేతు లారంగ పూజలు సేతు నీకు
నా మనంబున నుండుమా రామ భక్త !

భక్తి లేకున్న నుండెను ముక్తి తపన
ముక్తి కోసమె తనువుపై రక్తి కలిగె
చేతు పూజలు నికనైన చేతు లార
నా మనంబున నుండుమా రామ భక్త !

ఆలు బిడ్దల విడనాడి యడవి కేగి
మంచె కట్టుకు కూర్చుండి మడత వేసి
నిన్నె ధ్యానింతు నని శంబు నిష్ఠ తోడ
నా మనంబున నుండుమా రామ భక్త !

పండు యనుకొని సూర్యుని ప ట్ట బోవ
కాలి నీ మూతి యెర్ర గ కంది బోయె
అంత సాహసంబది యేల యౌర నీ కు
నా మనంబున నుండుమా రామ భక్త !

లంక దహియించు సమయాన రావణుండు
నిన్ను బంధించి దెమ్మని యాన తీ య
యేల బుద్దిగ నేగితి నీవు సామి
నా మనంబున నుండుమా రామ భక్త !Thursday, February 11, 2010

దొడ్డవరము

దొడ్డ వరమున వెలసిన దొడ్డ దేవ !
వేంకటే శ్వర! మమ్ముల జక్క జూ డు
వంద నంబులు మీ కివె వందలాది
రామ !హరిహర !మురహరి ! రమ్య చరిత !

Wednesday, February 10, 2010

ఆశీ స్సులు

గురువుల మ్రొక్కెద నిరతము
గురువుల సేవింతు నెపుడు కోరను దేనిన్
కోరక నె నిచ్చు గురువులు
మరువక యా శీ స్సు లెపుడు మన్నన లడరన్

Tuesday, February 9, 2010

అనంతుడు

పరమ ఋషి పుంగవుల పరంపరల యందె
అతని బ్రతుకు కప్పురపు టారతి గ వెలుగు
ఆది మధ్యాంత రహితుడనంతుడ తడు
అతని వయసును గ ణి యింపు నలవియౌనె?
అతని జీ వన దీ తీ ర్ధమవధి గలదె?

కర్షకుడు

బ్రతుకు బాటను తీ ర్చి దిద్దెడు పరమ గురుడవు నీవె గా
బరువు బాధ్యత లెరుగ జే సెడి పార్ధ సారధి నీవెగా
బ్రతుకు నావను సంద్రపు తీ రము చేర్చు నావికుడివెగా
హృదయ క్షేత్రములందు ప్రేమ పండించు కర్షకు డీవె గా .

పరమ గురువు--గురు పంచకము

ధర్మ సంస్థాప నార్ధమై ధర ణి లోన
మతములును వర్గముల యొక్క మసకలేని
ఆచరణ శీలమైనట్టి ఆర్ష శక్తి
ప్రజల కందించినట్టి శ్రీ పరమ గురువు .

౧.సూ చన గురువు
౨.వాచక గురువు
౩.బోధక గురువు
౪.పరమ గురువు
౫.నిషిద్ధ గురువు

నమస్కారమ్సు మాస్టర్ ఇకే .

లేవులేవాయె ఇక మాకు లేవు నీవు
కృష్ణ మాచార్య !మమ్ముల కృపను జూ డు
మీ దు పలుకులు మాకిక మధుర స్మృతులు
వందనంబులు గొనుమయ్య !వందలాది .

ఆ  ది దంపతులు

ఆ ది దంపతులైనట్టి ఆది దేవు
లాయు రారోగ్య సంపద లన్నియిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత!
ఇమ్మహాత్ముల గారు ణ్య మింపు మీర.

దీ పావళి

దీ పాలెన్నియొ వెలుగును
దీ పావళి నాడు మిగుల దే దీ ప్యముగా
రూ పాయలగును మెండుగ
పాపాత్మున్నరకు డొడలు బాయుట వలనన్

Monday, February 8, 2010

కలి దోష నివారణము

కర్కో త కస్య నాగస్య దమయంత్యా నలస్యచ ,
ఋతు పర్ణస్య రా జ ర్షే హ కీ ర్తనం కలి నాశ నం .

పరుండు నపుడు ----స్తోత్రము

రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం
శ యనే యః ప టే న్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి .

