Monday, December 30, 2013

భ్రూ ణ హత్యల జేయుట పుణ్య మగును

మిగుల పాపమగును గద మేదిని మఱి
భ్రూ ణ హత్యల జేయుట,  పుణ్య మగును
చెత్త బుట్టల బాపల  చేర దీసి
యాదరంబున వారిని  నాదు కొనిన 

Saturday, December 28, 2013

తరుణికి నందమ్ము నొసగు దలపై, గొ మ్ముల్

అర విడిచిన పూమాలలు
తరుణికి నందమ్ము నొసగు దలపై, గొ మ్ముల్
బఱగుచు మైసూ రెడ్లకు
కరమవి యంద మును గూర్చు  గనులకు  మిగులన్ 

Friday, December 27, 2013

శంకరుడు మ కొఱకు పారిజాతము దెచ్చెన్

వెంకన్నా!  వింటివ యిది ?
శంకరుడు మ కొఱకు  పారిజాతము దెచ్చెన్
జంకనునది  లేకుండగ
శంకను గలిగించు మాట  సబుబే పలుకన్ 

రాముడు విన నియ్య కొనడు రామాయణ మున్

పామరుని చెడ్డ మాటలు
రాముడు విన నియ్య కొనడు, రామాయణ మున్
నేమము దప్పక చదివిన
రాముడె మఱి మనకు నిచ్చు రత్నపు సిరులన్ 

Wednesday, December 25, 2013

చదువు రాని వాడు శాస్త్ర వేత్త

చదువు రాని వాడు శాస్త్ర వేత్త యగుట
కల్ల , చదువు ముఖ్య  మెల్ల రకును
చదువు లేని వాని  జవటగ భావింతు
రుర్వి  జనులు  నిజము  శర్వ పుత్ర !

Tuesday, December 24, 2013

క్రిస్మస్ నాడవ తరించె గృష్ణుడు భువిపై

అస్మత్  కవితా సుందరి
క్రిస్మస్ నాడవ తరించె , గృష్ణుడు భువిపై
విస్మయము గలుగు నట్లుగ
భస్మా సురు జంపి ప్రజల బాధలు దీ ర్చెన్ 

Monday, December 23, 2013

భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె

కీడు చేయుదు రనిశము దాడి చేసి
భువిని శాత్రవు లెల్ల, బంధువులు గారె
నాక మందలి సుర లెల్ల నాక పతికి
బంధు గణమును బెంచగ వలయు  మనకు 

కర్ణ పేయమ్ముగా బాడె గార్దభమ్ము

నిండు సభలోన  పాటలు  నీలవేణి
కర్ణ పేయమ్ముగా బాడె , గార్దభమ్ము
భీక రంబుగ నఱచెను మోకరిల్లి
యేమి బాధను నొందె నో ? నేమొ  కాని 

Friday, December 20, 2013

తాపసులకు బూజ్యుడు గదా దశ ముఖుండు

సకల శుభములు గలిగించు  శంక రుండు
తాపసులకు బూజ్యుడు గదా , దశ ముఖుండు
ప్రతి ది నంబును నుదయాన  భక్తి తోడ
కోటి లింగము లర్చించు  మేటి  గుణుడు 

Thursday, December 19, 2013

కట్టు డేనుగున్ వెంపలి చెట్టునకును

విచ్చల విడిగా దిరుగుచు రచ్చ జేసె
కట్టు డేనుగున్ , వెంపలి చెట్టునకును
కొమ్మ లుండును  జూచితె ? కొమ్మ లార!
యెక్క డైనను దానిని నివ్వ సుధను !

Tuesday, December 17, 2013

తరువుల బడ గొట్ట దప్ప దయ్య

అడవి  వెం బ  డిమఱి  యనువుగ   రహ దారి
వేయు  కొఱకు నచట విస్త రించు
తరువుల బడ గొట్ట దప్ప దయ్య ! మనకు
సకల సుగుణ యుతుడ ! శంక రార్య!

Monday, December 16, 2013

పదవీ విరమణము గొప్ప వరమగును గదా

పదవిని నుండగ దెలియును
పదవీ  విరమణము , గొప్ప వరమగును గదా
పదవీ విరమణ జనులకు
పదికిం  బది మార్లు శివుని బ్రార్ధన  జేయన్

పదవిని నుండగ జేయము
సదయుండగు శివుని బూజ సాకారముగన్
పదవులు దొలగిన జేతుము
పదవీ విరమణము గొప్ప వరమగును గదా .

 

హనుమంతుడు పూజ నీయు డసురుల కెల్లన్

విను డం దరి భక్తులకును
హనుమంతుడు పూజ నీయు, డసురుల కెల్ల
న్ననయము దడ గలి గించును
హనుమంతుని బేరు వినిన  నార్యా ! యెపుడున్ 

Friday, December 13, 2013

పదవి విరమణ యొక గొప్ప వరము సుమ్ము

పదవి యున్నంత కాలమ్ము పరమ శివుని
ఒక్క మారైన  దలచక యున్న  నాకు
దైవ ధ్యానమే నాకిక  భావ మగుట
పదవి విరమణ యొక గొప్ప వరము సుమ్ము

 

సురలసురులు గూడి రొకట చుట్టము లగుచున్

హరి దా బంచగ నమృతము
సురలసురులు గూడి రొకట చుట్టము లగుచున్
అరచేతు లొడిసి పట్టుకు
బిరబిర మని  ద్రాగి రపుడు బేబే వనుచున్ 

Thursday, December 12, 2013

సంజ నిద్దుర చేకూర్చు సంపదలను

మంచి యలవాటు కాదార్య ! మానవునకు 
సంజ నిద్దుర చేకూర్చు  సంపదలను
భక్తి శ్రధ్ధల బూజించ భర్గు నిలను
ఆయ నేకద ! మనలను నాదు కొనును 

బంధము లేగా మఱి గుది బండ లగు నికన్

బంధ ములజోలి పోకుము
బంధము లొక టొక టి గ నిక పట్టును బెంచున్
బంధము విడివడ  కుండును
బంధము లేగా మఱి గుది బండ లగు నికన్ 

Wednesday, December 11, 2013

కాటి కాపరి సాక్షాత్తు కాల యముడు

యముని నాజ్ఞను  బాటించి  యతని భటులు
మనిషి ప్రాణంబు గొనిపోయి  మరల యీయ
మసన మందలి  కాపరి మట్టు గఱపె
కాటి కాపరి సాక్షాత్తు కాల యముడు 

Tuesday, December 10, 2013

బడుగు బాపని మేనంత వజ్ర మయము

వడిలి పోయెను మఱి యెండు  పరక వోలె
బడుగు బాపని మేనంత , వజ్ర మయము
శ్రీ నివాసుని దేహము శిరము కూడ
ఏడు కొండల వానికి నేమి లోటు ?

కాశికా పురవాసులు కర్కశు లట

పుణ్య వంతులు  మఱి మఱి  పుడమి యందు
కాశికా పురవాసులు,  కర్కశు లట
కని కరంబిసు మంతయు కనని  యంత
కాశికా పురా ధీ శుడే కాచు గాత !

కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్

ఆరయ  బాంధ వ్యంబులు
వేరగు  భావంబు గాక , విచ్చల విడిగన్
మీరక , నలుగురి యా మమ
కారమె సుఖ శాంతు లొసగు కష్టము దీర్చున్
 

Monday, December 9, 2013

ముఱు గు కూ ప మున మునుగ ముక్తి కలుగు

శ్వా స యాడక   మరణించు సామి ! మఱి ని
ముఱు గు కూ ప మున  మునుగ ముక్తి కలుగు
భక్తి శ్రధ్ధల  బూజించ  భవుని  ధరను
పాప పుణ్యాల  ఫలితమే  వరుస జన్మ 

గంగా నది తెలుగు నాట గలగల పాఱు న్

భంగము లొక వరు వరుసను
గంగా నది తెలుగు నాట గలగల పాఱు న్
భంగములు సాల గలిగిన
లింగోద్భ వు డొసగ దయను  లేములు దొలగెన్ 

Sunday, December 8, 2013

భక్తి లేనివాడు పరమ భక్తుడు గద

మిగుల దుర్మార్గు డ నబడు మేదిని మఱి
భక్తి లేనివాడు  పరమ భక్తుడు గద
ధరను బ్రహ్లాదు  డ నువాడు ,ధార్మి కుడును
రాక్షస కుల భూ  షణుడు ను,  రమ్య  దేహి .

 

Friday, December 6, 2013

భ్రష్టుండగు వాడె పరమ పదమున దనరున్

కష్టముల బాలు జేయును
భ్రష్టుండగు వాడె , పరమ పదమున దనరున్
అష్టమ గర్భుని  కృష్ణుని
ఇష్టముతో  కొలిచి నేని నిహమున్దివినిన్ 

పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముడగున్

చాలిన బలమును బొందును
పాలను గ్రోలిన మనుజుడు , పాపాత్ముడగున్
ఆలను చంపిన యెడ లను
ఆలను భావించ వలయు  నమ్మల వోలెన్ 

రాము నిం జంపె రణమున రావ ణుండు

కలను గంటిని రాతిరి కలత జెంది
రాము  నిం జంపె  రణమున రావ ణుండు
భయము తోడన లేవగ , భ్రమగ  నెఱి గి
సంత సించితి  మదిలోన  వంత లుడగ 

Thursday, December 5, 2013

పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్

అండగ నుండిరి యన్నకు
పాండు కుమారులు  నలుగురు పదుగురు మెచ్చన్
భండనము నందు మిగులను
గండ రు  గండరుల బోలి  కను విందాయెన్ . 

Tuesday, December 3, 2013

పిట్ట కూతకు , ది శ లెల్ల బిట్టు వడకె

పారి పోయెను పక్షులు భయము తోడ
పిట్ట కూతకు ,  ది శ లెల్ల బిట్టు వడకె
నడవి మృగములు సహితము నదరి  యపుడు
కూత యెట్టిదో యూహించు  కొనుడు మీరు
 

సైంధవుడు చంపె భీముని సమర మందు

సైంధవుడు చంపె  భీముని సమర  మందు
నమ్మితిర మీరు ? మఱి యది నమ్మ దగునె ?
నిలువ జాలునె ? భీముని  బలము ముందు
తెలిసి  మఱియును  నిటులుగ దెలుప  దగునె ?

కాలకూట విషము మేలు జేయు

ప్రాణ హాని జేయు పరమాత్ములకు నైన
కాలకూట విషము  మేలు జేయు
ఆత్మ హత్యకు మఱి యారాట పడునట్టి
మానవునకు నిదియ  మఱి  తలపగ 

Monday, December 2, 2013

కాల చక్రము నాపుట, కడు సులభము

ఎవరి దరమును గాదార్య ! యిప్పుడమిని
కాల చక్రము నాపుట,  కడు  సులభము
ముక్తి నొందుట నేరుగా భువిని మఱి ని
భక్తి శ్రధ్ధల బూజించ  పరమ శివుని 

Thursday, November 28, 2013

యముని సదనంబు గలదట యవని యందు

ఎన్ని చోటులు వెదకిన  నన్ని చోట్ల
యముని సదనంబు గలదట యవని యందు
రక్షకులము గా  బఱగుచు  శిక్ష వేయు
గీ ములే యా య  మునిసద  నమ్ము లండ్రు 

Wednesday, November 27, 2013

ఫల శతము నొసంగె జీ ర్ణ పాదప మౌరా !

పలవలు గలిగిన మామిడి
ఫల శతము నొసంగె జీ ర్ణ పాదప మౌరా !
బల హీ న మగుట   వలనన
జలమును సరి బీ ల్చలేక  చావగ నుండెన్
 

గొడ్డు రాలి బిడ్డలు గుణ కోవిదుల ట

గొడ్డు రాలి బిడ్డలు గుణ కోవిదుల ట
వింటి రేయిది  యెచ టను ? వింత గొలిపె
గొడ్డు రాలికి పుడమిని బిడ్డ లుంట
యరయ కలికాల మాహాత్మ్య మగును సుమ్ము 

Tuesday, November 26, 2013

తాతకు నేర్పును మనుమడు దగ్గెడి విధమున్

తాతల తరములు గడిచెను
మాతరములు గూడ  గడువ మార్పులు గలుగన్
ఈ తరపు  కుటిల జగమున
తాతకు నేర్పును మనుమడు  దగ్గెడి  విధమున్
 

Sunday, November 24, 2013

తనివి గల్గించె రాముడు దానవులకు

యాగ రక్షణ  గావించి యా మునులకు
తనివి గల్గించె రాముడు , దానవులకు
మోక్ష మిచ్చెను సంహారము జరిపి మఱి
దైవ మెప్పుడు భక్తుల గావ యుండు 

Saturday, November 23, 2013

కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత

కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత
యగుపడును మఱి  భూతద్ద మందు జూడ
ఒక్క కడపయే కాకుండ   యెక్క డైన
నటులె  గన్పడు నిజమిది  యార్య ! యౌన ?

Friday, November 22, 2013

పూలవా నకు శిరమున బుండ్లు రేగె

పూలవా నకు శిరమున బుండ్లు రేగె
నెంత చిత్రము ? మీ పలుకెంత గానొ
నవ్వు దెప్పించె  నోసామి ! నాకు మిగుల
రాళ్ళ వానకు శిరములు  రగులు గొనును


పూల  వానకు శిరమున బుండ్లు రేగె
పూల వానకు మఱియును  పూల రహిత
వాన పడినను రేగును వరుస పుండ్లు
వాన దెబ్బకు నటులగు వారి జాక్షి !

Thursday, November 21, 2013

గాంగేయుడు పెండ్లి యాడి కనె సత్సుతులన్

రంగాచారికి గల దొక
మంగా యను బేర నొప్పు  మంచి దుహితయున్
అంగన  యందము మెచ్చీ
గాంగేయుడు పెండ్లి యాడి కనె  సత్సుతులన్ 

Wednesday, November 20, 2013

చెంప మీద గొట్ట సిరులు గురియు

పళ్ళు రాలిపోవు  పటపట యనుచును
చెంప మీద గొట్ట , సిరులు గురియు
శ్ర ధ్ధ  భక్తి గలిగి  శంభుని బూజించ
 మారు మాట లేదు  మాధవుండ !

Monday, November 18, 2013

పాపాలను జేయునతడు పరమేశ్వరుడే

పాపిగ బిలువబడును మఱి
పాపాలను  జేయునతడు ,పరమేశ్వరుడే
పాపుల రక్షణ జూచును
పాపియె  మఱి  భక్తుడయిన  పట్టున నెలమిన్ 

విప్ర వరుడు మాంసమ్ము తో విందొ సంగె

సంధ్య వార్చును మానక  శ్ర ధ్ధ తోడ
విప్ర   వరుడు ,మాంసమ్ము తో  విందొ సంగె
పెండ్లి రోజున సోముడు ప్రియము గలుగ
మేలు మేలనుచు దినిరి  పాళె గాండ్రు

 

Sunday, November 17, 2013

బుద్ధి నీకు లేదు పుణ్య మూర్తి !

కోప గించుకొనక  కూరిమి దోడన
పూరణలను సరిగ బూర్తి జేయు
శంక రార్య ! నిన్ను శంకించ దగు జెడు
బుద్ధి నీకు లేదు పుణ్య మూర్తి !

Saturday, November 16, 2013

ఆ శీ స్సులు



(చి .  ప్రవీణ్ -శ్వేతల  వివాహము సందర్భముగా )

1. రాపాక వంశ భూషణ !
   యే పుణ్యము జేసినావొ  యే జన్మలలోన్
   ఈ పావన వంశం బున 
   నేపారుగ  బుట్టు కతన  నీవు ప్రవీణా !


