Friday, October 16, 2015

ష ష్టి పూర్తి(కృష్ణయ్య గారు )

పుసులూరి వంశ  మండన !
పసగల మొనగాడ  వార్య ! పావన కృష్ణా !
మిసమిస లాడుచు నుంటివి
యరుదెంచెనె? నరువది మఱి యపుడే నీకున్ .

నిన్నుజూడగ లేవయ్య నిజము గాను
వత్స రంబులు నరువది వచ్చి నటుల
కాన బడుచుంటి  విప్పుడు కన్ను లకును
పడుచు కుర్రాడు నుండెడు పగిది నీవు

ఇటులె కాపాడు కొనుమయ్య ! యీ స్థి  తినిక
జన్మ యున్నంత వరకును ,సైయ నంగ
పిన్న పెద్దలు చెలికాండ్రు పేర్మి తోడ
నయ్య ! కృష్ణయ్య! జనములు హాయనంగ.


తనర హనుమాయి నీకిల  దగిన  భార్య
యగుచు  కంటికినే  రె ప్ప  యైన విధము
ఎల్ల  వేళల మీ బాగు నినుమ డించ
శ్రధ్ధ జూపును నిజమిది సజ్జ నుండ !


నీ దు  మాటయే ప్రజలకు వేద వాక్కు
నిన్ను నమ్మిన వారికి నీడ నిచ్చి
యాదు కొంటివి   నిక్కము  సాదరముగ i
సాటి యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?


వయసు దాటుట తప్పదు   ప్రతి యొకరికి
చింత గూడదు దానికై  సుంత యైన
చీకు   చింతలు  లేకుండ  శేష జీవి
తంబు సాగించు   కృష్ణయ్య ! తనర   యీవు


ష ష్టి పూర్తిని  నీ  రోజు జరుపు కొనగ
చింత నొందక మఱి నీవు  శివుని మదిని
స్మరణ జేయుచు గడుపుము జరము దనుక
ముక్తి  గలుగును దప్పక  ముదము గలుగ

సకల శుభ ములు గలిగించు శంకరుండు
ఆయు రా రోగ్య  సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .

( ది  5-11-2015 తేదీ న   కృ ష్ణయ్య గారి ష ష్టి పూర్తి  సందర్భము గా }

రచన ; పోచి రాజు   సుబ్బారావు

No comments:

Post a Comment