జన్మ రాహిత్యము
పూర్వ జన్మ మందు పూర్ణము కానట్టి
మిగులు పాపతతులు మిగుల కుండ
ననుభ వించ వలెను నాజన్మమునిలను
జీవి జీ వియు దప్పక జేయమదియ
పాపమంతయు జీవిని బాయు వరకు
జీవి జన్మించు చుండును జేత నముగ
పుణ్య కార్యాల వలననే బోవు నఘము
జన్మ రాహిత్య మునకది సత్పధ మగు
గిట్టు మనుజుడు దప్పక పుట్టు మరల
నతని పాపము విడివడు నంత వరకు
పుణ్య మార్జన జేయగ బోవు నఘము
కాన జేయుము పుణ్యము గలుగు వరకు
పాప ఫలితము గష్టా లు వరలు నెడల
పుణ్య ఫలితము సుఖములనొ సగు మదిని
పాప ముల జోలి కేగక బ్రదుకునంత
కాల ముపకృతి జేయంగ వలయు సుమ్ము
మిగులు పాపతతులు మిగుల కుండ
ననుభ వించ వలెను నాజన్మమునిలను
జీవి జీ వియు దప్పక జేయమదియ
పాపమంతయు జీవిని బాయు వరకు
జీవి జన్మించు చుండును జేత నముగ
పుణ్య కార్యాల వలననే బోవు నఘము
జన్మ రాహిత్య మునకది సత్పధ మగు
గిట్టు మనుజుడు దప్పక పుట్టు మరల
నతని పాపము విడివడు నంత వరకు
పుణ్య మార్జన జేయగ బోవు నఘము
కాన జేయుము పుణ్యము గలుగు వరకు
పాప ఫలితము గష్టా లు వరలు నెడల
పుణ్య ఫలితము సుఖములనొ సగు మదిని
పాప ముల జోలి కేగక బ్రదుకునంత
కాల ముపకృతి జేయంగ వలయు సుమ్ము
No comments:
Post a Comment