Saturday, October 4, 2014

దీపావళి

మరణించె నరకు  డనుచును
గరమగు సంతసము తోడ కర దీ పికలన్
గరమున బట్టుచు దిరిగిరి
పురజనములు వీ ధు లన్ని పోలగ బగలున్

మఱు చటి దినమున వారలు
వఱు వాతనె లేచి పిదప బాగుగ శుచియై
య రమరలు లేని భక్తిని
పరమాత్మకు బూజ జేసి  బ్రమదము తోడన్

దీపాలను వెలిగించిరి
దీపావళి పేరు పెట్టి దేదీ ప్యముగాన్
రూపాయలైన వెరవక
పాపాత్మున్నరకు డొడలు బాయుట వలనన్

వెలిగించిరి దీపాలను
వెలిగించిరి యగ్గిపెట్లు వేడుక తోడన్
వెలిగించిరి కాకరలను
వెలిగించగ వచ్చె నచట వెలుతురు మిగులన్

పేల్చిరి టపాసు కాయలు
పేల్చిరి నిక బాంబు లెన్నొ పేల్చిరి పిస్టల్
పేల్చిరి సీమ టపాసులు
పేల్చగ నట మారు మ్రోగె వెఱవగ నభమున్

తల్లి దండ్రులు బందుగు లెల్ల కలిసి
యొకరి నొకరును దమదమ యునికి దెలుపు
కొనుచు , ముచ్చట్ల తోడన కులుకు చుండ
నాడు చుండిరి పిల్లలు హర్ష మొదవ


















No comments:

Post a Comment