Sunday, January 31, 2021

దారుణకార్యమౌనుగదదంపతులందుటసౌఖ్యమిద్ధరన్

దారుణకార్యమౌనుగదదంపతులందుటసౌఖ్యమిద్ధరన్
దారుణమెట్లగున్రమణ!దంపతులేగదవారలిద్దరున్
నోరునునుంచు మేలుగనునొవ్వగజేయుటబాడియేగనన్
మీరుటమాటలన్భువినిమీకునుమాకునుమంచిగాదుగా

Saturday, January 30, 2021

దంపతులు సౌఖ్యమందుటదారుణమ్ము

పుణ్యతీర్ధములకువెళ్ళిమునిగినీట
దంపతులు సౌఖ్యమందుటదారుణమ్ము
పరులుచూతురనుభయము పడకయట్లు
తనువులొక్కటగుటమరీ దారుణమ్ము

గామినినూపురంబలరె గాంతునకున్దలమానికంబుగన్

భామినిసత్యభామకసిబాదమునెత్తుచుదన్నగాదలన్
గామినినూపురంబలరె గాంతునకున్దలమానికంబుగన్
గోమునబల్కెనప్పుడటకోపముపోయెనె?చెప్పుమావడిన్
బ్రేమముమీరదెత్తుసుమవృక్షముచూడుమ యీక్షణంబునన్

Friday, January 29, 2021

కామినినూపురమలరెను కాంతునితలపై

 ఏమనిజెప్పుదునారద!

కామినినూపురమలరెను కాంతునితలపై

కామినియనగనునెఱుగుమ

యామెయెయాసత్యభామ యాపనిజేసెన్

కలిబొలిమాటలాడుచునుగాంతలబొందునుగోరువాడెకా
వలయుననంగదుష్టుడగువద్దనువాడగుసజ్జనుండిలన్
కలియుగధర్మమేమొయిదికానిచొనిట్లుగసాహసింతురే?
వలపులజోలికిన్జనకబంధుగణంబులపేర్మినొందుమా

Thursday, January 28, 2021

వలయుననుఖలుడు,సుజనుడువలదనునెపుడున్ ము

వలపులుమీరగరతికా
వలయుననుఖలుడు,సుజనుడువలదనునెపుడున్
కలిబొలిమాటలువినడము
పలుకులుసత్యంబులుగనెబలుకగగోరున్

వందేభారతమాతర,మ్మనుటదుర్వాక్యంబగున్ సత్కవీ!

 బృందా!తప్పనియంటివేగదయదిన్ భావ్యంబుగాదోచెనే

వందేభారతమాతర,మ్మనుటదుర్వాక్యంబగున్ సత్కవీ!

నిందారోపణజేయుచున్దఱచుదానేగొప్పవాడంచుటన్

వందేమాతరమంచుబల్కుడికయాభవ్యంపుమాతన్రహిన్

Wednesday, January 27, 2021

వందేమాతరమనుటకు,వాక్యముసుకవీ!

బృందా!భయమా! యేలకొ?
వందేమాతరమనుటకు,వాక్యముసుకవీ!
డెందంబుహత్తువిధముగ
నందంబుగవ్రాయునెడల హర్షంబొదవున్

నేడుపువిన్ననాహృదయమెంతయొమోదమునందెదృప్తిగన్

వీడగజేయుచున్ భయముపేర్మినిబిడ్డడుపుట్టనంతటన్
నేడుపువిన్ననాహృదయమెంతయొమోదమునందెదృప్తిగన్
జూడగ ముద్దులన్ గురియుచొప్పుననుండెనుబోసినవ్వుతో
వేడుకజేయనెంచితినిబీదలకట్లనెయర్ధికోటికిన్

Tuesday, January 26, 2021

యేడ్పువినిమోదమందితిహృదయమంద



సంధ్యసమయాన పుట్టిన చంటిపిల్ల

యేడ్పువినిమోదమందితిహృదయమంద

యింటిమహలక్ష్మి యామెయే యింకమాకు

పేరు శ్రీలక్ష్మి యంచును బెట్టుదురమ!


