వరుని గళంబునన్ వధువు వైభవమొప్పగ గట్టెదాళినిన్
వరుడును గట్టెదాళినిక వైభవమొప్పగ దాళినామెకున్
నరయగ మంగళంపునును హారము పచ్చటి పావడంబును
నిరువురు నొక్కసారిగను నింపొనరించగగట్టిరయ్యెడన్
వరుని గళంబునన్ వధువు వైభవమొప్పగ గట్టెదాళినిన్
వరుడును గట్టెదాళినిక వైభవమొప్పగ దాళినామెకున్
నరయగ మంగళంపునును హారము పచ్చటి పావడంబును
నిరువురు నొక్కసారిగను నింపొనరించగగట్టిరయ్యెడన్
కలియుగపు మహిమవలన కామినేని!
వధుని మెడలోన దాళిని వరుడు గట్టె
నెవరు కట్టిన సరియెనౌ నింక వారు
చిలుక గోరింక వోలెను మెలగు టొప్పు
భీముని సూనుడున్ మిగుల భీకర రూపము దాల్చిదానుసం
గ్రామమునన్ ఘటోత్కచుడు గ్రౌర్యముజూపె దయావిహీనుడై
సామముజేయ నొప్పుకొన సైనీకులెవ్వరు నిచ్చగింపనౌ
భీమరమయ్యెగా నచట భీకరమైన వీధంబుగారవీ!
భీముని తోబాటుగసం
గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముజూపెన్
సామీరినిమించువిధము
నీమముతోజేసెరణము నిర్జరులలరన్
కనగన్ తట్టెను యిట్లు వ్రాయగను నోకామాక్షి యేమంటివే
శునకమ్మున్ గడుభక్తిగొల్చిన లభించుభో శుభమ్ముల్ గడున్ ?
వినుమా శంకరు గోల్వగానగును నెవ్వాడెంత భక్తిన్ దగన్
గనిపించుండతడేయిలన్ గదిక దాగైకొండు మోక్షంబికన్
కనగనె ఛీఛీ యనవలె
శునకమ్మును,భక్తిగొలువ శుభములు గల్గున్
వినగను సంతస మొందగ
ననవరతము గీ ర్తనలను నార్తిని బాడన్
గారడి యొకని కనికట్టు బరగు కతన
అన్నమయ్యెసున్నము,ముదమందితినిరి
భక్తులందఱు దృప్తిగ రక్తితోడ
దైవనామము బలుకుచు దనివితీర
అన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధురెల్లరున్
భిన్నపు మాటలన్ బలుక,పేలవమౌదువు గాదెయోరవీ!
యన్నము సున్నమెట్లగును నారసి చెప్పుమ వింతయేగదా
యన్నముగళ్ళకున్నదిమి హాయీగ తిందురు బంధురెల్లరున్
పైసలు లేకపోయినను పామరు వోలెను నుండకుండగా
వీసము మాత్రమున్ జలము వీడక ధైర్యము తోడనుండుచున్
మాసము మాసమున్ ధనము మందులు,బీదలకున్ నియోగించుటన్
వాసన లేనిపువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్
కాసులు గొరవడి యైనను
వీసమునున్ జంకకుండ పేదలకొఱకై
పైసలు పంపుట గనగను
వాసన లేనట్టి పువ్వు వాసినిగాంచెన్
పగవానిన్ మనచిత్తమందునిచి సేవల్ జేసినన్ మేలగున్
పగవానికిన్ సరి,కానివానినిల నాప్యాయంబుగా జూచుచున్
బగలేకుండగ నుండుచో నెపుడు పాపంబబ్బదే వేళయున్
జగదాధారుడు నెల్లవేళలను దాసంరక్షణంబున్ గొనున్
బగవానికి సేవజేయ వలెమేల్గలుగున్
జగమున గలదొక సామెత
తగువిధపుంమనుజ సేవ తార్ష్యుని సేవౌ
బ్రదుకు బండిని నీడ్చగ శక్తిలేక
తనమ నోరధము నునోడ గొనగజేసి
వేడుకొనె బరమాత్ముని విపులముగను
భక్తరక్షణ శీలివి మానముడుగ
జేసికాపాడు మమ్ముల జేరదీసి
మోదంబందుచు మానసంబున దగన్ ముమ్మూర్తులానీవెగా
మోదీ!నిన్గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో
దాదీ చెప్పిన మాతలన్ వినగనే దాదాత్మ్యమున్ బొందితిన్
మోదీపై మనసుండి యిట్లుగను దా మోదంబుతోనుంటకున్
హోదా గలదని దలచుచు
మోదీ! నిన్ గాంచినంత మోహించునొకో
దాదీ పలుకుచు నాతో
మోదముతోనుండెమిగుల మొన్నటినుండిన్
నష్టము లేదులేదు మననాయకులెల్లరు నీతిమాలినన్
నష్టము లేదులేదనగ నాయము కాదుగ జింతజేయగా
భ్రష్టతనొందు దేశము నపారముగాసిరులన్నిపోవవా?
