Tuesday, August 31, 2021

ఖర పాదార్చనజేసి పుత్రునిన్ గనె గంజాక్షి మోదమ్మునన్

 కరమున్ మానసమందునన్ నిలిపి యాకాశీవిభున్ చంద్రశే

ఖర పాదార్చనజేసి పుత్రునిన్ గనె గంజాక్షి మోదమ్మునన్

నరయంగా నదియేకదా శివుని మాహాత్మ్యంబులోకంబునన్

భరణీ!నేర్వుమ యీశ్వరార్చనకు సాఫల్యంబు ముమ్మాటికిన్

ఖర పాదము గొల్చిగాంతగనె సత్పుత్రున్

 అరమరిక లేకయుండగ

నిరతము దాసేవజేయ నిర్మలబుద్ధిన్

గరముం భక్తిని శశిశే

ఖర పాదము గొల్చిగాంతగనె సత్పుత్రున్

Monday, August 30, 2021

చావొసగున్ విశేష సుఖసంచయమన్నది వాస్తవమ్మగున్

చావొసగున్ విశేష సుఖసంచయమన్నది వాస్తవమ్మగున్
మీవచనంబులన్ వినగ మీరని సంతస మయ్యెనెంతయో
జీవము గల్గీయున్నయెడ జీవితమంతయు దుఃఖమొందుచున్
పావని! యుండనోపుగద బాములనోర్చుచు నిజ్జగంబునన్

చావొసగు సమస్త సౌఖ్యములను

బ్రతికియుండ కలుగు బాధలు విరివిగ
పుత్రమిత్రభార్య పోరు వలన
నేది దేని నొసగు నిజ్జగ మునయన
చావొసగు సమస్త సౌఖ్యములను

Sunday, August 29, 2021

పెనిమిటికేకదా ప్రసవవేదన గల్లును మిక్కుటంబుగన్

వినుము కుటుంబపోషణయు బెద్దలరక్షణ భార్యకోరికల్
పెనిమిటికేకదా ప్రసవవేదన గల్లును మిక్కుటంబుగన్
దినకర! వీరికోరికలు దీర్టగ నెంతయొ భారమైనయున్
బనిగొని చేయుచుండుచును బంధులమన్నన లందుకొమ్ముమా

పెనిమిటికేకలుగు,బ్రసవవేదన గడిదిన్

వినుముర కుటుంబ బాధలు
పెనిమిటికేకలుగు,బ్రసవవేదన గడిదిన్
గనగను భరించ రానిది
వనితలకున్ మరల జన్మ భరణిని సుమ్మీ

Saturday, August 28, 2021

కారము గాంచినంతనె వికారము గాంతురు మౌనిపుంగవుల్

చూరగొనంగ మానసము చోద్యము నాకపుభామరంభయా

కారము గాంచినంతనె వికారము గాంతురు మౌనిపుంగవుల్

పారము నొందియున్ మునులు భ్రష్టులు నౌటకు కామవాంఛయే

కారణమౌట జూడ,విను గామముజేయును తొత్తువానిగా

కారముగని పొందెదరు వికారము మౌనుల్

 కారము లందుగననహం

కారము బెనుకీడుజేయు కవివర, వినుడీ

పారంగతులయి దురహం

కారముగని పొందెదరు వికారము మౌనుల్

Thursday, August 26, 2021

మంగలవాడెభర్తయగు మానుము దుఃఖమికన్ దలోదరీ!

 అంగన,నాదుమాటవిను మందముబాటుగ మోక్షమందుకా

మంగలవాడెభర్తయగు మానుము దుఃఖమికన్ దలోదరీ!

