Tuesday, February 10, 2015

పద్య రచన -శ్రీ వేంకటేశ్వరు పాదాలు

వేంకటేశ్వరు పాదాలు బేల ! యవియ
చూడ హుండీల బోలుచు చూపరులకు
నంద మొలికించు చుండెను డెం దములకు
జూడ రావమ్మ ! నీవును  సుబ్బలక్ష్మి 

వేంకటేశ్వరు పాదాలు  వినయముగను
బట్టుకొనుదును  గట్టిగా  భయము లేక
స్వామి యిచ్చును దర్శన  భాగ్య ముమఱి
నాదు భాగ్యము  నెన్నగ  నలువ దరమె ?

వెంకన్న పదము గొలుతును
లెంకగ   మఱి యుండి యతని లీలలు గనుచు
న్టం కము లిచ్చును  విరివిగ
పంకజముల బూ జజేయ బ్రహ్మాండ ముగన్

 

No comments:

Post a Comment