Tuesday, October 28, 2014

క్షౌరకర్మ

క్షవరము  జేయుట దానిని
నవహేళ న జేయ గూడ దవసర మదియే
క్షవరము జేయుట నొక కళ
వివరముగా దెలుపు ది పుడు వీనుల విందౌ

శిరసు  పైన జుట్టు  చిందర వందర
గా గనబడుచు నెడల  కామరాజ !
క్షవర శాల కేగి   చయ్యన చేయించు
కొనగ వలయు సుమ్ము కురులు సరిగ

క్షవర మయ్యది లేనిచో కలుగు బాధ
లెన్నియో మఱి  ,  తల నొప్పి  మిన్న గా ను
వచ్చు చుండును  మఱి యును  బెచ్చు పెరిగి
  పేను   లనబడు పురుగులు ,పీకు  తలను

దాని వలనన దురదలు  దాని వలన
గోక శిరమును , పుండ్లు గాన్ సోకి క్రిములు
మెదడు లోనికి జొచ్చియు మెదడు మఱియు
సకల రోగాలు రాకకు సహకరించు

అందువలనన ప్రతి యొక్క  డవస రమును
బట్టి కా  రము చేయించ వలయు సుమ్ము
అప్పు  డో సహ చరులార! యందమైన
 నాయు రారోగ్య ములరెండు బాయ వచ్చు

అనుభవంబున జెప్పితి నార్యులార !
యిచ్చ గింతురొ ,లేదొ మీ  యిష్ట మదియ
నాదు వంతుగా నుడివితి నమ్మ కముగ
నెవరె  వరికి ష్టమో జేయు డు వర  లునటు . 






No comments:

Post a Comment