చెంగటజేరి యాహరికి సేవనుజేయగ నెల్లవేళలన్

భంగముకాదు నీకదియ భావినిమేలును గూర్చుదప్పకన్

మంగలవాడే పతియగు మానుము దిగులున్

 మంగా!వినుమిది తిరునా

మంగలవాడే పతియగు మానుము దిగులున్

బెంగను వదులుమ యికనీ

చెంగటనేయుండునిజము శ్రీకరుడెపుడున్

Wednesday, August 25, 2021

నత్తరయంబునన్దిరిగెనాలుగుగ్రామములొక్కజామునన్

 అత్తిలి,కొత్తపేట,తడ యాదగిరిన్వడి నేగినాదుమే

నత్తరయంబునన్దిరిగెనాలుగుగ్రామములొక్కజామునన్

సత్తెపుకాలపున్,మనిషి ఛాందసమెక్కువయౌటచే దమిన్

సత్తువలేకపోయినను శక్తిని గూర్చుకు తిర్గుచుండునే

నత్త! తిరిగి వచ్చె నాలుగూళ్ళు

 బారసాల యనుచు పయనమై నాదుమే

నత్త! తిరిగి వచ్చె నాలుగూళ్ళు

కాలునిడవ కుండు కారణంబుననామె

తిరుగుచుండు నూళ్ళు ధీరయగుచు

జూడగనేగు సిగ్గుపడిచూడదు చూడకయుండ లేననున్

 వేడుక మీరగా గిరిజ భీముని మానసమందునన్ గనన్

జూడగనేగు సిగ్గుపడిచూడదు చూడకయుండ లేననున్

వీడగరాని ప్రేమయది వేవురు చెప్పిన లేదులాభముల్

వాడిగ కంతుబాణముల భారము సోకిన నంతియేకదా

చూడనేగును సిగ్గిలి చూడదయ్యె

 రాముచేతిలో ధనువది రమ్యముగను

ఫెళ్ళు మనుచును విఱుగగ బ్రీతితోడ

చూడనేగును సిగ్గిలి చూడదయ్యె

సరసి యగు సీత చెలికత్తె సన్నుతించ

Monday, August 23, 2021

వికృత రూపముల్ గలవారు ,విధుడు మరుడు

 రాహుకేతువు లిరువురు రహినిజూడ

వికృత రూపముల్ గలవారు ,విధుడు మరుడు

వారి వారల వృత్తుల నారితేరి

జగము నందున బ్రఖ్యాతులగుట వినమె?

Sunday, August 22, 2021

ప్రార్ధన

చిరకాలమ్ము సనాతనార్ష గుణ సంశ్లేషైక సన్మానసుం 
బర మార్థాతత శోధనార్థ పరితప్తస్వాంత సంచారినిన్ 
గురు సేవానుగ తాఖిలాంచిత మహా గుప్తార్థ విజ్ఞానినిన్
దరహాసాస్య విరాజమాన జనకున్ ధాతాభునిం దల్చెదన్ 

by kameswararao

 

 



పరువును దీయువారలె శుభంబునుగూర్చు హితుల్ సుబాంధవుల్

దురితము లెన్నియోసతముదోర్బల మొప్పగ జేయువారిదౌ
పరువును దీయువారలె శుభంబునుగూర్చు హితుల్ సుబాంధవుల్
కరమును మేలుజేయుట సుకర్మమునౌనను భావనంబుతో
పరులను హింసజేయుటయు బర్వును దీయుట మేలుగాదుగా

