Thursday, April 30, 2015

శ్రీ శ్రీ జయంతి

శ్రీరంగము వారయ మఱి 
శ్రీరాముని సేవ జేసి సిరులను  మఱియున్ 
వారసుడు శ్రీనివాసు గు 
మారుగ  నిల బొంది రార్య !మంచిని జేయన్ 

భారత రామాయణములు వ్యర్ధములు గదా

ఆరయ  పవిత్ర  ములుగద
భారత రామాయణములు ,వ్యర్ధములు గదా
పారాయణ జేయకునికి
వారల జీవితములు ధర  వారిజ నాభా !

పద్య రచన -కృష్ణుడు -మఱ్ఱి యాకు

మఱ్ఱి యాకును బాన్పుగా  మలచు కొనుచు 
తీరు  బడిగాను  గూర్చున్న  తిరుమలేశ !
వంద నంబులు సేతును  వంద లాది 
యందు కొనుమయ్య ! కృష్ణయ్య ! యందు కొనుము 

Wednesday, April 29, 2015

పద్య రచన -బాలిక యేడుపు

చిత్ర మందున  బాలిక చింత తోడ 
నేడ్చు  చుండెను  గారణం బేది యగునొ ?
తెలిసి  కొననేగి  బాధను  దీర్చు మయ్య !
కావ లసినది  యీయుచు  గారవముగ 

పద్య రచన నల్లేరు పై బండి నడక

శంక రార్యుల సూచనల్ సరిగ చూసి
వ్రాయ మొదలిడ పద్యముల్  వాసి గాను
పద్య రచన నల్లేరు పై బండి  నడక
వోలె సాగును  నిజమిది  పోచి రాజ !

శ్రద్ధాంజలి

31-5-2014 వ తేదీన పెద్ద బావ  పరమ పదించిన  సందర్భముగా )


లేవు  లేవాయె  యిక మాకు  లేవు  నీ వు
ఎచట  కేగితి నీ వయ్య !  యిచట  నుండి
వత్తు  వెప్పుడు  మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు  చూతుము  నీ కోస  మిచ్ఛ తోడ .

కాన  రానట్టి  దూ రంబు  గడచి నావు
కాను పించుమ  యొక సారి ,కాంచి  నిన్ను
సేద దేరుదు  మో సామి ! చింత  నుండి
రమ్ము  పెదబావ !  రయముగ  నిమ్ము  గాను .

బంధు ప్రీ తిని  గలిగిన  బాంధ  వుండు
స్నేహ సంపద నొందిన  చెలియ  కాడు
భువిని  నిమిషకవి కులపు  భూ ష ణుం డు 
కల్ల  కాదిది  నిజము నే  బల్కు చుంటి .

మాయ  మర్మము  లెరుగని  మనిషి వీ వ !
మత్స రంబును నీ కిసుమంత  లేదు
సాటి  మనుజుని  మనిషి గా  సాకి నావు
సాటి  యెవరయ్య ! నీ కిల  సాటి యెవరు ?

పిలుతు వెప్పుడు మమ్ముల బ్రీతి తోడ
పలుక రింపులే కరువౌను బావ !యికను
చివరి సారిగ నినుజూడ జేర నైతి
నెంత దురదృష్ట వంతుడ నిలను నేను

ఏమి నేరము జేసితి మింత లోన
మమ్ము లవిడిచి పోతిరి ? రమ్ము వేగ
నేను వత్తును నీతోడ నెమ్మనమున
పలుకు చుంటిని నిజమును  బావ !నమ్ము

అమర లోకంబు  జేరితి వయ్య ! నీ వు
అమరు లందఱు  నిను జూచి  యాద  రించ
మసలు  గొనుమయ్య ! యక్కడ  మాన్యు రీ తి
వంద నంబులు నీకివె  వంద లాది

మీ తో  గడిపిన  రోజులు
చేతో  మోదంబు  గలిగె  చిన్మయ రూ పా !
మాతో బలికిన  బలుకులు
నెంతో విలువైన  వయ్య ! యెంచగ  నిపుడున్ .