2. వరుడు పుట్టెను  రాపాక వారి యింట
    వధువు జన్మించె  నంగు లూర్వారి యింట
    వరుని పేరు మఱి ప్రవీణు  వధువు శ్వేత
    అంద చందాల సరి వోయి రాలు మగలు


3. ఒకరి కొఱకునై  మఱి యొక రుద్భ వించి
    అగ్ని సాక్షిగ నొకటిగ  నగుట కొఱకు
   వేచి యుండిరి యిరువురు వినయముగను
   వరలు  కళ్యాణ ఘడియలు  వచ్చు వరకు


4. కల కాలము మీ రిద్దరు
   కలసి మెలసి జీ వితమును గడుపుచు పతి ప
   త్నులు మిత్రులు గా కష్టం
   బుల సుఖముల  దోడ యి  శుభముల  నంద వలెన్

అమ్మా ! శ్వేతా !


5. ధరణి  యీ ప్రవీ ణే నీ కు   దగిన  భర్త
    ఎదురు  చెప్పక వానికి నెపుడు నీ వు
    పాలు నీరును  బోలుచు బ్రదుకు చుండి
   మంచి గృహిణిగ   బేరొం దు  మనుజు లందు


6. అమ్మ నాన్నల విడిచియు  నరుగు దేర
     బెంగ  యుండును నిజమిది  బేల ! నీ కు
     అత్త లోనన జూడుమ యమ్మ నికను
   కుదుట పడునమ్మ  మనసునీ  కోమ లాంగి !


7.  సకల  శుభములు గలిగించు  శంక రుండు
     ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
     కంటికిని రెప్ప యట్లయి  కాచు గాత
    ఎల్ల  వేళల మిమ్ముల  చల్ల గాను
   

రచన ; పోచిరాజు సుబ్బారావు

 

కార్తికమ్మున వచ్చు నుగాది మనకు

కలుగు పుణ్యము మునుగంగ  గంగ లోన
కార్తికమ్మున , వచ్చు నుగాది మనకు
చైత్ర మాసాన పాడ్యమి  సై యనంగ
మాసముల కెల్ల  ముఖ్యము  మార్గ శిరము 

Sunday, November 10, 2013

సత్య దూరము గద హరి శ్చంద్రు గాధ

మిన్ను నేకమౌటను మఱి  మన్ను తోడ
సత్య దూరము గద, హరి శ్చంద్రు గాధ
సత్య వంతుల కయ్యది సాటి యగును
జయము సాధించు నెప్పుడు సత్య మార్య !

Friday, November 8, 2013

వెన్నతో బెట్టిన విద్య

దొంగ తనములు సేయుట  దొంగకు మఱి
వెన్నతో బెట్టి నటువంటి విద్య యౌను
గట్టి శిక్షకు గురియౌను బట్టు వడిన
దొరక కుండిన నికయగు దొరయె సుమ్ము 

సాహెబు ముప్ప్రొద్దు లందు సంధ్యను వార్చున్

ఆ హా ! యేమని జెప్పుదు
నా హిమగిరిసుత గరుణన నారంభించిన్
బీహారు నగర మందలి
సాహెబు ముప్ప్రొద్దు లందు సంధ్యను వార్చున్ 

Thursday, November 7, 2013

కర్ణుడు సుయోధనుని జంపె గదన మందు

కుంతి  సూర్యుల  పుత్రుడు  కువలయాక్షి !
కర్ణుడు, సుయోధనుని జంపె గదన మందు
భీమసేనుడు గదతోడ భీకరముగ
కొట్టి  దొడ మీద  గిలగిల గొట్టు కొనగ 

Monday, November 4, 2013

దీపము నార్పగ గృహమున దేజమ్మెసగన్

పాపము  గదమఱి  గుడిలో
 దీపము  నార్పగ, గృహమున దేజమ్మెసగన్
దీపాల వెలుగు లీ నెను
దీపావళి నాడు మిగుల దేదీ ప్యముగాన్

Sunday, November 3, 2013

కందు కూరి వీ రేశ లింగము ఖలుండు

సంఘ సంస్కర్త గా నెఱు గంగ వలయు
కందు కూరి వీ రేశ లింగము , ఖలుండు
దుష్ట బుద్ధిని  మెలగుచు  దురితములను
చేయు చుండును నిర తము  చెప్ప లేని

Saturday, November 2, 2013

ఆ శీ స్సులు

పుసులూరి వంశ  మండన !
పసగల మొనగాడ  వార్య ! పావన కృష్ణా !
మిసమిస లాడుచు నుంటివి
వెసనౌ ప్రశ్నార్ధ కంబు  విరమణ  మాటల్ .


తనర హనుమాయి నీకిల  దగిన  భార్య
యగుచు  కంటికినే  రెప్ప  యైన విధము
ఎల్ల  వేళల మీ బాగు నినుమ డించ
శ్రధ్ధ జూపును నిజమిది సజ్జ నుండ !


నీ దు  మాటయే ప్రజలకు వేద వాక్కు
నిన్ను నమ్మిన వారికి నీడ నిచ్చి
యాదు కొందువు  నిక్కము  సాదరముగ i
సాటి యెవరయ్య  నీకిల  సాటి యెవరు ?
  

పదవి విరమణ తప్పదు  ప్రతి యొకరికి
చింత గూడదు దానికై  సుంత యైన
చీకు   చింతలు  లేకుండ  శేష జీవి
తంబు సాగించు   కృష్ణయ్య ! తనర   యీవు


పదవి విరమణ యీ రోజు పరమ పురుష !
చింత నొందక మఱి నీవు  శివుని మదిని
స్మరణ జేయుచు గడుపుము జరము దనుక
ముక్తి  గలుగును దప్పక  ముదము గలుగ 



సకల శుభ ములు గలిగించు శంకరుండు
ఆయు రా రోగ్య  సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .

( ది  .30-11-2013 తేదీ న   కృ ష్ణయ్య గారి పదవీ  విరమణ  సందర్భము గా }

రచన ; పోచి రాజు   సుబ్బారావు















Thursday, October 31, 2013

క్రోధమే మేలు గద సర్వ గుణము లందు

కష్టములు  గలుగుటకును  గార ణంబు
క్రోధమే,  మేలు గద సర్వ గుణము లందు
దాన మయ్యది గలిగించు ధర్మ పధ ము
దాన ధర్మము లీ రెండు   మాన వలదు 

అతిశ యోక్తులు

అతిశ యోక్తులు పలికెడి య య్య వారు
తారసిల్లెను నాకట  తణుకు నందు
సుత్తి వారిది వినలేక సొమ్మ సిల్లి
నేల బడితిని నా క్షణమో  లతాంగి 

బంధములు

బంధములే  శృం ఖలములు
బంధములను బెంచు కొనకు పడతుల యెడ లన్
బంధు వని  వచ్చు వానిని
అంధు డ వై  నమ్మ కునికి  హర్షము మనకున్ 

పద్యమ్ముల వ్రాయునట్టి వాడల్పు డగున్

మద్యము ద్రాగిన మత్తున
విద్యాధరుడనియె  నిట్లు  వీనుల విందౌ
పద్యము గణములు దెలియక
పద్యమ్ముల వ్రాయునట్టి  వాడల్పు డగున్
 

నిధి చాల సుఖమా

అరయ  నిధి చాల సుఖమా !యార్య మఱి ని
దైవ సన్నిధి సుఖమా దయను దెల్పి
మమ్ము సంతోష పఱు చుడు  మాననీయ !
వందనంబులు సేతును వంద లాది 

రాచి ఱo పానపెట్టు

రాచి ఱo పానపెట్టు ను రమ్య తనదు
కోడలి నెపుడు చూచితె  ? కూ రుచుండ
నీయ దొక నిమిషమయిన ,నేర ములను
జెప్పు కొడుకున కెన్నియో  మెప్పునొంద 

కలము -కత్తి

కలము చేబూని  మొదలిడ  కావ్యమగును
ఖండి తంబగు  కం ఠాలు  కత్తి వలన
శుభము కలిగించు  కలమున   శుభము  కత్తి
కలము  కత్తులు  రెండును  కరము పదును 

కలిమి లేములు

కలిమి  గల చోట నుండదు కఱు వు  నిజము
లేమి యుండదు సంపద లీ ను  చోట
కలిమి లేములు రెండును కలిసి కొనవు
కలిమి లేములు కావడి  ఘటము లుగద 

కలిమి గల గృహిణి కంట కన్నీ రొలుకన్

అల కాపురంబు నందున
కలిమి గల గృహిణి కంట కన్నీ రొలుకన్
విలవిల లాడుదు రబలలు
సలిలంబును మ్రింగు పగిది సంద్రము లోనన్ 

Wednesday, October 30, 2013

పచ్చికను దిననొల్లదు పాడి యావు

చూ లు కలిగిన యాయావు చొప్ప మఱియు
పచ్చికను దిననొల్లదు పాడి యావు
మంచి పచ్చికను దినుచు నం చి త ముగ
పాల నిచ్చును జనులకు భవ్య చరిత !  

కలి కలిగిన వాని యింట కలవే సు ఖ ముల్

కలిపురుషుని  కారణ మున
నలు డప్పుడు విడిచి యే గ  నల దమ   యంతిన్
గల గల  యే   డ్చెను  నాస   తి
 కలి కలిగిన  వాని  యింట  కలవే  సు ఖ ముల్ 

Tuesday, October 29, 2013

అడ్డంకులు

అడ్డంకు లెన్ని యున్నను
నొడ్డా ణ ము కొందు నీకు నోపిక పడుమా
బిడ్డల  గుడ్డల  సంగతి
దొడ్డకు నే జెప్పి యుంటి దునిలో కొనునున్


 

అత్రి మునికి నహల్యయే పుత్రిక యగు

అత్రి మునికి  నహల్యయే పుత్రిక యగు
ననుచు రూడి గ బలుకుట యక్రమమ్ము
బ్రహ్మ  చేతను   సృ జియింప  బడిన సా ధ్వి
గౌ తమ  మహర్షి భార్య యే , సేతు నతులు 

Monday, October 28, 2013

పతితల ఖండించె నం ట పార్వతి గినుకన్

పతియగు  శివుడా బులి గణ
పతితల ఖండించె   నం ట  పార్వతి గినుకన్
బ్రతికించి  యాతని ప్పుడు
వెతలంబోగొట్టు మదిని  భిక్షుక శ్రేష్టా !

క్షీరాబ్ధి శయను డనంగ శివుడే గదరా

తారక రాముడు మఱియును
క్షీరాబ్ధి శయను డనంగ శివుడే గదరా
ఆరాముడు మఱి శివుడును
వీరిరువురు నొక్క రార్య ! వీ క్షింపంగాన్ 

కాలితో దన్నుటే మేటి కనికరమ్ము

కాలితో  దన్నుటే  మేటి కనికరమ్ము
అటుల జరిగెనునలనాడ యామృకండు
తనయు పట్లన  కాలుని దరికి పోవు
తఱి ని  గాపాడె  శం భుడు  తనర భక్తి 

Saturday, October 26, 2013

మామా ! యని భావమఱది మాటలు గలిపెన్

రా ,మాయింటికి నిప్పుడు
మామా !, యని భావమఱది మాటలు గలిపెన్
కామాక్షి కగును సోదరు
డా మోహనరావు కూ డ  హర్షము తోడన్ 

Wednesday, October 16, 2013

ఇత్తడి కఱిగి యగునార్య! పుత్తడిగను


ఇత్తడి కఱిగి యగునార్య! పుత్తడిగను
చోద్యమీమాట వింటిమె? చూచితెక్క
డైన,నట్లగునెడలను నైహికమున
లేమియనునది మనకిక లేదు సామి!

కోదండ రాముడందురు

కోదండ రాముడందురు
కోదండము చేతబూనికువలయమందున్
ఛేదించి శత్రుమూకల
వేదన మాన్ పించెకతన వేల్పులబ్రజకున్

నందివర్ధనపూవది

నందివర్ధనపూవది యందగించె
శంభుశిరసుపై దెల్లగ చంద్రు బోలి
గగనమంతయువెలుతురు గానిపించె
చోద్యమాయెను మఱియది చూపరులకు

జీతములేనట్టి కొలువె శ్రేష్ఠము జగతిన్


తాతలసేవలనరయగ
జీతములేనట్టి కొలువె, శ్రేష్ఠము జగతిన్
మాతాపితరులసేవలు
నేతావాతా  యె రుం గు  మెప్పటి  కైనన్ 

Tuesday, October 15, 2013

అప్పుచేసి పప్పు కూడు

అప్పుచేసి యెపుడు పప్పు కూడుదినకు
అప్పు వలన మనకు ముప్పు కలుగు
అప్పులేనివాడు హాయిగ జీవించు
అప్పు నిప్పు వంటిదార్య!వినుము

జగడము

జగడము లాడుట మానుడు
జగడములేదారితీయుజావులకు నిలన్
జగడము ధర్మ విరుధ్ధము
సుగమమునగు జీవితంబు జగడము లేమిన్

Monday, October 14, 2013

గవాక్షము

సూర్యకిరణాలు వచ్చును చూరుపైన
గలుగునా గవాక్షమునుండి కాంతితోడ
సూర్య బింబముపగిదినిసుడులు దిరిగి
కనుల మిరుమిట్లు గొలుపుచు గానిపించు

శూర్పణఖ రామచంద్రుని సోదరియట


పెండ్లియాడుమ యనికోరె బ్రియము గలిగి
శూర్పణఖ రామచంద్రుని సోదరియట
చుప్పనాతి రావణునకు చోద్యమాయె
రావణారిని గోరుట రామ మఱిని

Sunday, October 13, 2013

బూడిదలోపోసిన పన్నీరు

అడవి కాచిన వెన్నెల యటులవలెను
సంద్రమందున జేరెడు సలిలమువలె
బూడిదందలి పన్నీరు కూడ వమ్ము
లార్య! నిజమిది నమ్ముడు నౌను ననుచు

తొమ్మిదిలోనొకటిదీయ తొయ్యలి పదియౌ

ఇమ్ముగ నెనిమిది యగుగద
తొమ్మిదిలోనొకటిదీయ తొయ్యలి పదియౌ
తొమ్మిదికి నొకటి గలిపిన
నెమ్మదిగను నేర్చుకొనుమునిరతము లెక్కల్

విజయ దశమి

విజయ దశమి నాడు విష్ణు బూజనుసేయ
సకల సంపదలును,సంతునిచ్చు
రాముడటులజేసి రావణువధియించె
అర్జునుండు గెలిచె నరి గణమును

Friday, October 11, 2013

ప్రకృతి వైపరీత్యములు

వాయుగుండములీమధ్య వరుసవరుస
వచ్చుచుండెను గప్రకృతి వైపరీత్య
ములివియెగమఱివాటిల్లు ముప్పులు, పలు
విధములగునష్టములుగల్గు వేంకటేశ!

కడుపు నొప్పియనుచుకరము మురిసె

ఫద్మ యీదినంబు పనికిరాలేదుగ
కడుపు నొప్పియనుచుకరము మురిసె
కనకదుర్గ తాను కనినకలనుగూర్చి
అభయ హస్త మిచ్చె నంబ కలను

తలదొలగించిననిడుములుదప్పు జనులకున్


ఇల గజముఖుడౌ గణపతి
తలదొలగించిన,నిడుములుదప్పు జనులకున్
తలుపులయమ్మను గొలిచిన
ఇలవేలుపుమాకుగాన నిచ్చునుశుభముల్

సరస్వతీ ప్రార్ధన


శారద మాతా! నతులివె
శారదమా! గృపను జూడు శరణము నీవే
యారయ,చదువుల తల్లివి
పారంగతు జేయుమమ్మ! పరిపూర్ణముగాన్

Thursday, October 10, 2013

సరస్వతీ పూజ


భక్తి శ్రధ్ధలతోడన పరమ శివుని
సోద రిసరస్వతి నిపుడు నాదరమున
పూజచేసిననిచ్చును బుణ్య మార్య!
కల్లకాదిది నిజమునే పల్కు చుంటి

Wednesday, October 9, 2013

ధవునకపుడుగర్భమయ్యె దనయుడు పుట్టెన్

అవునట వింటిరెమీరు మా
ధవునకపుడుగర్భమయ్యె దనయుడు పుట్టెన్
ఎవరెవరికెవరు పుట్టిరొ
వివరముగా దెలుపుడార్య! వీనుల విందున్

విద్యుద్విపత్తు


ఆంధ్రరాష్ట్రమందంతయునంధకార
మగుట,విద్యుద్విపత్తులేయగునుమఱిని
కారణంబులుసిబ్బందిగైరు హాజ
రగుట , వెలుగులు సూతుమయార్య!మనము?

