Saturday, October 18, 2014

న్యూయార్కు ప్రయాణము

న్యూయార్కు మహానగరము
న్యూ యార్కును జూ డగోర నోముల ఫలమే
న్యూయార్కు నగర వాసులు
ఆ యేసుని భక్తు లగుట నపర కుబేరుల్

పయన మైతిమి కారులో బఫులొ నుండి
వంద మైళ్ళు మే బోవగ వర్ష మదియ
ఉరుము మఱియును మెరుపులు మెరయు చుండ
కుండ బోతగ విడువక కురియ సాగె

పురము పురములు దాటుచు పోవు చుండ
దారి కిరువైపు లున్నట్టి తరువు లతలు
స్వా గతంబును  బలుకునా సా దరముగ
రంగు రంగుల పూలతో రమ్య మలరె

పూల భ్రాంతిని నొందితి బూలు కా వు
ఆకు రాలె డు  కాలంబు నపుడు కా న
చెట్ల యాకులు వింతగ నట్లు మారె
రంగ రించిన నెరుపుల  రంగు తోడ

బ్రిడ్జి వారన   గలయట్టి పెద్ద చెట్లు
చిన్న చెట్లుగ  గనిపించి చెలువు నొంది
పూల పాన్పును బరచెనా ! పూల తోడ
ననగ దోచెను మారిన యాకు లన్ని


పోవు చుంటిమి నేరుగ బోవునపుడు
వాన వచ్చిన ,వెలసిన మాన కుండ
రయము న్యూ జెర్సి నగరము రాత్రి వేళ
చేరు కొంటిమి హొ టలును క్షేమ ముగను

మఱు చటి దినము నుదయా న మరల మేము
భువిని  పే రొం దు న్యూయార్కు డవును టవును
చూడ కోరిక కలుగగ వేడు కగను
పయన మైతిమి టూ రుగా ప్రమద మలర

చూసితి డకోట హౌసును
చూసితి యా నగర ఠీ వి ,సొగసులు మిగులన్
చూసితిని రైలు మార్గము
చూసితి మే తార లిల్లు చూడ్కులు లలరన్

చూసితి మేరీ స్టా ట్యూ
చేసియుమఱి బోటు మీద చేరితి నటకున్
చూసితిని మ్యూ జియమ్మును
చూసిన నాకళ్ళు చెదిరె చోద్య ములకున్

చేరితి సెంట్ర లు  పార్కును
చేరితి యా కొలము బస్సు సెంటరు మఱి యున్
ఆ రయ మఱి యా సెంటరు
ధర నెప్పుడు నిదుర పోదు తనరెడు కాంతిన్

చూడ  సెంట్ర లు  పార్కును చోద్య మయ్యె
విడత యుండెను నె ని మిది వేల యెకర
ములట షూ టిం గు లచ్చట జరుగు ననిరి
హీ రొ  యినులును మఱి యును హీ రొ  లటనె
నుందు రని జెప్పె మా గైడు నంద ముగను

అన్ని దేశాల జెండాలు మిన్ను నంటి
చుట్టు రెపరెప లాడుచు బిట్టు గాను
చిన్న పిల్లల స్కేటింగు చెన్ను మీర
రాకు ఫిల్లరు సెంటరు రమ్య మలరె

క్రిష్ట మస్సు దినము నట క్రిస్మ సుట్రి
వివిధ రంగుల దీపాల వెలుగు తోడ
అంద గించును పరిసర మంత యటను
ననుచు చెప్పెను మాగైడు నపుడు మాకు

టెర్ర రిస్టుల చేతను బ్రేల్చ బడిన
భవనముల కూల్చి మార్చిరి భద్ర ముగను
ఫౌం టె నుం  జేసి రచ్చట వ్రా సిరి యట
మరణ మొందిన వారల పేరు లన్ని

డౌను టవునన దృశ్యముల్ దనర జూచి
విద్మహే నవీ నులు రాగ విడిచితి మిక
డౌను టవునును ,వారితో చనుచు మేము
చేరితి మివారి యింటికి క్షేమ ముగను

స్వా గ తించియు మమ్ముల సాదరముగ
వండి పెట్టిరి ప్రియముతో  వంటకములు
సకల శుభములు కలిగించు శంక రుండు
నా యు రారోగ్య సంపద లన్ని యిడుత !

బ్రిడ్జి వాటరు పురమున  వెలసి నట్టి
వేంకటే శుని బూజించి వినయ ము గను
శివుని దర్శించి సేవించి శిరము వంచి
వేడు కొంటిమి మనసార విభుని మేము

వాషింగు ట న్నునంగల
భాసురమగు  పార్లమెంటు భవనము మఱి యు
న్నీ ష న్మాత్రము దూరపు
భేషగు నా వైటు హౌసు బ్రియమున గంటిన్

నాదు శిష్యుడు శేఖరు నామ కుండు
నుండు నూరికి బోవగ, మెండు గాను
సంత సించియు నాతిధ్య మెంతొ నిచ్చె
నతని భార్యయౌ  శాంతయు నాద రించె

సకల శుభములు గలిగించు శంక రుండు
నాయు రారోగ్య సంపద లన్ని నిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
శాంత శేఖరు  కార్తీ కు  లందరినిల

పిట్సు బర్గున వెలసిన వేంక టేశు
పూజ జేయించి ప్రాసాద పొట్ల ములను
భక్తి తోడన గ్రహియించి బయలు దేరి
తిమి, యొ  కహొ టలు నందు రా  తిరి గ  డుపగ

క్రొత్త చోటుల నెన్నియో కొడుకు చూప
నా కళిం ప జే  సికొనుచు  నంతి మమున
వైల్డు యానిమ లు ల పార్కు వరుస జూచి
చేరితిమి యిక  యింటికి క్షేమ ముగను


















No comments:

Post a Comment