పరువు దీయువారె బంధు హితులు

 సాధు జనులనెపుడు సంతోషబఱచగ

దురిత కర్మ జేయు దుష్టజనుల

పరువు దీయువారె బంధు హితులు

సాధురక్షణంబె జగతి కోరు

Saturday, August 21, 2021

స-హో-ద-రి యతిగ

 సంతసంబున రాఖీని సాదరముగ

నుర్వినిజరుపు కొనగమ హోత్సవముగ

దనదు పుట్టింట యుండెడు తమ్ముదరికి

ప్రియము తోడను వచ్చిము రిసెనుసహజ

Friday, August 20, 2021

పుళ్ళకునుప్పుకారములబూతగ నద్దిన మేలుగల్గెడిన్

 గుళ్ళకు గోపురంబులవి కూర్మిని భక్తిని నిచ్చునట్లుగా

వ్రేళ్ళకు నుంగరంబులను బ్రీతిగ దొడ్గిన నందమౌవలెన్

కాళ్ళకు చెప్పులున్ మఱియు కళ్ళకు కాటుకవోలె,బెండవే

పుళ్ళకునుప్పుకారములబూతగ నద్దిన మేలుగల్గెడిన్

పుళ్ళకు కారమ్మె మేలు పూతగ నద్దన్

 కాళ్ళకు చెప్పులె యందము

కళ్ళకునిక యందమౌను కాటుక యెపుడున్

నోళ్ళకు రుచినిచ్చెడు వే

పుళ్ళకు కారమ్మె మేలు పూతగ నద్దన్

Thursday, August 19, 2021

ధర్మజుడాంజనేయునకు దండ్రి సుయోధను మేనమామయున్

ధర్మజు గూరిచిన్ విమల దానిటు చెప్పెను రామరాజుతో
ధర్మజుడాంజనేయునకు దండ్రి సుయోధను మేనమామయున్
ఘర్మము నుండి వచ్చుటన గన్గొనలేకను సత్య,మట్లుగా
షర్మిళ! చెప్పెగాని,విను సాధుజనాదరణుండెయ్యెడన్

ధర్మజుండాం,జనేయుని తండ్రియెకద

ధర్మపాలన తత్పరుడార్య!యెపుడు
ధర్మజుండాం,జనేయుని తండ్రియెకద
వాయుదేవుడు నాల్లవ వాడు పంచ
భూతములయందు ప్రాణుల బ్రోచునతడు

Tuesday, August 17, 2021

జారుల నిత్యకృత్యములుసజ్జన మోదముగూర్చకుండునే

 తీరని కోరికల్ హరికి దెల్పుచుబ్రార్ధన జేయనేగగా

నోరిమితోడ నర్చకుడ యొప్పగు నాదర ణంబుతోడ మా

పేరును గోత్రమున్ నడిగి బేరిమి తోడను బూజజేయుపూ

జారుల నిత్యకృత్యములుసజ్జన మోదముగూర్చకుండునే

జారులకృత్యములగని సుజనులు మురిసిరే

 పేరును గోత్రము లడుగుచు

వారియు నిక బాలతోడ పశుపతి నెపుడున్

బేరిమి నభిషించెడుపూ

జారులకృత్యములగని సుజనులు మురిసిరే

వేపాకుల పచ్చడిదిన వేడ్కజనించెన్

 సాపాటులోనయీకరి

వేపాకుల పచ్చడిదిన వేడ్కజనించెన్

పాపా!సూనృత మియ్యది

యీపూటకునీ వుకూడ యియ్యది తినుమా

ర్వేపాకున్ గొని చేయపచ్చడి నహోవేడ్కన్ భుజింపందగున్

 పాపా!చెప్పుదునీకెయొక్కటి భారంబు నాయన్క క

ర్వేపాకున్ గొని చేయపచ్చడి నహోవేడ్కన్ భుజింపందగున్

మాపున్ జేయుమయంచు జెప్పుమ యుమామాహే శ్వరాశర్మకున్

నీపుణ్యంబును జేయగోరుదునునే- నిష్టంబుగాజేయుమా

Monday, August 16, 2021

ఇంతిని గౌగిలించెను జితేంద్రియుడైన మునీంద్రుడక్కటా

 అంతయు మాయగానయెను నందఱు జూచుచునుండగాసభన్

నింతిని గౌగిలించెను జితేంద్రియుడైన మునీంద్రుడక్కటా

వింతగ దోచెనాఘటన వేములవాడను జూచితే రమా!

కంతుని బాణముల్ మునికి గట్టిగనాటెనొ యేమొ యిట్లయెన్

యింతినింగౌగలించె మునీంద్రుడకట

 గాదిసూనుని దపమును గంగపాలు

జేయ,యింద్రుడు పంపగా జేరిమునిని

నాట్యమాడగ గామాన మోహితుడయి

యింతినింగౌగలించె మునీంద్రుడకట

స్వాతంత్ర్రముదొరికె విడువవా దాస్యంబున్

 తాతల కాలను పోయెను

నూతనమౌ తరము వచ్చె నొవ్వగలేలా?

