Tuesday, January 29, 2013

వేద గాయత్రి అగ్ర హారము

1.వేద గాయత్రి  పేరున వెలసి నట్టి
   యగ్ర హారంబు  జూడంగ హర్ష మయ్యె
  చేయు చున్నట్టి  యాగంబు  సరళి జూడ
  సంతసం బొందె  మిగుల  నా యంత రాత్మ .

2. అక్కడి  ప్లాటులు  జూడగ
   మిక్కుటముగ నిడువ  గలిగి  మిలమిల లాడెన్
   మక్కువ  గలిగెను  నాకవి
  చక్కగ  నే  ప్లాను వేసి  స్వంతము  సేతున్

3. అడిగెదను  శర్మ గారిని
    గడు వీ యుడు  మూడు నెలలు  గైవశ మునకున్
   విడివిడిగ బ్రోగు చేయుచు
  నిడుమలు బడి యైన నిత్తు నీ శ్వరు  కృ పనన్ .

4. ప్లాటు నిత్తురు మనిషికి  ప్లాటు యొకటి
    యదియు  బాపడు  లయినవా రైన యెడల
    కల్ల గాదిది  నిజమునే  బల్కు చుంటి
   శర్మ  యిట్లని  వాక్రుచ్చె  సభను గూర్చి .

5.  పప్పు  బూరులు  పులిహోర  పాయ సంబు
    పెరుగు  సాంబారు వడ్డించ  బ్రేమ తోడ
   భోజ నంబును  జేసితి బుష్టి గాను
   అన్నదాతకు  కలుగుత ! యాయు వృ ద్ధి .
 

2 comments:

  1. రావు మహాశయా,

    వేద గాయత్రి ఎక్కడున్నది?

    జిలేబి.

    ReplyDelete