Tuesday, October 8, 2013

కనులవినవచ్చువీనుల గాంచవచ్చు

భక్తి శ్రధ్ధల శంకరు భజనజేయు
పరమ పురుషుండుతనదగు వరముతోడ
కనులవినవచ్చువీనుల గాంచవచ్చు
తారతమ్యము లెఱుగనియార్యుడతడు

కంచిగరుడసేవ

కంచికేగిన ప్రతియొక్కడంచితముగ
గరుడసేవనుగావించికాంచు విష్ణు
నదియయిచ్చునుఫలితము నార్య! నిజము
వరల కామాక్షి మాతకు వందనములు

Monday, October 7, 2013

వేపపుల్ల

వేపపుల్ల నమల వెగటుగా నుండును
పండ్లుతోమ తెల్లబడును మిగుల
పిప్పి పన్నులుండవెప్పటికినిమఱి
వేపపుల్ల మేలు వేనవేలు

చి.సౌ.హిరణ్మయి-హర్షలకు ఆశీస్సులు



1.వధువు పుట్టెను బెహరాల వారి యింట
వరుడు జన్మించెపోతరాజుల కులమున
హర్షవర్ధనుడాతడు నామెదుర్గ
జోడుకుదురగ మూర్తము  జూసి నారు.

2.ఒకరి కొఱకునై మఱియొక రుద్భవించి
అగ్ని సా క్షి గ   పరిణయ  మగుట కొఱకు
వేచి యుం డిరి  పెద్దల  యా  శి సులకు
అనుమతీయగ  నీరోజు  నగును  బెండ్లి

3. రామ చం ద్రుడు నీ తండ్రి రామ యైన
త్రిపుర సుందరి నీ తల్లి తెలియు మమ్మ !
యేమిభాగ్యము నీ యది యెంచ దుర్గ !
భర్త పేరును  గలిసెను ఫ ణి యనంగ

4.తనర  మణి కం ఠు డనబడు తనయు డితడు
 తగిన  భర్తయే మఱి నీకు తార తమ్య
ములను నెంచక సంతోష ముండునటుల
మెలగు మోదుర్గ ! యదినీకుమేలునిచ్చు

అమ్మనాన్నలవిడిచియు నరుగుదేర
బెంగయుండును నిజమిది బేలనీకు
అత్తలోననజూడుమ యమ్మనికను
బాధయుండదు యికనీకు పచ్చినిజము

6.అత్తమామలు మఱియును నాడు బిడ్డ
మిగుల సౌమ్యులువారిని మీఱకుండ
అధిక భక్తిని  మెలగితి  వైన నిన్ను
రక్ష సేయును నిరతము రాము డబల !

7.పుట్టి నింటను మెలగిననట్లు గానె
మెట్టినింటనుగూడను మెలగుమమ్మ!
ఆది దంపతిసములగు నత్తమామ
లాదరించుమునిరతము హర్షమునన

8.మానవత్వంబుతోడన మసలుకొనుచు
మానినులయందగుమతలమానికముగ
పిల్ల పాపల తో డన  చల్లగాను
నిండు నూ రే ళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున


9.మాస్టరీకెయం   యన్నులు  మమతతోడ
మిమ్ము నాశీర్వదింతురుమింట నుండి
కల్లకాదిది నిజమునే పల్కు చుంటి
నోహిర ణ్మయి! సీవీవి పాహి మిమ్ము.

10.సకలశుభములుగలిగించు శంకరుండు
ఆయురారోగ్య సంపదలన్నియిచ్చి
కంటికిని  ఱెప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల  మిమ్ముల  చల్ల గాను



ది.23-10-2013తేదీనహిరణ్మయి-హర్షల  వివాహము  సందర్భముగా
రచన--పోచిరాజుసుబ్బారావు
















 

Sunday, October 6, 2013

ప్రణయ కలహము

ప్రణయకలహములనునవిపడతులందు
విరివిగాకాని పించును తరచి చూడ
ప్రేమతోడన దరిజేరి ప్రియము పలుక
తొలగిపోవును గోపము తోయజాక్షి!

ఆనపపాదునకుజూడ ననుములు పండెన్

నానాజీ తోటనగల
ఆనపపాదునకుజూడ ననుములు పండెన్
గా ననుచుండిరిజనములు
వీనులకది బాగులేదు వినుటకు సామీ!

త్ర్యయంబక సంభవుడు మఱదియగు శ్రీపతికిన్

లంబోదరుడగు గణపతి
త్ర్యoబక సంభవుడు మఱదియగు శ్రీపతికిన్
బింబానన! కుంతిసుతుడు
అంబుధిశయనునకినిడుదు  నంజలి యెపుడున్

Saturday, October 5, 2013

ఓమనగుంటలు

ఆమనిఋతు దినములలో
గోముగ నట నాడెవారుగుంపుగపడతు
ల్వోమన గుంటలలనాటను
ప్రేమను మఱి  యొకరికొకరుప్రియములు గలుగన్

aasiissulu--sekarana



కంటి కింపగు కళ్యాణ మంటపమున

హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి

శుభ సుఖంబుల జీవన శోభ నంద

దీవెనల నీయ మీ జంట దీప్తినందు.



కలకాలము మీ రిద్దరు

కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప

త్నులు మిత్రులుగా కష్టం

బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.



ఎల్లప్పుడు మీ జంటకు

నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్

కొల్లలుగ నందవలెనని

యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.



సరిలేని శుభ సుఖంబుల

సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు

స్థిర దాంపత్యముతో మీ

రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్.


దేవి అవతారములు--నైవేద్యములు

పాడ్యమి---బాలాత్రిపురసుందరి---పులగము
విదియ---గాయత్రి---పులిహోర
తదియ---మహాలక్ష్మి---కొబ్బరి అన్నము
చవితి---అన్నపూర్ణ----చిల్లులేని గారెలు
పంచమి---లలిత---పెరుగు గారెలు
షష్టి---- సరస్వతి --- రవ్వకేసరి
సప్తమి --- దుర్గా దేవి --- కలగలుపు కూ రల  అన్నము
అష్టమి --- మహిషాసుర  మర్దిని --- చక్కెర పొం గలి
నవమి --- రాజ  రాజేశ్వరి  --- క్షీరాన్నము
దశమి ---పులిహోర,లడ్లు

తాళము

తాళము వేయుట మఱువకు
తాళములేరక్ష మఱిని తలిరుల సిరికిన్
తాళములు బెక్కు రకములు
తాళము గాడ్రేజు మిన్న తలిరుల బోడీ!

రాము నోడించె వాలి సంగ్రామమందు

కలనుగంటిని రాతిరి కల్ల కాదు
రాము నోడించె వాలి సంగ్రామమందు
అనుచు,వెఱగంది,లేచితి హర్షమొదవె
రాముడోడించెననితెల్సి రణమునందు

Thursday, October 3, 2013

పిత్రమావాస్య


పిత్రమావాస్య దినమునపెద్దలకిల
పిండముల నిత్తురందఱు పేర్మితోడ
సంతసించుచు పెద్దలుసకల శుభము
లుగలి గింతురు నిజమిది లోకనాధ!

Wednesday, October 2, 2013

యజ్ఞవాటిక


యజ్ఞవాటిక జూడగ హర్షమయ్యె
బ్రహ్మ మొదలగు దేవతల ర్హు డౌ,ను
మాపతినినిశ్చలముగనుమదిని నిల్పి
చేయుచుండిరి యజ్ఞము చిత్రమందు

Tuesday, October 1, 2013

గడ్డిమేయు జనులకెల్లకలుగుసుఖము

ఆవుదూడలు గేదెలు నావు లార్య!
గడ్డిమేయు జనులకెల్లకలుగుసుఖము
రామరాజ్యముపగిదిని రాజ్యమొదవ
పిల్లపాపలతోడన చల్ల గుండ్రు

జాతిపిత

జాతిపిత

జాతిపితగనుబేరొంది జగమునందు
సత్యము మఱియు నాయహింసా పథమ్ము
నెఱపి యాంగ్లరాజులమఱి తఱిమి కొట్టి
తెచ్చె స్వరాజ్య ముమనకు దెగువతోడ

Monday, September 30, 2013

అనువుగానిచోట యధికులమేయను

అనువుగానిచోట యధికులమేయను
ననుట నొప్పు గాదువినయము మఱి
యార్య! బ్రదుకుదెఱువుమార్గమదియగును
నెల్లవారలునిక చల్లగుండ్రు

మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్

వడివడిగా గుడికేగెను
మడిగట్టిన పండితుండు, మద్యము గ్రోలెన్
దుడుకుదనంబులు గలిగియు
చెడు వర్తన గలిగియుండు చెనటులు మిగులన్

Sunday, September 29, 2013

ముంచినట్టివాడె పూజ్యుడయ్య!

హరుని దినము దినము నభిషేకజలమున
ముంచినట్టివాడె పూజ్యుడయ్య!
వాని
దరికిజేర్చు  పార్వతీ నాధుడు
సత్య మిదియ నమ్ము శంకరార్య!
 

గ్రామ దేవతలు

గ్రామదేవతలనువారు గ్రామగ్రామ
మునకునూరిచివరనుండి మనకు నెల్ల
వేళలను రక్షణగ నుంద్రు వేయి నతుల
నిడుదు నిరతమా తల్లికి నిమ్ముగాను

Saturday, September 28, 2013

కాలుడు హిమశైల సుతకు గాంతుండయ్యెన్

శైలాద్రి దనయ గోరగ
కాలుడు హిమశైల సుతకు గాంతుండయ్యెన్
ఈలయకారుని పొగడిన
కైలాసము దరికిజేర్చి కైవల్యమిడున్

పరనింద

పరనింద సేయకెన్నడు
పరనిందనుజేయ మిగుల పాపముగలుగున్
పరనింద,దనను బొగడుట
నిరవుగ నిలమంచికాదు నెవరికి నైనన్

జారుల కృత్యములు మనకు సంతోషమిడున్

గౌరవహీనములగునుగ
జారుల కృత్యములు,మనకు సంతోషమిడున్
జారులు మంచిగమారుచు
వారందరు కలిసి మెలసి వర్తిలి యుండన్

శివ కుటుంబము



అర్ధనారీశ్వరుండయి  యచట శివుడు
కొమరు లిద్దరు నిరువైపు లిమ్ము గాను
తల్లి దండ్రుల ముద్దుల తనయ్తు లగుచు
శివకుటుంబమునొప్పెను చిత్రమందు

Friday, September 27, 2013

కోడిపందెములు

పల్లెటూరున సంక్రాంతి పండుగలకు
కోడి పందెముల్ జరిపింత్రు వేడుకనుచు
పదును గత్తుల తోడన బలము జూప
వెఱ్ఱి కేకలు వేతురు వెఱ్ఱి జనము

శివపార్వతులు

వింటిరె మీరీ సంగతి
కంటిని నొక యద్భుతమ్ము కనలేదెపుడున్
మింటను శివపార్వతులే
కంటికి కనుపించిరార్య! కలయో,నిజమో?

Thursday, September 26, 2013

అప్పు లేనివాడె యధము డుగద

అప్పు లేనివాడె యధము డుగదయన
కప్పు లున్న యెడల నతిగ ఖర్చు
పెట్టకుండ కూడబెట్టును ధనమును
అప్పు భయము తోడ నార్య! వినుము

దొంగల ముఠా


దొంగలందఱు నొకటయి  మంగపతిని
నిలువునా దోచుకొనియును నిలువ నీడ
లేక గావించిరా దొంగలే ముఠాగ
వచ్చి మఱి యేది లేదిక  పస్తులు గతి.

రోకటి పోటౌషధము శిరోవేదనకున్

రోకటి పోటున నలుగును
షీకాయలు నంతెకాని శిరమున కదియా!
ఈకలికాలపు మాటలు
రోకటి పోటౌషధము శిరోవేదనకున్

పోస్టు కార్డు



ఒకరి వార్తలింకొకరికిని తెలుపను
పోస్టుకార్డు పైన వ్రాసెడిరిగ
మృగ్యమయ్యె యిపుడు పోస్టుకార్డులుమఱి
సెల్లు ఫోను వచ్చె క్షేమములకు

Tuesday, September 24, 2013

gati లేని మనుష్యుడే సుగతు డనదగున్


 అతిగనునున్నను మఱిదు
ర్గతి లేని మనుష్యుడే సుగతు డనదగున్
మితిమీరి పొగరుగలిగిన
పతితునిగా ననగదగును బశుపతి నాధా!

కారాగారము

కారాగారములయ్యవి
యారామములయ్యె యిపుడ యదికారులకున్
పోరాములైనవారికి
నీరకముల శిక్షలుండు నిష్టతగలుగన్

Sunday, September 22, 2013

ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుడు పుట్టెన్

కట్టుంగ నగర మందున
ముట్లుడిగిన  సతికి నొక్క పుత్రుడు పుట్టెన్
అట్లని యంటిర ! చిత్రము
ఇట్లయె  కలికాల మౌర ! యేమని జెపుదున్ ?

హనుమానంద లహరి

రామ నామము బలుకుదు  రమ్య మలర
రామ భజనలు  సేతును రాగ మొప్ప
నీకు  కైదండ లిడుదును  నీవ  దిక్కు
నా మనంబున నుండుమా  రామ భక్త !

దోమ

దోమ లు  దోమలుదోమలు
దోమలతో నిండి యుండె  దుహినము  కంటే ?
దోమల జంపుట కొఱకై
ధూ మము  మఱి  యింటి నిండ  దూ రగ జేతున్ 

ముద్దబంతి పూలు

ముద్దబంతి పూలు  ముచ్చట గానుండు
దండ గ్రుచ్చి కట్ట దండి గాను
అంద గించు దార బంధములు మిగుల
పూల లోన  బంతి పూలు  మిన్న 

విశ్వాస ఘాతకుడు

లేదు లేదని  వచ్చిన బీద వాని
చేర  దీ సియు  మఱియును  జిదిమి పండ్లు
కోసి యిచ్చెను దినుమని , క్రూరు  డతడు
కత్తి  ఝ ళిపించె   విశ్వాస ఘాత కుండు 

జింకను గని బెదరి పారె చిరుత పులి వడిన్

డొంకల  మాటున  నొదిగిన
జింకను గని  బెదరి  పారె  చిరుత పులి వడిన్
బింకమగు సింహ మనుకొని
అంకము పై నున్న  పిల్ల యదురుచు  నుండన్ 

Friday, September 20, 2013

దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్

వినుమిది యగ్రజ ! !కుంతీ
దనుజులు హరి భజన జేయు ధన్యులు సుమతుల్
అనవరతము  కృష్ణు మనన
మెనరంగా  జేతు రార్య ! యె ప్పు డు మదిలోన్ 

జూదము

వ్యసనము లన్నిటి కంటెను
వ్యసనము మఱి  జూద మరయ  వ్యధలను గూర్చున్
వ్యసనంబు లేడు  రకములు
వ్యసనంబుల దరికి బోక వర్తిలు మెపుడున్ 

Thursday, September 19, 2013

ఋ ణాను బంధము

పశు గణంబులు  సుతులును పత్ని యరయ
ఋణమున కనుబంధములుగ  బృధివి  యందు
కలుగు చుందురు  మఱి ఋణ  ములుము  గియగ
పోవు చుందురు  నిజమిది  పూవు  బోడి !

