Sunday, January 25, 2015

పద్య రచన -సైనిక వందనము

వంద నంబులు సేయగ వంద లాది
సేన యంతయు నచ్చట శ్వేత ప్రభున
కుమఱి  సంతస మాయెను కుసుమ  ! నాకు
నెంత  ముచ్చట  వేసెనో ,  వింత జూడ



జనగణ తంత్ర దేశముగ చక్కగ మారిన భారతావనిన్
జనవరి యిర్వదా రనిన సైనిక పాటవమున్ గ్రహించగా
మన కొక గొప్ప వేడ్క గద మాన్య సిపాయి లవక్ర విక్రమ-
మ్మును చవి జూపి శత్రువుల మూల్గును పీల్చెడి సాధనమ్ములన్
గని మురియంగ మేన పులకాంకురముల్ జనియించు సోదరా!
.
సర్వ సత్తాక లౌకిక సామ్యవాద
దేశ మందున గణతంత్ర దినము నేడు
రాజధాని ఢిల్లీ లోని రాజపధము
నందు జరగు చుండె నానందముగను

No comments:

Post a Comment