Saturday, February 6, 2010

సైంటూ లోయుస్

ది .౧౪-౧ ౨౦౧౦ వ తేది రాత్రి సెయింట్ లోయజ్ కి వచ్చి హిల్టను హోటలులో బస చేసి మరునాడు ఉదయము అక్కడకు దగ్గరలో గల ఒక పెద్ద ఆర్చి ని చూసి టిక్కెట్టు కొని లిఫ్టు ద్వారా పైకి వెళ్ళాము .అది ౬౦౦ అడుగుల ఎత్తు. పైనుండి కిందకు చూస్తే కారులు ఆట బొమ్మల వలె కని పించాయి .అక్కడ మిసిసిపి మిస్సోరి నది ప్రవ హించు చున్నది .అది చూసికుని బయలు దేరి వచ్చి మధ్య దారిలో అబ్రహాం లింకన్ మ్యుజియం చూద్దామను కున్నాము .సమయా భావముచే చూడ కుండగానే రాత్రి ౭ గంటలకు ఇంటికి చేరాము .అక్కడక్కడ ఫోటోలు కూడా కిరణ్ తీసాడు .

మెరామెక్ గుహలు-ఇతర స్థలములు

ది .౧౪-౧-౨౦౧౦ తేది గురువారము ఉదయము ౧౦ గంటలకు బయలు దేరి సాయంత్రము ౪-౧౫ నిమి ష ములకు మె రా మె క్ గుహలకు చేరి కొంటిమి .౪-౩౦ నిమి ష ముల తర్వాత ఆ గుహల లోనికి ప్రవే శ ము లేదు .మా తర్వాత ఒక జంట వచ్చిరి .టిక్కె ట్టులు కొని లోపలకు వెళ్లి తిమి .ఆ గుహల క్రింద నుండి మె రా మెక్ అను నది ప్రవ హించు చున్నది .ఆ నది యెంతో లోతు లేక పోయిననూ కరెంటు దీ పాల మూ లంగా చాల లోతు ఉన్నట్లు గా కన బడు చున్నది .లోపల కొండ తాలూకు ద్రవపూం చారలు మఱ్ఱి ఊ డల వలె చాల బాగున్నవి .కరెంటు దీ పపు కాంతు ల తొ మెరియు చున్నవి .ఇద్దరు దొంగలు దోచుకున్న ధనముతో ఆ గుహ లోనికి వెల్లిరట. దానిని స్థా నికులు చూఛి ఆ గుహను యాత్రా స్థ లము గా మార్చిరట.ఆ గుహలు వేల సంవత్సరముల క్రిందటే ఏ ర్ప ద్దాయిట. ఒక ఫార్మేషను రావడా నికి సుమారు ౧౦౦ సంవత్సరములు పడుతుందట.ఆ గుహలను జే మ్సు అను దొంగ కని పెట్టాడుట .ఆ గుహ మొత్తము ౭ ఫ్లో రులు .౫ వ ఫ్లో రు వరకు మాత్రమే అనుమతి ఉంది .ఒక చోట సినిమా దియేటరు వలె ఫార్మేషను ఉంది .దానిని కరెంటు దీ పాలతో ఉంది .చివరగా అమెరికా దేశపు జెండా బాగా వెలుగులో కనిపించినది .అది చూసి రాత్రికి హిల్టన్ హోటల్ కి వెళ్లి ఆ రాత్రి అక్కడ బస చేసాము .
ఉగాది శుభా కాంక్షలతో కేంపు ============
ది .౧౬-౩-౨౦౧౦ వ తే ది ఉగాది రోజున కిరణ్ తో సియా టెల్సుకు విమానములో
వెల్లి తిమి .మైక్రో సాఫ్టు అధిపతి యైన బిల్ గే ట్సు స్వగ్రామము .అక్కడ గల వాషింగు తన్ లేకు దరినే ఆయన ఇల్లు ఉందిట .ఆ సాయంత్రానికి హోమ్ ఉడ్ స్యూట్సు అను హోటలు కి వచ్చితిమి .అక్కడకు దగ్గర గా నే రెడ్ మాండు సిటి గలదు .అది యే మైక్రో సాఫ్టు .బిల్ గే ట్సు ప్రపంచ ధనికులలో రెండవ వాడు .నిన్న ఓ హేర్ విమానాశ్రయములో
విమాన మెక్కి డెన్వెర్ విమానా శ్ర యములో దిగి అక్కడ ఒక గంట విరామము .మరల
అక్కడ విమానమెక్కి సియాటేల్సు లో దిగి కారులో రెడ్మాండు వెళ్లి అక్కడ మయూరి
అను నెల్లూరు వారి హోటలు లో లంచు చేసి సియాటేల్సు వెళ్లి రూంకి వెళ్ళాము
ఈ రోజు అనగా ౧౭-౩-౨౦౧౦ తేదిన కారు హేండు ఓవరు చేయడానికి డౌన్ టౌన్ కి వెళ్లి హేండు ఓవరు చేసాము ;కారు పార్కింగు కు ౧౦ లేదా ౧౨ ఫ్లోరులు ఉంటాయి .
ఈ షియా టెల్ వాషింగుతన్ స్టేటు లో ఉన్నది .ఇక్కడి బస్సులు కరెంటు ద్వారా
నడుస్తాయి .ఈ సిటి లోనే విమానములు తయారగును .ఇక్కడ నుండియే అన్ని దేశాలవారు విమానాలను కొనుక్కుంటారు .ఇక్కడి భవనములు ఒక్కొక్కటి సుమారు ౫౦ ,౬౦ ఫ్లోరు లు ఉంటాయి .కారు పార్కిన్గుకే ౧౦ ,౧౫ ఫ్లోరులు ఉంటాయి .
౧౯-౩-౨౦౧౦ న మధ్యాహ్నము హోటలు వారి కారు లొ వెస్టు లేకు సెంటరు కి
వెళ్లి అక్కడ మోనో రైలు సెంటరు దగ్గర రైలు ఎక్కి స్పేసు నీ డు టవరుకు వెళ్లి
లిఫ్టులో పైకి ఎక్కాము .ఆ టవరు ౫౨౦ అడుగుల ఎత్తు ఉన్నది .అక్కడ పైన చూస్తే
పసిఫిక్కు మహా సముద్రపు ఓడల రేవును చూసాము .అక్కడ దూ రానికి మంచు
పర్వతాలు కనిపించాయి .సాయంత్రము ౪ గంటలకు ఇంటికి చేరాము .
హోటలు అడ్రస్సు =హోము ఉడ్ స్యూట్సు బై హిల్టన్ ,సియాటిల్ -కాన్వెన్షన్ సెంటర్
పిక్ స్ట్రీట్ ,౧౦౧౧ పిక్ స్ట్రీట్ ,సియాటెల్ ,డబ్ల్యు ఏ .౯౮౧౦౧ .-౧-౨౦౬-౬౮౨-౮౨౮౨.