మాతా!యీపని యేమిటి

స్వాతంత్ర్రముదొరికె విడువవా దాస్యంబున్ 

జాతింనేర్చెను నేమొ దాస్యమువిడం సంస్కారమడ్డొచ్చెనే

 స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీజాతికిన్

మాతా!చక్కటిప్రశ్న వేసియుమమున్ మాట్లాడకుండంగ మా

చేతన్ సత్యమువినం నోపుదువె?దాసీవోలె జీవించయీ

జాతింనేర్చెను నేమొ దాస్యమువిడం సంస్కారమడ్డొచ్చెనే

Friday, August 13, 2021

నూకలు నానిపోవుటకు నూఱుయుగమ్ముల కాలమయ్యెడిన్

 మాకనపాలెమందుగల మామిడి రంగయ పూటపూటకున్

రూకలు లెక్కపెట్టుచును రూప్యము లన్నియు లేనిచోనికన్

నాకసమంతయున్ హడలు నట్లుగ భీకరనాదుతోననెన్

నూకలు నానిపోవుటకు నూఱుయుగమ్ముల కాలమయ్యెడిన్

నూకలు నానుటకువలయు నూఱుయుగమ్ముల్

 మాకనపాలెపు యువకుని

రూకలు చేజాఱిపోవ రొప్పుచు మిగులన్

నాకము వినబడ యిటులనె

నూకలు నానుటకువలయు నూఱుయుగమ్ముల్

Thursday, August 12, 2021

సమరముమాని శూలిరభసమ్మున బాఱెను ప్రాణరక్షకై

సమరము జేయవచ్చియును శత్రుగణంబుల దూకుడుంగనిన్
సమరముమాని శూలిరభసమ్మున బాఱెను ప్రాణరక్షకై
సమయము జూచి వచ్చి మఱి సైన్యము దోడుగరాగ ,దప్పకన్
విమతుల యంతుజూసెదను భీకర యుద్ధముజేసి వారితోన్ 

సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్

అమరావతి భటుడొక్కడు
నమితోత్సాహంబునొంది యాజికి వెడలన్
విమతుల బాణపు ధాటికి
సమరమ్మును వీడి శూలి చయ్యన బాఱెన్ 

Tuesday, August 10, 2021

దత్తపది అమ్మ-కొమ్మ-నిమ్మ-బొమ్మ

 అమ్మహామహు గృష్ణుని యాదరమున

సంధి జేయుట కొఱకునై సత్వరముగ

బొమ్మని దమకు నిమ్మనె బురములైదు

నందుకొమ్మిక బావరో వందనమని

దయను బ్రార్ధించె గృష్ణుని దర్మరాజు

శుభాకాంక్షలు


 అమ్మ నాన్నల విడిచియు  నరుగు దేర
     బెంగ  యుండును నిజమిది  బేల ! నీ కు
     అత్త లోనన జూడుమ యమ్మ నికను
   కుదుట పడునమ్మ  మనసునీ  కోమ లాంగి



అప్పుచేసి యెపుడు పప్పు కూడుదినకు
అప్పు వలన మనకు ముప్పు కలుగు
అప్పులేనివాడు హాయిగ జీవించు
అప్పు నిప్పు వంటిదమ్మ!వినుము


పరనింద సేయకెన్నడు
పరనిందనుజేయ మిగుల పాపముగలుగున్
పరనింద,దనను బొగడుట
నిరవుగ నిలమంచికాదు నెవరికి నైనన్


మాన వత్త్వంబు తోడన మసలు కొనుచు
మానినుల యందగుచు  దల  మానికముగ
పిల్ల పాపల తోడన  చల్ల గాను
నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున


సకల శుభములు గలిగించు శంకరుండు
నా యు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
యి వ్వ ధూవరు ల నిరత మింపు మీర

 

