Thursday, August 6, 2015

జగన్నాధ శాస్త్రీ జీ

సకల శాస్త్రాలు సదివిన శాస్త్రి వర్య !
జగము నంతను నెరిగిన జగను సామి 
వేద సారము దెలిసిన వేద విదుడ !
యందు కొనుమయ్య ! దండాల నందు కొనుము 

యజ్ఞ యాగాదు లెన్నియో విజ్ఞత నన 
నియమ నిష్ఠ ల తోడన  నిర్వ హించ
సోమ యాజిని జేసిరి సుజన గణము 
సాటి యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?

కంచు  కంఠము  నీయది కమ్మ గుండు 
యాగ  మధ్యన మంత్రాల  నర్ధములను 
విశద పఱతువు మాకయ్య విపులముగను 
సంత సించితి రెల్లరు  సంతు తోడ 

సకల శుభములు గలిగించు శంక రుండు 
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి 
కంటికిని  రెప్ప యట్లయి  కాచు గాత !
యెల్ల వేళల మిమ్ముల జల్ల గాను 



No comments:

Post a Comment