భారతమాతకున్జయమువల్కెడువాడె,ఖలుండుద్రోహియౌ

ఆరయదేశభక్తుడుగనాదరమందునునెల్లవేళలన్
భారతమాతకున్జయమువల్కెడువాడె,ఖలుండుద్రోహియౌ
నేరములెన్నియోతఱచునేర్పునజేసెడుమానవుండుగా
చీరగరాదువారినికజీవితమంతయునెట్టిచోటికిన్  

Monday, January 25, 2021

భరతమాతకుజయమనువాడె,ఖలుడు

భావిభారతపౌరుడే పృధివియందు
భరతమాతకుజయమనువాడె,ఖలుడు
దేశసంపదకెపుడువినాశనమ్ము
గోరుమనుజుడునౌనుగ కువలయమున

బెకబెకలాడకప్పలవెభీతిలిపాఱెనుపాముగ్రక్కునన్

 చెకుముకిఱాయివోలెను నచేతనరీతినినుంటివేమిరా?

ప్రకటముజేయుమీప్పుడిటపామదిచూడుమయేమిచేయునో?

నకనకలాడుసర్పమువనాంతరసీమకునేగనయ్యెడన్

బెకబెకలాడకప్పలవెభీతిలిపాఱెనుపాముగ్రక్కునన్ 

Sunday, January 24, 2021

కప్పలబెకబెకలకునహికడుభీతిల్లెన్

 ముప్పనసాంబునిమడుగున

గప్పలభక్ష్షించుకొఱకుకర్కటిరాగన్

చప్పునముప్పునుగనునా

కప్పలబెకబెకలకునహికడుభీతిల్లెన్

బ్రమదముగూర్చవచ్చెనుప్రభంజనమెల్లెడవీచితీవ్రమై

 విమలమనస్కునైజనగవేంకటనాధునిదేవళంబుకున్

బ్రమదముగూర్చవచ్చెనుప్రభంజనమెల్లెడవీచితీవ్రమై

సుమధురభావముండునెడసోమముసైతమునెయ్యమిచ్చుగా

నమలినమాన్యవంతులకునందగజేతురుసాయమెప్పుడున్

Saturday, January 23, 2021

కనకపుగద్దెనెక్కుటకు,గాడిదకేకలవన్నియర్హతల్

 వినుమురరంగనాయకుడ!పేర్మినినర్హులుపండితోత్తముల్

కనకపుగద్దెనెక్కుటకు,గాడిదకేకలవన్నియర్హతల్

పనిగొనిబెద్దమూటలనుభారమునొందకమోయనిచ్చలున్

కనగనుహెచ్చుమూల్యములుగల్గునుగాడిదపాలెయిద్ధరన్

Friday, January 22, 2021

కనకపుసింహాసనంబు గాడిదకెతగున్

 కనివిని యెఱుగను నెపుడును

కనకపుసింహాసనంబు గాడిదకెతగున్

ననుటను సబబని దలచితె?

కనకపుసింహాసనంబు కవులకెయొప్పున్

శ్రీదేవీపదపద్మమెత్తెడిశివున్ జిత్తంబునన్ గొల్చెదన్

మోదంబొందుచునెల్లవేళలను నామోదంబుతోదప్పకన్
శ్రీదేవీపదపద్మమెత్తెడిశివున్ జిత్తంబునన్ గొల్చెదన్
వేదాతీతుడు శంకరుండునుదగున్ విష్ణుండునొక్కండుగా
నాదామోదరు,శంభునిన్ గొలువుడీహర్షాతిరేకంబునన్ 

Thursday, January 21, 2021

శ్రీసతీపదమొత్తెడి శివునిగొలుతు

 శ్రీసతీపదమొత్తెడి శివునిగొలుతు

శ్రీసతీపదమెత్తిన శ్రీకరుండు

నందనందనుడార్య!వినంగరాదె?

