లేవు లేవమ్మ !యిక మాకు లేవు నీవు
ఎచట కేగితి వోయమ్మ! యిచట నుండి
వత్తు వెప్పుడు మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు చూతుము నీ కోస మిచ్ఛ తోడ .
కాన రానట్టి దూ రంబు గడచి నావు
కాను పించుమ యొక సారి ,కాంచి నిన్ను
సేద దేరుదు మో యమ్మ !చింత నుండి
రమ్ము వేవేగ మొక సారి రమ్ము మరిని
ఎచట కేగితి వోయమ్మ! యిచట నుండి
వత్తు వెప్పుడు మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు చూతుము నీ కోస మిచ్ఛ తోడ .
కాన రానట్టి దూ రంబు గడచి నావు
కాను పించుమ యొక సారి ,కాంచి నిన్ను
సేద దేరుదు మో యమ్మ !చింత నుండి
రమ్ము వేవేగ మొక సారి రమ్ము మరిని
మాయ మర్మము లెరుగని మనిషి వీ వ !
మత్స రంబును నీ కిసుమంత లేదు
సాటి మనుజుని మనిషి గా సాకి నావు
సాటి యెవరమ్మ ! నీ కిల సాటి యెవరు ?
పిలుతు వెప్పుడు మమ్ముల బ్రీతి తోడ
పలుక రింపులే కరువాయె భామ !యికను
చివరి సారిగ జూచుటే చివరి చూపు
ఎం త దురదృష్ట వంతుడ నిలను నేను
ఏమి నేరము జేసితి మింత లోన
మమ్ము లవిడిచి పోతివి ? రమ్ము వేగ
నేను వత్తును నీతోడ నెమ్మనమున
పలుకు చుంటిని నిజమునే నమ్మునన్ను
అమర లోకంబు జేరితి వమ్మ ! నీ వు
అమరు లందఱు నిను జూచి యాద రించ
మసలు గొనుమమ్మ ! యక్కడ మాన్యు రీ తి
వంద నంబులు నీకివె వంద లాది
నీ తో గడిపిన రోజులు
చేతో మోదంబు గలిగె చిన్మయ రూ పా !
మాతో బలికిన బలుకులు
నెంతో విలువైన వమ్మ ! యెంచగ నిపుడున్ .
సకల శుభములు గలిగించు శంక రుండు
మరల జన్మంబు లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ ననుమ తించి
యొసగు శాంతిని నాత్మకు నొప్పు గాను
మీ రు లేనట్టి లోటును మేము దీ ర్చ
లేము , భార మంతయు నిక నా మురహరి
చూచు కొను నమ్మ ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమమ్మ ! శ్రద్ధాంజ లందు కొనుము
---------------------
అశ్రు పూర్వక నయనాలతో .........
కోటేశ్వరరావు మఱియు కుటుంబ సభ్యులు
No comments:
Post a Comment