సకల శుభములు గలిగించు  శంక రుండు
మరల జన్మంబు లేకుండు  వరము  నిచ్చి
పుణ్య లోకాలు  జేరగ  ననుమ తించి
యొసగు శాంతిని నాత్మకు నొప్పు గాను


మీ రు లేనట్టి  లోటును  మేము దీ ర్చ
లేము , భార మంతయు  నిక నా మురహరి
చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము
---------------------
అశ్రు పూర్వక  నయనాలతో .........    
పోచిరాజు సుబ్బారావు  మఱియు  కుటుంబ సభ్యులు


జన్మ రాహిత్యము

జన్మ రాహిత్యము

పూర్వ జన్మ మందు పూర్ణము కానట్టి
మిగులు పాపతతులు మిగుల కుండ
ననుభ వించ వలెను నాజన్మమునిలను
జీవి జీ వియు  దప్పక జేయమదియ

పాపమంతయు జీవిని బాయు వరకు
జీవి జన్మించు చుండును జేత నముగ
పుణ్య కార్యాల వలననే బోవు నఘము
జన్మ రాహిత్య మునకది సత్పధ మగు

గిట్టు మనుజుడు దప్పక పుట్టు మరల
నతని పాపము విడివడు నంత వరకు
పుణ్య మార్జన జేయగ బోవు నఘము
కాన జేయుము పుణ్యము గలుగు వరకు

పాప ఫలితము గష్టా లు  వరలు నెడల
పుణ్య ఫలితము సుఖములనొ సగు మదిని
పాప ముల జోలి  కేగక బ్రదుకునంత
కాల ముపకృతి జేయంగ  వలయు సుమ్ము 

Tuesday, April 28, 2015

పద్య రచన -రామ లక్ష్మణులు

చిత్ర మందున జూడుము  చిత్స్వరూప !
రామ లక్ష్మణు లచ్చట రయము గాను 
యజ్ఞ  సంరక్ష  ణ మునందు ప్రాజ్ఞు  లగుచు 
సిద్ధ ముగనుండి గద మఱి  యుద్ధ మునకు 

న్య స్తాక్షరి =భూకంపము

భూమి లోపల  వత్తిడి భూరి యుండ 
కంపనము మొద  లగుచుండి  కటువు గాను 
పగిలి  భూమి బీ  టలు బీ ట  లగుచు మిగుల 
ముప్పు గలిగించు బ్రజలకు  మూర్తి ! గనుము 

Monday, April 27, 2015

పరమ శివునితో లక్ష్మియు బవ్వళించె

బంధ మెక్కువ  నాకుగా బరగె నార్య !
పరమ శివునితో , లక్ష్మియు  బవ్వళించె
పాల  సంద్రాన విష్ణువు పార్శ్వ మునన
వంద నంబులు సేతును  వారి కెపుడు

పద్య రచన -భామలు -తిరుగలి

చిత్ర మందున  భామలు చిత్త మలర
త్రిప్పు  చుండిరి  పిండికై  తిరుగ లియట
యెంత  మెత్తగా  వచ్చునో  నంత బాగు
చేయ  వచ్చును  దానితో జేత నైన
పిండి వంటలు రామయ్య !ప్రియము  గలుగ 

Sunday, April 26, 2015

అన్నమొ రామచంద్ర యని యందరు చచ్చిన రామరా జ్యమే

మిన్నక యుండగా ను వ ల దెన్నడు  ,చచ్చుట  నాపగా దగున్
అన్నమొ రామచంద్ర యని యందరు చచ్చిన, రామరా జ్యమే
యెన్నడు నుండున ట్లుగను  పన్నుగ  నందరు బాటు నొందుచున్
నెన్నిక లందు నె  న్నుకొన మిన్నగు వానిని  నొప్పుగా ధరన్







పద్య రచన -పాము ,సాలె పురుగు /హస్తి

చిత్ర మందున శంభుని జిత్ర ముగను
సర్ప మొక్కటి  నాగము  సాలె పురుగు
బూజ  జేయుట గుఱు తుగా  పొలుపు గాను
పూలు  మణులును  గలవియై పొడగ నెగద . 

