Tuesday, February 17, 2015

పద్య రచన -ఉల్లి పాయలు

ఉల్లి పాయలు జూడుము  మెల్ల గాను
నెంత యందము  గానుండె ? నెఱు పు  తోడ
నెందు వాడిన  నిచ్చును  నందు  రుచిని
ను ల్లి పాయ పకోడీ ని  యల్లము మఱి
చేర్చి  భావన ! మఱి నాకు  జేసి పెట్టు

ఉల్లి పాయలు గలవట  చెల్లి ! చూడు
ఎంత యందము గలవియో నంత రుచిని
నిచ్చు ననుటలో సందియ మించు కైన
లేదు  నిజమిది నమ్ముము  నాదు  మాట

తల్లి సమానమే యనుచు నుల్లిని  నందురు  గాదె పం డితు ల్
ఉల్లియ నిచ్చు గుండె బల మెల్లపు డె ట్లుగ నాహరిం చినన్
అల్లదె యాయువుం బెరుగు హర్షము నిచ్చును నెల్లవే ళలన్
కల్లయు గాదు నా పలుకు నల్లదె  వైద్యుని  మాటలే మఱిన్


 

No comments:

Post a Comment