31-5-2014 వ తేదీన పెద్ద బావ పరమ పదించిన సందర్భముగా )
లేవు లేవాయె యిక మాకు లేవు నీ వు
ఎచట కేగితి నీ వయ్య ! యిచట నుండి
వత్తు వెప్పుడు మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు చూతుము నీ కోస మిచ్ఛ తోడ .
కాన రానట్టి దూ రంబు గడచి నావు
కాను పించుమ యొక సారి ,కాంచి నిన్ను
సేద దేరుదు మో సామి ! చింత నుండి
రమ్ము పెదబావ ! రయముగ నిమ్ము గాను .
బంధు ప్రీ తిని గలిగిన బాంధ వుండు
స్నేహ సంపద నొందిన చెలియ కాడు
భువిని నిమిషకవి కులపు భూ ష ణుం డు
ఎచట కేగితి నీ వయ్య ! యిచట నుండి
వత్తు వెప్పుడు మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు చూతుము నీ కోస మిచ్ఛ తోడ .
కాన రానట్టి దూ రంబు గడచి నావు
కాను పించుమ యొక సారి ,కాంచి నిన్ను
సేద దేరుదు మో సామి ! చింత నుండి
రమ్ము పెదబావ ! రయముగ నిమ్ము గాను .
బంధు ప్రీ తిని గలిగిన బాంధ వుండు
స్నేహ సంపద నొందిన చెలియ కాడు
భువిని నిమిషకవి కులపు భూ ష ణుం డు
కల్ల కాదిది నిజము నే బల్కు చుంటి .
మాయ మర్మము లెరుగని మనిషి వీ వ !
మత్స రంబును నీ కిసుమంత లేదు
సాటి మనుజుని మనిషి గా సాకి నావు
సాటి యెవరయ్య ! నీ కిల సాటి యెవరు ?
పిలుతు వెప్పుడు మమ్ముల బ్రీతి తోడ
పలుక రింపులే కరువౌను బావ !యికను
చివరి సారిగ నినుజూడ జేర నైతి
నెంత దురదృష్ట వంతుడ నిలను నేను
ఏమి నేరము జేసితి మింత లోన
మమ్ము లవిడిచి పోతిరి ? రమ్ము వేగ
నేను వత్తును నీతోడ నెమ్మనమున
పలుకు చుంటిని నిజమును బావ !నమ్ము
అమర లోకంబు జేరితి వయ్య ! నీ వు
అమరు లందఱు నిను జూచి యాద రించ
మసలు గొనుమయ్య ! యక్కడ మాన్యు రీ తి
వంద నంబులు నీకివె వంద లాది
మీ తో గడిపిన రోజులు
చేతో మోదంబు గలిగె చిన్మయ రూ పా !
మాతో బలికిన బలుకులు
నెంతో విలువైన వయ్య ! యెంచగ నిపుడున్ .
సకల శుభములు గలిగించు శంక రుండు
మరల జన్మంబు లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ ననుమ తించి
యొసగు శాంతిని నాత్మకు నొప్పు గాను
మీ రు లేనట్టి లోటును మేము దీ ర్చ
లేము , భార మంతయు నిక నా మురహరి
చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము
---------------------
అశ్రు పూర్వక నయనాలతో .........
పోచిరాజు సుబ్బారావు మఱియు కుటుంబ సభ్యులు
మాయ మర్మము లెరుగని మనిషి వీ వ !
మత్స రంబును నీ కిసుమంత లేదు
సాటి మనుజుని మనిషి గా సాకి నావు
సాటి యెవరయ్య ! నీ కిల సాటి యెవరు ?
పిలుతు వెప్పుడు మమ్ముల బ్రీతి తోడ
పలుక రింపులే కరువౌను బావ !యికను
చివరి సారిగ నినుజూడ జేర నైతి
నెంత దురదృష్ట వంతుడ నిలను నేను
ఏమి నేరము జేసితి మింత లోన
మమ్ము లవిడిచి పోతిరి ? రమ్ము వేగ
నేను వత్తును నీతోడ నెమ్మనమున
పలుకు చుంటిని నిజమును బావ !నమ్ము
అమర లోకంబు జేరితి వయ్య ! నీ వు
అమరు లందఱు నిను జూచి యాద రించ
మసలు గొనుమయ్య ! యక్కడ మాన్యు రీ తి
వంద నంబులు నీకివె వంద లాది
మీ తో గడిపిన రోజులు
చేతో మోదంబు గలిగె చిన్మయ రూ పా !
మాతో బలికిన బలుకులు
నెంతో విలువైన వయ్య ! యెంచగ నిపుడున్ .
సకల శుభములు గలిగించు శంక రుండు
మరల జన్మంబు లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ ననుమ తించి
యొసగు శాంతిని నాత్మకు నొప్పు గాను
మీ రు లేనట్టి లోటును మేము దీ ర్చ
లేము , భార మంతయు నిక నా మురహరి
చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము
---------------------
అశ్రు పూర్వక నయనాలతో .........
పోచిరాజు సుబ్బారావు మఱియు కుటుంబ సభ్యులు
No comments:
Post a Comment