భీముండు ప్రసిధ్ధు డయ్యె బిఱి కి తనమునన్

రాముని తమ్ముడు భీముడు
రాముడు మఱి శౌర్యశాలి  రమ్యుడు కూడన్
భీముని  గుణమును నరయగ
భీముండు ప్రసిధ్ధు డయ్యె బిఱి కి తనమునన్ 

Saturday, April 25, 2015

పద్య రచన -శకుంతల లేఖ వ్రాయుట

విరహ వేదన  కతనాన వేస డిల్లి 
యాశ  కుంతల యట తామ  రాకు మీద 
వ్రాయ దొడగెను జూడుడు  ప్రభువు కొఱకు 
తోడు కత్తెలి  రుదెసల  తోడు కలుగ  

Friday, April 24, 2015

నండూరి రామ కృష్ణ జయంతి

పుట్టితి వట  యీ రోజున 
పుట్టిన యోరామ కృష్ణ !పూర్ణిమ చంద్రున్ 
బిట్టుగ  బోలుచు  వెలుగుము 
నట్టింట ను  దిరుగుమా ర్య ! నగవుల తోడన్ 

మీ సమ్ములు లేని వనిత మేదిని గలదే

రోసము నకు గుఱు తులు గద
 మీ సమ్ములు, లేని వనిత మేదిని గలదే
మీసము  లుండవు  వనితకు
మీ సములే  యున్న యెడల మీరును  హద్దుల్ 

పద్య రచన -యశోద -బాల కృష్ణుడు

మన్ను తింటివా ?చూపుమో  కన్న ! నోరు 
నీది యనగను మఱి యా య శోద ,చూప 
తనదు నోటిని కృష్ణుడు తల్లి కపుడు 
చూచె  లోకాలు  పదునాల్గు  చూడ్కు లలర 

దత్త పది -జలుబు ,ద గ్గు ,నొప్పి , నలత (రామాయణా ర్ధము )

ప్రజలు  బుద్ధి హీను లగుట బరితె గించి 
పలుక  దగ్గునే ? భూమిజ  పరువు ధరను 
నొప్పిద మగురీ  తినపుడు నుతులు సేయ 
కాన  లతరులు,  గ్రహియించె  కాంత నపుడు 

పద్య రచన -మీరా బాయి

మీరాబాయిని జూడుము 
ధారగ నట పాడుచుండె ధారా ళ ముగన్ 
మీరా కీర్తన వినగను 
నేరాయియు నైన కరగు నింపౌ కతనన్ 

Thursday, April 23, 2015

దనుజుల యిలవేల్పు చక్ర ధరుడగు హరియౌ

దనుజుడు ప్రహ్లాదుడు  మఱి
యనయము గీ ర్తించు చుండె నామహి  తాత్మున్
మనమున  నాలో  చించగ
దనుజుల యిలవేల్పు చక్ర ధరుడగు హరియౌ 

ఆడవారు అన్ని రంగాలలో

ఆడవారు కా  దిపుడార్య  యబలు లుమఱి
అన్ని  రంగాల యందున  మిన్న గాను
రాణి కెక్కుచు  నుండిరి  రమ్య  ముగను
చెప్పు  చున్నది  చిత్రము  చేతి  తోడ 

తుల సమ్మ

చిత్ర మందున యి ల్లాలు    చిత్త మలర,
చేయు చుండె ను బూజను  సీత  చూడు
అమ్మ!  తుల సమ్మ ! వం దన మమ్మ ! నీకు
కరుణ జూడు ము మమ్ముల కనిక రిం చి 

Monday, April 20, 2015

సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్

సుతునకు  మేలును జేయగ
సతతము  మఱి  భక్తి తోడ  శంభుని పూజ ల్
నతులను ,మఱియును  నంజని
సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్
 

Sunday, April 19, 2015

శ్రీ సద్గురు శ్శరణమ్

శ్రీ సద్గురు శ్శరణమ్ 
శ్రీ శ్రీ శ్రీ  జగద్గురు ఆది  శంకరాచార్య భక్త సమాజ సభ్యత్వ నమోదు పత్రము 
---------------------------------------------------------------------------------

పేరు ;
తండ్రి పేరు ;
గోత్రము ;
చిరునామా ;
ఫోను నంబరు ;
ఈ  మెయిల్ ;
రుసుము ;
                                     నేను  మీ సంస్థలో  సాధారణ  సభ్యత్వము  తీసికొన గోరుచున్నాను . సంస్థ 
నియమ  నిబంధనలు ,ఆశయాలు  మఱి యు  కార్య కలాపాలు ,ఉద్దేశాలను  గౌరవిస్తూ  ఎటువంటి  ఆటంకములు 
కలుగ కుండ మనస్ఫూర్తిగా  న వంతు  సహాయ సహకారములు అందించగల వాడను . 
నోట్ ; సావంత్సరిక  చందా; రూపాయలు  516/-. 
         జీవిత  చందా ; రూపాయలు  5116/-

