పద్యము..అంబురుహము (గణములు..,భ,భ,భ,భ,ర,స,వ, యతి 13వ అక్షరం)
———
భారత మందలి గాధలు నేర్చుటఁ బావనం బగు జన్మమే
ధీరులు భీముడు క్రీడియుఁ గర్ణులు తేజముం గనఁబర్చిరే
శూరులె యందరు ,నాజినిఁ జూపిరి శూరతన్ బలమున్ గదా
వారికి వీరికి కృష్ణుడె నెచ్చెలి బంధువుం డభిమానుడున్ 1.
పద్యము...ఉత్సాహ..(గణములు...7సూర్యగణములు 1గురువు..యతి..5వగణం మొదటి అక్షరం )
———
పంచపాండవు లన వీరు బరగిరి భువి భూవరా!
యెంచి చూడ ధర్మజుండు నీ నకులుఁడు భీముఁడున్
సంచితంబు లైన గుణులు సవ్యసాచి మఱియు నా
పంచముం డగు సహదేవ వర్యుఁడు గుణ వంతులే 2.
పద్యము...హరిహర..(గణములు...భ,జ,న.త. యతి 7వఅక్షరం)
——
కౌరవుల మాయ కతన జూదమ్ము
పారక జయమ్ము వడయ రాదయ్యె
నేరక జయించు నియమ సూత్రాలు
చేరిరి వనంబు సిరులు లేకుండ 3.
వ.నెం. 196. పద్యము..స్వాగతము .గణములు..ర,న.భ.గ.గ..యతి 7వఅక్షరం
——
స్వాగతం బిడుదు బాండుకుమారా!
యాగమంబునకు నాకృతి నీవే
మూగ జీవులము మోదము నీయన్
సాగ కుండగను జప్పున రావా 4.
వ.నెం. 07..పద్యము..అశ్వగతి..గణములు..భ,భ,భ,భ,భ,గ..యతి.10వఅక్షరం.
--
ధర్మజు డెన్నడు తప్పడు ధర్మము నాపదలన్
మర్మము నేర్వడు స్వచ్ఛపు మాటయె యాతనిదౌ
నర్మపు మాటలు సెప్పని నైజము నాతనిదే
కర్మమె సాక్షిగ దమ్ములఁ గాంచును బ్రేమగనే 5.
వ.నెం.199
పద్యము...హరిహయము..గణములు...న,స,న,భ,న,గ...యతి..10 వఅక్షరం.
--
వినయముగఁ గృష్ణుఁ డనె వెంగలి నృపతితో
ననునయపుఁ బల్కు వినుమా యిది మమతతో
వినిన గలుగున్ శుభము వేయి విధములుగా
ననుమతిని నీయు మిక నర్ధపుఁ బుడమినే 6.
వ.నెం.191.
పద్యము...సుగంధి...గణములు...ర,జ.ర,జ,ర....యతి 9వఅక్షరం
--
పాండు రాజ! రాజసూయ ప్రాంగణంబు నందునన్
మండు చుండు నగ్ని హోత్ర మధ్య యందు భక్తితో
నెండు రావి జువ్వి పుల్ల లిమ్ము గాను వేయుచో
మండి సిద్ధి నిచ్చు నీకు మర్మ మిద్దె భూవరా 7.
వ.నెం.04
పద్యము..అపరాజితము...గణములు...న,న,ర,స,వ. యతి..9వఅక్షరం
--
ద్రుపదుని సుత కృష్ణ తోయజ నేత్రయే
జపము దపము సేయ జన్మము గల్గెగా
నపజయ మన లేక యార్జన సేసె నా
ద్రుపద విభుడు వైరితో జగడంబునై 8.
వ.నెం. 05
పద్యము...అలసగతి...గణములు..
న,స,న,భ,య....యతి..10వ అక్షరం.
--
అట నడచు ద్రౌపదిని హర్షమునఁ జూడం
గటువుగ మదం బడరఁ గర్కశ నరుండై
యెటు దిశకుఁ కీచకుడు నింతి వెడలం దా
నటులె వడిఁ బోవు చెద నాశను వహించెన్ 9.
వ.నెం.12
పద్యము...ఇంద్రవంశము...గణములు...త,త,జ,ర. యతి 8వఅక్షరం.
--
ధామంబు జేరంగను ద్రౌపదిన్ సతిం
గామాంధుఁడే పిల్చెను గాటినిం గనన్
భీముండు తాఁ జంపెను భీకరంబుగా
నీమంబుతోఁ గీచకు నేర మెంచుచున్ 10.