ది .౨౦-౩-౨౦౧౦ వ తేది శనివారము మధ్యాహ్నము కారులో ఎవరెట్టు అను సిటీకి
వెళ్ళాము .కారు రఘు అను కిరణు స్నేహితుడు . అతడు రెడ్మాండు లో ఉంటాడు .
అతని ఇంటికి టూరు అయిన తరువాత వెళ్లి మయూరి హోటలులో టిఫిను చేసాము .
ఎవరెట్టు లో గ్రౌండ్ ఫ్లోరులో విమానముల నమూనాలు విడి విడి భాగాలుగా చూపించిరి
అవి బ్లోయింగు విమానములు .అది అతి పెద్ద విమానాల కర్మాగారము . తరువాత
బస్సు లో ౭౪౭ నెంబరు విమానములు తయారు చేయు షెడ్డు కి వెళ్ళాము .అక్కడ
అయిదారు విమానములు తయారగు చున్నవి .అది ఒక పెద్ద షెడ్డు .మొత్తము
అరవయి లక్షల మంది ఉద్యోగులు .అది చూసిన తరువాత ౭౮౭ నెంబరు విమానములు తయారు చేయు షేడ్డుకి వెళ్ళాము .అక్కడ ఏడెనిమిది విమానములు
తయారగు చున్నవి .౭౭౭ నెంబరు విమానమును మన భారత దేశము కొనుగోలు
చేసినదని సూ చనగా ఆ విమానము మీద ఎయిరు ఇండియా అని వ్రాయ బడినది .
అక్కడ ౭౩౭ ,౭౪౭,౭౬౭,౭౭౭,౭౮౭, నెంబరుల విమానములు తయారు చేయు చున్నారు .విమానముల ఫ్రంటు పైలట్టు ఉండు భాగము .మధ్యన పాస్సింజరులు
ఉండు భాగము చివర భాగము సామానులు వేయు భాగములు విడి విడిగా ప్రదర్శన
లో భద్ర ప ర చిరి .౭౪౭ నెంబరు విమానము ఎక్కువ టెక్నాలజీతో ను ౭౮౭ నెంబరు
విమానము తక్కువ టెక్నాలజీ తో తయారు కాబడుతోంది అని చెప్పారు .
సియా టెల్ లో కూడ ఒక మినీ బోయింగు విమానము లు తయారు చేయు కర్మాగారము ఉన్నది.