                                                                                                        సంతకము 
--------------------------------------------------------------------------------------------------------------------
శ్రీ శ్రీ శ్రీ జగద్గురు  ఆది శంకరాచార్య భక్త సమాజము ;;;(;రిజిస్టర్డు  )
ఇం .నెం . 355, న్యూ  నా గోల్ ,హైదరాబాద్ 
వివరాలకు ..  9440768316,,,8121222228. 



శ్రద్ధాంజలి

లేవు  లేవాయె  యిక మాకు  లేవు  నీ వు
ఎచట  కేగితి నీ వయ్య !  యిచట  నుండి
వత్తు  వెప్పుడు  మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు  చూతుము  నీ కోస  మిచ్ఛ తోడ .

కాన  రానట్టి  దూ రంబు  గడచి నావు
కాను పించుమ  యొక సారి ,కాంచి  నిన్ను
సేద దేరుదు  మో సామి ! చింత  నుండి
రమ్ము  మఱి నీవు  రయముగ  నిమ్ము  గాను .

బంధు ప్రీ తిని  గలిగిన  బాంధ  వుండు
స్నేహ సంపద నొందిన  చెలియ  కాడు
భువిని  మంగళం  పలి కుల     భూ ష ణుం డు 
కల్ల  కాదిది  నిజము నే  బల్కు చుంటి .

మాయ  మర్మము  లెరుగని  మనిషి వీ వ !
మత్స రంబును నీ కిసుమంత  లేదు
సాటి  మనుజుని  మనిషి గా  సాకి నావు
సాటి  యెవరయ్య ! నీ కిల  సాటి యెవరు ?

పిలుతు వెప్పుడు మమ్ముల బ్రీతి తోడ
పలుక రింపులే కరువౌను !పరమ పురుష !
చివరి సారిగ నినుజూడ జేర నైతి
నెంత దురదృష్ట వంతుడ నిలను నేను

ఏమి నేరము జేసితి మింత లోన
మమ్ము లవిడిచి పోతిరి ? రమ్ము సామి !
నారి కేళ పు  వృక్షము  కార ణం బ ?
నీదు మరణము నకిపుడు  నిజము గాను

ఆట లాడుచు  మేమంత యలసి పోయి
దప్పి గొనగను  దయతోడ నప్పు నిచ్చి
దప్పి దీ ర్చె డి  వాడవు ధర్మ శీల !
మిన్న యగునాయు పకృతిని నెన్న తరమె ?

అమర లోకంబు  జేరితి వయ్య ! నీ వు
అమరు లందఱు  నిను జూచి  యాద  రించ
మసలు  గొనుమయ్య ! యక్కడ  మాన్యు రీ తి
వంద నంబులు నీకివె  వంద లాది

మీ తో  గడిపిన  రోజులు
చేతో  మోదంబు  గలిగె  చిన్మయ రూ పా !
మాతో బలికిన  బలుకులు
నెంతో విలువైన  వయ్య ! యెంచగ  నిపుడున్ .

సకల శుభములు గలిగించు  శంక రుండు
మరల జన్మంబు లేకుండు  వరము  నిచ్చి
పుణ్య లోకాలు  జేరగ  ననుమ తించి
యొసగు శాంతిని నాత్మకు నొప్పు గాను


మీ రు లేనట్టి  లోటును  మేము దీ ర్చ
లేము , భార మంతయు  నిక నా మురహరి
చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము
---------------------
అశ్రు పూర్వక  నయనాలతో .........    
పోచిరాజు సుబ్బారావు

Saturday, April 18, 2015

కోడిని కరకర నమిలె కోడలమ్మ

కోడి చర్మము వొలిచి కుతకు  తగ ను
నగ్ని  మీదను గాల్చి మా  హర్ష  మొన్న
కోడిని కరకర  నమిలె , కోడలమ్మ
విస్కి  బాటిలు కొనియీ య వేగ ద్రాగి 