పద్యము..ఇంద్రవజ్ర...గణములు...త,త,జ,గ,గ..యతి 8వఅక్షరం.
--
పంతంబు సాధించెను బాపి నీడ్చన్
సంతోషముం బొందెను సాగ నంప
న్నంతంబు నీచుండు జనాళి కింపై
సాంతంబు గైదండను సాగిలంగన్ 11.
వ.నెం. 08.
పద్యము...అశ్వలలిత...గణములు...న,జ,భ,జ,భ,జ,భ,వ. యతి..13 వఅక్షరం.
--
పనుపఁగ మాయ జూదమున నోడు వార లిక పోవు నట్టి పగిదిన్
వినయము దోపఁ బాండవులు హస్తి వీడి చని రెల్లఁ గాఱడవికిన్
దినుచును గందమూలములు ద్రాగి తీయ నగు కొండవాలు జలముల్
మనుగడ సాగఁ జేసి రట వారి మంచితన ముండ నార్యుడ!తగన్ 12.
వంనెం. 10
పద్యము...అసంబాధ...గణములు...మ,త.న.స,గ,గ. యతి..12 వఅక్షరం.
--
లోకారాధ్యుండా! నను గరుణను లోఁ గొమ్మా
యేకాంతం బందే కొలువఁగ గిరిజేశుండా
యా కామేశున్ ద్రౌపది యడిగిన దా గృష్ణున్
నా కీసాయం బిం డనుచు నిజ మనం బందున్ 13.
వ.నెం. 14..
పద్యము...ఇల....గణములు...స,జ.న,న,స....యతి..8వఅక్షరం.
--
విదురుండు వచ్చిన పెనుముదమున ననెన్
గదనంబు నెట్లగు కనికరము గలుగన్
విదురా!సరాసరి వివరముగ చెపుమా
వదరెన్ సరాగము వరలగను నపుడున్ 14.
వ.నెం. 17
పద్యము...ఉపస్ధితము...గణములు...త,జ,జ,గ,గ....యతి ..8వఅక్షరం.
-
దుర్యోధను డంతట తోషితుండై
కార్యాచరణంబును గర్ణు నాఙ్ఞం
గార్యోన్ముఖుఁ జేసెను గర్కశుండై
యార్యుండగు కృష్ణుని యంతుఁ జూడన్ 15.
వంనెం.19.
పద్యము....ఏకరూప....గణములు...మ,భ,జ,గ,గ....యతి..8 వఅక్షరం.
--
వీరాలాపంబు లన వేసరమ్ముల్
వీరుండౌ యుత్తరుని వేగ మంతన్
వీరుండౌ యర్జునుడు వింటిఁ గొమ్మం
చా రాపుత్రుం బిలిచె నాజి సేయన్ 16.
వ.నెం. 21.
పద్యము..కంఠీరవము....గణములు..న,య,స,గ,గ.. యతి..7వఅక్షరం.
—
రయముగ నా సారధివై యుండన్
భయ మిసుమంతం బడనో కృష్ణా
జయముల నందన్ జయశీలుండన్
బ్రియ నరు డేనే బిలువన్ రావా 17.
'వ.నెం. 22...పద్యము...కంద వృత్తము...గణములు...య-య-య-య-ల. యతి..8వఅక్షరం.
--
విశాలంపు దేశమ్ము పీయూష పానంపు
టశాంతంబు హీనంబు హ్రైంకార గానంపు
దిశాదివ్య రూపంపు దేదీప్య మానంపుఁ
బ్రశస్తంపు దేశమ్ము పాంచాల దేశమ్ము 18.
వ.నెం. 25. పద్యము...కనకలత.....గణములు...న,న,న,,న,న,న,స .. యతి..13వఅక్షరం.
--
ద్రుపదుని కొమరుడు చనియెను దొడరుచును నరునితో
రిపులను సమర తలమునఁ బరి పరి విధములుగఁ దో
రపు బలముల గణముల నిక రయమున దునిమెను గ్రూ
రపు జను లగు రిపుల తలలు రగిలిన వనలముతో. 19.
వ.నెం. 24. పద్యము...కందుక వృత్తము ...గణములు ...య,య,య,య,గ. యతి .8వఅక్షరం.
---
చిదానంద రూపుండు శ్రీకార మాద్యుండే
సదానందకారుండు సాకార దేహుండే
పదాంభోజయుక్తుండు పాలాభి షేకుండే
ముదాకార రూపుండు ముద్దౌను గృష్ణుండే 20.
No comments:
Post a Comment