1 . లేవు లేవాయె యిక మాకు లేవు నీవు
నే డకేగితి మమ్ముల నిచట విడిచి
రమ్ము రారమ్ము వేవేగ రమ్ము చిన్ని!
యె దురుచూతుమ.నీ రాక ముదము మాకు.
2 ఎచ్చట వేసిన గొంగళి
యచ్చటనే నుండు పగిదియాస్తులు,సరుకుల్
యె చ్చట పడితే నచ్చట
కచ్చా గా నుండె చిన్ని!కనుగొనుమయ్యా!
3 . బ్రతికినన్నాళ్లు రాజాల బ్రతికి తీవు
ఐదువేళ్ళుకు బెట్టితి వైదురింగ్లు
లోటు లేద య్య ! చిన్నయ్య !లోటు నీకు
నీదు భోగము రాదయ్య ! నేరికి నిల
- వినబడదయ్యా నికపై
వినబడదిక నీదు మాట
వినబడదయ్యా !
వినిపింపు మయ్య !
నొకపరి
వీ నులవిందౌను మాకు
గానమువోలెన్
5 నీదు జన్మము గొప్పది
నిహమునందు
బ్రతుకు భారము మాకిక
బాబు ! మాకు
కార్య కారణ ఘటనల
కర్త వీవ !
అందుకొనుమయ్య !
శ్రద్ధాంజ లందుకొనుము