౪-౯-౨౦౧౧ తేదిన హోటలు నుండి వాటర్ అండ్ థీమ్ పార్కుకు వెళ్ళాము .అక్కడ
రక రకములైన రైడ్సు ఉన్నాయి .అవి అన్నియు చిన్న పిల్లలకు ,నడిమి వయస్సు వాళ్లకు ఉపయోగ పడే విన్యాసములు .కిరణ్ వాటరు పార్కులో రైడ్సు చేసాడు .
మేము చేయలేదు. అక్కడ నుండి లాస్ కెన్యాన్ కు వెళ్లి గుర్రపు బండి మీద సుమారు
ఒక గంట సెపు చుట్టూ తిరిగి వచ్చాము .గుర్రపు బండి వాడు అక్కడి వింతలను గురించి చెప్పాడు .అక్కడ కూడ కెరటాల వంటి దిజైనులే .ఆ కొండ మార్గము కొండల మధ్యగా బాగా ఇరుకు ప్రదేశము .ఆ ఇరుకు మార్గము లోనే గుర్రాలు (౨) బండిని లాగు కొంటు వెల్లడము చాల కష్టము .ఆ బండి వాళ్ళు ఆ గుర్రాలకు ఆ రకమైన తర్ఫీదు ఇచ్చారు .
మొత్తము మీద మా ప్రయాణము ఉల్లాసముగా హాయిగా సాగినది .సాయంత్రము ౭ గంటలకు ఇంటికి చేరాము .
No comments:
Post a Comment