Wednesday, January 14, 2015

శ్రద్ధాంజలి -రామలక్ష్మి

లేవు లేవమ్మ!యి కమాకు లేవు నీవ
యె  చటి  కేగితి? వోయమ్మ !యి పుడు నీవు?
కళ్ళు మాయవి కాయలు కాచె సుమ్ము
రమ్ము వేవేగ మమ్ముల రక్ష సేయ .

 చిన్న దనమున మమ్ముల చేర దీ సి
చదువు సంధ్యలు నెరపియు సాకి నావు
తల్లి  వైనను  నీవెగా దండ్రివైన
మఱు వ జాలము నిన్నమ్మ ! మఱు వ లేము

 జ్ఞాప కంబులు మాకవి జ్ఞప్తి కొచ్చి
ఉన్న లేకున్న నున్నట్టు లుండె మాకు
అమ్మ ! చూతుము నొకపరి యమ్మ  రమ్ము
 మునుపు వోలెను నీ రాక ముదము మాకు .

ఎవరు వచ్చిన విసుగక నెందు కనక
కడుపు నిండుగ పెట్టుట కలదు నీ కు
నాన్న కూడను నిందుకై నమ్మి నిన్ను 
నుత్స హించును గదమ్మ !నుత్సు కతన

 అమ్మ ప్రేమను బంచిన యమ్మ వీ వు
మఱు వ జాలము మఱి మేము మరువ వ మ్మ !
జలుబు కారణ మయ్యెనా శ్వాస యాగ ?
దైవ నిర్ణయ మీ యది దరమె దాట ?

 ఆశ లేదమ్మ ! నీ కిల యాశ లేదు
ఉన్న దానితో  సంతృప్తి నొంది తీవు
సాటి రారమ్మ యె వరును సాటి రారు
అందు కోవమ్మ జోహార్ల నందు కొనుము .

 అమ్మ !  తాతయ్య బాబయ్య మామ కూడ
వెళ్లి పోయిరి మమ్ముల విడిచి నిచట
నీవు కూడను వారికి నేస్త మైతి
దిక్కు లేనట్టి మాకిక దిక్కు డా డి

మామ తాతయ్య బాబయ్య మరణములకు
కోలు కో లేక  ననిశము   కుములు చుండె
నచట యమ్మమ్మ , నీ మృత్యు వకట యెంత
దారు ణం బును గలుగంగ  దారి తీయు ?

గోరు ముద్దలు దినిపించి గోము గాను
నలుపు సలుపులు లేకుండ ననున యించి
కంటి కిని రె ప్ప  యట్లయి కనుచు మమ్ము
పెంచి పెద్దచే  సితివమ్మ ! మంచి గాను


 అమర లోకము జేరితి వమ్మ నీవు
అమరు లందఱు నినుజూచి యాద రించ
మసలు కొనుమమ్మ యక్కడ మాన్యు రీ తి
నా దు కొనగను  నమరులు , హాయి గుండు .

 చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు
జన్మ లేకుండ జేయగ  సమ్మతించి
సకల శుభములు గలిగించు శంక రుండు
నీదు నాత్మకు శాంతిని నించు గాక !

( ది . 13-1-2015 తేదీన పరమ పదించిన  మా అమ్మ గారికి
అశ్రు పూర్వక నయనాలతో ...... రాజా , బిందు ,సౌజన్య మఱి యు
కుటుంబ సభ్యులు )

రచన = పోచిరాజు సుబ్బారావు



No comments:

Post a Comment