లేవు లేవాయె యికమాకు లేవునీ వు
ఎచట కేగితి వన్నయ్య ! యిచట నుండి
యెదురు చూతుము మీరాక యెపుడ నుచును
మమ్ము కరుణించి రావయ్య మా ద రికిని .
ఎప్పుడు నెక్కడ కలిసిన
నప్పా !మఱి బాగె నీ వ ? యందరు కూడ
న్నెప్పుడు వచ్చితి విచటకు
చొప్పున నను నడుగు చుండు సుఖముల నెపుడున్
పట్టు దలను దోడ పట్టభద్రుడ వయై
యొజ్జ లందు మేటి యొజ్జ గాను
పేరు గాంచి తీవ ప్రేమాదరమ్ముల
నిన్ను మించు నతడు మన్ను లేడు
ఏమి పాపము జేసితి మేము సామి !
దయను విడనాడి పోయిరి ధర్మ మౌనె ?
నెదురు చూసియు చూసియు నిపుడు నాదు
కళ్ళు జూడుము కాయలు కాచె సామి !
బంధు ప్రీతిని గలిగిన బాం ధ వుండ !
స్నేహ సంపద నొందిన చెలియ కాడ !
పుడమిని నివర్త వంశపు బుధుడ వీ వ !
కల్ల కాదిది నిజమునే బలుకు చుంటి
మాయ మర్మము లెరుగని మనిషి వీవు !
మత్సరంబును నీ కిసుమంత లేదు
సాటి మనుజుని మనిషిగా సాకి నావు
సాటి యెవరయ్య నీకిల సాటి యెవరు ?
మరణ కాలంబు దెలిసెనా ! మాత కృపను
నమ్మ పోషణ కూతుళ్ళ కప్ప గించి
వప్ప గింతలు సేసితి వొప్పు గాను
నందు కొనుమయ్య ,సాదర వందనాలు
కాన రానట్టి దూ రంబు గడచి నావు
కాను పించుమ యొకసారి ,కాంచి నిన్ను
సేద దేరుదుమో సామి !చింత నుండి
రమ్ము సోదర !ర యముగ నిమ్ము గాను
మీరు లేనట్టి లోటును మేము దీ ర్చ
లేము భారమంతయు నిక నా మురహరి
చూచు కొను నార్య !నిజమిది ,లేచి యికను
నందు కొనుమయ్య శ్రద్ధాంజ లందుకొ నుము
నీ దు పయనము దెలిసిన నీకు గలుగు
వేల కొలదిగ శిష్యులు వెంట బడుచు
సాగ నంపిరి మిమ్ముల సాదరముగ
నాహ ! జోహార్లు మాయవి యందు కొనుము
సకల శుభములు గలిగించు శంక రుండు
మరల జన్మంబు లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ ననుమ తించి
నీదు జన్మకు శాంతిని నెగడు గాక !
(ది . 7-8=2014 తేదీన శ్రీ అన్నగారైన రవీంద్ర నాధ శర్మ గారు
పరమ పదించిన సంద ర్భముగా అశ్రు పూరిత నయనాల తో .......... )
రచన : పోచిరాజు సుబ్బారావు
ఎచట కేగితి వన్నయ్య ! యిచట నుండి
యెదురు చూతుము మీరాక యెపుడ నుచును
మమ్ము కరుణించి రావయ్య మా ద రికిని .
ఎప్పుడు నెక్కడ కలిసిన
నప్పా !మఱి బాగె నీ వ ? యందరు కూడ
న్నెప్పుడు వచ్చితి విచటకు
చొప్పున నను నడుగు చుండు సుఖముల నెపుడున్
పట్టు దలను దోడ పట్టభద్రుడ వయై
యొజ్జ లందు మేటి యొజ్జ గాను
పేరు గాంచి తీవ ప్రేమాదరమ్ముల
నిన్ను మించు నతడు మన్ను లేడు
ఏమి పాపము జేసితి మేము సామి !
దయను విడనాడి పోయిరి ధర్మ మౌనె ?
నెదురు చూసియు చూసియు నిపుడు నాదు
కళ్ళు జూడుము కాయలు కాచె సామి !
బంధు ప్రీతిని గలిగిన బాం ధ వుండ !
స్నేహ సంపద నొందిన చెలియ కాడ !
పుడమిని నివర్త వంశపు బుధుడ వీ వ !
కల్ల కాదిది నిజమునే బలుకు చుంటి
మాయ మర్మము లెరుగని మనిషి వీవు !
మత్సరంబును నీ కిసుమంత లేదు
సాటి మనుజుని మనిషిగా సాకి నావు
సాటి యెవరయ్య నీకిల సాటి యెవరు ?
మరణ కాలంబు దెలిసెనా ! మాత కృపను
నమ్మ పోషణ కూతుళ్ళ కప్ప గించి
వప్ప గింతలు సేసితి వొప్పు గాను
నందు కొనుమయ్య ,సాదర వందనాలు
కాన రానట్టి దూ రంబు గడచి నావు
కాను పించుమ యొకసారి ,కాంచి నిన్ను
సేద దేరుదుమో సామి !చింత నుండి
రమ్ము సోదర !ర యముగ నిమ్ము గాను
మీరు లేనట్టి లోటును మేము దీ ర్చ
లేము భారమంతయు నిక నా మురహరి
చూచు కొను నార్య !నిజమిది ,లేచి యికను
నందు కొనుమయ్య శ్రద్ధాంజ లందుకొ నుము
నీ దు పయనము దెలిసిన నీకు గలుగు
వేల కొలదిగ శిష్యులు వెంట బడుచు
సాగ నంపిరి మిమ్ముల సాదరముగ
నాహ ! జోహార్లు మాయవి యందు కొనుము
సకల శుభములు గలిగించు శంక రుండు
మరల జన్మంబు లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ ననుమ తించి
నీదు జన్మకు శాంతిని నెగడు గాక !
(ది . 7-8=2014 తేదీన శ్రీ అన్నగారైన రవీంద్ర నాధ శర్మ గారు
పరమ పదించిన సంద ర్భముగా అశ్రు పూరిత నయనాల తో .......... )
రచన : పోచిరాజు సుబ్బారావు
No comments:
Post a Comment