డేవాను నగర మందున
నేవస్తువు నైన నుండు నిది యది యనకన్
డేవా ను ననగ దెలియుము
డేవానే భరత ఖండ డీలరు సుమ్మీ
ఆ నగ రము మా యింటికి
కానగ లేనంత దవ్వు కారులొ పోవన్
యానము గంటకు పైగా
నానందము గలుగు నచట నటు నిటు దిరుగన్
పిల్ల లకుగాను వారల తల్లి దండ్రు
లనగ కొడుకును గోడలు న చట కొనిరి
మంచి విలువైన దుస్తులు నంచితముగ
నొకటి మించిన దొకటిగా నొప్పె నవియ
బీర కాయలు మొదలుగా గూర లెన్నొ
మఱియు నచ్చట వలయుసా మాను లుకొని
టి ఫిను దినియును సేవించి టీని పిదప
తిరిగి వచ్చితి మింటికి తిన్న గాను
నేవస్తువు నైన నుండు నిది యది యనకన్
డేవా ను ననగ దెలియుము
డేవానే భరత ఖండ డీలరు సుమ్మీ
ఆ నగ రము మా యింటికి
కానగ లేనంత దవ్వు కారులొ పోవన్
యానము గంటకు పైగా
నానందము గలుగు నచట నటు నిటు దిరుగన్
పిల్ల లకుగాను వారల తల్లి దండ్రు
లనగ కొడుకును గోడలు న చట కొనిరి
మంచి విలువైన దుస్తులు నంచితముగ
నొకటి మించిన దొకటిగా నొప్పె నవియ
బీర కాయలు మొదలుగా గూర లెన్నొ
మఱియు నచ్చట వలయుసా మాను లుకొని
టి ఫిను దినియును సేవించి టీని పిదప
తిరిగి వచ్చితి మింటికి తిన్న గాను
No comments:
Post a Comment