నన్నయ,యాంధ్రభోజుడనినన్ సరియంచును మెచ్చిరెల్లరున్

మిన్నగ భారతంబునిల మెప్పగునట్లుగ వ్రాసెనేగదా
నన్నయ,యాంధ్రభోజుడనినన్ సరియంచును మెచ్చిరెల్లరున్
పన్నుగ గృష్ణరాయలిల భాషను లెస్సగు దెన్గులోనదా
చెన్నుగ ,నొప్పునట్లుగను జిందులుమీరగ వ్రాయకావ్యమున్

ఆంధ్రభోజుడు నన్నయ్య యనుటనిజము

ఆదికవియని నన్నయ్య నండ్రు వోలె
భాష లన్నిటి యందున ప్రధమ మైన
తెలుగు నందున కావ్యమ్ము తేజరిల్ల
ఆంధ్రభోజుడు నన్నయ్య యనుటనిజము

Monday, August 9, 2021

ఉత్తముడంచు బేర్కొని ,యయోసతిగోరుకోనెన్ విడాకులన్

 అత్తకు జేసె వందనము హర్షము నొందితి మిక్కిలిన్ మగం

డుత్తముడంచు బేర్కొని ,యయోసతిగోరుకోనెన్ విడాకులన్

జిత్తుగ ద్రాగివచ్చి పతి చిత్తుగబాదగ నెల్లవేళలన్

మత్తును గారణంబుగను మారెను నట్లుగ మంచివాడులే

డుత్తముడని,విడాకులనువిద గోరె

 సంతసించెను నెంతయో శైలజ మగ

డుత్తముడని,విడాకులనువిద గోరె

దినముదినముబీడించ పతి,సరి యైన

మార్గమనుకొని జేసెను మానవతిగ

Sunday, August 8, 2021

మదనుని కంటిమంటలకు మాడె ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్

మదనుని కంటిమంటలకు మాడె ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్
మదమున బల్కుచుంటివ?యమానుషపల్కులు న్యాయమా రమా
ముదమున నుంటివేయికను మూర్ఖునివోలెను బల్కుపల్కియున్
మొదటిగురుండు శంకరుడు మోమును వంచుచుమ్రొక్కుమా వెసన్

మరుని కంటిమంట మాడ్చెశివుని

మూర్ఖుడొకడు పలుక మోమోటముబడక
మరుని కంటిమంట మాడ్చెశివుని
నొజ్జ చెప్పెనిటుల యోరి!వినుము
మరుని సంహ రించె హరుని కన్ను

