నోటి దూల గాండ్రు నూటికి పదిమంది
యుండ్రు భువిని మఱి ని నొండు పనియు
లేక నెపుడు నితరు లే ధ్యేయ ము గనిల
నాడి పోసి కొందు రార్య ! వారు
ఇతర జనములు సేసె డి యేప నైన
నచ్చు బాటుకా నందున నసుగు గొనుచు
నా ర్య ! యుందురు నెపుడును నీ ర్ష్య తోడ
వారి బ్రదుకులొ నిత్యము వగలె మిగులు
బ్రదుక నేరరు నలుగురి బ్రజల మధ్య
మేము మాకుగా నధికుల మేయ నుచును
గొప్ప లెన్నియో మఱి చెప్పు కొందు రిలను
వారి సంస్కార మంతియ , బ్రహ్మ కెఱు క
No comments:
Post a Comment