Tuesday, January 13, 2015

పద్య రచన -గంగిరెద్దు

గంగి రెద్దును జక్కగ రంగు రంగు
వస్త్ర ములతోడ  ముస్తాబు బఱచి మిగుల
గంగి రెద్దుల వారలు గడప గడప
కుమఱి  వెళ్లి య  డుగుకొందు రు, మహ  రాజ !
యీయ గోరుదు  వస్త్రము ల్  యీ ధవ ళకు

 రాసి రాసి తిరిగి రవి వచ్చె నేడెగా
భోగి తెచ్చె మరల భోగములనె
యుత్తరాయణమున నుప్పొంగి సంక్రాంతి
కన బసవడు వచ్చె కనుమ నిపుడు.

రంగగు వస్త్ర సంచయము రమ్యముగా ధరియించి మేనిపై
ఖంగున మ్రోయ గంటలును కమ్మగ శబ్దము జేయు మువ్వలున్
హంగుగ పాడ వంత తను హాయిగ నాడును తెన్గు లోగిటన్
ముంగిట గంగిరెద్దు గన ముచ్చట లేరికి నైన పల్లెలన్.



No comments:

Post a Comment