యిష్టులగాక సజ్జనుల నెన్నుకొనంగసు నెల్లవేళలన్
నాయకుల్ నీతిమాలిన నష్టమగున
చెప్ప నగునేని దాముగా జిప్పకూడు
తినెడు రోజులు వచ్చును ననయమునిక
జీవితాంతము నుందురు చెఱను సుమ్ము
నాతియ చెఱలో నుండగ
గోతినని ధనంజయుండు కొండలనెక్కెన్
మాతను వెదకుట కొఱకై
నైతిక మౌయనుచునెక్కె నాటక మందునన్
రాతిరి యాటలాడుచును రాహువు భీముడు జేరగాదనున్
కోతినటంచు నర్జునుడు గొండలనెక్కుచు వేసెగంతులన్
గాతరమేమియున్గనక గంతులు వేయుట యబ్బురంబునౌ
కోతికిచేయనోపునిల గూర్మిని బూజలు దైవమౌటగా
కూడునుబెట్టునా యిడున గూడును పద్యము లెన్నడేనియున్
వీడుడు సంశయంబునిక బేర్మిని నాయమ యిచ్చువాటినిన్
నేడిద రామచంద్రకవి!యీభువనంబున దప్పకుండగన్
బాడగనుండు దీయగను బద్యములెప్పుడు దేనెవోలెసూ
కూడుబెట్టునా పద్యముల్ గూడునిడున
సందియంబును వీడుము శర్మ!నీవు
రెండునిచ్చును బద్యముల్ మెండుగాను
శారదామాత దయనవి సంభవించు
ఉదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకోయటంచు దాన్
నుదయము లేచునంతనెనయోమయ వార్తను దెల్పిరేగదే
సదయను జూడుమమ్ములను శంకర! యేమని వ్రాయగల్లుదున్
నుదయము లేపు గోడియ మయూరముగాదుగ జింతజేయగన్
మదనాల! లేపు కోడియె
యుదయమె కొక్కొరొకొ యని,మయూరములేపున్
హృదయము సంతో షించగ
విదలించుచు నొక్కసారి పింఛము వడిగాన్
కనసొంపై యలరారెగా కమల! యాకంజాస్య క్రీగంటి యా
వనితారత్నము పెండ్లినాడు కనగా ,బాలెంతరాలొప్పుగన్
వినయంబొందుచు చూచువారలకు దేవేరిన్ గనంగాయెడిన్
గనుడీలోకము పోకడన్ ,గనుచునేకాంతంబుబాటించుమా
ఇంతి తనపెండ్లినాడు బాలెంతరాలు
జరుగు చున్నవి యీనాడు శంకవలదు
జరుగునింకను వింతలు జగమునందు
చూచు చుండుట మనపని సుజనులార!
కమ్మని వార్తనున్ నుడువ గంపెడునాశనువచ్చువారినిన్
పొమ్మనిపెట్టినం బొగను ,బోమనువారెకదాసుబాంధవుల్
నిమ్ముగ వచ్చునాపగకునేరికి నష్టము గల్గకుండగా
నమ్మరొ చక్కజేసిరిమ హాత్ములరీతిని గాదెవారలున్
పగగొని చెడుభాగముగా
బొగబెట్టిన,బోనివారె పోసద్బంధుల్
సుగమంబగురీతిని,హిత
మగుపలు కున్బలికిపగను నంతముగాగన్
చీకును జింతయున్ వదలి సిగ్గును గల్గగ బల్కుచుంటె?యే
లోకులు మెచ్చ పంచవటిలోన వసించిరి పాండునందనుల్?