పద్య రచన -పెంట కుప్ప ,మొక్క

ఎంత యేపుగ బెరిగెనో  నింతి ! జూడు
పెంట  కుప్పమ  ధ్యన నట  పిచ్చి మొక్క 
సార  వంతము  గలయట్టి  నేల  కనుక 
మొక్క  బెరిగెను నేపుగ  ముద్దు గాను 

Friday, April 17, 2015

పద్య రచన -కుంభ కర్ణుని లేపుట

చిత్ర  మయ్యది  చూడగ జిత్ర మాయె 
నేను  గులజేత ద్రొక్కించి  యినుప చువ్వ 
లపొడి  పించి లేప దొడగె  రక్కసుడగు 
కుంభ  కర్ణుని నిద్రను కుజను  లచట 

Thursday, April 16, 2015

పద్య రచన -పడక కుర్చీ

పడక కుర్చీని  జూడుము బావ ! యచట 
యందు  కూర్చుని పేపరు హాయి గాను 
చదువు కొనుమయ్య ! పూర్తిగ  శ్రద్ధ తోడ 
తూగు  టు య్యెల  మాదిరి  యూగు చుండి 

భర్త యల్లు డయ్యె భామ కపుడు

తాను  మరణ మొంద తనదు సోదరునకు
భర్త యల్లు డయ్యె ,భామ కపుడు
భర్త యగును సుతుడు, బంధ మిట్లు  గలుగు
నిట్లు  గాను నుండె నెక్క డైన 

పద్య రచన -రావణుడు -జటాయువు

కామ మదమున  సీతను గాంక్ష తోడ 
నెత్తు కొని బోవ పక్షిరా  జత్త ఱి నట 
రావ ణు నెది రిం  చ  నతడు  రయము గాను 
రెండు  రె క్కలు  ఖండించ ఖండ  మాయె 

Wednesday, April 15, 2015

రణము కవులకు కీర్తి క రమ్ము గాదె

పద్య ములువ్రాయ సరియగు  పద్ధ తినిల
తెలుపు  ఛందము బాగుగ తెలిసి కొనుచు
భాష శుద్ధత  గలిగించు భవ్య  వ్యాక
రణము కవులకు కీర్తి క  రమ్ము గాదె 

పద్య రచన -శంకరా చార్యులు

చిత్ర మందున  గలయట్టి  శిష్టు  డరయ 
యపర శంకరు డా తడు హర్ష ! కనుము 
వాని తల్లిని  గొనిపోవ  పైన జూడు 
సిధ్ధముగ నుండె గగనాన  శివుని  గణము 

Monday, April 13, 2015

పద్య రచన -చెవికి మాటీ

చిత్ర మందున  చిత్రాంగి  చెవికి నచట 
యాభ  రణ ముగా  మాటీ ని  హత్తు కొనెను 
చూడ  ముచ్చట గానుండె  చూడు  నీవు 
నీకు  కూడను  గొందును  నీర జాక్షి !

వలచి పెండ్లాడె వృధ్ధుని పడుచు పిల్ల

వృద్ధు  డయ్యును గనిపించ  శుద్ధ ముగను
పడుచు  కుఱ్ఱా డు  వోలెను  బడతి కపుడు
వలచి పెండ్లాడె వృధ్ధుని  పడుచు పిల్ల
వారి బంధము  బాగుగ వరలు గాక !

వ్యసనమువేయిరీతుల శుభప్రదమై యశమందఁజేయురా

Sunday, April 12, 2015

పద్య రచన -ధర్మ రాజు -యక్షుడు

చచ్చి  పడియున్న తమ్ముల   శవము లనట
ధర్మ  జుడుగని బ్రతికింప దలచి , యక్షు
ప్రశ్నల కుదగు  రీతిగ  బదులు సెప్పి
బ్రదుకు నట్లుగ  జేసెను  వారి నపుడు

పద్య రచన -పూలదండలు

వివిధ రకముల పూలతో వెల్లి  విరియు
పూల దండలు జూడగ పుణ్య పురుష !
కళ్ళు  మిఱు మిట్లు గొలిపెను  రంగు లవియ
చూడ ముచ్చట గొలుపును జూప రులకు 

చంద్ర వంశ్యుడు శ్రీ రామ చంద్రుడు గద

కంస మర్దను డైనట్టి కన్నడు మఱి
చంద్ర వంశ్యుడు  శ్రీ రామ చంద్రుడు గద
సూర్య వంశాన బుట్టిన  శూరు డా ర్య !
వంద నంబులు వారికి బహుళ  ముగను
 