ది. ౨౭-౩-౨౦౧౦ తేది .శ నివారము ౧౦౦ మైళ్ళ దూరము లొ గల మౌంట్ రైయనిర్
అను చోటికి కారు లొ వెళ్ళాము .అది ఒక పెద్ద కొండ .౨౪౦౦౦ అడుగుల ఎత్తులో
ఉన్నది .ఎత్తులో హిమాలయముల కన్నా సగము .అది అంతయు మంచు
మయము .కొండయె మంచు కొండ. మంచు కొండ పైకి ఎక్కాను .దిగడము కష్ట మైనది.

రె యినీ రు కొండ చూసితి
రె యి నీ రె మంచు మయము రేయిం బగలున్
రె యి నీ రొక కైలాసము
రె యి నీ రే మూడు మైళ్ళు నెత్తున నుండెన్ .

దారి పొడుగున నడవులు దారి యియ్య
పైను వృక్షాల సొగసుకు బైర్లు కమ్మ
సాగినది మాదు పయనము సంత సమున
భరత దే శ పు వాసిగా భాగ్య మదియ .

కొండ దారికి ప్రక్కల గోడ లుండె
గోడ లన్నియు మంచు తొ కూడి యుండె
చూడ ముచ్చట గొల్పును చూపరులకు
చూడ మీరును వేవేగ రండి తరలి.

శి ఖరముల మిన్న రెయనీ రు శి ఖర మరయ
కొండ కొండల నడుమన నొదిగి యుండె
వర్ణ ణీ యంబు గాదది నలువ కైన
చిత్రములు గాదె యీ శ్వర కృతము లకట .

ఎవరెస్టు శి ఖర మయ్యది
ఎవరెస్టును నెక్క గలమ ఏనాడైనన్
ఎవరెస్టు పొడవు నరయగ
నీ వనియే మైళ్ళు నార నిప్పుడ యనఘా !


ది.౨౮-౩-2010వ తే ది .ఆదివారము మౌంటు హెలెను అను అగ్ని పర్వతము గే ట్లు మూసి వేయడము చేత అక్కడకు వెల్ల లేదు. తుల్పి టౌను కు వెళ్ళాము. అది స్కాగితు వాలీ .అక్కడ అనేక రకముల పూ లు మనోహరము గా ఉన్నవి.మొక్కల ఆకులు ప్లాస్టిక్కును పో లి యున్నవి. అక్కడ గుర్తుగా రంగు రంగుల పతంగములు ఆకా శ మున రెప రెప లాడు చున్నవి.అక్కడి నేల యంతయు నల్ల రేగడి నే ల.అక్కడి పూ లు ముదురు ఎరుపు ,తెలుపు,పింకు కలరు, పర్పులు కలరు ఉండి అన్నియు కలువ పూ ల వలె యున్నవి.అక్కడ ఉన్న పూ ల రకములు.ఆరంజి క్లొ,కాస్మో , అలస్క స్టార్ ,హావరోన్,కేన్దిaఆపిలు , మే జిక్ లావెండర్ , మున్లైట్టు ,ఆరెంజు ,నంబర్ ౫౨౬ , పింకు గ్లోరి మొద లుగా చాల రకములు గలవు.

రకరకముల పూ మొక్కలు
రకరకముల పూ లతోటి రంగులు విచ్చన్
సకలము తోటను జూచితి
నాస్కా జితు వేలి నందు నబ్బుర మయ్యెన్ .

Friday, February 5, 2010

జగతః పితరౌ వందే ........

వాగార్దా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ .

Tuesday, February 2, 2010

తోటకాస్టకం

విదితాఖిల శాస్త్ర సుధా జలధే
మహితో పని షడ్ కదితార్ధ నిధే
హృదయే కలయే విమలం చర ణం
భావ శంకర దేశిక మె శర ణం 1

కరుణా వరు ణా లయ పాలయ మాం
భవ సాగర దుఃఖ విధూన హ్రదం
రచయాకిల దర్శన తత్వ విధం
భవ శంకర దేశిక మె శరణం 2

భవతా జనతా సుఖితా భవితా
నిజ బోధ విచారణ చారుమతే
కలయే శ్వర జీ వ వివేక విధం
భవ శంకర దేశిక మె శరణం ౩

భవఎవ భవానిధి మె నితరం
సమ జాయత చేతసి కౌతి కత
మమ వారయ మోహ మహా జల ధిం
భవ శంకర దేశిక మె శరణం ౪.

సుకృతే ధికృతే బహుధా భవతో
భవితా సమ దర్శన లాలసతా
అతి దీ నమిమాం పరి పాలయమాం
భవ శంకర దేశిక మె శరణం ౫.

జగ ధీ మవితుం కలితా కృ ధయో
వి చ రంతి మహామాహ సచ్చలతా
అహి మాం షురి వార్హ విభాసి గురో
భవ శంకర దేశిక మే శరణం ౬.

గురు పుంగవ పుంగవ కేతనతే
సమతా మయతాం నహి కోపి సు ధీ
శర ణా గత వత్సల తత్వ నిధే
భవ శంకర దేశిక మే శరణం ౭.

విదితా ఖిల నమయా విష ధైక కలా
నచ కించన కాంచన మస్తి గురో
దృ త మేవ విదేహి కృ పాం సహజం
భవ శంకర దేసికమే శరణం ౮.


Sunday, January 31, 2010

పెన్నిధి

రమ ణు ల సన్నిధి పెన్నిధి
రమ ణు ల యా శ్ర మ పధంబు రమ ణీ యంబై
రమ ణు ల మనముల నిలిచిన
రమ ణు ల సేవింతు నెపుడు రాగము తోడన్ .

Saturday, January 30, 2010

అవధానము

రావూరి వంశ మండన !
కోవూ రున బుట్టి నీవు కోరిక లలరన్
ఏవూ రి వాడవైనను
మావూ రికి రండి స్వామి! మన్నన లొందన్.

అవధానము లన్నిట నీ
య వ దాన మె గొప్ప దండ్రు ఆర్యా రాధ్యా !
అవధానం బొ న రిం పుము
అవధానపు చక్రవర్తి ఆశువు గాగన్ధన్యుడు

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్వా మీ !

Friday, January 29, 2010

డొంకరాయి

ఇల డొంకరాయి పురమున
వెలసిన యా రామ చంద్రు వేడుక మీ రన్
కొలిచిన నిచ్చును శుభములు
కొలువగ వే రండు మీరు కొలుతును నేనున్ .

అప్పనపల్లి

అప్పనపల్లి పురంబున
నొప్పుగ వేంచేసి నట్టియప్పరమాత్మున్
మెప్పు తొ కొలిచిన వారికి
నప్పతియే తప్పకిచ్చు నాయువు సిరులున్ .

మంగళము

మంగళ యోగి హ్రుద యాబ్జ మందిరమునకు
మంగళము సచ్చిదా నంద మయున కెపుడు
మంగళము చిత్క లా పూ ర్ణ మహిత కాంతి
మండనునకు సదా జయ మంగళంబు .

జయ శ్రీ రమణ జయ భవ హరణ
జయ జయ సన్ముని సేవిత చరణ
జ్ఞానామృతమున దీనుల దనుప గ
పూ ని నరాకృతి బొందిన పరుడవు
శాంతి భూ ములను చరియించేడు నిను
చేరి భజించెద చిన్మయ రమన .
పాద కమల మధు పానము సేయుచు
పాడేద మదుపము భంగిని రమణము
తను వాగ్మనముల నిను సేవింపుచు
ఘనతర శాంతిని గనియె ద రమణ
సుందర నందన సూ రి జనావన
వందన శతముల నందవె రమణ
కై మోడ్చుచు నా గతి నీ వను నా
గాంబను కరుణ తొ నరయవే రమణ
జయ సుఖ రూపా జయ పర మేశా
జయ జయ అరు ణాచల శ్రీ రమణ !

Thursday, January 28, 2010

గురు వర రమణ !