Saturday, August 7, 2021

జమునను జూడగావిజయ శాంతిలభించెజయప్రదమ్ముగన్

 విమల మనంబు గల్గుచును వెన్నెలవోలెను వెల్గునాసతిం

జమునను జూడగావిజయ శాంతిలభించెజయప్రదమ్ముగన్

మమతలె యుట్టి చెందగను మాన్యతతోడను జిత్రమందులీ

నమయినరీతి చిత్తమున నాట్యముజేయుచు నుండునేగదా

జమున జూడ విజయశాంతిదక్కె

 నాదు మనుమరాలు నాట్యమాడగనిన్న

యూరివారలపుడ యుత్సుకతన

వేయి విధములుగను వినుతించ ముఖపంక

జమున జూడ విజయశాంతిదక్కె

Friday, August 6, 2021

వనధర్మమ్మును బూన లోకులకుసౌభాగ్యమ్ము ప్రాప్తించులే

 వినయంబొప్పుచు దానధర్మములు దావేవేగ గావించుపా

వనధర్మమ్మును బూన లోకులకుసౌభాగ్యమ్ము ప్రాప్తించులే

వినుచో సత్యము మీరలందరును భోవీరేశ్వరాయా!వెసన్

గనగన్ సౌఖ్యములన్నియున్ ధరనువేకైవశ్యమౌధరన్

వనధర్మము బూనుజనులు భాగ్యము గనరే

 అనయము శివునిం జూచుచు

మనమున ధ్యానించుచుండు మనుగడ గలరై

వినయము దానములను పా

వనధర్మము బూనుజనులు భాగ్యము గనరే

Wednesday, August 4, 2021

అతివినయమ్ము ధూర్తులగు నాంధ్రులక్షణ మందురెల్లెడన్

 సతతముగౌరవించుచును సజ్జనభావము గల్గుచుండగా

నతివినయమ్ము ధూర్తులగు నాంధ్రులక్షణ మందురెల్లెడన్

మతిచెడువాని పల్కులవి మర్మపుమాటలు బల్కనోపునే

యతివినయమ్ము లాంధ్రులని హారతులిచ్చెను దేశదేశముల్

అతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్

 సతతము గలహము లాడుచు

నతలాకుతలంబుజేసి యాప్తుల యాస్తుల్

నతులను జేయుచు నెదుటన

అతివినయము గల్గినట్టి యాంధ్రులు ధూర్తుల్

Tuesday, August 3, 2021

దున్నను,సూదిబెజ్జమున దూర్చెద మీరలు మెచ్చురీతిగన్

అన్నరొ గడ్డివాములకు నడ్డము వచ్చెనుగట్టుమా వెసన్
దున్నను,సూదిబెజ్జమున దూర్చెద మీరలు మెచ్చురీతిగన్
గన్నులు మూసిదెర్వగనె గాంచుడు దారమునిప్పుడే వెసన్
నెన్నగ జాలకష్టమిది యేబది యేండులు దాటువారికిన్

దున్ననుదున్నను,సూచీబిలమున దూర్చెదగనుమా

అన్నా!కట్టుమ ఱాటికి
దున్నను,సూచీబిలమున దూర్చెదగనుమా
కన్నుంగవ మూసితెఱచి
కన్నంతనె బాల!యిపుడె కలకాదుసుమా

 

Monday, August 2, 2021

తట్టెడుపద్య మొక్కటికదా మురిపించును తట్టెడేలనో

పట్టును లేనివెన్న్నయిన భావము మంచిగ లేనిచో మదిన్
తట్టెడుపద్య మొక్కటికదా మురిపించును తట్టెడేలనో
కట్టడి జేయగా దగును కబ్బములెన్నియొ వ్రాయుకంటె దా
పట్టును గల్గుపద్యములు వ్రాయగనుండువిధంబుగానికన్

తట్టెడు పద్యమ్ము చాలుతట్టెడవేలా?

,చట్టున నర్ధము నగుచును
బిట్టగు భావంబు గలిగి భేషుగ దనరన్
బట్టును గల్గుచు నికమది
తట్టెడు పద్యమ్ము చాలుతట్టెడవేలా?

Sunday, August 1, 2021

ఎవడే యెవ్వడె యెవ్వడేయెవడెతానెవ్వాడె యెవ్వండొకో

 జవరాండ్రందఱి కోకలన్ గవిసి వశ్యంబునగావించువా

డెవడే యెవ్వడె యెవ్వడేయెవడెతానెవ్వాడె యెవ్వండొకో

యవనీనాధుడు కాడొకో దలచస్వర్గాధీశుడోగృష్ణుడో

వివరం బొప్పగ దెల్పుమా కమల! వేవేలంగ బ్రార్ధించెదన్

ఎవడే యెవ్వడె యెవాడె యెవ్వడెయెవడే

కవనము జెప్పెద వినుడీ

భవితను గుఱిచియు నికగతిఫలముల గూర్చిన్

వివరముగ నని పలుకువా

డెవడే యెవ్వడె యెవాడె యెవ్వడెయెవడే

పొలతి!నిజంబిదేగరికపోచయె చాలును,గట్టనేనుగున్

కలుషితమైన దేహమును గావగ మంత్రమువేయ యత్తఱిన్
పొలతి!నిజంబిదేగరికపోచయె చాలును,గట్టనేనుగున్
బలమగు గొల్సుచేత ,నికవంతలు బెట్టక లొంగియుండుగా
గలనున సైతమున్ బసిరిగడ్డిని జుల్కనజేయ యొప్పునే

గరిక పోచతో నేన్గును గట్ట వచ్చు

గరిక పోచతో నేన్గును గట్ట వచ్చు
దెలివి తేటలు గల్గుచో దేనినైన
జేయ వచ్చును ,మృగరాజు సింహమరయ
చంపబడెనుగా గుందేలు చర్య వలన