యయినశివకేశవులొకరెయాఖ్యవేరు

బంధములెల్లద్రెంచుకొన,బంధువనంబడులోకమందునన్

అంధులవోలెజీవితమునందగనౌనికనెల్లవారికిన్
బంధములెల్లద్రెంచుకొన,బంధువనంబడులోకమందునన్
బంధముగూర్చువాడెకద బంధుగణంబునగాకనెల్లవారిచేన్
బంధువులందఱున్ భువినిబంధములన్నిటిబెంచగాదగున్

Wednesday, January 20, 2021

బంధములందెంచుకొనిన,బంధువనబడున్

బంధుత్వంబులువోవును
బంధములందెంచుకొనిన,బంధువనబడున్
బంధములబెంచువానిని
బంధంబులుమేలుసేయుబ్రజలకునెపుడున్

Tuesday, January 19, 2021

పద్యమ్మునువ్రాసితిననిపలుకగనేలా

గద్యమువ్రాసినకవివర!
పద్యమ్మును వ్రాసితినని పలుకగనేలా
పద్యమ్ములకును నెఱుగుము
హృద్యంబగు గ్రంధపఠన మెక్కువవలయున్

పద్యమువ్రాసినాడనని పల్కగనొప్పునె కృష్ణశాస్త్రికిన్న్

గద్యమువ్రాసిజూపియును గందరగోళపుమధ్యలోదనే
పద్యమువ్రాసినాడనని పల్కగనొప్పునె కృష్ణశాస్త్రికిన్
హృద్యముగారచించగనునింపుగఛందములాదిగానొగిన్
విద్యలనెన్నియోచదివివిఙ్ఞతనొందుచువ్రాయగావలెన్

రాయనునన్నువీడకుమురాయనురాయపరాయణోక్తులన్

రాయనునన్నువీడకుమురాయనురాయపరాయణోక్తులన్
నాయపరాధముల్గనక నన్నునుజూడుముదయామయుండవై
నీయడుగుల్ శిరంబునను నిల్పుచుసేవలుసేయువాడనే
పాయకయుండుమాయికను భద్రగీరీశుడ!రామ!నామదిన్

రాయనుననువీడిపోకురాయనురాయా

మాయలమారివికృష్ణా!

రాయనుననువీడిపోకు,రాయనురాయా!
నీయానతికొఱకైయిట
రాయిగనేనుంటిగదర రహిచెడికనుమా

Sunday, January 17, 2021

నందనులదహించిరంట నాటిపురంధ్రుల్

చిందర వందర చెత్తను
గొందఱుగని నూడ్చదాని,గొందఱుప్రోగున్
నందంబుగదాబేర్చెడు
నందనులదహించిరంట నాటిపురంధ్రుల్ 

Wednesday, January 13, 2021

భోగిపండ్లుగురియరోగమొదవెనట

 భోగిపండ్లుగురియరోగమొదవెనట

యబ్బురంబుగాదెయార్యయదియ

భోగిపండ్లుదెచ్చి బుడతలశిరముపై

బోయవృద్ధియగునునాయువతని


Tuesday, January 12, 2021

సూర్యుడుచందమామవలె శోభిలుశీతకరుండుగాదివిన్

 సూర్యుడుచందమామవలె శోభిలుశీతకరుండుగాదివిన్

సూర్యునికాంతిపుంజములు సోకగదేహమువేడియౌగదా

సూర్యునివోలెకాక హరిచుక్కలఱేడయి శీతలత్వమున్

శర్యములందునన్ నిడును జల్లనివెన్నెలనద్భుతంబుగాన్

Monday, January 11, 2021

దినమణీయె,శీతకరుడుచంద్రునితెఱగున

జగమునకువెలుగు నునిచ్చు ఖగమునుండి
దినమణీయె,శీతకరుడుచంద్రునితెఱగున
భరణియంతయునుండిన ప్రజలుపొలుపు
జీవనంబును సాగింత్రు సిరులతోడ

