జ్ఞానము అనగా ఎట్టిది ?
బ్రాహ్మమును ఎరుగుట
శమము అనగా నేమి ?
చిత్త శాంతి
శ్రేష్టమైన దయ ఏది ?
భూతములకు సుఖమును ఆశించుట పరమ దయ
ఆర్జవము అనగా ఏది ?
సకల భూతము లందు సమ బుద్ది కలిగి ఉండుట
మానవులకు జయింపరాని శత్రువు ఎవరు ?
కోపము
అంతము లేని వ్యాధి ఏది ?
లాభము
ఎటువంటి వాడు సాధువు అగును ?
సర్వ భూతములకు మేలు కోరు వాడు
అసాధువు ఎటు వంటి వాడు ?
దయ లేని వాడు
మోహము అనగా ఏది ?
ధర్మ మార్గమును ఎరుగ కుండుట
అహంకారము అనగా ఏది ?
దేహమందు అభిమానము
సోమరి తనము అనగా ఏది ?
ధర్మ కార్యములు చేయ కుండుట
దుఃఖము అనగా ఏది ?
అజ్ఞానము
ఋషులచే చెప్పబడిన స్థైర్యము ఏది ?
వర్ణాశ్రమ ధర్మము లందు ప్రవర్తిల్లుట
No comments:
Post a Comment