Monday, October 31, 2016

దత్తపది - (కన్ను-ముక్కు-చెవి-నోరు)దీపావళి సంబరాలను వర్ణిస్తూ

బాణసంచను గాల్చగా వలయు సరిగ
లేని యెడల ముక్కు చెవులు కన్ను నోరు
నిప్పు రవలకు గాలును నప్పుడపుడు
జాగ రూకత మంచిది సర్వు లకును 

రణమేసుఖశాంతులిచ్చిమనకున్ రంజిల్లజేయున్ మదిన్

క్షణికావేశములేకయుండగనునాసాంతంబుజేయంగపూ
రణమేసుఖశాంతులిచ్చిమనకున్ రంజిల్లజేయున్ మదిన్
 వినుడీసూత్రముమీరలందరునునోవీరాభిమానుల్ ! దగన్
 బ్రణవంబీయదిగాదలంచియెదనభ్యాసంబుజేయుండహో

రణమేసుఖశాాoతులిచ్చిరoజిలజేయున్

రణగొణశబ్దములొకపరి
సణుగుడులేయేకధాటిసాధింపులునున్
 గణకొనకసమస్యాపూ
రణమేసుఖశాంతులిచ్చిరంజిలజేయున్

Sunday, October 30, 2016

కాామేశ!

కార్తికంబునబుట్టినకారణాన
శివునిశుభదృష్టినీయందుచిలుకమిగుల
భోగభాగ్యములన్నియుబుష్కలముగ
గలుగుగావుతకామేశ!ఖరునివలన

Saturday, October 29, 2016

ఫాల్గుణమున దీపావళి పండుగ కద

చెట్ల యాకులు రాలును జిత్ర ముగను
ఫాల్గుణమున ,దీపావళి పండుగ కద
వచ్చు నాశ్వయుజ బహుళ పక్షమందు
నమవసను బ్రతి వత్సర మమల కీర్తి

Friday, October 28, 2016

నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్

ఆగణపతినిన్ జంపెను
నాగాభరణుండు కినిసి ,నరకుని జంపెన్
పోగాలము వచ్చుతరిని
నా  గౌరియె భామయగుచు నాజిని  లోనన్


విప్ర కులావతంసునకు బేరగు జంధ్య మదేల వేయగన్

కప్రపు రంబునందు గల కాంతలు పెద్దలు సంశయించి రీ
విప్ర కులావతంసునకు బేరగు జంధ్య మదేల వేయగన్
విప్ర కులావతంసుడును వేలుగ శాస్త్రము లెన్నియో దగన్
విప్రులు మెచ్చగా దనర వేమఱు సారులు పాఠ నంబునన్ 

విప్ర వరునకు యజ్నో ప వీత మేల

సకల శాస్త్రము లన్నియు జక్క జదివి
పేరు ప్రఖ్యాతు లార్జించి  వినుతి కెక్కు
విప్ర వరునకు యజ్నో ప వీత మేల
యవస రమ్మది లేదిల యార్య !వినుము

Thursday, October 27, 2016

శంకరార్య!

మీకుజరిగిన దానికిమేముకూడ
బాధనొందితిమిమిగులపరమగురువ!
వేళతప్పకమందులువేసికొనుము
సరియయగుమీకువెంటనేశంకరార్య!

Wednesday, October 26, 2016

పెను ప్రమాదములుప్ర మోదము నకెసుమ్ము

జరుగు చున్నవి నిత్యము జనుల కకట
పెను ప్రమాదములు,ప్ర మోదము నకెసుమ్ము
రోడ్ల ప్రక్కన జెట్లను నాటు ట రయ
పిల్ల గాలులు వీచును జల్ల గాను 

అమ్మ ఆబ్దీకము


అమ్శ వచ్చునుశుక్రవారమ్మునాడు
వచ్చువారలుమరిరానివారలెవరు
తెలియకుండెనునాకది,దేవిరాక
తధ్యమనుకొనుచుంటినిదధ్యమౌనె?
-----
అమ్శచల్లనియాశీస్సులందుకొనగ
దప్పకుండగరావలెనొప్పురీతి
సోదరులుమరియునికనుసోదరీమ
ణులగుమీరలు,సప్రేమబలుకుచుంటి

కోడలు, మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్

కోడలు, మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్
జూడగ దుష్టకంబు లవి జోరుగ సాగుచు నుండె నీభువిన్
గోడలు మామ జూచి కనుగొట్టుట యేమిది కండకావరం
బాడది యుండగా వలెను నాడతనంబున గౌరవంబుగన్

కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్



చూడుము కలియుగ ధర్మము
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్
కోడలి చర్యకు భయపడి
కోడలినే వెడల గొట్టె గుపితుడు నగుచున్ 