చిత్రమ్మేకదసింహమున్గనమటన్సింహాచలింబందురే

చిత్రమ్మేకదసింహమున్గనమటన్సింహాచలింబందురే
చిత్రమ్మంచుచు బల్కయొప్పదటబో సింహంబులుండంగనౌ
నాత్రంబందుటయొప్పునేరమ! హర్షంబుతోనుండుమా
స్తోత్రంబొప్పగజేయుమా ప్రభుని యష్టోత్తరనామావళిన్

సింగములేకున్ననెటులసింహాచలమౌ

.సింగపురాయని గొలువగ
నంగనదావెంటరాగ నార్యులు చేరన్
సింగమునావిపినంబును
సింగములేకున్న నెటులసింహాచలమౌ

Sunday, January 10, 2021

పుస్తకమున్ గనన్,ఖరవిభూషణముల్గదయెంచిచూడగన్

మస్తుగ వచ్చునాకురమ! మత్తునుగూడిన నిద్దురెప్పుడున్
పుస్తకమున్ గనన్,ఖరవిభూషణముల్గదయెంచిచూడగన్
దుస్తరమైనమూటతతిదొంతరవోలెనునుండుబట్టలున్
విస్తునుగల్గజేయుచునువింతగనుండెనుజూచువారికిఐ

Saturday, January 9, 2021

పుస్తకమ్ములు,ఖరభూషణములు

అడ్డగాడిదలకు హస్తభూషణములు
పుస్తకమ్ములు,ఖరభూషణములు
బరువుకలుగుపెద్ద బస్తాలనికరము
ఖరముమేలుసేయు కరముమనకు

Friday, January 8, 2021

త్కర్మమునీదురూపమున కన్నులముందఱనిల్చెనొప్పుగన్

 నర్మపుభాషణంబుల సనాతనధర్మము నొవ్వకుండస

త్కర్మమునీదురూపమున కన్నులముందఱనిల్చెనొప్పుగన్

ధర్మమెయెల్లవేళలను ధైర్యమునిచ్చుచు మానవాళికిన్

ధర్మపథంబునన్ నడువదారినిజూపునుదప్పకుండగన్

త్కర్మమునీరూపుదాల్చి కనబడెనెదుటన్

ధర్మము దప్పక యెప్పుడు
గర్మలనేజేయుకతన గామితఫలముల్
శర్మా!వినుమా సదస
త్కర్మమునీరూపుదాల్చి కనబడెనెదుటన్ 

Thursday, January 7, 2021

పిల్లికిశ్రాద్ధమున్ బుడమివేలుపువెట్టెనుశాస్త్రపద్ధతిన్

పిల్లికిశ్రాద్ధమున్ బుడమివేలుపువెట్టెనుశాస్త్రపద్ధతిన్
నల్లదెయేమిపల్కితిరియచ్చెరువయ్యెనువిన్నవెంటనే
పిల్లికిగొర్గెనేదలను బేర్మినిమంగలిఖాళియుంటతోన్
పిల్లియదృష్టమేయిదియ వేలనునొందుట మానవాళిచేన్

పిల్లికిశ్రాద్ధమును బుడమివేలుపువెట్టెన్

పిల్లితలగొఱిగె మంగలి
పిల్లికిశ్రాద్ధమును బుడమివేలుపువెట్టెన్
పిల్లికి భోగముగలుగుట
యల్లదిభాగ్యమ్ము గాదె ?యాలోచించన్ 

ధమునువీడిపోగలదెతన్విముదంబునభర్తయింటికిన్

వినయముగల్గుచుండియును బ్రేమనునిచ్చెడు బంధువర్గబం
ధమునువీడిపోగలదెతన్విముదంబునభర్తయింటికిన్
మనమునబాధయుండిననుమాన్యతనొందినదైనదౌటచే
మనగనుభర్తతోడనిక మానినియేగెనుమోదమబ్బగన్

