Thursday, January 15, 2015

ఓ మానవుడా !

ఎపుడు పోవునో  యీ ప్రాణ  మెవరి కెఱు క ?
ప్రాణ ముండంగ జేయుచు బరుల కీవి
బ్రదుకు నన్నాళ్ళు  దృ ప్తిగ  బ్రదుకు డ య్య !
దాని వలనన గలుగును దైవ  యయువు

 మమకారమ్మును  వదులుము
మమకారము కలిగి యుండ మఱి మఱి జన్మ
ల్లమరుచు నే యుండును
మమకారము మించు జబ్బు మహినిన్గల దే ?

నొప్పించకు మదినెవరిది
నొప్పించిన దిరిగి నీవు నొవ్వగ వలయున్
నొప్పించుట కును  బదులుగ
నెప్పుడు సంతసము జేయు నెవరికి నైనన్

మౌనము భూషణ మెయ్యెడ
మౌనము మఱి యాయుధమ్ము మైత్రికి నెపుడున్
మౌనము కాదస మర్ధత
మౌనులకు న్మహిమ గలిగె మౌనమె చేతన్

కండ్లుండెను గాననుచును
గండ్లను నిక బెద్ద జేసి కనకుమ యన్ని
న్గం  డ్లకు గనబడు న  న్నియు
కం డ్లె దుటనె మాయమగును గనుమీ నిజమున్


 

No comments:

Post a Comment