Tuesday, October 25, 2016

మునికి న్గో పమె భూషణంబగు బ్రజా మోదంబు సంధిల్లగన్

మునికి న్గో పమె భూషణంబగు బ్రజా మోదంబు సంధిల్లగ
న్ననగాన్యాయమె యార్య మీకదియయా హా యెంతగా బల్కిరో
మునికిన్ శాంతమె భూషణంబగును నే ప్రొద్దున్గదా నేర్వుమా
యనిశంబాతడు మానసంబు నిల  నాదైవంబు నేగొల్చుగా 

Monday, October 24, 2016

మునికి గోప మెకద భూషణంబు

మునికి గోప మెకద భూషణంబనగను
న్యాయ మగునె నార్య !నరునకు వలె
గోప ముండ రాదు కొంచె మైన మునికి
మౌనమే యతనికి నాభరణము 

రైకనువిప్పిడాసెసమరంబునగూలినబ్రాణనాధునిన్


భీకరయుధ్ధరంగమునబేరయనాయుడుఖడ్గమున్దగన్
దాకరమందునన్మిగులధారణజేయగముందెబోవగన్
రైకనువిప్పిడాసెసమరంబునగూలినబ్రాణనాధుని
న్నాకమలాక్షిశోకముననాయతరీతినినీరుకార్చుచున్

రైకనువిప్పికలిసినదిరణనిహతుబతిన్


చాకలికొమరుడురణమున
నేకాకిగబోరుసలిపియీడ్వంబడుచు
న్నాకముజేరగదనసతి
రైకనువిప్పికలిసినదిరణనిహతుబతిన్

Saturday, October 22, 2016

నడిరేయి ర విగాంచి నవ్వె నుత్పలము

వేడి గాడ్పు వీచె నడిరేయి, ర విగాంచి
నవ్వె నుత్పలమన న్యాయ మౌనె ?
చంద్రు జూడ గ విక సనమునొందు భువిని
రవిని జూడ గముకు ళ త నునొందు 

Friday, October 21, 2016

సీతను బెండ్లాడి శివుడు శిశువును గనియన్

ప్రీతిగ నుండెను రాముడు
సీతను బెండ్లాడి, శివుడు శిశువును గనియె
న్మాత  గు పార్వతి జేసిన
ప్రతిమది గణపతి రూపపు పార్థివ మేనన్ 

సోదరా !

చదివితి శతకపు భాగము
చదువగ సంతసము గలిగె జక్కగ నుంటన్
చదువుల తల్లియ నిన్నిక
సదయను మఱి  జూచు గాక సహజ న్ముండా !

పాచికల నాడ యవసరం బదియ వలదు
భక్తి భావము దోడన పరమ శివుని
బూజ జేసిన నిచ్చును బుణ్య ఫలము
వేంక టేశుడు శంభుడు వేరు కాదు

భవ్యత నొందుట కొఱకు ను
నవ్యయుడగు గృష్ణు గొలువ నాతడు మనకున్
దివ్యంబగు మోక్షంబును
సవ్యంబగు రీతి నిచ్చు సహజ న్ముండా!

దేవ గురువు బృ హస్పతి తిరము గాను
శ్రవణ మందున నుండిన సర్వు లకును
నాయు రారోగ్య సంపద లన్ని గలుగు
సోమ వారపు దినమున శుభము గలుగు


వేంకటేశుని శతకము వీను లలర
చదువు చుంటిని నిత్యము, చదువు తరిని
స్వామి దర్శన మగు నట్లు భ్రాంతి గలుగ
మోకరిల్లుదు వెంటనే ముఖము దించి

సప్త గిరులను దాటుచు సంయమునన 
నిన్ను జూడగ రాగోర చిన్మయుండ !
మార్గ మధ్యము నందున మంగళమగు 
నీదు రూపము గన్ప డె  నిజము గాను 
సార్ధ కంబయ్యె నిజమునా జన్మ యికను 
నట్లె గావుము నాభాతృ హర్ష మొదవ


వినగను గాధలు నీయవి 
మనసున సంతోష మయ్యె మాన్యుడ వగుట
న్గను లార జూచు భాగ్యము 
నొనరగమఱి జేయుమార్య!యోనా సామీ !


శక్తి కొలదిని జేయంగ రక్తి తోడ 
పూజ నావేంక టేశుని మూల ప్రతిమ 
కు మరి స్వామియ యిచ్చును కువల యమున 
శాంతి ,సౌభాగ్యపు సిరులు ,సంతు వుయును 

జన్మలన్నిటికంటెనుజన్మమరయ
యిలనుమానవజన్మయేమేలుగదర
బుధ్ధితెలివియుజ్ఞానాన బూర్ణుడగుచు
మానవత్వముతోడనమసలుచుండు







సోదరా !

చదివితి శతకపు భాగము
చదువగ సంతసము గలిగె జక్కగ నుంటన్
చదువుల తల్లియ నిన్నిక
సదయను మఱి  జూచు గాక సహజ న్ముండా !