Wednesday, January 6, 2021

ధనమువలదటంచు జనునెతన్వి

పుణ్యఫలమువలన బ్రోగుకాబడినట్టి
ధనమువలదటంచు జనునెతన్వి
మంచిపనులవలన సంచితమయగును
బుణ్యమనెడు నొకయ పూర్వశక్తి

Tuesday, January 5, 2021

దత్తపది--

ఎంచుకుంటిని నీయందమెల్ల యిపుడె
జుర్రుకొనగను ,నోభామ!చూడుమికను
చీరచెంగూని గుబ్బలుజారెనకట
నీదునడుమూగ నటునిటు నిజముసుమ్ము

కనులకువిందొసంగుగద గబ్బిలమేతనసోయగంబుతో

కనుముర మర్రివృక్షమునుగంటివె?చక్కనిరంగుగల్గుచున్
కనులకువిందొసంగుగద గబ్బిలమేతనసోయగంబుతో
బనిగొనిజాషువాకవియె వ్రాసెనుగబ్బిలమౌపేరునన్
మనములుసంతసించగను మాన్యులు,సజ్జనలోకమందరున్

Monday, January 4, 2021

కనులవిందొనర్చుగబ్బిలమ్ము

కొమ్మ క్రింద వ్రేలి గమ్మత్తుగానుండి
కనుల విందొనర్చు గబ్బిలమ్ము
గబ్బిలమ్ముగురిచి కావ్యమే వ్రాసెను
జాషువకవి భువిని భేషుగాను

Sunday, January 3, 2021

దనతోడన్ శయనింపగన్ బిలిచెగాంతన్,యోగిమోక్షార్ధియై

 కనగాదెల్సెనుదానుగారమనువేకళ్యాణమాడంగనౌ

దనతోడన్ శయనింపగన్ బిలిచెగాంతన్,యోగిమోక్షార్ధియై

జనతావాసమువీడికాననపువాసంబున్ గోరుకొంచుదా

మననంబయ్యదిచేయగాశివునినామంబున్ నేగె గాయటన్

తనతోశయనింప,మౌనితన్వినికోరెన్

 అనయముశుభమగుహరిచిం

తనతోశయనింప,మౌనితన్వినికోరెన్

వనితా!విడువకు పతిసే

వనునెల్లపుడునుగలుగునుబరమపదంబున్

నీయాలిన్ దగనాకొసంగవలె నీనీతిఙ్ఞతన్ జూపుచున్

నీయాలిన్ దగనాకొసంగవలె నీనీతిఙ్ఞతన్ జూపుచున్
నోయీ యేమనిబల్కుచుంటివియిటన్ నోపంగరాదాయెగా
మాయాజాలముగాదలంచితివే?మందుండ! యేమాయెరా?
న్యాయంబొప్పెడురీతి మార్చుమిక నీయాలోచనామార్గమున్

Saturday, January 2, 2021

నీయాలినినాకొసగుము నీతిపరుడవై

ఓయీరామారావా!

న్యాయంబేతెఱచిచూడ నైతికమిదియా?
పాయుమయిటులుగ బలుకుట
నీయాలినినాకొసగుము నీతిపరుడవై

 

ఏలాదుఃఖము దున్నపోతువని నిందింపన్ సభన్ మిత్రమా
ప్రేలాపంబులుమానుమాయిక ననున్ బీడింపన్యాయంబునౌ?
నులాదున్ననుగానుబోతుననుటేనేరంబుగానుండదా?
వాలాయంబుగనీవునిందలనికన్ వారింపనౌచిత్యమౌ

Friday, January 1, 2021

దున్నపోతని నిందింప దుంఖమేల

ఏకధాటిగ దినుచుండు నెవనినైన
దున్నపోతని నిందింప దుఃఖమేల
తిండియనునది మితముగా నుండునెడల
నాయురారోగ్యవంతులై యవనియుండ్రు