Wednesday, September 18, 2013

దురాశ

ఆశ యుండ దగు  మఱి దురాశ యుండ
కూడ దెప్పుడు , మనముగా  గోరి కలను
నణచి  పెట్టుకొ  నవలెను  నపుడు గలుగు
మనసునకు హాయి , సత్యము  మనుజు లార !

శబ్ద కాలుష్యము

కాలుష్యము లన్నిటిలో
కాలుష్యము శబ్ద మరయ  క లుషితు జేయున్
మేలివియు లేని చోటులు
బాలలు కడు దూరముంట  పఱగును  నెపుడున్ 

పుస్తకముల జదువువాని బుద్ధి నశించున్

మస్తకము నిండి యుండును
పుస్తకముల జదువువాని , బుద్ధి నశించున్
సుస్థిరత లేని కవితల
పుస్తకములు చదువు నెడల పొరలు పొరలుగాన్ 

Tuesday, September 17, 2013

సంప్రదాయము లు

సంప్రదాయము ల ను పేర జగము నందు
ఇచ్చి పుచ్చుకోవడ ములే  యిచ్ఛ తోడ
జరుగు చుండును నెన్నియో ,సరకు గొనక
న్యాయ మార్గాన  నడువుము  నరుడ ! నీవు
 

మూఢ మతులాదరింత్రు ముముక్షువులను

మొండి వాదన  జేతురు  ముఖ్యముగను
మూఢ మతులా,దరింత్రు  ముముక్షువులను
దేవతా గణ మనిశము  దైవ మనుచు
స్వాగ తింతురు  కూడను  స్వర్గ మునకు 

గణేశ నిమజ్జనము

తొమ్మి దిదినంబు లియ్యెడ నెమ్మనమున
భక్తి  శ్రధ్ధల  బూజించి భర్గు సుతుని
భక్ష్య భోజ్యముల్  సరగున  భక్తి నిడుచు
చేతురు నిమజ్జనము నిక చెరువు  నందు 

Monday, September 16, 2013

తాతను వివాహ మాడెను తరుణీ మెచ్చి

పావని తనకు బంధువు , వరుసకైన
తాతను వివాహ మాడెను , తరుణీ మెచ్చి
వేయి రూప్యము లిచ్చెను  వికట కవికి
నాత  నికధలు  జదువగ  హర్ష మొంది 

జోల పాట

జోల పాటను బాడుదు నోలలామ !
నిదుర పొమ్ముమ  యికనైన నిశ్చలముగ
చాల పనియుండె నికనాకు  ,చాలు కినుక
పండు కొనుమమ్మ బాలిక ! పండు కొనుము 

Sunday, September 15, 2013

తన్మయత్వము

మంగ ళం పల్లి గానము మధుర మగుచు
నోల లాడించి హృదయాల నుత్స హించు
తన్మ యత్వము పొందించు తట్టు మదిని
మంగ ళం బును  గలిగించు మనుజ తతికి 

బలరాముడు లంక జేర వారధి గట్టెన్

అల కృష్ణున కన్నయె యీ
బలరాముడు , లంక జేర వారధి గట్టెన్
జలధిం బెను రాళ్ళు బఱచి
బలములనే జూపు కొనుచు వానర సేనల్ 

Saturday, September 14, 2013

పగటికలలు

రాజు నగుదును బాలింతు రాజ్యము నిల
మీ రు  బానిసలుగ నుండి  మేము పంపు
నాజ్ఞలను నెర  వేర్చుడ ననగ
పగటి కలలను గంటివా / పార్ధ ! నీవు 

గంగడోలు

ఆవు మెడకు క్రింద యరుదైన చర్మము
వ్రేలు చుండు నార్య ! వింతగాను
గంగడోలు గ బరగంగు నదియ సుమ్ము
దాని దువ్వ యావు దరికి వచ్చు 

అమృతము సేవించి సురలు హతు లైరి గదా !

అమరత్వము  నొందిరి మఱి
అమృతము సేవించి సురలు, హతు లైరి గదా !
సమరంబున రాక్షసులా
కమలాక్షుని  జూచు తోడ  కలవర బడుచున్ 

గుడి గంటలు -బడిగంటలు

గుడి గంటలు బడిగంటలు
  వడివడిగా మ్రోగుచుండు బడిలో గుడిలోన్
బడిలో పిల్లల కొఱకవి
గుడిలో నవి భక్తతతులు కోరిక లడుగన్
 

Friday, September 13, 2013

భాషకేలనయ్య వ్యాకరణము

భాషకేలనయ్య వ్యాకరణమనుట
నొప్పు దార్య ! వినుము  తప్పని సరి
భాషకు మఱి తగిన వ్యాకరణ మవస
రమ్ము నా పలుకు నిజము సుమ్ము 

గుణ త్రయము

సత్త్వ గుణమున కర్ధము  సాధుతనము
చూడ రాజస మొసగు రజో గుణంబు
తామసము నొనగూ ర్చు నధమ గతినిల
ఈ గుణములే గుణ త్రయ మిందు వదన !

దుర్దినము

సూర్య దర్శన భాగ్యంబు  జూర గొనిన
దినము నండ్రు  నిపుణులు దుర్దినము  నాగ
భోజనంబులు సేయరు భువిని వారు
సూర్య భగవాను  కిరణాలు సూచు వరకు
 

పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్

అంజీ ! యెక్కడ నుం టివి ?
ముంజులు  మఱి  వేగ దెమ్ము  మూ షికమునకున్
నంజుగ బెట్టుద మనగను
పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్
 

తులసి కోట

తులసి కోట లోని  తులసి మొక్కను జూడ
మనసు పొంగు చుండు  ననవ రతము
పచ్చదనము గలిగి  బహు ళ శాఖల నొప్పు
అమ్మ ! తులసి ! నతుల  నందు కొనుము 

Wednesday, September 11, 2013

స్వర్గము -నరకము

పుణ్య కార్యము లొనగూర్చు  పురుషు డిలను
సకల సుఖములు నొందును జక్క గాను
స్వర్గమే యది వారికి ,దుర్గమ మగు
పాప కర్మలు సేసెడి  పాపు లకును


నరకము విషయము నరయగ
నరకము నా వేరు లేదు  నరులకు నెపుడున్
నిరతము గనబడు చుండును
తరుణులు సరి లేని యెడల  దారగ నిలలోన్ 

బూర్లు- పులిహోర

బూర్లు పులిహోర చేయను బోటి పడుచు
నొకరు మించిన మరియొక  రుత్సహించి
అమ్మలక్కలు  మూవురు  కమ్మగాను
చేయ మొదలిడి రిచ్చట చేత లిపుడు 

బానిస బ్రతుకే నయమని పలికెను గాం ధీ

మానమునే య మ్ముకొనుట
బానిస బ్రతుకే  నయమని పలికెను గాం ధీ
పూ నికతో  ప్రాణము లిడి
మానక స్వాతంత్ర్య  మిపుడు మనకు లభింపన్ 

Tuesday, September 10, 2013

వేట పాలెము

విజయ దశమి పర్వ దినాన  విజయ ముగను
వేట పాలెము నందున మెప్పు నొందు
సంస్థ  నెలకొల్ప బడెను సా  రస్వత పర
మైన విద్యాలయం బట  యార్య  గనుడు .
 

పాయసమ్మున గారమ్ము వేయదగును

వేడి యుండగ  చక్కెర  వేయదగును
పాయసమ్మున ,  గారమ్ము వేయనొప్పు
నాలు  వేపుడు రుచిగను  నాహ రించ
ఉప్పు కారాల వలననే  నొప్పు కూర .
 

Monday, September 9, 2013

కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్

తలపగ  రాయలు మించిన 
కలడే  విజ్ఞాన ఖని  శకారుని  కంటెన్
పలు దుర్మార్గపు పనులను
అలవోకగ జేయువాడు  నవనిని  గలడే !
 

పునర్జన్మ

పుట్టి మరణించి మరల ను  బు ట్టుట ,యను
దాని నండ్రు పునర్జన్మ  యైన యట్లు
ప్రాణి జేసిన  కర్మల  బట్టి మరల
జన్మ లెత్తును  బుడమిని  సత్య మిదియ



 

Sunday, September 8, 2013

గరళ కం ఠు ని శత్రువు గజ ముఖుండు

మానినులకు  మరులు గొల్పు  మన్మ ధుండు
గరళ కం ఠు ని  శత్రువు , గజ ముఖుండు
పార్వతీ పరమ శివుల  ప్రధమ  సుతుడు
పూజ జేయగ వారిలో మొదటి  వేల్పు 

Saturday, September 7, 2013

ది . 22-10-2013 తేదీన శుభాష్ ,జ్యోతిల వివాహము సందర్భముగా సమర్పించు పద్యాంజలి పూర్వక ఆశీ స్సులు

హాయ్ ! సుభాష్ !


తల్లి దండ్రుల కేకైక  తనయు డీవు
అక్క లిద్దరి  గారాబు "అనుజు " డీవు
బావ లిద్దరి  ముద్దుల  బావ వీవు
అందు కొను ముర!  యా శీ స్సు  లందు కొనుము


పెండ్లి యీ డు రాగ  పెండ్లి సేయుట గూర్చి
తల్లి దండ్రులు మఱి  యెల్ల వారు
వెదుక  మొదలిడ  నిక  వధువు కొ ఱకు వారు
కాను పించె  యీ మె  కన్ను గవకు


ఊరి  పెద్దలు మోదాన  నోల లాడ
తల్లి దండ్రులు  ననుమతి  దనకు నీయ
చూడ చక్కని  మూ ర్తము  సొంపు  లలర
అయ్య వారలు  బెట్టిరి  యంచితముగ


ఒకరికొఱకునై  మఱి యొక రుద్భ వించి
అగ్ని సాక్షిగ  నొకటిగ  నగుట కొఱకు
వేచి యుండిరి  యిరువురు  వినయముగను
వరలు  కళ్యాణ  ఘడియలు  వచ్చు వరకు



జ్యోతి నీ పట్ల నిజముగ  జోతి యగును
సంది యంబిసు మంతయు నిందు లేదు
కాన నొకరికి నొకరుగా  గలిసి  యుండి
జీ వ యాత్రను సాగించు  సేమ మలర


అమ్మా !  జ్యోతీ !


అత్త మామలు మఱి యును  నాడు బిడ్డ
లరయ  మంచి వా  రలు మఱి  యబల ! నీవు
వారి కనుసన్న మెలగంగ  వలయు నమ్మ !
అట్లు జేసిన  సంతోష మమ్మ ! మిగుల


తనర యీ సుభాషును నీకు  తగిన భర్త
ఎదురు చెప్పక వానికి  నెపుడు నీవు
పాలు నీ రును  బోలుచు  బ్రదుకు చుండి
మంచి గృహిణిగ  బేరొం దు  మనుజు లందు


మాన వత్త్వంబు తోడన మసలు కొనుచు
మానినుల యందగుచు  దల  మానికముగ
పిల్ల పాపల తోడన  చల్ల గాను
నిండు నూరేళ్ళు  బ్రదుకుమా  నెమ్మనమున


సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రె ప్ప యట్లయి  కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .


రచన :  పోచిరాజు  సుబ్బారావు
(పెద్ద మామయ్య)



















 

ప్ర పత్తి

భక్తి  మఱియు ప్ర  పత్తుల  భరిత మగుచు
శివుని పూజించు  మనుజుడు శీ ఘ్ర ముగను
మోక్ష పదమును  జేరును ముక్తు డగుచు
సంది యంబును  నిసుమంత  పొంద వలదు 

వాసవునకు మయూ రమ్ము వాహనమ్ము

పరగ   నైరావతము కద  వాహనమ్ము
వాసవునకు , మయూ రమ్ము వాహనమ్ము
శంక రాత్మజు డైనట్టి   షణ్ము ఖు నకు
వాహనమ్ములు   వేరైన దయ్య మొకటె .

(దై వము  ప్ర కృ తి ,దయ్యము  వికృ తి )

Friday, September 6, 2013

నాధ ! ఓం నమో నారాయణాయ ! యనకు

పలుకు మిట్లని బలికె  భర్త తోడ
నాధ ! ఓం నమో నారాయణాయ !, యనకు
మెప్పు డెవరిని  నేమియు నిచ్ఛ తోడ
మంచి వారల  లక్షణ  మదియ సుమ్ము 

రోదనము

ఆదరువు లేని  చోటన
వేదనములు గలిగి  మనసు  వివశత  నొందున్
బాధలు  పెరిగిన యెడ ల ను
రోదనమే చివరి మెట్టు  ఋ షులకు  నైనన్
 

Thursday, September 5, 2013

సర్వదా చింతయే గాదె సంతు వలన

గంప గయ్యాళి యౌ  భార్య  గలుగు నెడల
సర్వదా చింతయే గాదె , సంతు వలన 
వంశ  మభి వృ ధ్ధి మార్గాన  బచ్చ గాను
ఉడు పతిని వోలె  కాంతులు  నొందు చుండు  

పిల్లి

ఓగిరమ్ము  కొఱకు  వేగిరమ్ము పడునా
గోడ మీది పిల్లి చూడు డార్య !
నలుపు రంగు తోడ మిలమిల  లాడుచు
మూషి కమ్ము కొఱకు  వేచు చుండె . 

సర్వేపల్లి రాధా కృష్ణన్

రాధా కృష్ణున కిడుదును
పాదాలకు వందనంబు  వరమగు  భక్తిన్
ఆదిని గురువే యాయన
మీదన  నధ్యక్షు డయ్యె  మేదిని మనకున్ 

పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయులిలన్

కాపురుషు లనెడి  వారలు
పాపాత్ములె , పూజ్యులగు  నుపాధ్యాయులిలన్
పాపాలు సేయ కుండగ
ప్రాపుగ మన వెంట నుండి రక్షణ సేయున్ 

Tuesday, September 3, 2013

శివ గంగ

చిత్ర మందు జూడ శివుడు గంగ నడుమ
నుండి జంతు వొకటి  యురము నందు
పెట్టు కొనిన యట్లయె  ట్టు  లుం  డె నొగద !
ఏది యే మయినను  నీ శు గొలుతు
 

Monday, September 2, 2013

శూలి తనయ గంగ సోదరి యుమ

విఘ్న నాయకుడగు  విఘ్నేశ్వరుడు మఱి
శూలి తనయ,  గంగ సోదరి యుమ
జగము నకు ను  నిదియ సత్యము  మఱియును
గంగ యుమలి  రువురు  కంతు  చెలులు 

బావ

అక్క భర్త బావ  యగును గదా మఱి
అత్త  కొడుకు  బావ  యగును నిలను
మామ కొడుకు  బావమరది  య గును గద
వరుస లిటులె  యుండు  బంధు వు లలొ 

Sunday, September 1, 2013

హంతకునకు వర మొసంగె నలర జగము

రాము డ వతార  పురుషుడై  రావణున్ని
జంపి  హంతకు డయ్యును   సకల జనులు
సంత  సంబును  బొందుచు  సాదరముగ
హంతకునకు వర మొసంగె  నలర జగము 

Saturday, August 31, 2013

పాదమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్

మీదకు రానేరడు గద
పాదమ్ములు  లేని నరుడు , పరుగిడ జొచ్చె
న్నీ దరి కాదరి కా తడు
వేదన మఱి  దాళ లేక వీ రడు  మిగులన్ 

దానిమ్మ

చూడు దానిమ్మ ఫలమును  చూడ్కు లలర
గింజ లుండెను  ము త్యపు  గింజ వోలె
తినుట మొదలిడ నోరంత  తీపి  గలిగి
మంచి రుచి నిచ్చు నయ్యది  ,మంచి  ఫలము 

Friday, August 30, 2013

కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను

నాదు  సోదరి గిరిజకు  నల్ల గాను
కొడుకు పుట్టె , సన్యాసికి గురువు కృపను
ముక్తి గలుగగ  జేరెను  మోక్ష పధము
గురువు దయలుండ  సాధించు  కొనగ  గలము 

తెలుగు పద్యము

తెలుగు పద్యపు  భావమ్ము  తీ యనగుచు
సంతసమ్మును  గలిగించు  జదు వరులకు
అందువలనతా  ననియెను  నాంధ్ర భోజు
డైన  రాయలు  మఱి లెస్స  యైన  దనియు
 

Thursday, August 29, 2013

సతి సతి గవయంగ సంతు గలిగె

కలుసుకొనిరి  విందు గలుగు చోటన  మఱి
సతి సతి  గవయంగ  సంతు గలిగె
భార్య మరియు  భర్త బహు దినంబులు నట
సహజ మీయది  యిక  జగము నందు
 

లోభి

తాను  దినడు  మఱి ని  దాచు సంపద మొత్త
మంత , పెట్ట డితర  మనుజు లకును
లోభి గుణ మదియ   లాభ మేమియు లేదు
వ్యర్ధ మతని  బ్రదుకు  వసుధ లోన 

Wednesday, August 28, 2013

భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు

ఇందు  సందేహ  మేలనో  నిదియ నిజము
భాగ్య నగరమ్ము  హైదరాబాదు, కాదు
అనిన నొప్పదు ముమ్మాటి కదియ సుమ్ము
కంది  శంకర ! నమ్ముడు  కల్ల కాదు .
 

