పాలూరి వంశ కన్యక !
గా లము మఱి వేసి తీవు గడుసరి దానౌ
గేలములో చిక్కెను యీ
కాలపు సరి యైన నతడు కాంతా !నీకున్
వధువు పుట్టెను పాలూరి వారి యింట
వరుడు యద్దనపూ డిని వారి యింట
జూడ చక్కని జంటయై చూపరులకు
సంత సంబును గలిగించు సంతతమును
సౌమ్య !వినుమిది యొక మాట సౌమ్య ముగను
భర్త యెడ లన నీవుగా వలపు గలిగి
చిలుక గోరింక వోలెను జలము బాలు
విధము కలసి మెలసి యుండు వేయి యేళ్ళు
అమ్మ నాన్నల విడిచియు నరుగు దేర
బెంగ యుండును నిజముగ బేల !నీకు
అత్తలోనన జూడుమా యమ్మ నికను
కుదుట పడునమ్మ మనసు నీ ,కొంత వరకు
కంటి కింపగు కళ్యాణ మంటపమున
హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి
శుభ సుఖంబుల జీవన శోభ నంద
దీవెనల నీయ మీ జంట దీప్తినందు.
కలకాలము మీ రిద్దరు
కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులుగా కష్టం
బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.
ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.
సరిలేని శుభ సుఖంబుల
సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు
స్థిర దాంపత్యముతో మీ
రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్
సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల చల్ల గాను
రచన ; పోచిరాజు సుబ్బారావు
వెనువెంటనె శాప మీయ వెనుకాడరుగా
మనసంతయు రాజగుటను
కనలేకను మునియు రాక కలిగెను శాపమ్
ముని =దూర్వాసుడు
మనసంతా రాజు =శకుంతలకు
రాజు =దుష్యంతుడు