వ.నెం. 198.
పద్యం. హరిణి.
గణములు.. న-స-మ-ర-స-వ.
యతి. 12వఅక్షరం.
---
పరిసరము శుభ్రంబై నిత్యమ్ము భాసిలుచుండుచో
సరి యగును, గాదేనిన్ రోగాలు సంభవ మౌనుగా
సరిగమలతోఁ బాటల్బాడంగ శక్తిని వాడకే
పరిసరముఁ జక్కం జేయుం డింక బల్వురు నేకమై 1.
వ.నెం. 194.
పద్యం. సురభూజరాజము
గణములు.. న-భ-ర-న-న-న-ర
యతి. 12వఅక్షరం.
--
చదలు వోలెను జక్కగాఁ బరి సరములను బరిశుభ్రమౌ
విధము జేసిన, మంచి సంపద వివిధ విధములఁ బొందనౌ
చెదలు పట్టవు పాము చేరదు సిరులు గురియును దప్పకన్
బదము నిల్పును లక్ష్మి యచ్చటఁ బ్రబలిన ముదము తోడుతన్ 2.
వ.నెం. 161.
పద్యము...వరలక్ష్మి..
గణములు. త-భ-భ-భ-య.
యతి..8వఅక్షరం
-
మారాము జేయక యో మనుజుండ!యిక రమ్మా
బీరమ్ము లాడక యీ విరి మొక్క క్రిమి కోటుల్
నీఱైనఁ గాల్చినచో నెఱులౌఁ బరిసరాలే
రారమ్ము వేగముగా రమణా!యిక శుభంబౌ
3.
వ.నెం. 81.
పద్యం. పంక్తి.
గణములు...భ-భ-భ-గ.
యతి. 7వఅక్షరం.
--
కాలువ లందును గల్మషముల్
హేలగ వేయుట హీనము సూ
మూలను మూలన మూత్రములు
చా లిక మందును జల్లుమురో 4.
వ.నెం. 80.
-పద్యం. ..నిశ.
గణములు... న-న-ర-ర-ర-ర
యతి. 9వఅక్షరం.
--
పరిసరములు సూడ బాగుండుచో రోగమే రాదుగా
నరి గణముల రాక హర్షమ్ము బోఁద్రోచి చీకాకులన్
బఱచిన, మనయింటి ప్రాంతాలు చక్కంగ ,శుభ్రమ్ముగా
వరలు నటులఁ జేయు వైరమ్ము చాలించి పౌరుండుగా 5.
వ.నెం... 65. .
పద్యం. తరళము.
గణములు...7నగణములు,1గురువు.
యతి.. 13వఅక్షరం.
---
మలినములను గృహము దరిని మరుగు బఱుచు నెడల, చీ
మల ,పురుగుల, క్రిముల భవ మమరినఁ బుడమి రుజములే
గలుగుఁ గనుక మలినములను గనులకుఁ గనఁబడని చో
టులను గనుగొని యచటనె కటువుగ బుడమిని నిడుమా
6.
వ.నెం. 66
పద్యం...తలుపులమ్మ
గణములు.. భ త త భ న ర గ.
యతి. 10వఅక్షరం.
-
చెత్త చెదారమ్ము నేరించి చీడ పురుగులఁ జంపుమా యో
యత్త కుమారుండ! వేగమ్ము నగ్ని రగిలిచి కాల్చుమా యా
చెత్తలు లేకుండ యుండంగఁ జేటును గలుగకుండ నుంచున్
మత్తును గల్గించు నా మాయ మద్యముల నిక ద్రాగకుండీ 7.
వ.నెం. 58.
పద్యం. జలదము.
గణములు.. భ ర న భ గ.
యతి. 10వఅక్షరం.
--
గొట్టపు బావి చుట్టు గల క్రుళ్ళును,బోఁ
గొట్టగ,శుభ్ర మైన తఱి గోతులలోఁ
జట్టున కీటకంబులకుఁ జల్లినచో
మట్టొనరింప మందు నట మంచి యగున్ 8.
వ.నెం..116
పద్యం...మందాక్రాంత...
గణములు...మ-భ-న-త-త-గ-గ.
యతి...11వఅక్షరం.
--
స్వచ్ఛందంబై పరిసరములన్ బాగు చేయంగ నొప్పౌ
యిచ్ఛన్ జేయంగ బ్రతి మనుజుం డిష్టమౌ రీతి గానే
స్వచ్ఛంబౌ భారత మనుట యే సార్ధకం బట్లు చేయం
జిచ్ఛక్తిన్ హర్షము లొలుకగా సేవలో మున్గ నొప్పౌ 9.
వ.నెం. 176
పద్యము... శివశంకర
గణములు. స-న-జ-న-భ-స.
యతి. 11వఅక్షరం
--
శివ! శంకర! భవ! నా కిటఁ జినచూపును నిడకే
దివ మంతట పరిశుభ్రము తిరమౌ నటు లగుఁ గా
నవసానము వరకున్ దగు నరుసం బగు బలమున్
జవమున్ సహనము శక్తినిఁ జవులూరఁగ నిడుమా 10.
No comments:
Post a Comment