ఆకాశవాణి

పలికె ఆకాశవాణి  యా ప్రభుని గూర్చి
యీ శకుంతల  భార్యయే  యీశ ! నీకు
అనగ  దుష్యంతు డ య్యెడ  యనుమ తించ
పూల  వర్షము గురిసెను  మురిపెముగను


ఆకాశవాణి పలికెను
సంకోచము లేక నీవు  సాదరముంగాన్
శాకుంతల యను నీమెను
స్వీ కారము చేయుమార్య !  చెఱు గని బుద్ధిన్ 

Tuesday, August 27, 2013

ఒడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్

విడ్డూర  మిదియ  చూడుడు
ఒడ్డాణ మలంకరించె  నువిద  శిరమ్మున్
వడ్డాది వా రి యింటను
విడ్డూ రము కాద  యిదియ ?  వీ క్షిం పం గన్ 

పచ్చి మిరప కాయ

పచ్చి మిరప కాయ  పచ్చగ   నలరెను
గూబ  గుయ్య మనును  గొప్ప కొఱకు
కఱ కఱ మని తినిన  కార మ  గుచును
కాన  శ్రద్ధ  మేలు దాని పట్ల 

Monday, August 26, 2013

పకోడి

కళ్ళు దె ఱవ గ నె ప కో డి  కాని పించె
ఏమి భా గ్య ము ? మనకిక యీ దిన మ్ము
వేడి వే డి గ  ది  ను దము  వే గ ము  గను
ఆలసించిన విషమగు  నమృత  ము గ ద !
 

ఉల్లి గ డ్డల దిను వార లె ల్ల ఖలులు

ఉల్లి నందురు  కద సామి !  తల్లి వంటి
దనుచు  మఱి యేల  మీ రె య  ట్లంటి  రిపుడు ?
ఉల్లి  గ డ్డల  దిను వార లె  ల్ల  ఖలులు
గాదని సెల వీ యుడు మఱి  కంది  సామి !

Sunday, August 25, 2013

ప్రాతః కాలము

ప్రాతః కాలమె లేచుచు
చేతో మోదంబు గలుగ  చిన్మయ మూర్తి
న్నాత్రత  నారాధించిన
ఆతడె  మనకిచ్చు  నెపుడు  నమితపు సిరులన్
 

వేశ్య కౌగిలింతను గోరి వెడలె యోగి

సాని కొంపకు రయమున  సత్తి బాబు
వేశ్య కౌగిలింతను గోరి  వెడలె,  యోగి
వేమన శతకము వ్రాసె   వినుర వేమ
అనెడు మకుటాన  పద్యము లద్భుతముగ 

శీ త కన్ను

నాదు  రచనలకు జిలేబి సోదరి మఱి
చూచు  తోడనే  స్పందించి చొరవ చూపి
వ్రాయు చుండెడి వారలు  వ్యాఖ్యలు నిక
శీ త కన్నును వేసిరి  వ్రాత లేక 

వాణి -- రాణి

వాణి  మఱియును  సోదరి  రాణి యరయ
ఒక్కరే మఱి  యెటు లను  చక్క గాను
నటన చేయుచు నుండిరి  పటువు  తోడ
దర్శకుని మహిమము కద  దనరె  నటుల ?

మరో చరిత్ర

 సీ ర్య  లందు మరో చరిత్ర రయముగను
 సాగు చున్నది  యందలి సర్వ జనులు
పార వశ్యులై  తమతమ పాత్ర లందు
నటన గావించు చుండిరి  జట్టు గూడి
 

Saturday, August 24, 2013

బకమున్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా

నకనక లాడుచు  మఱి యా
శకటంబున దిరుగుచుండ  శలభము  గానన్
వికశించిన  ముఖమున శా
బకమున్వడి  మ్రింగుచున్న బల్లిం  గనుమా
 

కృష్ణా నది స్తోత్రము

పోవు నఘములు నీ నీట  మునుగ తల్లి !
కలుగు శుభములు  నీపేరు  పలుకు కతన
నిన్ను నమ్మిన వారికి నీడ నిత్తు
వుకద   కృష్ణమ్మ ! నిజమైన  పూజ సేసి 

అనుబంధాలు

తాత  తండ్రి  భార్య తనయులు మఱియును
బావ యికను  మేటి బంధు తతుల
బంధము లొకదాని  వరుసన నొకటిగ
దనరు బంధ ములె య  గు నను బం ధాలు గ . 

గడియారము

గడియారము  చూడగ  మఱి
గడియారపు  ముళ్ళు సూపు  గంటలు నిమిషాల్
నడయాడుచు  గుండ్రముగను
సుడులుంగా  మనము కూడ  సూర్యుని చుట్టున్
 

Friday, August 23, 2013

బాం ధవ్యములు

పాలకుల నిర్ణయంబులు  ప్రజల కు మఱి
నష్ట మనిపించి  యాందోళ న లు స  లిపిరి
ప్రభుత  ప్రజల బాం   ధవ్యపు  పట్టు లేక
జరుగు చున్నవి  బందులు  జగము నందు 

మురళీ గానమ్ము మరణమును గలిగించున్

పరమ పదంబును జేర్చును
మురళీ గానమ్ము,  మరణమును గలిగించున్
విరివిగ దీపి పదార్ధము
లరుదుగ  మధు మేహ రోగి  యాహా రించన్ 

గొడ్రాలు

సంతు లేమిని నందురు  జనులు భువిని
మఱియు  రా నీ యరు గ  శుభ కార్యములకు
ముద్ర వేతురు గొడ్రాలు  ముదిత యనుచు
నాతి పట్ల యి  ట్లనుటను  నాయ మగునె ?

ఆశీ స్సులు



భువిని నడకుదిటి  గృహపు  భూ ష  ణుండు
తల్లి దండ్రుల గారాబు తనయు డైన
వేంకట  సువర్ణ మునకునౌ  విధి తలచె ను
పెండ్లి చేయవలెననుచు బ్రీ తి తోడ


ఒకరి కొఱకునై  మఱి యొక రుద్భ వించి
కనులు కనులను గలుపగ  దనివి తీ ర
కాంచి పెద్దలు ,పెట్టిరి మంచి  మూ రు
తమ్ము నీ రోజు రాతిరి యిమ్ము గాను


వరుడు పుట్టె  నడకుదిటి వారి యింట
రావి  నూ తల యింటను  రామ పద్మ
ఒకరికి నొకరు తోడుగా నుండి మఱి ని
పరమ సంతోషముగ నిల బ్రతుకు గాక !


వధువు నుద్దేశించి ;;


మగువ ! అత్తమామలు  గడు మంచి వారు
వారి కనుసన్న మెలగుము  , మారు పలుక
వలదు , సంతోష బెట్టుము భర్త నెపుడు
అట్లు మెలగుచు నాశీ స్సు లందు కొనుము


పుట్టి నింటను మెలగిన నట్లు విధము
మెట్టి నింటను మెలగుచు  నెట్టి  లోటు
రాని  విధముగ  వర్తిలి  రామ పద్మ !
జీ వితంబును  సాగించు  నీవ యికను


అమ్మ నాన్నల విడిచియు  నరుగు దేర
బెంగ యుండును నిజమిది బేల ! నీకు
అత్త లోనన జూడుమా  యమ్మ నికను
కొదవ లేకుండ మనసు నీ  కుదుట పడును


ఎదురు చెప్పక జేయుమ యె వరి కైన
మంచి గృహిణిగ  నెదుగుము  మంది లోన
మాన వత్త్వంబు తోడన మసలు  గొనుచు
మానినులయందగుము దల  మానికముగ


సకల శుభములు గలిగించు శంకరుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని  రెప్ప  యట్లయి కాచు గాత !
ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను


(28-8-2013 తేదీన  వెంకట సువర్ణ రత్న కుమార్ ,పద్మ లతల వివాహము
సందర్భ ముగా )

రచన ;  పోచిరాజు సుబ్బారావు


















 

తిరుగలి

తిరుగలిని జూడు డా ర్యులు
అరమరలో నుండె  నచట యందము దోపన్
తిరుగలివలె యీ బ్రతుకులు
తిరుగుచునే నుండు భువిని  దినముం  దినమున్  

తీ ర్ధ యాత్రలవలన వర్ధిల్లు నఘము

పుణ్య పురుషార్ధములు మఱి  గణ్య ముగను
తీ ర్ధ యాత్రలవలన  వర్ధిల్లు, నఘము
కలుగు  ప్రాణ హింస జరుగు  నెలవు చోట
ప్రాణ హింసను  జేయక పదిల పడుము 

Wednesday, August 21, 2013

జనా ర ణ్య ము

రా ష్ట్ర  సమైక్య  కొఱకునై  రాష్ట్ర  మం త
చేయు చుండిన  సీ మాంధ్ర  నాయకు  ల ట
బందు లాం దో ళ నంబుల   చంద  మరయ
కాను పించెజ  నారణ్య  మౌ  నను న టు








 

రామ భక్తులలో మేటి రా వ ణుం డు

వాయువేగము  గల య ట్టి    వాయు సు తుడు
రామ  భక్తులలో  మేటి,  రా వ ణుం డు
శివుని  భ క్తుడు , నూ టొ క్క  శివుని  లింగ
ములకు బ్రతిదిన  మభి షేక  ము నొన  గూర్చు 

Tuesday, August 20, 2013

సానీ నీ సాటి గలరె సాధ్వుల లోనన్

పోనీలే యని  యుండగ
మేనంతయు  నిండునట్లు  మెక  చర్మంబా !
కానీ నీయీ పని , దొర
సానీ నీ సాటి గలరె  సాధ్వుల లోనన్ 

రక్షా బంధనము

బంధ మయ్యది బలముగ  బట్టు కొఱకు
కట్టు చుండెను  రాకీని  బిట్టు గాను
అరయ శ్రావణ  పూర్ణిమ  యగుట వలన
నేడు ,చిత్ర పు  చిత్రము  చూడు డార్య !

Monday, August 19, 2013

యమ మహిష ఘంటికా నాద మతి హితమ్ము

చేతు  లాడక  వినలేని  చెవులు  మఱియు
నోరు పలుకక  నడువక  కాళ్ళు   లేచి
నిలబ  డు టకును  బలములే  నినత  నికిల
యమ మహిష ఘంటికా నాద మతి హితమ్ము 

తెలుగు జాతి మనది

తెగువ గలిగిన జాతిరా తెలుగు జాతి
మనది  నిస్స్వార్ధ మయమునై  దనరు చుండు
వేడు కొందును శంభుని  వినయముగను
తెలుగు వాడిగ  బుట్టుక గలుగు కతన 

Sunday, August 18, 2013

పెన్నిధి

పేదల పెన్నిధి యనబడు 
వేదుల రామయ్య  మేటి వితరణ యందున్ 
బీదలు గోరక మునుపే 
లేదనకన నిచ్చు నెపుడు నాదర మొప్పన్
 

వలదు వలదనుకొన్నసం ప్రాప్త మగును

పూర్వ జన్మల  పుణ్యంబు  పొందు కతన
భోగ భాగ్యముల్జనులకు  భూరిగాను
వలదు వలదనుకొన్నసం  ప్రాప్త మగును
సందియం బిసుమంతయు  నిం దు  లేదు 

కైంకర్యము

ప్రతి దినంబును  జేతురు  భక్తులు మఱి
భక్తి శ్రద్ధలు గలుగుచు  రక్తి తోడ 
భవుని  కైంకర్య మత్యంత  వైభవంబు 
కలుగు నట్లుగ  శుభములు గలుగు కొఱకు 

రూపాల సంగమేశ్వర స్వామి --కర్నూలు

ధరణి వె లయుజ  గన్నాధు దలము మీద
సంగ మేశ్వరు  స్వామిని శక్తి కొలది
పూజ జేయగ  నేగగ  మోజు పడుచు
స్వామి  దర్శన మాయెను  సంతసముగ


మంత్ర యుతముగ  నర్చన తంతు పూర్తి
గాగ పూజారి యిచ్చెను నగవు తోడ
తీర్ధ ప్రాసాదములు మాకు  తియ్య వైన
అందు కొంటిమి మఱి యును  నార గించి


పిదప  యాంజ నేయు  స్తాట్యు  పేర్మి తోడ
మార్గ మంతయు గతుకుల మయము నైన
చూడ నేగితి  మచట కు  చొరవ తోడ
చూడ నద్భుతముగ నుండె  చూచు కొలది


ఉర్వి జనములు సుఖముగ  నుండు కొఱకు
దైవ ప్రార్ధన జేసితి నీ వ ,స్వామి !
ఎల్ల వేళల గాపాడు  చల్ల గాను
నీవె దిక్కిక గోరుదు  నిన్నె శరణు


వాన రాకడ గమనించి  పై నభమున
పయన మైతిమి యింటికి రయము గాను
ఒక్క య ఱగంట పయనమై సుఖము గాను
చేరు కొంటిమి యింటికి సేమము గను





Saturday, August 17, 2013

తెలుగు లెస్స

దేశ భాష లందు తెలుగు లెస్స నియెను
సార్వ భౌము డపుడు సరిగ బలికె
తేనె లొలుకు భాష తెలుగు భాషయె మఱి
అర్ధమగును నార్య యందఱకును




భీ మసేనుండు దేవకీ ప్రియ సుతుండు

పాండవుల యందు  నరయగ  బాహుబలుడు
భీ మసేనుండు,  దేవకీ ప్రియ సుతుండు
మనకు నారాధ్య దేవుడు కృష్ణుడె  కద
వందనంబు బృం  దావన  వాసి కార్య !





