బొట్టు ముఖ్యము హైందవ పొలతి కెపుడు
మంగళ ప్రదము మఱియు మాన నీయ
మిలను సౌభాగ్య మిచ్చును నెంత గానొ
పెట్టు కొనుడమ్మలార! యీ బొట్టు నెపుడు
బొట్టు లేనిచో నర్హత పుట్ట దెచట
శకున ములకుగా ని,శుభము జరుగు చోట్ల
కేగ ,బిడియమ్ము బొందుదు రెపుడు మీరు
పెట్టు కొనుడమ్మ లార ! యీ బొట్టు నెపుడు
అంద మిచ్చును ముఖమున కందఱి కిని
బొట్టు కలిగిన ముఖమున బొమ్మ వ్రాయు
మంచి జీవన మొందుత ! మంది లోన
పెట్టు కొనుడ మ్మ లార! యీ బొట్టు నెపుడు
బొట్టు పెట్టెడు వారికి పుడమి యందు
పెరుగు నాయువు , శుభములు పేర్మి తోడ
బొట్టు లేనిచో విధవతో బోల్చు దు ర ట
పెట్టు కొనుడ మ్మలా ర ! యీ బొట్టు నెపుడు
ఆడ వారునే గాకుండ నరయ గాను
పురుష పుంగవు లనబడు నరులు కూడ
పెట్టు కొనిననీ బొట్టును బిట్టు గాను
గలుగు శుభములు శంకరు గరుణ వలన
మంగళ ప్రదము మఱియు మాన నీయ
మిలను సౌభాగ్య మిచ్చును నెంత గానొ
పెట్టు కొనుడమ్మలార! యీ బొట్టు నెపుడు
బొట్టు లేనిచో నర్హత పుట్ట దెచట
శకున ములకుగా ని,శుభము జరుగు చోట్ల
కేగ ,బిడియమ్ము బొందుదు రెపుడు మీరు
పెట్టు కొనుడమ్మ లార ! యీ బొట్టు నెపుడు
అంద మిచ్చును ముఖమున కందఱి కిని
బొట్టు కలిగిన ముఖమున బొమ్మ వ్రాయు
మంచి జీవన మొందుత ! మంది లోన
పెట్టు కొనుడ మ్మ లార! యీ బొట్టు నెపుడు
బొట్టు పెట్టెడు వారికి పుడమి యందు
పెరుగు నాయువు , శుభములు పేర్మి తోడ
బొట్టు లేనిచో విధవతో బోల్చు దు ర ట
పెట్టు కొనుడ మ్మలా ర ! యీ బొట్టు నెపుడు
ఆడ వారునే గాకుండ నరయ గాను
పురుష పుంగవు లనబడు నరులు కూడ
పెట్టు కొనిననీ బొట్టును బిట్టు గాను
గలుగు శుభములు శంకరు గరుణ వలన
No comments:
Post a Comment