Friday, October 16, 2015

పద్యరచన- అంశము... “సూర్యోదయ వర్ణనము” ఛందము - సీసము.

కావుకా వుమనుచు కాకుల రవములు
              వినబడం  గమరిని  వీనులకును
ప్రాగ్ది శా  భాగాన భానుండు   రధముపై
              బయలుదే రంగను  బ్రభలు వెలుగ
వేకువ జామున వేలకొ  లందిగ
                  నడకకై మార్గాన  నడచు చుండ
చీకట్లు మాయమై చిరువెలుం  గులుదోప
                  పుడమితల్లి యపుడు  పులక రించ
యంధ  కారము  మాయమై యచట యచట
కాంతి వెలుగుల తోడన  కానుపించ
తెల్ల వారెను జూ డుడు మెల్ల మెలగ
శంక రార్యుడ ! వందన మింక మీకు 

No comments:

Post a Comment