Friday, August 16, 2013

గురు బోధనము


కణ్వు  డాదిగ ఋషుల యా   కథలు వినగ 
దెలియ వచ్చెను  పూర్వము తిరము గాను 
ఆశ్ర మంబున  శిష్యుల కాశ్ర యంబు 
నిచ్చి గావించె బోధన  లింపుగాను 

మద్యమును గ్రోలు డనునదే మంచిమాట

మద్యమును గ్రోలు డనునదే మంచిమాట
యనుట నొప్పైన  బ్రతివారు హాయి యనుచు
కైపు నెక్కగ ద్రాగు చు  గంతు  లేతు
రార్య ! నిజమిది  నమ్ముడు  మీ రు  కూడ 

Thursday, August 15, 2013

పుస్త కమ్ము చదువు వాడు ఖలుడు సుమ్ము

అనువు గాని చోట యనవరతము పుస్త
కమ్ము చదువు వాడు ఖలుడు సుమ్ము
పుస్తకమ్ము జదువ పొలుపుగ మఱి   వాని
సుజను డండ్రు  లల్లి ! సుజన   గణము 

పిడికిట సూర్యుడు

పిడికిట సూర్యుని జూడుము
పిడికిలి లో వెలుగు చుండె పేరిమి రశ్మిన్
పిడికిలి య వంశిగారిది
అడకువతో ,నీ కునతులు  నారని జో తీ !                                                        

Wednesday, August 14, 2013

స్వాతంత్ర్య ఫలము దక్కు స్వార్ధ పరులకే

 నేతల మోసపు మాటలు
ప్రీ తిగనేయుం డుగాని   ప్రేమలు  గరువౌ
స్వాతంత్ర్యము మనకు  గలుగ
స్వాతంత్ర్య ఫలము దక్కు  స్వార్ధ పరులకే 

స్వాతంత్ర దినో త్స వము

ఈ రోజు మనకు పండుగ
సై , రా యీ  దేశమునకు  స్వా తంత్ర్యం బున్
 మా  రణ హోమము  పిమ్మట
వైరుడు  దా   బోవు గతన  వచ్చెను నరుడా !

Tuesday, August 13, 2013

అ పరిఛితులు

నమ్మకుము దుష్ట జనులను
నమ్మకుమా యపరిచితుల నర్మపు  మాటల్
నమ్మకుము నీ మనస్సును
నమ్ముము మఱి దేవ దేవు  నామము  నరుడా !



హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్

బేరము  లాడితి  గట్టిగ
హారము కొఱకై  యొక సతి హారము నమ్మెన్
కారణ మరయగ  దెలిసెను
వారసుడగు గొడుకు బంప వాషింగ్టనుకున్




అయిష్ట మగునుగ కవిత్వ మధముల కు గదా !

రయముగ రండిటు  చదువుదు
జయమెవరిదొ  దెలియునిపుడు  సంపూ ర్ణముగన్
భయ మనుచు విడుతు రది యిం
పయినను ఖలునకు కవిత్వ మధములకు గదా 

Monday, August 12, 2013

శిల -శిల్పము

శిలను జెక్కువాని  శిల్పి యండ్రు భువిని
శిల్పి చెక్కు శిలను  శిల్ప ముగను
ప్రాణ ముండు దాని వలె  రమ్యమై యుండి
మనసు దోచు కొనును  మాన్యు లార !

Sunday, August 11, 2013

లచ్చి మగని కైదువు త్రి శూ లమ్ము గాదె

దైత్య గణమును సు వి  దారక మైనది
లచ్చి మగని కైదువు , త్రి శూ లమ్ము గాదె
భవుని నాయుధంబు  భవ్య మగునదియా
ఆయుధంబు లార ! హాయి నిండు 

అద్దె యిల్లు

స్వంత యిల్లు  లేని వారల కద్దె కొం
ప మఱి  తప్ప దార్య ! పాడు వడిన
దైన  మంచి  దైన నిక మనువచట నే
గడుప వలెను  నెంత కష్ట మైన





 

పచ్చని చెట్టు

పచ్చని చెట్టును  గొట్టిన
పచ్చగ వాడుండ బోడు భరణిని  నిజమున్
నచ్చక యీ నా మాటలు
విచ్చలవిడి గొట్టె నేని  వివశత నొందున్


కారణం బును   లేకయ ఖడ్గ మూని
ఎవడు కొట్టునో  చెట్టును  నీ పుడమిని
సరము  పడుగాక యనుచును  శాప మిచ్చు
చూడు ! పోవద్దు తరువుల జోలి కెపుడు


తరువు లేడ్చును నిజమిది తరుణు లార !
ఆకు రాల్చును దఱచుగ  నదియ గుర్తు
వాటి కాకులే కన్నీళ్ళు  వసుధ లోన
మనువు సాగించు నవి కూడ  మనకు వలెనె 

Saturday, August 10, 2013

ప్రత్యర్ధిని జూచి వడకె బార్థుం డని లోన్

ప్రత్యర్ధులు  సోదరులే
సత్యము , మఱి  వారి జంప  సముచితమేనా ?
హత్యలు దాజేయ ననుచు
ప్రత్యర్ధిని జూచి  వడకె   బార్థుం డని లోన్ 

గానుగ

తిలల నుండి ద్రిప్పి దీ యంగ  తైలము
జోడు  వృషభ ములను  గాడి కట్టి
త్రిప్పు చుండె జూడు   తెలుకల రామయ్య
చూడ ముచ్చట య్యె  జూచు కొలది 

ప్రాణ భీ తి

పిల్లి వాసన గనిబెట్టి  యెలుక  పాఱు
కుక్క కనిపించ  పిల్లులు  నక్కి యుండు
సింహ మగుపడ  జింకలు  చేవ జూపు
ప్రాణ భీ తినె గద  మఱి  ప్రాణు లన్ని 

పాపాత్మురాలు

పచ్చని చెట్టని  జూడక
పచ్చక దానుండ బోక పచ్చని పనసన్
కచ్చాగా గొట్టించెను
పిచ్చిది మఱి యేమొ  కాని పేరుకు వాణీ


కత్తి  దెబ్బలు  దినుచును  గదల కుండె
ఎంత బాధను నొందెనో  నెవరి కెఱు క
ప్రాణ హింసను జేయను  బాణి  యెటు ల
వచ్చె ?  మిక్కిలి క్రూరుడా  వాచు మేను


కత్తి దెబ్బలు బడుటన  కంది  మ్రాను
రాత్రి యంతయు నేడ్చెను  రాల్చి యాకు
ఏమి పాపము జేసెనో  నేమొ కాని
 నరుని నొకనిచే  గొమ్మలు నఱు క  బడెను . 

ఆప్త మిత్రుడు

కష్ట కాలమందు  కాపాడు నాతడే
 ఆప్త మిత్రుడనగ ననగ  వచ్చు
డబ్బు చూసి వచ్చు  డాం భికులను  మఱి
దూర ముంచ మేలు  దురిత దూర !

 

చతురోపాయములు

సామ దాన భేద నామమున దనరి
ప్రాణ హాని లేక బరగు నిలను
మఱి ని  దండ మనగ  మారణ హోమము
జరుగు నార్య   వలదు చావు
 

జ్వరము -లక్షణములు

ముక్కు దిబ్బడ మఱియును  ముఖము వాపు
కాళ్ళు నొప్పులు కళ్ళెఱ్ఱ  కరములు నిక
పట్టు లుండవు  దేహము బయలు కమ్ము
మైమ ఱు పు గల్గు నాకలి మంద గించు  

Friday, August 9, 2013

కోయ దొర

వేరు మందులు ముందర వేసి కొనుచు
సెల్లు ఫోనును జూచుచు శీ ఘ్రముగను
కూరు చుండెను హాయిగ కోయ దొరయ
చూడు డార్యులు  మఱి మీ రు  చోద్య మిదియ 

నెల కేడు దినమ్ములని గణిం తురు విజ్ఞుల్

అల శాస్రజ్ఞులు  సెప్పిరి
నెల కేడు దినమ్ములని ,గ ణిం తురు  విజ్ఞుల్
మెలమెల్ల గ దివిని గదలు
పలు తారల ఫలిత మార్య ! ప్రమదము తోడన్ 

Thursday, August 8, 2013

గురువులు , శంకరయ్య గారు !

ఆది దంపతు లనబడు  నయ్యు మా మ
హేశు లీ శంక  రార్యుల కా శి సులను
నిచ్చు గావుత ! రుగ్మము చచ్చు వడగ,
వడి గ   కోలుకొన రోగపు బారి నుండి 

రామజోగి మందు ప్రాణ హరము

రామజోగి మందు ప్రాణ హరము కాదు
ప్రాణము నిల బెట్టు  ప్రతియొ  కరికి
మందు వాడ  కంబు  మనుగడ  కొఱకు నౌ
కోరి   ప్రాణ హరము కొఱకు  కాదు 

పెంకుటిల్లు

ఇల దొడ్డ వరము నందున
అలయా చిత్రమును బోలి  యైదు గదుల తోన్
వెలసిన  యిల్లే  మాయది
చలువకునై బెంకు  పైన  చ ఱచితి మార్యా !

Wednesday, August 7, 2013

ఆది దంపతు లు

ఆది దంపతు లనబడు  నయ్యుమామ
హేశు లిచ్చు  గావుత ! మఱి  హేమమయము
లైన నాభరణం బులు  వాని భక్తు
ల కెపుడు  నిరతి  శయ మగు    ముక్తి గూడ 

త్రాగి పాడె నంట త్యా గ రాజు

నిండు జనము గలుగ  బండి రా ధా కృష్ణ
త్రాగి పాడె నంట ,  త్యా గ రాజు
రామ చంద్రు పైన  రమ్యమై  న గృతులు
రచన జేసి  మిగుల  రాణ  యొప్పె 

అత్తమీ ది కోపము దుత్త మీ ద జూపు

అత్తమీ దన నున్నట్టి యాగ్రహంబు
దుత్త మీదన జూపెను దుహిత యొకతె
ఏమి  సేతలు సేయను  జే త గాక
శాప నార్ధము లన్నియు  సైచి మిగుల
 

కూచిపూడి నృత్యము

నృత్యము లన్నిటి గంటెను
సత్యముగా జెప్పదగును చక్కని దనియున్
నృత్యమ కుచిపూడి  యనగ
సత్వరమే రండు మీరు  సకలము  నేర్వన్ 

మూడు ముళ్ళ బంధము

అండదండ లుండె  మెండుగ నాకిల
భర్త కూడ  మఱి ని  బాగయుంట
మూడు ముళ్ళ బంధము దెగువ నేర్పెను
బాగు ననగ జేతు  భావి నికను 

ఆటవిడుపు

ఆటవిడుపు గ  విడుచును  నయ్య వారు
పా    ఠ  ములువిని  విసిగిన  బాల బాలి
కలను  నా డుకొనుటకు నై   కలసిమెలసి
వారి మనసులు  హాయిగ మారు కొఱకు
 

Tuesday, August 6, 2013

శివ లాస్యము

శివ లాస్యమ యది , జూడగ
భవబంధము లన్ని దొలగి పరముం  గలుగున్
శివలాస్యపు  మహిమమ యది
శివ శివ యని పలుక మ నకు  సేమము  గలుగున్




 

పాండవులు దుష్ట చిత్తులై భంగ పడిరి

సాధు వర్తనులు మఱియు  సాత్త్వికులు ను
పాండవులు, దుష్ట చిత్తులై భంగ పడిరి
ధార్త రాష్ట్రులు  ఘోష యాత్ర కరి గి కద !
కలిసి    యుండిన  నెంతైన  కలుగు  సుఖము 

Monday, August 5, 2013

అప్పిచ్చెడు వాడు వైద్యు డగు ననిరి బుధుల్

ఎప్పుడు సుఖముగ  నుండుత !
అప్పిచ్చెడు వాడు,  వైద్యు డగు ననిరి బుధుల్
ఒప్పుగను  వైద్య శాస్త్రము
తప్పగ మఱి  జదువు వాడు ధరణిని వింటే ?

పానకాల స్వామి

బిందుల కొలది పానకం బ్రియము తోడ
ఇత్తు నెప్పుడు కాపాడు మిప్పుడీ శ !
దుష్ట సంహార !నరసింహ ! దురిత దూర !
నిన్ను నమ్మితి న నమ్ముము నిజము గాను 

ఉట్టికి నెగుర లేనమ్మ స్వర్గానికెగి రిం ద ట

ఉట్టి కెగురలే  దు మఱి యు నెట్టు లెగురు
దివికి నాయమ్మ తెగువన దెలియ జేయు
డార్య ! సాధ్యమ ? భువిలోన  నట్ల  గుటను
వింటి మామఱి  గంటి మా వీ స మైన



 

పుట్టుకతో వచ్చు బుద్ధి పుడకల వశ మౌ

పుట్టుకను వచ్చు బుద్ధులు
బిట్టున బోబోవు నరయ  పేడికి  నైనన్
అట్టులు సెప్పిన విధముగ
పుట్టుకతో వచ్చు బుద్ధి  పుడకల వశ మౌ 

Sunday, August 4, 2013

పద్య రచన -అడవి దున్నలు ,సింహము

అడవి దున్నల దాడికి నాగ లేక
పారి పోవుట జూచితె ? మీ రలార్య !
అడవి  యం తటి  కిని రాజు  నయ్యు  సింహ
మక్కట  !,  సమష్టి యనగను  నదియ సుమ్ము 

వావి వరుసలు జూడని వారనఘులు

వావి వరుసలు జూచి యు ద్వాహ మాడ
మంచి సంతాన వంతులై  మహిని వెలుగు
మఱి యు వంశ ము  నభివృద్ధి బ ఱగు సుమ్ము
వావి వరుసలు జూడని వారనఘులు

 

Saturday, August 3, 2013

పద్య రచన -ఏనుగు

అల్లనల్లన మెల్లగ నడుగు వేచి
నడుచు చున్నది  చూడుడు నగము నచట
కట్టె మోపులు వీపుపై గట్టి వైచి
నడుపు చుండెను గజమును  నాయకుండు 

శ్రీ శ్రీ కవి యనగ దగడు సిరి సిరి మువ్వా !

శ్రీ శ్రీ కవితలు నవతకు
నాశ్రయమై యుండి    మనకు  హాయిని గూర్చున్
శ్రీ శ్రీ యన నా కిష్టము
శ్రీ శ్రీ కవి యనగ  దగడు? సిరి సిరి మువ్వా !

Friday, August 2, 2013

సంపాదన లేని మగని సాధ్వి నుతించెన్

ఇంపుగ  సంసారంబును
పెంపొనరగ జేసికొనుచు  ప్రేమమ్మలరన్
రొంపున  మునిగెడు  నక్రమ
సంపాదన లేని మగని  సాధ్వి నుతించెన్ 

ప ద్యరచన -ఆత్మవంచన

తనను కొఱ గాని వానిగ దలచి మదిని
ఎవడు వర్తించు ననిశము  నిహము నందు
ఆత్మవంచన  యగునది  యార్యు లార !
సంయ మనమున  ముందుకు  సాగ వలయు 

మోకాలికి బోడి గుండు ముడి వెట్ట దగున్

పోకిరి వలె  దిరుగకు మఱి
యో కామేశా ! యనంగ  నూరికి  బోదున్
నాకో తొంబది యిమ్మనె
మోకాలికి బోడి గుండు ముడి వెట్ట దగున్ ?

Thursday, August 1, 2013

పద్య రచన -ప్రకృ తి

మనకు కనబడు నంతయు  మఱి  ప్రకృతియ
ప్రకృతి  కోపించ మారును వికృతి గాను
ఈ శ్వరా ధీ నమై  చరిం చీ యది నిట
కాన వేడు కొందము నిక కాలు మనము 

వాన రాకడ ప్రాణము పోకడ

వాన రాకడ ప్రాణం బు  బాయు ట నగ 
ఎఱు గ  రెవరును  జగతిని  నెచట నైన
వచ్చు చుండును మఱియును  బాయు చుండు
వాటి సమయాన నవియ  నా  మాట నిజము 

ముసలి దనము

ముసలి దనము వలన  మొద్దు బారు మెదడు
చట్ట నొప్పి  భుజము జాచ లేరు
పులిసి   పోవు  నొడలు  పోడిమి దగ్గును
బొందు  విడువ మేలు ముందు గానె . 

