వాతావరణ ము జూడగ
నాతపమే గాన బడక యహ మంతయునున్
శీ తలముల తో గూడిన
వాతము లవి వీచు చుండె భయములు గలుగన్
మంచు గలిగిన వర్షము మహిని బడగ
దాని వేగమ్ము జుడను దడయు కలిగి
మేని యందలి వెంట్రుకల్ మీది కెగసి
నిక్క బోడుచుకు నుండెను నిక్క ముగను
నేల యంతయు దెల్లనై నిజము గాను
దట్ట మైనట్టి మంచుతో దిట్ట ముగను
బాల సంద్రము వోలెను భాసిలు టను
నబ్బు రంబును గలిగించె నా క్ష ణ మున
ఎన్ని గంటలు కురియునో నేమొ యికను
కార్ల పై భాగ మంతయు కప్ప బడియె
నింక నింకను గురిసిన యిండ్లు గూడ
మంచు మయమగు నను మాట మఱు వ వలదు
బయట నెంత మంచు పడుచున్న ,శీ తల
మెంత యున్న గృహము లందు వెచ్చ
గానె నుండు మరిని లేనియెడ నెవరు
బ్రదుక జాల రిచట పచ్చి నిజము
తగ్గు ముఖము వట్టె దా మంచు వర్షము
రెండు గంటలు మఱి మెండు కురిసి
తెరిపి యిచ్చె నభము తెల్లగా మారుచు
గాని పించె యెండ కనుల కిపుడు
రెండవ రోజున కూడను
మెండుగ నిట హిమము పడుచు మేదిని గప్పన్
గండముగ మారె పయనము
దండము నిక సాంబ !నీకు దరికిన్ జేర్చన్
No comments:
Post a Comment