Tuesday, February 3, 2015

హిమ పాతము (3-2-2015)

వరుస బడగను  మోకాలి బంటి వరకు
నిన్న మొన్నను  స్నోయది , కన్ను గవకు
వింత గొలుపగ మంచుతో , వీ ధులన్ని
పాల సంద్రమా యనునటు భాసిలె నిట

మంచు బడినట్టి రోడ్లన్ని మంది గలిసి
బాగు చేయుచు నుంటిరి , బాగు కొఱకు
నుప్పు  వాడుదు రిచ్చట తప్ప కుండ
పాల సంద్రము మారును నీ రముగను

మంచు పూర్తిగ దొలగుచు మార్గ మంత
పూర్వము వలె నుం  డుకొరకు నాఱు దినము
లగున నిరి యి చ  ట గల వా  రంద రపుడు 
మరల వ్రాయుదు సంగతు ల్మరియు కొన్ని

అంత కంతకు స్నో ఫాల్సు  నధిక మగుచు
చెట్లు చేమలు భవనాలు చిన్నపెద్ద
వన్ని మంచు మ   యమగుచు నలరి ,మిగుల
నేత్ర పర్వము గావించె జిత్రముగను

మంచు వలనన రోడ్లన్ని మంద మగుచు
వాహనంబుల కత్యంత భార  మయ్యి
ముందు  నకుబోవ కాకుండ చంద మటుల
మెల్ల మెల్లగా జారుచు వెళ్ళు చుండె

No comments:

Post a Comment