చందమామ లో మచ్చ

చందమామ లో న  నందమై యామచ్చ
సోయగంబు గూర్చె  జూప రులకు
అందమెచట నుండు  మంది జేరునటకు
సంది యంబు వలదు సన్ను తాంగి !

కౌగిలి మరణమ్ము నొసగు గద సరసులకున్

భోగములదేలియాడుచు
రోగములను దెచ్చుకొనుచు  రోగిగ  మారీ
ఆగని యె డలన  మఱి చెలి
కౌగిలి మరణమ్ము  నొసగు  గద సరసులకున్ 

Wednesday, July 31, 2013

గీతాంజలి

1. భగవంతుడు  ఎక్కడ ఉండును

ఎచ్చట గీ త  వినంబడు ?
నిచ్చను  బారాయణం బు  నెచ్చట జరుగున్ ?
ఎచ్చట చర్చలు  జరుగును ?
అచ్చట హరి యుండు నిజము  నరయు కు మారా !
-----------------------------------------------------

2. హరి ఎప్పుడు  సంతసించును ?


 సర్వ భూతములను  సమ దృష్టి వీ క్షించి
శత్రు మిత్రు లనెడి  శంక వీ డి
నాది నీది యనెడి భేద భావము వీ డి
సత్య వాదు లైన  సంత సించు
--------------------------------------------------
3. హరిని  పూజించిన ఏమి  ఇచ్చును ?


సుజనులార ! వినుడు సోత్కర్ష తోడన
హరిని  భజి యించు డ య్య ! మీరు
భక్తి  శ్రద్ధ  తోడ  భజన గావించిన
హరియె  యిచ్చు మీకు సిరుల మూట


(మిత్రులు ,శ్రీ  ఇంద్రసేనా రెడ్డి గారి  సౌజన్యముతో .... )
 

Tuesday, July 30, 2013

శ్రావణ మేఘములు

శ్రావణ మేఘములయ్యవి
శ్రావణ మాసంబు  రాగ  సరగున గురియున్
ఆవల యీవల యనకను
భూవలయము నంత తడుపు  భోరున ధారన్ 

శివ నామ మహిమ

శివ యను రెండక్షరములు
భవమును లేకుండ జేసి భాసురముగ నున్
దివిజుల సరసున జేర్చును
శివ శివ యని బలుకు మెపుడు  శివునే నరుడా !

ఆపద్బాంధవుడు

ఆపద్బాంధవు డందురు
ఆపద గాపాడువాని  నార్యులు వినుమా !
ఈ పొద్దాపొద్దనకను
ఏ పొద్దున నైన నతడు  నిచ్చును  సాయం

 

షిరిడీ సాయి

షిరిడీ సాయి ని  గొలువగ 
నరుదేరగ  షిరిడి కిపుడు  నాత్రుత తోడన్
దరిసెన  మాయెను మఱి యిక
విరిమాలలతోడ పూజ వేమరు జేతున్ 

స్వాములు

స్వాములందఱు  మ ఱి  సర్వ  సంగములను
విడుచు వార లనియు  విందు మిలను
ఏసి కారులు నిక  నేసి భవనములు
వంది  మాగధుల  పసందు సబబె ?


 

మనము శాంతించు నెన్నొ సమస్య లున్న

ప్రతి దినమ్మును  చాగంటి  ప్రవచనమ్ము
శ్రద్ధ తోడన  వినినచో  సకల జనుల
మనము శాంతించు నెన్నొ  సమస్య లున్న
కల్ల  గాదిది  నిజమునే బల్కు చుంటి


 

Monday, July 29, 2013

అగ్రహారములు

పూర్వ కాలము  నందున బుడమి  నేలు
రాజు లొసగిరి  యగ్రహారములు ,వేద
పండితులకు ము  దంబున  బహుమ  తిగను
శాంతి  యుతముగ పాలన సాగు కొ ఱకు 

ఆధునిక మయసభ

మయుని  సభను  జూడ  నరిగి  మమత తోడ
ఉన్న దనుకొని  దాకగ  సున్న  మిగిలె 
లేదు  లేయని  నేగగ  మీ ద కుఱు క
బల్లి  నా మీ ద , మిక్కిలి  భయ పడితిని 

Sunday, July 28, 2013

పద్య రచన - జయాపజయములు

జయములు సరి , యపజయము, వి
జయమునకే  నాంది  యండ్రు  శాస్త్రజ్ఞులుత 
జ్జ యమునకు బొంగ కను నప
జయమునకుం  క్రుంగ కుండు జనుడే  ఘనుడున్
 

పండుగ నాడేల నాకు పాత మగడనె న్

మెండుగ  గ్రొత్తవి  యుండగ
పండుగ నాడేల నాకు  పాత, మగడనె న్
నిండుగ  నుండును నీ కవి
దండలు మును గొన్నవాటి  దాల్చుము  మెడలోన్ 

Saturday, July 27, 2013

యమ దర్బారు

అదిగొ చూడుడు సమవర్తి  యాసనంబు
నందు కూర్చుండి పాపుల యాగడముల
బట్టి శిక్షలు  వేయను  ప్రతియొ కరిని
పిలుచు చుండెను  వరుసగ  బిగ్గరగను

స్వ ర్గారోహణము

స్వ ర్గారోహణమనునది
దుర్గామమే యగును  మఱిని  దుర్మార్గులకున్
భర్గుని గరుణలు గలిగిన
స్వర్గమునే దాటవచ్చు  సాకారముగన్
 

కాళ్ళకు బుద్ధిజెప్పు

తేరు మీ దన నర్జును దేరుపాఱ
కాంచి కదన రంగము నుండి కాఱడవులు
పట్టి పోయిరి  యక్కట  ప్రభుత సేన
కాళ్ళకు మ ఱి బుద్ధి జెపుట  కాద,యిదియ ?

కాకి-కేకి

కాకి యుండును నలుపున  కారు నలుపు
కాయ మంతయు నెమలికి  కన్ను లుండు
కాకి కేకులు గూ యును  కాక ..కూ గ
వచ్చు రెండును నండము బ్రద్ద లగుచు 

హాలాహలము

జగమును రక్షించుట కై
అగజాపతి త్రాగ నపుడు  హాలాహలమున్
నగవులు జిందుచు నమరులు
నగధారికి పూ లవాన  నతులుగ నిడియెన్ 

Friday, July 26, 2013

వృద్ధ నారిని యువకుడు పెండ్లి యాడె

వృద్ధు డైనట్టి భీ ముడు పెండ్లి యాడె
వృద్ధ నారిని,  యువకుడు పెండ్లి  యాడె
వయసు లోనున్న  వాణిని వలచి మిగుల
దంపతు లిరువు రాదర్శ  దంపతులు మఱి

పద్య రచన - చేదోడు వాదోడు

చేయి  దోడును మఱియును వాయి దోడు
నగుచు  యన్ని  పనులను దా నగుచు  జేసె
మాకు  కృష్ణమ్మ యపుడున   మ్మకము గాను
అటులు జేయువా రెవరును నగుప డరుగ. 

Thursday, July 25, 2013

పాడు మనుజు జూడ వేడుక గద !

అన్య చిత్తకాక  యన్య దేవుని గాక
పరమశివుని నొకని మాత్రము మఱి
భక్తి శ్రద్ధ గలిగి  పంచా క్షరి  నియత
పాడు మనుజు  జూడ  వేడుక గద !

పద్యరచన-పేదరాసి పెద్దమ్మ

బాటసారులకు మిగుల  బంధు వయ్యి
కూడువెట్టును  బ్రియమున  కొసరి కొసరి
గ్రామ వార్తలు  సెప్పును గధలు గాను
పేదరాసి పెద్దమ్మ నా బేరు వడసి . 

Wednesday, July 24, 2013

కారు నలుపుపైన గలిగెప్రేమ

కారు కొనుట కొఱకుకాకినాడకు నేగి
కార్లు జూడ నచట  కారు నలుపు
పైన  గలిగెప్రేమ  కాన కొ నగనిష్ట
పడితి నార్య! మఱిని  భర్గు  గృపను . 

పద్య రచన -కరతాళ ధ్వనులు

కరతాళ ధ్వని జేసిరి
విరివిగబ్రజ లందఱచట  వేడుక తోడన్
పరమానందుల వారిది
దరిసెన మను భాగ్య మబ్బె దద్దయు బ్రీ తిన్. 

Tuesday, July 23, 2013

వర్షము

కుండ పోతగ వర్షము  గురియు చుండె
వీ లు  లేదాయె యెచటకు వెళ్ళు టకును
ఎండ భరియించ  వచ్చును నెంత యైన
కాని  భరియించ లేముగా వాన చినుకు 

వ్రతములతో వర్ధిలును జరా మరణమ్ముల్

వితరణ భావము  వనితకు
వ్రతములతో వర్ధిలును, జరా మరణమ్ముల్
ప్రతియొక్కరికివి  దప్పవు
సతతము  శివ పూ జ   సేయ  సత్పద మబ్బున్ 

వరదలు

వరదలు  వచ్చుచు  నుండును
విరివిగ ప్రతి వత్సరమ్ము  వేగము  తోడన్
వరదలు  వచ్చుట వలననె
తరుసంపద  వృధ్ధి నొంది  తగ్గు కలుషముల్

Monday, July 22, 2013

గురు స్తుతి

శిష్య రేణువు  నను దరి జేర్చి గాత !
అనెడు  మకుటాన  నుండెను  నార్య! యవియ
విష్ణు నందుని గృ తములు  విలువ గలవి
వందనంబులు మఱివిష్ణు  నందను నకు . 

Sunday, July 21, 2013

శరణు కోరె గ పోతము చంపెను బలి

శరణు కోరె  గ పోతము   చంపెను బలి
కాదు ,బలితన  తొడనునే   గాటు  వెట్టి
డేగ కాహార మొసగియు    డీ లు వడిన
పావురంబును  గాపాడె  ప్రభువు గాన
 

శివ తాండవము

శివ తాండవ రచనమునకు
శివుడే మఱి  సంతసించి  సేమము గలుగన్
అవిరళ  వరముల నిచ్చుత !
భవకరుడగు  రామజోగి  భ్రాతకు నెపుడున్ . 

జన్మ దిన శుభా కాంక్షలు

తే గీ . రామ  లక్ష్మిగ  నామంబు  రమ్య మలరి
         పుట్టి నింటను మఱియును  మెట్టి నింట
         మంచి  వనితగ  పేరొంది , మమత లిచ్చు
         అక్క  సమురాల ! వందనం  బందు కొనుము .


తే . గీ . చేయు చుండిరి  కొడుకులు  చేవ తోడ
           పుట్టు  దినమును  నుత్సవంబుగను  నిపుడు
          ఏమి  భాగ్యము  నీ యది !  యేమి  యమ్మ !
         ప్రోత్స హించుము  వారిని  పొందు  మీ ఱ.


తే. గీ . మనుమ  రాండ్రు ను  గోడళ్ళు  మనుమ లిచట
          వేచి యున్నారు  మీ రిచ్చు యాశిసు లకు
         కాన  నోయమ్మ! యీ యుచు  గాంక్ష దీ ర
        చీ రి  కొడుకుల  నక్కున  జేర్చు కొనుము .


కం .   మంగళ  వాయిద్యం బులు
         మంగళముగ  మ్రోగు చుండ  మానిను లపుడున్
         రంగైన  కేకు  ముక్కయు
         మ్రింగించిరి  యామె చేత  మీ గడ పెరుగున్ .


తే . గీ . సకల శుభములు  గలిగించు  శంకరుండు
           ఆయు రారోగ్య  సంపద లన్ని యిచ్చి
           కంటికిని  రె ప్ప యట్లయి  కాచు గాత !
          ఎల్ల  వేళల  మిమ్ముల  చల్ల గాను .


ది . 23-07-2013  తేదీ న సోదరి ,రామలక్ష్మి గారి  పుట్టిన రోజు  సందర్భముగా
శు భా కాంక్షలతో ........  పోచిరాజు  సుబ్బారావు

  

పంతాలు -పట్టింపులు

పంతాలు ను  పట్టింపులు
పుంతకు మఱి చేర్చి   లీల ! పోడిమి తోడన్
చెంతను  నిరువురు  మెలగిన
పంతాలిక దరికి రావు  పావన  శీ లా !

గురు పూ ర్ణిమ

గురు పూ ర్ణిమ దినమున మన
గురువును  బూజించు నెడల  గురువే యిచ్చున్
వరమగు  నా శీ ర్వాదము
పర సుఖములబొందు కొఱకు  పావన  నరుడా !

పంచాయతీ ఎన్నికలు

ఎన్నికలు  జరుగు చున్నవి
ఎన్నిక  పంచాయ తీ ల  యీ శుల  కొఱకున్
అన్నలు  దమ్ముల  మధ్యన
మున్నెన్నడు  గానరాని  మోదము తోడన్ 

Saturday, July 20, 2013

మీసము లందమ్ము సతికి మెట్టెల కంటెన్

రోసము  గలిగిన  మనిషికి
మీసము లందమ్ము, సతికి మెట్టెల కంటెన్
బాసటముగ బతి దేవుని
ఆసలు మఱి  దీ ర్చదగును  నాప్యాయత తోన్ 

పద్య రచన -వానకాలపు చదువు

ప్రతి దినమ్మును  మానక  పరుగులిడుచు
పాఠ శాలకు నేగిన  ఫలములేదు
చదువ ,వ్రాయను  నేర్వని  జడుని  నరయ
వాన కాలపు  చదువులు మాను టొప్పు 

Friday, July 19, 2013

పట్టూ -విడుపులు

పట్టూ విడుపులు  ననునివి
ఇట్టట్టుగ నుండవలెను  నెవరికి నైన
న్నట్టులు   జరుగని నెడలను
పట్టును గోల్పోవు నిజము  పండిత వర్యా !

పద్య రచన -శునకము

సాధనంబున  సముకూరు  సర్వ జనుల
కన్ని  పనులును  జక్కగ  నడ్డు  లేక
శునక రాజము  సాక్షియే  చూడు డార్య !
ఎటుల నిలబడె వాటిపై నెత్తు లోన . 

Thursday, July 18, 2013

నోటి పూత

నోటి పూతకు జెడిపోయె  నోరు మిగుల
వచ్చు చుండెను  వాసన  హెచ్చు గాను
మందు వాడిన దగ్గక  మఱి ని  బెరిగె
శివుని  నిర్ణయ మెటు  లుండె జెప్ప లేము  

భీష్ముడం బను బెండ్లాడి బిడ్డల గనె

తొల్లి  పేరగు  దేవవ్రతుడనువాడు
భీష్ముడం, బను బెండ్లాడి  బిడ్డల గనె
నాటకంబున  భీష్ముడు నా బడునట
అతడు పెండ్లాడె  నంబను  నామె నపుడు 

పద్య రచన -తొలి ఏకాదశి

తొలి ఏకాదశి  దినమున
తులనాత్మక  దండములను  తొలిగా  శంభో !
ఇలనే నాదర సహితము
మెల మెల్లగ బెట్టు చుంటి  మీదయ  కొఱకున్ . 

మానవులారా ! భజనలు మానుట శుభమౌ

గానము  జేయుడు భవు కథ
మానవులారా !, భజనలు  మానుట  శుభమౌ
మానవ మృగముల కెప్పుడు
ఆనతి మఱి  యిచ్చె మనకు  నార్యులు  వినుడీ . 

Wednesday, July 17, 2013

మాయలో పడు

ప్రక్క  యింటి  యామె  మాయలో పడి రవి
తనదు  భార్య గొట్టి  తరిమె నయ్య !
ఏమి చిత్రము  లివి  ? యీకలి కాలము
నింక యెన్ని వింత లీ క్షణ ములొ !