లోకులు గాకులందురిల లోకులమాటలు గడ్డిపోచలే
యీకలి పూరుషున్ మహిమ లేయివి వీటిని నమ్మబోకుడీ
రామ లక్ష్మణులును సీత రమ్యమలర
పంచవటిలో వసించిరి,పాండుసుతులు
మీదుమిక్కిలి తేజస్సు నొదవి భువిని
పాలనంబును జేసిరి బాహుబలిని
పాతివ్రత్యము మంటగల్పెనుగదా పాపిష్ఠ సావిత్రియే
పాతివ్యత్యము రక్ష సేయుటకునై భారంపు కార్యంబయౌ
ప్రేతేశుం దగనొప్పుకోలుగను దాబ్రీతిన్ వి భుంబ్రాణిగా
బంతంబొప్పగ జేసెనప్పుడు గదాప్రాణాల నర్ధించియే
ఓతల్లీ యేమాయెను
పాతివ్రత్యముజెఱచితివా సావిత్రీ!
నీతినిమాలిన యీపని
కాతరమే లేద నీకు కాంతా!చెపుమా
సవ్యంబైనది యౌషధంబని యికన్ సాహాయ మున్జేయగా
కోవ్యాక్సిన్ గని గోల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా
నవ్యంబై ముఖమంతయున్ బరగగా నైరాశ్య మొందన్ వెతన్
భవ్యుండేయికదిక్కు నాకనుచు వే ప్రార్ధించె దీనమ్ముగా
దివ్యంబైనదియీయది
నవ్యతగా గానిపించె,నయమున్ జేయున్
సవ్యమగు రీతి వాడిన
కోవ్యాక్సిన్ గని కరోనగొల్లున నవ్వెన్
అగణిత తేజవంతులకు నద్భుతరీతిని నౌను దప్పకన్
గగనము ముష్టిమాత్రము ,నగమ్ములు దేలును దూదిపింజలై
భగభగమండు మంటలును వారల దేజపుధాటి కత్తఱిన్
నెగడుచు నుండిచల్లనయి నీలుగుగోల్పడి యుండునేసుమా
ప్రేరణంబు గలుగ భీతియు లేనట్టి
యాంజనేయు డుదధి నడ్డువచ్చు
వారినధిగ మించి చేరలంక నతని
కాకసమ్ము పిడికిలంత సుమ్ము
అరయుమ యెందుశోధనను నద్భుత రీతినిజేయగానవా
హరునిదురూహలే,వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్
హరుని మనంబునందుననె!ధ్యానముజేయునొ,వానికీభువిన్
గరమును నిచ్చునాయువును గామితవాంఛలునిశ్చయంబుగన్
అరయగ గనబడవుగద యా
హరునిదురూహలె,సుఖమిడునట్టి వరములౌ
హరుడొసగును భక్తులకిల
హరునిన్ సేవించునెడల నాయువు సిరులన్
శూరులునైన రాజులట జోరుగ గానుక లెన్నియో ,యికన్
హారములింపుగొల్పెడు నయాభరణంబుల నీయగా
వారల రాజసూయపు ప్రాభవమంతయు జూసి యంతటన్
గోరిసుయోధనుండు,గడకున్ బ్రణమిల్లెను యాఙ్ఞసేనికిన్
రాజసూయమ్ము జూచిన రాజులపుడు
కానుకలను సమర్పించి కరముమోడ్చి
ద్రుపదతనయకు మ్రొక్కె,దుర్యోధనుండు
మౌనముద్రను వహియించె మౌనివోలె
సిరులను నీయు భామయును శీతల పర్వత రాజపుత్రికే
విరిసిన పద్మమందు గడు వింతగ బుట్టెను,కాలనాగమే
జరజరప్రాకి వేగముగ సంద్రములన్నిటి నీది చంపెగా
గరువపు బ్రాణభీతియు ను గర్మము వెంటనురాగ ఱేనికిన్
సిరులను నిచ్చెడు లక్ష్మియె
విరిసిన కమలమున బుట్టె,విషసర్పమ్మే
నురగలుగక్కుచు చచ్చెను
బరమాత్ముని గర్భగుడిని పరిత్రాణమునన్
కలతలురేపు దుష్టులను,గాపురుషాదుల చేష్ట,శత్రుమూ
కలను,సహింపగావలయు గాపురమందభివృద్ధి,గోరినన్
గలతలులేని గాపురము గాంచును వృద్ధిని నెల్లవేళలన్
గలనున సైతమున్ వలదు కర్కశరూపము మాానవాాళికాన్
సూటిపోటు లుగల మాటల,శత్రుమూ
కలసహింపవలయు గాపురమున
చేయిచేయి గలుప చేటుగలుగుగద
మౌనమయది మేలు మౌని వలెను
ఆరయ మంచివారుగను నందఱిచేతను మెప్పునొందురే
కోరకమున్నె మేలునొనగూర్చెడివారలె,క్రూరచిత్తులౌ
నేరము జేయకుండినను నేరము మోపుచు హింసజేయునౌ
వారిని దవ్వుగానునుపు బాధ్యత యందరి మీదయున్నదే
మంచివారితరులకు ప్రేమను నిరతము
గోరనిదె మేలొనర్తురు,క్రూరులెపుడు
జేయుచుందురు దుష్కృతి చేతలందు
నికను మానసి కంబుగ నిడుము లిడగ
సంశయించరు పుడమిని శర్మ! యెపుడు
వద్దుర సిద్దిపేట జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్
నద్దమఱేయి వచ్చెనటయచ్చటకేమఱి యాకరోన సూ
ముద్దనువోలె గన్పడుచు మోమున దూరుచు గంఠమందు దా
దద్దయు బాధవెట్టునట తాలిమి చాలని నంతగా రవీ!
