ఋషుల చే చెప్పబడిన ధైర్యము ఏది ?
ఇంద్రియ నిగ్రహము
ఋషులచే చెప్ప బడిన స్నానము ఏది ?
కామ క్రోధాదులను విడుచుట
ఋషులచే చెప్ప బడిన దానము ఏది ?
ప్రాణులను రక్షించుట
పండితుడు ఎవడు ?
ధర్మము తెలిసిన వాడు
నాస్తికుడు ఎవడు ?
మూర్ఖుడు
కామము అనగా నేమి ?
సంసారమునకు కారణమైనది
మత్సరము ఎటు వంటిది ?
మనః పరితాపము
అహంకారము అనగా నేమి ?
అజ్ఞానము
డంభము అనగా నేమి ?
ఇతరులు మేచ్చునకు చేయు ధర్మ కార్యము
దైవము అనగా నేమి ?
దాన ఫలము
నీచత్వం అనగా నేమి ?
పరులను దూషించుట
ధర్మార్ధ కామములు పరస్పర విరోధము గలవి. నిత్య విరోధము లైన ధర్మార్ధ కామములకు మానవుని యందు కూడిక ఎట్లు కలుగును ?
భార్యా ధర్మములు అన్యోన్య వశము లై ఉన్నప్పుడు ధర్మార్ధ కామములు కలిసి యే
ఉండును
No comments:
Post a Comment