పద్య రచన - పుష్ప లావిక

సొగసు  కన్నుల దోడన  సొంపు  మీఱి
ఎడమ చేతిని  పూ బుట్ట  యింపు   గొ లుప
వలపు  కన్నులు రమ్య మై  వలపు   లీ న
చూడ ముచ్చట గొలిపెను  జూడు  డార్య !

Tuesday, July 16, 2013

పుక్కిటం బట్టి యుమిసె సముద్ర జలంబు

అవని  జనులను  గాపాడ  యా యగస్త్యు
డా క్షణం బున  రాక్షస  యానవాలు
తెలియు  కొఱకునై  సంద్రాన , వెలికి తీయ
పుక్కిటం బట్టి  యుమిసె  సముద్ర జలంబు 

కోటి లింగాల రేవు

కోటి లింగాల రేవు ను   గోర్కె  మీఱ
చూడ నేగితి  నోయమ్మ! చూడ గానె
మంత్ర రాజం బు  చదువుచు , మదిని  నిండ
నిలుపు కొంటిని  శం భుని  నిక్క ముగను 

పద్య రచన -మాయల పకీ రు

మాయల పకీరు ప్రాణపు  మర్మ మిదియ
చిలుక యందున నుండెను  చెలువు గాను
బాల నాగమ్మ సుతు నాగ వర్ధి రాజు
చెట్టు దరిజేరి  మఱియు నా  జిలుక జంపె
 

Monday, July 15, 2013

దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్

వరదల  పాలైరి  జనులు
దురదృష్టము వలన , సిరులు దొరకు జనులకున్
విరివిగ  శివు బూజించిన
ఇరవుగ మఱి  మనసువెట్టి  యెప్పుడు  నైనన్ 

పద్య రచన- రిక్షా వాలా

కన్ను గవను  మించి మిన్నగా పుత్రుని
చేత బట్టు కొనుచు  చేదు చుండె
రిక్ష,  చూడు డార్య ! రేయి బగలు  ను లా
గినను  దీ రవాతని  నిడుమములు 

వేవిళ్ళు

కడుపుతో నుండు  గుర్తుగ  కరము వచ్చు
వాంతి  రూపము వేవిళ్ళు  వరుసగాను
నాలు గైదుది నమ్ములు  , నయము కా వ
వైద్యు సలహాను  బాటించ వలయు సుమ్ము
 

వికటకవి

రామ కృషుని కవితలు  రమ్య మలరి
భావ సంపద లొలికించు  భవ్యముగను
అట్టి యెడల వికట కవి యనుట యెట్లు
చెల్లు ? వినయపు కోరిక  చెప్పు డార్య !

పెళ్ళిళ్ళ పేరయ్య

పెళ్లి సంబంధముల కునై  పెద్ద వారు
పిలువ వచ్చెను పెళ్ళిళ్ళ  పేరయయ్య
కూతు  వివరంబు  లట్లనే  కొడుకు గూర్చి
చెప్పె నప్పుడు పెళ్ళిళ్ళు చేయ దలచి 

Sunday, July 14, 2013

రాము డానంద మందె ను నూ ర్వశిని పొంది

రాము డానంద  మందె ను నూ ర్వశిని  పొంది
అనగ  దగునార్య ? యా రాముడనగ నేక
పత్ని యుతుడుగా దె లియుడు  పరమ పురుష !
వంద నంబులు  నిడుదును  వంద లాది . 

పద్య రచన -క్రొత్త కాపురము

క్రొత్త  కాపురమ్ము గోరి బెట్టితినినే
జూడ రండి మీరు చూసి మమ్ము
ఆద రించి  వేయు డ క్షతల్ మిగుల
అమ్మ ! నాన్న ! అక్క ! అత్త!మామ!
 

Saturday, July 13, 2013

పద్య రచన -ఉపాయము

చిత్ర మందున  జూడుడు  శిశువు లార!
ఓ గిరంబున  కొఱకునై  నొక్క మేక
ఎక్కి  మోటారు బండిని  చక్క గాను
పత్రములనందు కొను చుండె జిత్ర ముగను

సతతంబు  నుపాయంబున
జతనంబులు  సేయునె డల చక్కగ పనులన్
హి తముగ జేయగ  వచ్చును
సుతరంబగు  మేక సాక్షి  చూడుము  నరుడా !
 

Friday, July 12, 2013

నరకమున సుఖమ్ము దొరకు నయ్య

నరకమున సుఖమ్ము దొరకు నయ్య ,యయిన
ఇచ్చ గింతు రార్య  యిలను  జనులు
నరకమునకు బోవ  నగుబాటు నొందక
సుఖము నందు గలదు  సుఖము ,నిజము
 

పద్య రచన -విదూషకుడు

పూర్వ కాలంబు  నందున  పృధివి యొద్ద
హాస్య  మంత్రి వి  దూ షకు డ నగ  నొకడు
ఉండి , రాజులు సంతోష ముండు  నటుల
చూతు రెప్పుడు  నిజమిది  సుమ్ము  నమ్ము 

Thursday, July 11, 2013

కాంతా లోలుండె మోక్ష గామి యనదగున్

కాంతల చుట్టును  దిరుగును
కాంతా లోలుండె,  మోక్ష గామి యనదగున్
ఆంతర్యం బున శివునిడి
కాంతలకుం దూ రమగుచు గడిపెడు వానిన్ .
 

పద్య రచన -ముసురు

ముసురు  పట్టెను  గగనాన  మోద మలర
కారు  చీకట్లు పుడమిని గ్రమ్ము  కొనెను
చినుకు  పడు నను నాశతో  చీకు  ముసలి
గొడుగు  క్రిందన  కూర్చుండె  చూడు సామి !

మబ్బులు

మబ్బు లుండెను  మింటను  మస్తు గాను
కారు   చీకట్లు బుడమిని గ్రమ్ము కొనెను
ఏమి పాపము  చేసితి మేమొ  కాని
ఒక్క చినుకును  బడదాయె   నిక్కముగను

 

చచ్చిన వాడాగ్ర హించి శత్రువు గూల్చెన్

విచ్చల విడిగా ద్రాగెను
చచ్చిన వాడా,గ్ర హించి  శత్రువు  గూల్చెన్
అచ్చమ దెలుగిం టి వనిత
ఉచ్చును  బిగియించి, వేసి నోముగ శరమున్ 

పద్య రచన -రధ యాత్ర

సాగు చుండెను  రధయాత్ర  చక్క గాను
చూడ గనువిందు  గావించె  చూ డ్కులకును
ఎంత మంది యుం  డిరినేల  యీ నినట్లు
పుణ్య మంతయు  వారిదే  పూవుబోణి !

Wednesday, July 10, 2013

పద్య రచన -నవల

నవలలు వ్రాతురు  కొందఱు
అవలీలగ, గాని యందు  నర్ధము వెదుకన్
అవతవకలు గా నుండును
వివరముగా  వ్రాయు నతడు  విశ్వంభు వుడే . 

వట్టి రాక పోకలొనర్చు వాడె భర్త

వట్టి రాక పోకలొనర్చు వాడె భర్త
కాక , వలచియు  వలపించి కాంత  నతడు
భోగ భాగ్యాల దేలగ  భువిని  నామె
చేయ దగి నట్టి యేర్పాటు  చేయ వలయు . 

Tuesday, July 9, 2013

ఆర్య ! నేమాని వంశజ !

ఆర్య ! నేమాని  వంశజ ! యాద్యు డీవు
క్రొత్త  గణముల  తోడన  క్రొత్త  రచన
 దండ కం బది  శివప్రియ  , తనరె  మిగుల
అందు కొనుమయ్య ! నతులను  నందు కొనుము 

Monday, July 8, 2013

పద్య రచన -రాజమహేంద్రి

రమ్య హర్మ్యాల విలసిల్లు  రాజ మండ్రి
చూడ చక్కని  పురమది  చూడ రండి
రాజ రాజ నరేంద్రుని  రాజ్య మచట
రామ రాజ్యము పగిదిని  రాణ కెక్కె . 

శరమున్ గని జింక పిల్ల సంతస మందెన్

గిరగిర వడివడి బరుగున
అరుసముతో జిందు లేసి  నటునిటు దిరుగన్
ఇరవుగ దప్పిక కలుగన్
శరమున్ గని జింక పిల్ల సంతస మందెన్ 

Sunday, July 7, 2013

పెండ్లి యయ్యెను బార్వతి విష్ణువునకు

విశ్వనాధుని  దోడన  విభవ మొప్ప
పెండ్లి యయ్యెను బార్వతి,  విష్ణువునకు
లక్ష్మి తోడన  జరిగెను లాస్య లాడ
మేలు జరుగును  బుడమి  కి   చేలు పండి . 

పద్య రచన - కుశల ప్రశ్నలు

ఒకరు నొకరికి నెదురైన  నుత్సహించి
కుశల ప్రశ్నలు వేయుచు  కౌతుకమున
వ్యావహారిక  విషయముల్  బదిలముగను
మాట లాడుదు రయ్యెడ  మైమ ఱచుచు .

 

Saturday, July 6, 2013

పద్య రచన -ఛందో బద్ధ కవిత్వము

మీ దు మిక్కిలి  ఛందస్సు  మీర కుండ
రచన గావింప బడుటన  రమ్యముగను
పద్య కవితలు  వినుటకు హృ ద్య  మయ్యి
ఆయు రారోగ్య పుష్టిని  నంద జేయు . 

సౌహార్దము జూపు వాడె శత్రు వనదగున్

ఆహా యేమని యంటిరి ?
సౌహార్దము  జూపు వాడె  శత్రు వనదగున్
బాహాటంబుగ బలుకుదు
సౌహార్దము  జూపు వాడు  శత్రు వెటులగున్ ?

Friday, July 5, 2013

పద్య రచన -అత్త లేని కోడలు

అత్తలేని కోడలు త్తము రాలన
నిది వరకిటి  మాట  యిప్పు డరయ
కోడరికము  వచ్చు కోడ ళ్లె    యత్తల
యునికి  నోర్వ జాల కుండి  రకట 

Thursday, July 4, 2013

పద్య రచన -విందు

చూడు పొడుగాటి  విస్తరి  చోద్య మయ్యె
రకరకంబుల  తీపులు  రమ్యముగను
చూడ కనువిందు నొడ గూర్చె చూచు కొలది
ఆలసింపక  రండిక  యాహరించ . 

Wednesday, July 3, 2013

బాట వీ డి నడచు వాడె జ్ఞాని .

ధర్మ బుద్ధి లేక ధార్మికుడును గాక
కల్లబొల్లి మాట లుల్ల సిలగ
నర్మ భాషణముల  నమ్మించు వారల
బాట వీ డి నడచు వాడె  జ్ఞాని . 

పద్య రచన - బెత్తము

బెత్తము నుపయోగితురు
పొ త్తములను  జదువ కుండ  పోకిరి వలెనున్
పత్తనపు  రోడ్ల  వెంబడి
ఉత్తిత్తుగ  దిరుగు నెడల  నొజ్జలు మిగులన్ 

Tuesday, July 2, 2013

పురుషుడు గర్భమ్ము దాల్చె బుణ్య ఫలముగన్

తరుణి యొ కనాట కంబున
పురుషుని వేషంబు వేసి  పోణిమి సెలగన్
మరునుని  ప్రేరణ కతనన
పురుషుడు గర్భమ్ము దాల్చె  బుణ్య ఫలముగన్

మోదమును గూర్చె ఘోర ప్రమాద మౌర

శంకరా భరణ ము బ్లాగు , చదువరులకు
మోదమును గూర్చె, ఘోర ప్రమాద మౌర
కలిగె నుత్తరా ఖండము గ్రామ ప్రజకు
బహుళ నదులన్ని వరదలై పా ఱు కతన

పద్య రచన -శకునములు


శకునము లవి బూ టకములు
శకునములను నమ్మ కునికి జాతికి మేలౌ
శకునంబులకును బదులుగ
సకలంబుల నుండు శంభు శరణము వే డూ .



పద్య రచన -శకునములు 

Saturday, June 29, 2013

పద్య రచన -అదృష్టము

దృ ష్టము  గానిది  పుడమిని
ఇష్టము గా జూడ లేము  సాకార ముగన్
శిష్టులు  వక్కాణిం తురు
దృష్టము మఱి  కాని దంత  దృ ష్ట మ యగునౌ 

Friday, June 28, 2013

కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రిం గెన్

పందెం బు  గెలిచె  కూర్మము
కుందేలును , కోడిపిల్ల  గుటుకున  మ్రిం గెన్
అందందున  నడయాడుచు
విందుగ నొక వానపాము వీపున బొడిచీ . 

Thursday, June 27, 2013

పనస పండు

పనస పండు  వంటి  బాలుని గనెనట
యా యశోద  చూత మమ్మ  రండి
కృష్ణు బేర బఱగి  క్రూ రుల  వరుసగా
సంహ రించు వలదు  సంది యంబు .
 

మాయ లేడి

రాక్షసుండగు మారీచు డా క్షణ మున
మాయ లేడిగ రూపంబు  మహిని దాల్చి
అడవి యందున  దిరుగాడు  నయ్యద నున
సీత రాముని  దెమ్మనె  శీ ఘ్ర ముగను

 

Wednesday, June 26, 2013

కుండలోన బెట్టె గువలయమును

సాయి  పూజ కొఱకు  చామంతి పూలను
దెచ్చి , వాడకుండ  పచ్చ   కొఱకు
కుండలోన బెట్టె  గువలయమును మఱి
వాడ  కుండ నుండు  వార మైన .

పచ్చ  కొఱకు అనగా పసుపు పచ్చ దనము   కొఱకు
గా అన్వయించుకొన ప్రార్ధన .

పద్య రచన -దిన పత్రికలు

ప్రతి దినంబును   వచ్చు నీ  పత్రికలనె
య రయ దిన పత్రిక లనుచు  నండ్రు జనులు
ప్రతి దినంబును  నుదయాన  పఠ న మిడిన
పూర్తి  వార్తలు  దెలియును  భువిని  జరుగు 

Tuesday, June 25, 2013

కల గాంచితి మోద మలర గను మూ యకయే

అలవోకగ  నిద్రించగ
పలురకముల గలలు  వచ్చి  భయమును  గొల్పన్
మెలకువ రాగా  మరలను
కల గాంచితి  మోద  మలర గను  మూ యకయే 

పద్య రచన -లలిత కళలు

లలిత కళలు  మిగుల లలితము గానుండి
మనసు దోచు కొనుచు  మరులు  గొలుపు
మమత కలుగ జేసి  మఱి మఱి  గన జేయు
కళలు లోన మిన్న కళలు  నమ్ము 

Monday, June 24, 2013

కమ్మలు మోకాళ్ళు దాకి ఘులు ఘలు మనియెన్

అమ్మలు  గ్రొత్తవి  కొనగా
కమ్మలు , నవి వదులు నయ్యి కదులుచు మిగులన్
నిమ్ముగ  పైకిని  క్రిందకు
కమ్మలు  మోకాళ్ళు  దాకి ఘులు ఘలు  మనియెన్ 

పద్య రచన -గంగో ధ్ధృతి

మంద గమనము  గలదిగ  మహిత కెక్కి
ఉధ్ధృ తం బయి  మనుజుల  యుసురు దీ సె
ఏమి పాపము జేసిరో  యిలను  వారు
గంగ పాలైరి  యకట  ముక్కంటి యెదుట

పుట్టు  మనుజుడు  తప్పక గిట్టు  నిలను
ప్రభుని  కేదారు  సన్నిధి  ప్రాప్తి  కొఱకు
ఏమి  పుణ్యము  జేసిరో  యేమొ  గాని
మోక్ష మందిరి సులువుగ ముదము  గలుగ .

ముక్కంటి  యెదుట  మడియుట
జ క్కంగా  బొందె వారు  సాయుజ్యం బున్
 అక్కొం డల  నడుమన యా
ముక్కంటియె  చేర్చుకొనెను  ముదమున  వారిన్ .