సూర్యుని నడుపునది ఏది ?
బ్రహ్మము
సూర్యుని చుట్టూ తిరుగు వారెవరు ?
దేవతలు
సూర్యుని అస్తమింప జేయునది ఏది ?
ధర్మము
సూర్యుడు దేని ఆధారమున నిలిచియున్నాడు ?
సత్యము
మానవుడు దేనవలన శ్రౌత్రియుడు అగును ?
శ్రౌత్రము
దేని వలన మహత్తును పొందును ?
తపము
దేని సహాయము పొందును ?
ధైర్యము
దేని వలన బుధ్దిమంతుడగును?
పెద్దలను సేవించుట వలన
బ్రాహ్మణులకు దేవత్వమేది ?
వేదాధ్యయనము
సాదు భావము ఎట్లు కలుగును ?
తపస్సు వలన
అసాధు భావము ఎట్లు కలుగును ?
తపము లేనప్పుడు
మనుష్య భావము ఎట్లు కలుగును ?
మృత్యు భయము కలిగి యున్న బ్రాహ్మణునకు
క్షత్రియులకు దేవ భావము ఏది ?
అస్త్ర విద్య
సాదు భావము ఏది ?
యజ్ఞములు చేయుట
మానుష భావము ఏది ?
భయము
యజ్న విహితము లైన సామము లందు ముఖ్య మైన సామము ఏది ?
ప్రాణము
యజస్సుల లో ముఖ్య మైన యజస్సు ఏది ?
మనస్సు
యజ్ఞాధారము ఏది ?
రుక్కు
దేనిని అతిక్ర మించిన యజ్ఞము లేనట్లగును ?
రుక్కును
పై నుంచి పడువాని లో శ్రేష్ఠ మైనది ఏది ?
వర్షము
భూమి లోపల యున్న వానిలో శ్రేష్ఠ మైనది ఏది ?
బీజము
భూమి పైన ఉన్నవానిలో శ్రేష్ఠ మైనది ఏది ?
గోవు
పుట్టుక గల వానిలో శ్రేష్టుడు ఎవడు ?
పుత్రుడు
విషయ సుఖములను అనుభ వించుచు,బుద్ది మంతుడై ,జనుల చేత పూజింప బడుచూ , సర్వ భూత సమ్మతు డైనను,జివన్మ్రు తు డె వ డు ?
దేవతలకు ,అతిధులకు ,పితరులకు ,భ్రుత్యులకు పెట్టక తాను మాత్రము భుజించు వాడు
వదాన్యు డయ్యు
భూమి కన్నా గురు తర మైనది ఏది ?
తల్లి
ఆకాసము కన్నా విశాల మైనది ఏది ?
తండ్రి
వాయువు కన్నా వేగ మైనది ఏది ?
మనస్సు
గడ్డి కన్నా దత్త మైనది ఏది ?
చింత
కన్ను మూయక నిద్రించు నది ఏది ?
చేప
పుట్టుక కలిగియు చేతనము లేనిది ఏది ?
గ్రుడ్డు
హృదయము లేనిది ఏది ?
రాయి
వేగము వలన వృద్ది పొండునది ఏది ?
నది
బాటసారికి మిత్రుడు ఎవడు ?
సః యాత్రికులు
గృహస్తునకు మిత్రులు ఎవరు ?
భార్య
రోగ పిడితునకు మిత్రుడు ఎవడు ?
వైద్యుడు
మృతునకు మిత్రము ఏది ?
ధనము
సర్వ భూతములకు అతిధి ఎవడు ?
అగ్ని హోత్రుడు
సనాతన మైన ధర్మము ఏది ?
అమృత మైన ధర్మము
అమృతము ఏది ?
గోవులు ,చంద్రులు
జగత్తున వ్యాపించినది ఏది ?
వాయువు
సర్వదా ఒక్కడే సంచరించు వాడు ఎవడు ?
సూర్యుడు
మరల మరల పుట్టెడు వాడు ఎవడు ?
చంద్రుడు
చలికి ఔషధము ఏది ?
అగ్ని
అన్నింటిని మించిన పాత్ర ఏది ?
భూమి
ధర్మమునకు రక్షణము ఏది ?
దాక్షిణ్యము
కీర్తికి ఆధారము ఏది ?
ధనము
స్వర్గమునకు మార్గము ఏది ?
సత్యము
సుఖమునకు కారణము ఏది ?
మంచి స్వభావము
మానవునకు ఆత్మ ఎవరు ?
పుత్రుడు
మానవునకు దైవము కలిగించిన మిత్రము ఎవరు ?
భార్య
జీవనము ఎవని వలన కలుగు చున్నది ?
వర్షము
దేని వలన అధికుడు అగును ?
దానము
ధన్యములలో శ్రేష్ఠ మైనది ఏది ?
ద్రాక్ష
దానములలో శ్రేష్ఠ మైనది ఏది ?
విద్య
లాభాములలో శ్రేష్ఠ మైనది ఏది ?
ఆరోగ్యము
సుఖములలో శ్రేష్ఠ మైనది ఏది ?
సంతృప్తి
లోకమున పరమ ధర్మము ఏది ?
అహింస
సర్వదా ఫ లించే ధర్మము ఏది ?
ధర్మము
దేనిని నిగ్రహించిన దుఃఖము కలుగదు ?
మనస్సును
తరగని స్నేహము ఎవరిదీ ?
పండితుల స్నేహమునకు
నరుడు దేనిని వదలిన ప్రియుడు అగును ?
అహంకారమును
దేనిని వదలిన దుఃఖించ కుండును?
క్రోధమును
దేనిని వదలిన సుఖ వంతుడు అగును ?
కర్మమును
ధనమును బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వ వలెను ?
కీర్తి కొరకు
నటకులకు ఎందుకియ వలెను ?