Wednesday, February 18, 2015

పద్య రచన -రాక్షసులు దేవతలు సముద్రమును జిలుకుట

పర్వ  తంబది  మందర పర్వ   తంబు
వాసు కిని నట   ద్రాటిగా నా సురసు రు 
ల మృత  ముకొఱ కు   సంద్రాన  నటు నిటుగను
జిలుకు చుండగ శ్రీ లక్ష్మి  శిఖర మందు
 పుట్టె నద్భుతము గొలుప పుణ్య పురుష !

మందర  పర్వతం బునకు నందము గామఱి  వాసుకా హినిన్
చిందులు  వేయుచుం డగను, చీరియు బాగుగ గట్టిగా  నటన్
బందము వేసియా  సురలు ,పందెము తోడన నాసురా దులున్
విందుగ లాగగా జనన మొందెను శ్రీలక్ష్మి యద్భుతం బుగన్


No comments:

Post a Comment