Saturday, April 11, 2015

దత్త పది -అన్నము ,కూర ,పప్పు చారు ,భారతార్ధము

చారు శీలురు గుణవంతు  లార్య ! వారు
పప్పు సేతురు మమ్ముల  పాండవు లని
అన్న ! మురహరి !కాపాడు  చెన్ను మీర
జయము సమకూర జేసియు  శాశ్వ తముగ 

Friday, April 10, 2015

పద్య రచన -అన్నము -కూరలు

కూర  సాంబారు పప్పును కూడి యుండి
యన్న మయ్యెడ  శోభిల్లె  చెన్ను తోడ
ఆర  గించగ  రండిక యార్య ! మీరు
ఆల సించిన చల్లారి మారు రుచియ
 

Thursday, April 9, 2015

వాన పాము కాటు ప్రాణ హరము

వాన పాము కాటు ప్రాణ హరము కాదు
మేలు జేయు జీవి  బాల ! యదియ
త్రాచు పాము కాటు ప్రాణ హ  రముసుమ్ము
పాము వెంట బడుచు  బరుగు లిడకు 

పద్య రచన -పున్నమి చంద్రుడు

పున్నమి చంద్రుని జూడుము 
మిన్నున వెలుగొందు చుండె మెఱు పుల  కాంతిన్ 
వన్నెలు గలిగిన తారలు 
పన్నుగ  నడయాడు చుండ పడమర కేగెన్ 

Wednesday, April 8, 2015

పద్య రచన -ఆంజనేయుడు

ఫలమ  యనుకొని  సూర్యుని బట్ట బోవ
కాలి  నీ మూతి  యెఱ్ఱ గ  గంది పోయె 
నంత సాహసం  బది యే ల  హనుమ ! నీకు ?
వంద నంబులు సేతును వనచ  రాగ్ర !

ఆంజనేయుని  జూడగ నార్య ! తోచె
లంక దహియించి రావణు  బింక మణ చ
నుగ్ర రూపాన లంకకు నేగు నటుల
నెటుల  దోచెను  మఱి మీకు  నిటుల యేన ?

తరువున వెలుగొందె దార లెల్ల

చూడ ముచ్చ టయ్యె   చూ త  ఫ  లమ్ములు
తరువున, వెలుగొందె దార లెల్ల ,
నాక సంబు మీద  యంతట మిలమిల
లాడు చుమఱి   కాంతి తోడ నార్య !


కాకికి సతి రాజహంస కాద గు నెపుడున్

కాకికి కాకియె  సతి యగు
కాకికి సతి రాజహంస కాద గు  నెపుడున్
కాకుల జాతికి బంధము
కోకిలకే యుండి భువిని  కూనల బెంచున్ 

ఫేసు బుక్కు

ఫేసు బుక్కు ను  జూడగ  బ్రియము గలిగె
కార  ణం బేమ  ననచట గానిపించు
చుండె  నెందరో శిష్యులు చుట్ట  ములును
మఱియు  మిత్ర గ  ణ మ్ములు మాన  నీయ !

ఎక్క డె క్కడో  నున్నట్టి యిష్టు లుమఱి
యొక్క చోటున  గనిపించి  చక్క గాను
లిఖిత  రూపాన  కుశలముల్ 

పద్య రచన -భీష్ముడు అంప శయ్య

 పవ్వ ళిం చెను  భీష్ముడు పాన్పు మీద 
యంప శయ్యది పార్ధుని  నంప గముల
చేత నిర్మింప బడియెను జిత్ర ముగను 
ధర్మ రాజాదు  లచ్చట దరిని యుండి 
ధర్మ  సందేహ  ములువిని  తనియు  చుండ్రి 

Monday, April 6, 2015

చుట్ట ఱి కము లెల్లరకును క్షోభను గూర్చున్

పట్టును నిలగలి  గించును
చుట్ట ఱి కము లెల్లరకును, క్షోభను గూర్చున్
చుట్టాలు మోస  గించిన
రట్టుగ నిక మాఱి యిల్లు  రహిచెడు నార్యా !

