Friday, October 3, 2014

అమ్మ స్మృతులు -ఆవేదన


అమ్మను మించిన దైవము
ని మ్మహిలో గానరాదె  యెం దున వెతకన్
అమ్మయె తొలి గురువాయెను
అమ్మకు జేజేలు గొట్ట హాయిని నిచ్చున్ .

అమ్మకు నాన్నకు నతులివె
అమ్మా! యన కరు ణ జూ పి నాదేవతయున్
కమ్మని మాటలు  రక్తిని
ని  మ్ముగ బోధించె మాకు నిలలో మనగన్ .

అమ్మ ! నీమాట రామాజ్ఞ యనుచు దలచి
వేగ జేయుదు మఱి నీవు బ్రీతి తోడ
మమ్ము జూడగ నొకసారి రమ్ము దయను
నెదురు చూతుము నీకొఱ కి పుడు నిరతి .

ఎదురు చెప్పను నీ కెపు డెచట నైన
నీవు చెప్పిన దానినే , నిజము నమ్ము
మాచ రింతును దప్పక హర్ష మొదవ
కాన వేవచ్చి యొకపరి కనుము మమ్ము .

వేడు చున్నను నింతగా వీసమైన
గరుణ జూపవా ?మామీ ద పరుల మైతె ?
కాదు కాదమ్మ పరులము కాదు మేము
నీకు బుట్టిన వారమే నిజమునమ్ము

కనిక రంబేని మామీ ద కలుగు నెడల
సంతసంబది మాకును సంతు తతికి
నొప్పు విధముగ మఱి నీవు నిప్పు డిటకు
 వచ్చి పోవమ్మయొక తూరి ప్రమద మలర

ఇరువది యొకటవ తేదీ
మఱు వక యోమాత ! రమ్ము  మన గృహము నకున్
మరి నా  శక్తిని గొలదిని
నరిసెలు నిక జాల యెన్నొ నాహా రింతున్ .

నీవు రావేని యి క నేను  నిలుప జాల
బ్రాణ మిప్పుడు  ,మఱి నాకు పరమ శివుని
 నాజ్ఞ యొక్కటి శరణము యముని జేర
చింత జేయవ ?నాగూర్చి  సుంత యైన ?

అమ్మా! యె క్కడ నుంటివి?
యి మ్మా యి క నీ దు నాజ్ఞ  నిపుడే వత్తున్ 
సొమ్ములు నాస్తులు నన్నియు
వమ్మే నిక నీవు లేక,  బాపల కిత్తున్  



No comments:

Post a Comment