శాంతిం నేతుం మునింద్రా న్నిజ పద శర ణా దక్షి ణా మూర్తి రూపో
మౌనం భావం ప్రది స్య స్వ కమ థ జగత శ్చాపి జీ వా భి ద స్య
ఉక్త్వా తాదా త్మ్య భావం గురు నుతి వచసా శంకరా చార్య రూ పో
ప్యా స్తే శో ణా ద్రి మూలో గురువర ర మ ణో యః పరస్తం నమామి .

తా .జీ వ రూ ప మున నున్న జగత్తుకు త న మౌనమును జూ పి తన పాదముల నా శ్ర యించిన మునులకు
శాంతిని కలిగించుటకు దక్షి ణా మూ ర్తి రూ పమున నున్న వాడును ,గురు స్తోత్రముచే ఐ క్య భా వమును
శంకరా చార్య రూ పమున నున్న వాడును ,అరు ణా చల మూ లమున నున్న పరమ గురు వర్యుడగు
రమ ణు ని నమస్క రింతును.

Sunday, January 24, 2010

భీష్మునకు తర్ప ణము

వైయ్యాఘ్ర పద్య గోత్రాయ
సాం కృత్య ప్రవరాయచ
గంగా పుత్రాయ భీ ష్మాయ
ఆ జన్మ బ్రహ్మ చారి ణే
అ పుత్రాయ దదా మ్యే తత్
ఉదకం భీష్మ వర్మ ణే.

Saturday, January 23, 2010

జాగ్రత జాగ్రత

ఆశయా బధ్యతే లోకో ,కర్మణా బహు చింతయా
ఆయు క్షిణం న జానాతి తస్మాత్ జాగ్ర త జాగ్రత .
౪. పొన్నుకు వేరుగ భూషణ ముండునే
తన్ను విడిచి తనువేది -తన్ను
దను వను వాడ జ్ఞుడు తా నను వాడు
తను గనిన జ్ఞాని ధరించు .
౫. ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే
యప్పడా వస్తువు నాది -గురు చెప్పక
చెప్పి తెలియగ జేసినారే , ఎవరు
చెప్పి తెలుపుదురు చెప్పు .


ఏకాత్మ తత్వము నిట్టి దని తేల్చి భక్త
దేహాత్మ భావము దీర్చెను ఏకాత్మ
జ్ఞాన స్వరూప రమణ గురు నాధుడు తా
నానతిచ్చు పంచక మందు .

ఏకాత్మ పంచకము

౧ తన్ను మరచి తనువు తానై తలచి
ఎన్నియో జన్మము లెత్తి తుది -తన్ను
తెలిసి తా నౌట పలు దేశ సంచార
కల న్మేల్కనుట కను

౨ తానుండి తానుగ దన్ను తా నేనెవ?
దే నుండు స్థానమేది ?

యను వానికి
నేనెవ డెక్కడ నేనున్నా నన్న మధు
పానుని యీ డు పలుకు
౩ .తనలో దను ఉండ దాను జడమౌ
తనువందున్నట్టు తలచు -మనుజుడు
చిత్రములో నున్నది చిత్రమున కాధార
వస్త్రమని ఎంచువాడు

బ్రహ్మాస్త్రము

సకల వేదాంత సారంబు సంగ్రహించి
యాత్మ చిద్వహ్నిలో బు టంబమరబెట్టి
ధ్యానమను సానబట్టిన నేనేవండ ?
ననుచు వెడలిన దివ్యాస్త్ర మగునుగాదె.

Friday, January 22, 2010

వందే గురు ........

సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం .

కర్మ ఫలము

కర్మమున బుట్టు జంతువు
కర్మమునన వృద్ది బొందు కర్మమున జెడున్
కర్మమే జనులకు దేవత
కర్మమే సుఖ దుఃఖ ములకు కారణ మధిపా!

కర్మములకు దగు ఫలములు
కర్ములకు నిడంగ రాజు గాని సదా ని
ష్కర్ముడగు నీ శ్వ రుడును
కర్మ విహీనునకు రాజుగాడు మహాత్మా !రమణ మహర్షి ప్రార్ధన

హృదయ కమల దళంబులన్ జెదరకుండ
అక్షర స్వ రూ పుండ వై యేలరు నిన్ను
కర్మ వాసన మసకచే గాంచలేక
హస్త లిఖితా క్షరము కోర నగునే రమణ !