పద్య రచన -ఆల మంద

ఆల మందలు జూడుమ ! యాతృ  తగను 
బోవు చుండెను నింటికి  బుడత  లకును 
బాలు  గుడుపుట  కొఱ కుగా  పార్ధ ! యవియ 
వంద నంబులు  గోమాత  బృంద మునకు 

Sunday, April 5, 2015

పద్య రచన -బండి -మనుమడు -తాత

బండి మీదన తాతయ్య బండి వెనుక 
నీడ యందున మనుమడు నిశ్చ లముగ 
నుండె యిరువురు పటమున  పండు ! చూడు 
ఒకరు  భిక్షాటనకు మఱి  యొకరు చదువు 

దత్త పది కవిమిత్రులారా! గుణము - తృణము - పణము - రణము పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో


సద్గుణముల రాశి యతడు  సత్పు రుషుడు
జీవి  తంబును దృ ణ ముగా భావుకుండు
ద్యూత  మందున  పణముగా  ద్రో వది నట
పెట్టు కతనన రణమును  బిట్టు జేసె 

బోరులు

ఎండి పోయెను బోరులు  నీ శ ! మావి 
యె టుల  బ్రదుక వ  లయునిట  ! యేమొ  కాని  
పార్ధ !నీ వ  గతియిక ను  బాల  ముంచె 
దవొ మ ఱి యిక నీ  టను ముంచె   దవొ మము మఱి 

Saturday, April 4, 2015

పద్య రచన -చంద్ర గ్రహణము

చంద్ర గ్రహణ మయయ్యది 
చంద్రుని నట పట్టు చుండె  సాకా రముగాన్ 
చంద్రుని రాహువు పట్టిన 
చందము మఱి చూడు మార్య ! సరిగను బటమున్ 

పాలిమ్మని , సుతుని భర్త పాలికి బంపెన్


బాలుడు నేడువ సాగెను
పాలిమ్మని , సుతుని భర్త పాలికి బంపెన్
బాలకు సొమ్ములు దెమ్మని
మాలతి దా జెప్పె నపుడు పరుగున రారా .

పద్యములను వ్రాయు కవులు వ్యర్ధులు సుమతీ

పద్యములు  వ్రాయదలచిన
హృద్యముగా వ్రాయ వలెను హేమా !యెపుడున్
గద్యముల వోలె నుండెడు
 పద్యములను వ్రాయు కవులు వ్యర్ధులు సుమతీ !

Friday, April 3, 2015

ఆహ్వానము

బేతవోలు మొ  దలుగాగ బెద్ద లంద 
ఱకును  వినయపూ  ర్వకముగ  రయము  గాను 
వంద నంబులు  సేతును  వందలాది 
శంక రాభర  ణ సృజన !శంక రార్య !

Thursday, April 2, 2015

ద్యూత మద్య పాన రతులు నీతి పరులు

మూడు  పూ టలు  ద్రాగుచు,  మూ లుగుదురు
ద్యూత మద్య పాన రతులు,  నీతి పరులు
న్యాయ మెన్నడు విడనాడ రార్య ! వారు
మఱియు కాపాడు నీతియే మనల నెపుడు

పద్య రచన -పెండ్లి చూపులు

పెండ్లి జూపుల బే రన  బెండ్లి వారు 
వత్తు  రమ్మాయి గుణ గణా  లత్తరి మఱి 
తెలిసి  కొనుటకు మఱియును దెలివి తేట 
లు నడ  వడి  యంద  ము పలుకు  లుపలి  కించి 
యిష్ట  మగునె డ  సంబంధ మిష్ట మండ్రు 

అంశం- శ్రీకృష్ణుని రాయబారము. నిషిద్ధాక్షరములు - క. చ, ట, త, ప.

రాయ బారిని ,.వెన్నుని రాజ రాజ !
రాజ్య భాగము వారిది రయము గాను
నిమ్ము  లేని యెడల సమ  రమ్ము నందు
 మరణ  మయ్యది జరుగును  మామ ! వినుము 

Wednesday, April 1, 2015

పద్య రచన -తీర్ధ యాత్రలు

తీర్ధ యాత్రలు జేయగ సార్ధ కమగు 
వారి  జీవిత మ నుటను  బాడి యగును 
పుణ్య ముపురుషా ర్ధమ్ములు భూరి కలుగు 
కాన యాత్రలు నా వశ్య  కములు సుమ్ము