Friday, January 25, 2013

శ్రద్ధాంజలి

1. లేవు లేవయ్య యిక మాకు  లేవు నీ వు
   ఎచట కేగితి వన్నయ్య !యిచట నుండి
  వత్తు వెప్పుడు  మము జూడ  ,వత్తు  విపుడ !
  ఎదురు  చూతుము  నీ కోస మిచ్ఛ  తోడ .

2 .రాపాక వంశ  మండన !
   ఏ పాపము  సేసినామొ ? యింతటి  శిక్షన్
  ఏ పారగ  విధియించితి
 వీ పాపుల గనిక రించి  యీ సారికి  రా .

3. రామ  శేషమ్మ  కడుపున రహి జెలంగ
   కడుపు  పంటగ  మురమళ్ళ  గ్రామ మందు
   పుట్టి , పెరిగితి వీ వయ్య ! పోత వరము
   నందు  ,ప్రజల జేజేల  నందు కొనుచు

4.  మీతో  గడిపిన  రోజులు
     చేతో  మోదంబు  గలిగె  చిన్మయ రూ పా !
     మాతో  బలికిన  బలుకులు
    ఎంతో  విలువైన వయ్య ! యెంచగ నిపుడున్ .

5.  బంధు ప్రీ తిని  గలిగిన  బాం ధ వుండు 
    స్నేహ  సంపద  నొందిన  చెలియ కాడు
    భువిని  రాపాక  వంశపు  బుధు డతండు
    కల్ల  కాదిది  నిజమునే  బల్కు  చుంటి .

6.  మాయ  మర్మము  లెరుగని  మనిషి వీ వ
     మత్స రంబును  నీ కిసు మంత  లేదు
     సాటి మనుజుని  మనిషిగా  సాకి నావు
     సాటి  యెవరయ్య , నీ కిల  సాటి యెవరు ?

7.   మరణ  కాలంబు  దెలిసెనా ? మాత  కృపను
     అమ్మ పోషణ  కూతుళ్ల  కప్ప గించి
    ఒప్ప గింతలు  సేసిరి  యొప్పు గాను
    అందు కొనుమయ్య ,సాదర  వంద నాలు .

8.   కాన రానట్టి  దూ రంబు  గడచి నావు
      కాను పించుమ యొక సారి ,కాంచి  నిన్ను
     సేద దేరుదు మోసామి ! చింత  నుండి
     రమ్ము సోదర ! రయముగ  నిమ్ము గాను .

9.   సకల శుభములు   గలి గించు  శంక రుండు
      మరల  జన్మంబు  లేకుండు  వరము  నిచ్చి
      పుణ్య లోకాలు  జేరగ  ననుమ తించి
     నీ దు  నాత్మకు  శాంతిని  నిచ్చు  గాక !

10.  మీరు  లేనట్టి  లోటును  మేము తీ ర్చ
     లేము ,  భార మంతయు  నిక నా మురహరి
     చూచు కొను నార్య !  నిజ మిది , లేచి యికను
     అందు కొనుమయ్య ! శ్ర ద్ధాంజ  లందు  కొనుము .
     

                                      అశ్రు నయనాలతో ................
                                                  కుటుంబ సభ్యుల తరఫున ,
                                                    పోచిరాజు సుబ్బారావు
(క్రీ .శే .రాపాక  ప్రభాకర రావు గారి  వర్ధంతి  సందర్భముగా )
                                             22-1-2013
                                                           
                                                              



   
 

No comments:

Post a Comment