రాష్ట్రమునక రోన రగులుచు వ్యాపించె
సిద్దిపేట కేగ వద్దు కవులు
నెందు కైన మంచి దేగ కుండగనింటి
యొద్ద యుండి వినుడు పద్యములను
భద్రము నాకొసంగుమని వాలిని వేడెను రాముడయ్యెడన్
భద్రము నీయు రాముడిల వాలిని గోరుట నమ్మ శక్యమే?
ఛిద్రము లౌను బాపములు ,జీవిత చక్రము తిర్గుచుండగా
భద్రగిరీశునామమును బల్కుము,తోడనెమోక్షమబ్బునున్
భద్రమిడుమని రాముడు వాలినడిగె
భద్రమును నీయు రాముడే వాలినడుగ
వింత లన్నిటి కీయది వింతగొలిపె
రామచంద్రుడేగద జగ ద్రక్షకుండు
సుంతయుభేదభావములు సొప్పడ నీయని భారతంబునే
శాంతికి బుట్టినిల్లుగద ,జాతివివక్షను జూపుదేశమే
శాంతిభద్రతల్ గనని జక్కిగ బేరును బొందునీ భువిన్
శాంతియు సౌఖ్యముల్ గలుగ జక్కటి జీవనమందవచ్చుగా
కాతరము జెందు ననిశము
జాతి వివక్షగల నేల శాంతినిలయమే
నేతల ప్రజోపయోగపు
జేతలు,మాటలునుమేలు సేయుటవలనన్
ఇలలో వచ్చును రోగముల్ విమల! యీయేయా ల నుయ్యీగుటల్
గలుసారాయి ద్రాగువారలకె,భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
దలిదండ్రుల్ దమ సూనులన్ జదువులన్ దాదాత్మ్యమున్ గూర్చుచో
నలవోకన్ ధనమార్జనంబుపయి నేయాకర్షి తుండౌచుటన్
ఇలవెలయు వేంకటేశుని
గలలోనన్ దలచుచుండి గనుగవ యొప్పన్
విలసిత భక్తిరసంబను
గలు ద్రావెడువానికబ్బు గద భాగ్యమ్ముల్
బదవులె నేరుగా గలిగిప్రాఙ్ఞుని జేసిన నైననెంతయున్
మదిగలవారందఱును మాన్యత తోడను మెల్గుచుండుటన్
నిదియదికానిదేదియొ యదే యిడుచుండును మోదమెప్పుడున్
బదవులుదానుండునైన బహుళముగాగన్
నెదనాబొందగ దనివిని
యిదియది కానట్టీ దేదొ యిడు మోదమున్
వలదు వలదుమాత్ర యీయ వలదుబావ!నాకుగా
జేర్చును బర లోకముదమ చేతి మాత్ర యయ్యయో
బ్రతికి యుండ తిందు నికను బలుసు పత్ర మిపుడు,నా
జీవి యుండు నంత దనుక చేదు మందు దినను రా
వలదువలదురా బావ!నీవైద్య మిపుడు
చేర్చు బరలోకమునకు నీచేతిమాత్ర
బలుసు పత్రము నైనను భక్షణంబు
జేసిబ్రదుకుదు వలదునీ చేదుమందు