పాచికల నాడ యవసరం బదియ వలదు
భక్తి భావము దోడన పరమ శివుని
బూజ జేసిన నిచ్చును బుణ్య ఫలము
వేంక టేశుడు శంభుడు వేరు కాదు

భవ్యత నొందుట కొఱకు ను
నవ్యయుడగు గృష్ణు గొలువ నాతడు మనకున్
దివ్యంబగు మోక్షంబును
సవ్యంబగు రీతి నిచ్చు సహజ న్ముండా!

దేవ గురువు బృ హస్పతి తిరము గాను
శ్రవణ మందున నుండిన సర్వు లకును
నాయు రారోగ్య సంపద లన్ని గలుగు
సోమ వారపు దినమున శుభము గలుగు


వేంకటేశుని శతకము వీను లలర
చదువు చుంటిని నిత్యము, చదువు తరిని
స్వామి దర్శన మగు నట్లు భ్రాంతి గలుగ
మోకరిల్లుదు వెంటనే ముఖము దించి

సప్త గిరులను దాటుచు సంయమునన 
నిన్ను జూడగ రాగోర చిన్మయుండ !
మార్గ మధ్యము నందున మంగళమగు 
నీదు రూపము గన్ప డె  నిజము గాను 
సార్ధ కంబయ్యె నిజమునా జన్మ యికను 
నట్లె గావుము నాభాతృ హర్ష మొదవ


వినగను గాధలు నీయవి 
మనసున సంతోష మయ్యె మాన్యుడ వగుట
న్గను లార జూచు భాగ్యము 
నొనరగమఱి జేయుమార్య!యోనా సామీ !


శక్తి కొలదిని జేయంగ రక్తి తోడ 
పూజ నావేంక టేశుని మూల ప్రతిమ 
కు మరి స్వామియ యిచ్చును కువల యమున 
శాంతి ,సౌభాగ్యపు సిరులు ,సంతు వుయును 

జన్మలన్నిటికంటెనుజన్మమరయ
యిలనుమానవజన్మయేమేలుగదర
బుధ్ధితెలివియుజ్ఞానాన బూర్ణుడగుచు
మానవత్వముతోడనమసలుచుండు

శతక మంతయు బూర్తిగ జదువ దెలిపె 
భక్తి భావము కలిగెడు పధ్ధతి యును 
స్వామి మహిమ లు పుష్కర స్నాన ఫలము 

లాది గానెన్నియో వింత లాశతకము 







వేంకటేశ్వరా!





(౧)
శతకం బొక్కటి వ్రాయ నెంచితిని మీచారిత్ర్యముల్  చాటుచున్
నుతియింతుం దమ లీలలన్నిటిని నే నోరార రమ్యంబుగా
వెతలం బెట్టక శక్తి నిచ్చి నను దీవింపంగ రావే నమ
శ్శతముల్ సేసెద భక్తినిం దిరుమలేశా భక్త రక్షాగ్రణీ!

శ్రీసతి భీకరాగ్రహము శ్రీపతి శాంతము గాదె మిమ్మిలన్
భాసిత సప్తశైలయుత భారత విశ్రుత పుణ్య భూమినిన్
హాస విలాస రేఖల విహార నివాసము సేయ నిల్పె సం
త్రాస జనాళి రక్షణకు రాజనిభానన వేంకటేశ్వరా!                                1.

నుదుటను నామ మొప్పెను గనుంగవ కన్పడ కుండు నట్టులన్
సదమల దామ మొప్పెను భుజద్వయ భాసిత భూషణమ్మనన్
ముదిత లలంకరించి రట ముచ్చట గొల్పుచు వక్షమందునం
దదసదృ శాకృతిన్నరయ ధన్యుల మైతిమి వేంకటేశ్వరా!                        2.

శంభుని కంఠ మందున విషమ్మును చంద్రుని యందు మచ్చయున్
గుంభిత తాపమే యినుని క్రూర కరమ్ములఁ దల్లడిల్లగన్
గుంభన రీతిఁ జంపె వనిఁ గోతిని రాముడు నట్టి దోషముల్
సంభవ మన్న మీ కడ  నసత్యపుఁ బల్కులు వేంకటేశ్వరా!                      3.

కలువలు పూయ నేర్చునె ప్రకాశిత చారు శశాంకుఁ గానకే
వలవల యేడ్చు పద్మములు పశ్చిమ దిక్కున సూర్యు డున్నచో
వెలవెలఁబోవు గేహములు పేరిమి పూజలు సల్పకున్నచో
నిలయము సత్య సంపదకు నీ భజనావలి వేంకటేశ్వరా!                        4.

సుందర దివ్య విగ్రహము సూర్య శశాంక నిభాక్షియుగ్మ పా
రీంద్ర నిభావలగ్న పరిలిప్త సుగంధ నితాంత గాత్ర మా
నందమ యాభయప్రద ఘనద్యుతి హస్త వికాస మూర్తివే
నందిత పద్మగర్భ సురనాథ మహేశ్వర వేంకటేశ్వరా!